
సాక్షి, విజయనగరం : రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో అనంతవాహినిలా సాగుతోంది. బుధవారం ఉదయం జననేత 288వ రోజు పాదయాత్రను బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం పెద్ద భీమవరం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి జె.రంగరాయపురం, రంగరాయపురం, అప్పయ్య పేట, బొబ్బిలి వరకు పాదయాత్ర కొనసాగనుంది. బొబ్బిలిలో సాయంత్రం జరిగే బహిరంగ సభలో జననేత వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు.
జననేత వైఎస్ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. వారి సమస్యలను విన్న వైఎస్ జగన్, వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment