సాక్షి, విజయనగరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 278వ రోజు షెడ్యూల్ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. జననేత గురువారం ఉదయం విజయనగరంలోని నెల్లిమర్ల మండలం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. మొయిదా క్రాస్ మీదుగా మూలా స్టేషన్ వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment