298వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ | YS Jagan 298th Day Praja Sankalpayatra Schedule Released | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 14 2018 8:12 PM | Last Updated on Wed, Nov 14 2018 8:15 PM

YS Jagan 298th Day Praja Sankalpayatra Schedule Released - Sakshi

సాక్షి, విజయనగరం : రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతూ.. ప్రజా సమస్యలను ఆలకిస్తూ.. వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 298వ రోజు షెడ్యూల్‌ఖరారైంది. జననేత చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం పార్వతీపురం నియోజకవర్గంలోని చినరాయుడుపేట నుంచి జననేత పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నిడగల్లు క్రాస్‌, మురిపివలస మీదుగా సురమ్మపేట వరకు పాదయాత్ర కొనసాగుతుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటనవిడుదల చేశారు.

ముగిసిన పాదయాత్ర
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 297వ రోజు ముగిసింది. సాలూరు నియోజకవర్గంలోని తామరఖండి శివారు నుంచి జననేత పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి చినభోగిలి, సీతానగరం, అప్పయ్యపేట, జోగింపేట, గుచ్చిమి మీదుగా చినరాయుడు పేట వరకు పాదయాత్ర కొనసాగింది. జననేత నేడు 10.2కిలో మీటర్ల దూరం నడిచారు. ఇప్పటి వరకు వైఎస్‌ జగన్‌ 3,238.2కిలో మీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement