YS Jagan Padayatra
-
ప్రజలకు ఏం కావాలో సీఎం జగన్‌కు తెలుసు
సాక్షి, తాడేపల్లి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర.. ఏపీ రాజకీయ ప్రస్థానంలో మరిచిపోలేని ఒక ఘట్టం. నేటితో(సోమవారం) ఆ యాత్ర పూర్తై నాలుగు సంవత్సరాలు అయ్యింది. ఈ సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు పార్టీ నేతలు, కార్యకర్తలు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్టారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ సురేష్ తదితరులు హాజరయ్యారు. దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. ప్రజల్లో ఉండటమే రాజకీయం అని నమ్మిన వ్యక్తి జగన్. పాదయాత్రలో చూసిన ప్రజల కష్టాలు మ్యానిఫెస్టోలో రూపొందించారు. ఇప్పటివరకూ 98 శాతం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు పూర్తి చేశారు. ప్రజలకు ఏమీ కావాలో అది చేసిన ఏకైక నాయకుడు సీఎం జగన్. ప్రజలకు మంచి చేశారు కనుకే దైర్యంగా ఎమ్మెల్యేలను ఇంటింటికీ పంపుతున్నారు. జగన్ జీవితం తెరచిన పుస్తకం. వైఎస్సార్సీపీ అంటే దేశంలోనే విలక్షణమైన పార్టీగా నిలబడింది. ప్రజల నమ్మకాన్ని జగన్ ఏనాడూ వమ్ము చెయ్యలేదు. చాలా వరకూ అధికార పార్టీలు ముందస్తు కోరుకుంటారు. కానీ మన రాష్ట్రంలో ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయి. వెంటిలేటర్ పై ఉన్న పార్టీలు ముందస్తు ఎన్నికలు కోరుకుంటున్నాయి. 2024లో షెడ్యుల్ ప్రకారమే రాష్టంలో ఎన్నికలు జరుగుతాయి. పవన్-చంద్రబాబులు తమ అక్రమ సంబంధాన్ని పవిత్రం చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి పరామర్శిస్తారు. కానీ చావుకు కారణం అయిన వారిని పరామర్శించడం ఏంటి? అక్రమ సంబంధాన్ని సక్రమం చెయ్యడం కోసం కలుస్తున్నారు. తెలంగాణలో కిందా మీదా పడి బీజేపీకి దగ్గర అవ్వాలని చూస్తున్నాడు చంద్రబాబు. టీడీపీ -జనసేన కలవడం శుభపరిణామం అని సీపీఐ రామకృష్ణ అంటున్నాడు. ఎరుపు కాషాయం కలిస్తే పసుపు అవుతుందేమో.?, బలమైన జగన్నీ ఎదుర్కోడానికి వీళ్లంతా ఏకం అవుతున్నారు. చంద్రబాబు, పవన్‌లు ఎన్ని పగటి కలలు కన్నా ప్రజాబలం ఉన్న జగన్నీ ఏమీ చెయ్యలేరు. ఒకవైపు జగన్ ఉన్నారు.. ఆటు వైపు గుంట నక్కలు ఉన్నాయి. ప్రజల్లో ఉండి, ప్రజలకు ఏం కావాలో అది చేసిన నాయకుడు జగన్. చంద్రబాబు, పవన్ ఏ విలువలు, సిద్దాంతాలకు కట్టుబడి ఉన్నారో ప్రజలకు అర్థం అయింది. ఒక బలవంతమైన నాయకుడిని ఎదుర్కొనేందుకు ఇలాంటి వారంతా ఒకటవుతున్నారు. సీపిఐ రామకృష్ణ కామెంట్స్ విచిత్రంగా ఉంది. మరి బీజేపీ కూడా వారితో కలిస్తే ఏం చెప్తారు?, ఎరుపు, కాషాయం కలిస్తే పసుపు అవుతుందేమో చూడాలి. దుష్టశక్తులు ఇంకా ఏమేమి చేస్తాయో చూడాలి. పందికొక్కులు, గుంటనక్కలు ఏకం అవటాన్ని జనం చూడాలి. ఇలాంటి వారికి ప్రజలే బుద్ది చెప్తారు’ అని పేర్కొన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ‘పాదయాత్రలో వేల సమస్యలు జగన్ దృష్టికి వచ్చాయి. ప్రజా సమస్యలు తెలుసుకుని మ్యానిఫెస్టోలో పెట్టాం. జగన్ చెప్పాడంటే.. చేస్తాడంతే అనే నినాదం వచ్చింది’ అని స్పష్టం చేశారు. -
మహా సంకల్పానికి ఐదేళ్లు ..
-
జనం జెండా - ఒకటే లక్ష్యం ఒకటే ఆశయం
-
తన ఇంటి ఖర్చు మీద ఈనాడు రోతరాత.. పద్మావతి ఆగ్రహం
-
పేదల ఇళ్లపై పచ్చమీడియా కుట్ర బట్టబయలు
-
3 Years Of YS Jagan Ruling: జనమే సాక్షి - ప్రజా పాలనకు మూడేళ్లు
-
ఆర్టీసీ ఉద్యోగులకూ న్యాయం చేయండి
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వేతన వ్యత్యాసం సరిచేసి, పాతపెన్షన్‌కు అనుమతించాలని, ఇంటి అద్దెలు, సీసీఏలు పాతవి కొనసాగించాలని సీఎం వైఎస్ జగన్‌కి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ (ఎన్ఎంయుఎ) విజ్ఞప్తి చేసింది. ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలోకి విలీనం చేసిన సీఎంకు కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు శనివారం ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు గతంలో నాలుగేళ్లకు ఓసారి వేతన సవరణ జరిగేదని తెలిపారు. 2017 ఏప్రిల్ 1న 25శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ జరిగిందని పేర్కొన్నారు. అనంతరం 2020 జనవరి 1 నుంచి ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలోకి విలీనం చేసిందని, అప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ ఉద్యోగులకు 19శాతం వేతన వ్యత్యాసం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 2020 జనవరి 1 నుంచి బకాయి ఉన్న కరువు భత్యంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ఫిట్‌మెంట్‌ను కలిపి 2021 ఏప్రిల్ 1 నుంచి వేతన సవరణ చేసి.. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా న్యాయం చేయాలని కోరారు. -
పదకొండవ వసంతంలోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం
-
విజయసంకల్పానికి రెండేళ్లు
-
రేపు ఉచిత పంటల బీమా చెల్లింపు
సాక్షి, అమరావతి: ఆరుగాలం కష్టపడి తీరా పంట చేతికొచ్చే సమయానికి అతివృష్టి, అనావృష్టి, వరదలు, కరవు కాటకాలు, చీడపీడలు ఇతర ప్రకృతి వైపరీత్యాలతో కలిగే పంట దిగుబడి నష్టాలతో కుదేలవుతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కొండంత అండలా నిలుస్తోంది. సుదీర్ఘ 3648 కి.మీ పాదయాత్రలో రైతుల కష్టాలు, కడగండ్లు స్వయంగా చూసిన సీఎం వైఎస్ జగన్, ఆనాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. ఆ మేరకు రైతులను ఆదుకునే విధంగా ‘డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా’ పథకాన్ని అమలు చేస్తున్నారు. 2019 సీజన్లో పలు కారణాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం వారికి బీమా పరిహారం అందజేస్తోంది. అందులో భాగంగా రేపు (మంగళవారం) 9.48 లక్షల రైతులకు ఏకంగా రూ.1252 కోట్ల పరిహారం అందుతోంది. క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఇప్పటికే ఒక పరిహారం: 2018–19 రబీ పంటల బీమా ప్రీమియంకు సంబంధించి అప్పటి ప్రభుత్వం బకాయి పడిన రూ.122.61 కోట్లు చెల్లించిన ఈ ప్రభుత్వం, నాటి పంటల నష్టానికి సంబంధించి బీమా కంపెనీల నుంచి క్లెయిమ్‌లు వచ్చేలా చేసింది. ఆ మేరకు ఈ ఏడాది జూన్ 26న, బీమా కంపెనీలు రాష్ట్రంలో 5.94 లక్షల రైతులకు రూ.596.36 కోట్ల క్లెయిమ్స్ విడుదల చేశాయి. ఆనాడు కూడా క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కిన సీఎం వైఎస్ జగన్, రైతుల ఖాతాల్లో నేరుగా ఆ బీమా పరిహారం జమ చేశారు. పైసా కూడా భారం లేకుండా: దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులపై పైసా కూడా భారం లేకుండా పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తోంది. భూమి సాగు చేస్తూ, ఈ–క్రాప్‌లో రైతులు నమోదు చేసుకున్న ప్రతి ఎకరాన్ని పంటల బీమా పరిధిలో చేర్చి, రైతుల తరపున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తూ, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తోంది. పూర్తి పారదర్శకత: గ్రామంలో సాగు చేసిన పంటల వివరాలను వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ–క్రాప్‌లో నమోదు చేసి బీమా సదుపాయం కల్పించడంతో పాటు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినప్పుడు ఆ వివరాలు అంచనా వేసి, బీమా పరిహారం అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.ఈ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటిస్తూ, పథకంలో లబ్ధిదారులైన (అర్హులైన) రైతుల జాబితాలను, పూర్తి వివరాలతో గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం–ప్రీమియం: 2019 సీజన్లో పంటల బీమా కింద రైతులు కట్టాల్సిన రూ.468 కోట్ల ప్రీమియమ్‌తో పాటు, ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన రూ.503 కోట్లు కూడా కడుతూ, మొత్తం రూ.971 కోట్ల ప్రీమియమ్‌ను ప్రభుత్వం బీమా కంపెనీలకు చెల్లించింది. గత ప్రభుత్వ హయాంలో..: రైతుల పంటల బీమా కోసం ప్రీమియంగా గత ప్రభుత్వం తన వాటాగా ఏడాదికి కేవలం రూ.393 కోట్ల ప్రీమియమ్ మాత్రమే చెల్లించింది. అదే ఈ ప్రభుత్వం గత ఏడాది (2019)కి సంబంధించి ఏకంగా రూ.971.23 కోట్ల ప్రీమియం చెల్లించింది. -
వైఎస్ జగన్‌కు మద్దతుగా పదరా.. ఓ అడుగేద్దాం!
ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేపడుతున్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా పదరా.. ఒక అడుగేద్దాం అంటున్నారు నియోజకవర్గంలోని ప్రజలు. ఈ పాదయాత్రపై స్థానికుల సంభాషణ సాగిందిలా.. –చిత్తూరు రూరల్ పెద్దరాయుడు: ఏం బా సుబ్బరాయుడు యాడా పొలం కాడికి పోతా ఉండావా. సుబ్బారాయుడు: అవున్నో..పైరుకు నీళ్లు పెట్టాలి. పెద్దరాయుడు: రాబ్బా పోదువు..కరెంటు 9 గంటలు ఉండాది కదా.. సుబ్బారాయుడు: ఏమ్ లేదున్నో..గవర్నమెంట్ మా అకౌంట్లో రూ.2 వేలు వేసి ఉండాదినా . నా భార్యను పంపించి ఉండా.. తీసుకో రమ్మని. పెద్దరాయుడు: యాడ్రా వాళ్లంతా నడుచుకుంటా పోతాండారు సుబ్బారాయుడు:: మన జగనన్న పాదయాత్ర సేసి మూడేళ్ల అయిందంటనా. పెద్దరాయుడు: ఓహో...జగన్ అప్పుడు మన ఊరు పక్క కూడా వచ్చినాడు కదరా.. సుబ్బారాయుడు: అవున్నో..మనం పొయ్యినాం కదా! పెద్దరాయుడు: నాకు రైతు భరోసాతోపాటు రూ.2,250 పింఛన్ వస్తా ఉండాది. సుబ్బారాయుడు: అవును నా భార్యకు ఒళ్లు సరిలేదని రూ. 5వేలు, మనవడికి అమ్మఒడి, నా చిన్న కొడుక్కి, రేషన్‌కార్డు, కష్టకాలంలో ఉండారని రూ.వెయ్యి ఇచ్చినారు. పెద్దరాయుడు: ఇదంతా ఎందుకు చేస్తా ఉండారు... సుబ్బారాయుడు: వాళ్ల నాయన మాదిరిగా జగన్‌కూడా పాదయాత్ర చేసి ఊళ్లో వాళ్ల కష్టం తెలుసున్నాడు కదా. 341 రోజులు, అన్ని ఊళ్లు తిరుగుతూ జనం కష్టం, ఊళ్లో కష్టాలను కళ్లరా చూసారాబ్బా. ఇన్నీ రోజులు సేయడమంటే ఏం తమాషానా..? పెద్దరాయుడు: అవునబ్బో జనం కోసం ఇదంతా చేస్తుండాడు. సెప్పిన తేదీకి కరెక్టుగా చేస్తుండారు. మాట మీద నిలబడే వ్యక్తి అని నిరూపించుకున్నాడబ్బా. సుబ్బారాయుడు: అవున్నో.. అప్పుడు మాదిరి ఇప్పుడు లేదున్నో.. మనకు ఏం కావాలన్నా ఇంటికి వలంటీర్లు వస్తుండారు. పెద్దరాయుడు: మరి మనకోసం ఇంత చేస్తున్నాడు కదా.! అప్పుడెట్టాగో ఆయనతో పాటు నడవలేక పోయాం.. ఇప్పుడు ఆయనకు మద్దతుగా మనం కూడా పదాం.. ఈళ్లతో పాటు ఒక అడుగు వేద్దామా. సుబ్బారాయుడు: సరే ఆ సేద్యం ఎప్పుడూ ఉండేదే కానీ, నేనూ వస్తా ఒకడుగేద్దాం పద. -
వైఎస్ జగన్‌కు రాపాక శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేసి నేటికి (శుక్రవారం) మూడు సంవత్సరాల పూర్తి అయిన సందర్భంగా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజాసంకల్ప యాత్రం ఓ చరిత్రను లిఖించిందని అన్నారు. వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. వైఎస్ జగన్ పాదయాత్ర మొదలు పెట్టిన సమయంలో ఆయన వెంట వైఎస్సార్సీపీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారని ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా ఆయనకు మద్దతుగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. 17 నెలల పాలనలో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా కుల మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నాయని, బ్యాంకుల ద్వారా ప్రత్యేక మైన నిధులు మంజూరు చేసి ఏప్రిల్ నాటికి బాగుచేస్తానని ముఖ్యమంత్రి హమీ ఇచ్చారని తెలిపారు. ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగవు ‘గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో రోడ్లు కూడా వేసిన పరిస్థితి లేదు. అటువంటి రోడ్లను కూడా బాగు చెయ్యటానికి ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారు. అన్ని వర్గాలను ఆకర్షించే విధంగా ప్రభుత్వ పాలన ఉంది. పాదయాత్ర ఇచ్చిన హమీ మేరకు 56బీసీ కులాలకు కార్పొరేషన్లు ఎర్పాటు చేశారు. దేశ చరిత్రలో ఎవరు చేయని సాహసం సీఎం జగన్ చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో కరోనా పేరుతో ఎన్నికలను నిలుపుదల చేశారు. వాస్తవానికి అప్పుడు కరోనా కేసులు అంతగా లేవు. ఇప్పుడు వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఎన్నికలు నిర్వహించాలి అంటున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేవలం తెలుగుదేశం పార్టీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి గ్రామంలో కరోనా కేసులు అధికంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో ఎన్నికలు నిర్వహించడం సరైనది కాదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యహారం పై ప్రజల నుండి పూర్తి వ్యతికత ఉంటుంది. స్దానిక సంస్థలు ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగే పరిస్థితి లేదు’ అని అన్నారు. -
వైఎస్ జగన్ పాదయాత్రకు మూడేళ్లు
-
ప్రజల ముంగిట పాలన
-
విద్యారంగంపై నేడు సీఎం జగన్ సమీక్ష
-
సీఎం వైఎస్ జగన్ ఒక విజన్ ఉన్న నాయకుడు
-
‘నాలుగు నెలలకే రాద్ధంతం చేయడం సరికాదు’
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రజా సంకల్ప యాత్ర ప్రధాన కారణమని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ప్రజా సంకల్ప యాత్ర రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన తన మదిలోని విషయాలు వెల్లడించారు. నవంబర్ 1 అనగానే వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర గుర్తొస్తుందన్నారు. ప్రజా సంకల్పయాత్ర.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకు భరోసా ఇచ్చిందన్నారు. టీడీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి, తమను ప్రజలకు దగ్గర చేసిందన్నారు. వందల నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు పాదయాత్ర ద్వారా ప్రజలు ఘనమైన మెజార్టీ ఇచ్చారని అదే సంకల్పయాత్ర గొప్పతనమని కొనియాడారు. నవరత్నాల ద్వారా పేద ప్రజలకు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే పేద, బడుగు, బలహీన వర్గాలకు బాసటగా నిలిచారని మల్లాది విష్ణు వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టి నాలుగు నెలలు గడవక ముందే ప్రతిపక్షాలు ఎంతో కాలంగా ఉన్న సమస్యలను కూడా ఈ నాలుగు నెలల్లో చేసినట్టు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని రాద్ధాంతం చేయడం ప్రతిపక్షాలకు తగదన్నారు. రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా గెలిపించింది వారి సమస్యల పరిష్కారానికి మాత్రమే అని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను ఏపీలో అమలు చేసి అందరితో శభాష్ అనిపించుకునేలా ముఖ్యమంత్రి పాలన సాగిస్తారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. -
అనంతపురం: కొత్త పంథా ఎంచుకున్న కలెక్టర్
కరువుకు నిలయం అనంత. ఇక్కడి ప్రజల ఆర్థిక పరిస్థితి అంతంతే. అందుకే బడుగుబలహీన వర్గాల పిల్లలకు సంక్షేమ హాస్టళ్లే దిక్కు. అయితే సిబ్బంది నిర్లక్ష్యం.. వసతుల లేమి విద్యార్థులకు ప్రత్యక్ష నరకంగా మారింది. ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని గుర్తించిన జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆ మేరకు తనదైన శైలిలో చర్యలకు ఉపక్రమించారు. హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ.. అక్కడే రాత్రి బస చేస్తూ సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యంపై కన్నెర్ర చేస్తూ.. మెరుగైన వసతి సౌకర్యాల కల్పన దిశగా అడుగులు వేస్తున్నారు. సాక్షి, అనంతపురం : విద్యారంగంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రెండేళ్లలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికలు రచించారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్‌గా సత్యనారాయణ బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి అట్టడుగు వర్గాల పిల్లలు చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, దివ్యాంగ సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అకస్మిక తనిఖీలు చేస్తూ దడ పుట్టిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, విద్యార్థుల హాజరు, భోజనం నాణ్యత, మెనూ అమలు.. హాస్టల్ వార్డెన్ల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొత్త పంథా ఎంచుకున్న కలెక్టర్ హాస్టళ్లను ఆకస్మిక తనిఖీ చేస్తున్న కలెక్టర్ విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఐదుగురు వార్డెన్లపై ఇప్పటికే వేటు వేశారు. అయినప్పటికీ మిగతా వారిలో పెద్దగా మార్పు రాలేదు. సస్పెండ్ చేయడం.. కొద్దిరోజుల తర్వాత దాన్ని ఎత్తివేయడం వల్ల ఉపయోగం లేదని భావించిన కలెక్టర్ కొత్త పంథా ఎంచుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వార్డెన్లపై సస్పెన్షన్‌తో సరిపెట్టకుండా ఇంక్రిమెంట్ల కోతకు చర్యలు తీసుకుంటున్నారు. షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ ఇచ్చిన తర్వాత(విత్/వితౌట్ కుములేటివ్ ఎఫెక్ట్) ఒకటి లేక రెండు ఇంక్రిమెంట్లు కోత విధించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా పెనుకొండ ఏఎస్డబ్ల్యూఓ ప్రసాద్, చెన్నేకొత్తపల్లి ఎస్సీ హాస్టల్ వార్డెన్ మారుతీరావు, కుక్ నారాయణమ్మ, బీకేఎస్ ఎస్సీ హాస్టల్ వార్డెన్ బాబుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కూడేరు బీసీ బాలికల హాస్టల్ వార్డెన్ కేఆర్ శశికళకు చార్జెస్ ఫ్రేం చేశారు. నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ⇔ చెన్నేకొత్తపల్లి ఎస్సీ హాస్టల్‌ను ఈనెల 7న కలెక్టర్ సత్యనారాయణ ఆకస్మిక తనిఖీ చేశారు. 55 మంది పిల్లలకు గాను 26 మంది మాత్రమే ఉన్నారు. 29 మంది గైర్హాజరయ్యారు. వినాయక చవితి పండుగకు వెళ్లిన వారు ఇంకా రాలేదని వార్డెన్ ఇచ్చిన సమాధానంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగ 3వ తేదీ అయితే 7వ తేదీ వరకు రాకపోయినా మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. అంతేకాకుండా పప్పులో ఉప్పు ఎక్కువైందనీ, సాంబారులో నీళ్లు తప్ప కూరగాయలు కనిపించలేదని.. పైగా పప్పులో రాళ్లు కనిపించాయన్నారు. తనకు వడ్డించిన అన్నంలోనే రాయి వచ్చిందన్నారు. మెనూ ప్రకారం వెజిటబుల్ కర్రీ చేయాల్సి ఉన్నా..నీళ్ల చారుతో సరిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ⇔ ఇక ఈనెల 3న కలెక్టర్ బుక్కరాయసముద్రంలో ఎస్సీ హాస్టల్‌ను పరిశీలించారు. 130 మందికి గాను కేవలం 5 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఎస్టీ హాస్టల్ వార్డెన్ అందుబాటులో లేరు. సంబంధిత శాఖల అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని భావించిన కలెక్టర్ అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పు రాకకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అందరూ పనితీరు మార్చుకుని ప్రభుత్వ ప్రాధాన్యామాలకు అనుగుణంగా పనిచేయాలని లేకపోతే ఇంటికి పంపించేందుకు కూడా వెనకాడేది లేదని కలెక్టర్ హెచ్చరిస్తున్నారు. సస్పెన్షన్ వేటు పడిన వార్డెన్లు ►రామునాయక్, అనంతపురం ఎస్సీ నంబర్–4 హాస్టల్ వార్డెన్ ►బాబు, బుక్కరాయసముద్రం ఎస్సీ హాస్టల్ వార్డెన్ ►వెంకటేశ్వర్లు, ఎస్టీ హాస్టల్ వార్డెన్ ►ఠాగూర్, గుంతకల్లు మండలం పాతకొత్తచెరువు బీసీ హాస్టల్ వార్డెన్ (వీరిలో రామునాయక్, ఠాగూర్‌పై సస్పెన్షన్ ఎత్తివేశారు.) -
‘సీఎం జగన్ పాలన దేశంలోనే రికార్డు’
సాక్షి, విశాఖ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 80 రోజుల పాలనలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం దేశంలోనే ఒక రికార్డని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి కొనియాడారు. నవరత్నాల అమలుతోపాటు కీలక బిల్లులు తీసుకురావడంతో విమర్శకుల నుంచి సైతం ముఖ్యమంత్రి ప్రశంసలు అందుకున్నారని స్పష్టం చేశారు. కృష్ణా బ్యారేజ్ వచ్చిన వరద నీటిపై కూడా చంద్రబాబు, టిడిపి నేతలు రాజకీయం చేయడం దిగజారుడు తనమని ఎద్దేవా చేశారు. -
వైఎస్ జగన్ పాదయాత్రపై పుస్తకావిష్కరణ
సాక్షి, అమరావతి: చారిత్రాత్మక ‘ప్రజాసంకల్పయాత్ర’ పాదయాత్రపై రూపొందించిన జయహో పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్, ది ప్రింట్ ఎడిటర్ చీఫ్ పద్మభూషణ్ శేఖర్ గుప్తా చేతుల మీదుగా సోమవారం ఆవిష్కారం చేశారు. సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి ఆధ్వర్యంలో జయహో పుస్తకం సంకలనం చేయబడింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ ఎమెస్కో సంస్థ ప్రచురించింది. 14 నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రలోని వివిధ చారిత్రాత్మక ఘట్టాలను దీనిలో పొందుపరిచారు. 3,648 కి.మీ సుధీర్ఘంగా సాగిన పాదయాత్రను ఫోటోలతో సహా పుస్తకాన్ని రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు, శేఖర్‌గుప్తా, రామచంద్రమూర్తి, వైఎస్సార్సీపీ నేతలు, సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయం: సీఎం వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర అనేది ఒక స్పిరిట్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. 3648 కి,మీ పాదయాత్ర చేయడమంటే సామాన్యమైన విషయం కాదని, ప్రజల సహకారంతోనే పూర్తి చేయగలిగానని అన్నారు. ఏకంగా 14 నెలల పాటు సాగిన ఈ ప్రయాణంలో ప్రతి పేదవాడిని కలిశానని, దాని ఫలితంగానే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 50 శాతం ఓట్లు వైఎస్సార్సీపీకి వచ్చాయని సీఎం గుర్తుచేశారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా.. ప్రతీక్షణం ప్రజల కోసమే పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. తన పాదయాత్రపై పుస్తకాన్ని రూపకల్పన చేసినందుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు.. పాదయాత్ర ద్వారా వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారని ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయాలను, వారసత్వాన్ని జగన్ ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. వైఎస్సార్‌తో తనక ప్రత్యేకమైన అనుబంధం ఉన్నట్లు ఆయన గుర్తుచేశారు. దేశంలో జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయన్నారు. వైఎస్ జగన్ నాయకత్వం రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరముందన్నారు. కార్యక్రమంలో రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. తన నాలుగున్నర దశాబ్దాల పాత్రికేయ అనుభవంలో పాదయాత్రపై పుస్తకాన్ని రూపొందిచడం గొప్ప విషయమన్నారు. -
ఎన్నికల వరకే రాజకీయాలు: ఎమ్మెల్యే శిల్పా
సాక్షి, కర్నూలు/ నంద్యాల: ఎన్నికల వరకే రాజకీయాలని, తర్వాత అందరి సంక్షేమానికి కృషి చేయాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన మాటలే తమకు స్ఫూర్తి అని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి పేర్కొన్నారు. కులం, మతం, పార్టీలు చూడమన్నారు. తమకు ఓటు వేయని వారికి సైతం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన చేసిన తొలి ప్రసంగం ఆకట్టుకుంది. చెప్పాల్సిన విషయాన్ని స్పష్టంగా..సూటిగా చెప్పి స్పీకర్ తమ్మినేని సీతారాం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు అందుకున్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రసంగం సాగిందిలా ‘పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృత నిశ్చయంతో ఉన్నారు. రాష్ట్రంలోని 25 లక్షల మంది నిరుపేదలకు స్థలాలు ఇచ్చి వాటిలో ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. దివంగత వైఎస్ఆర్లాగా తమ ముఖ్యమంత్రి ప్రజల మనసును గెలుచుకుంటున్నారు. గతంలో కూడా పలు ప్రభుత్వాలు పేదలకు గృహాలు కట్టించి ఇచ్చాయి. అయితే మా ప్రభుత్వం కట్టించి ఇచ్చే ఇంటిపై లబ్ధిదారుడు అవసరాల కోసం బ్యాంకులో రుణం సైతం పొందవచ్చు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 300 చదరపు అడుగుల ఇంటి కోసం పేదల నుంచి రూ.2.65 లక్షలు వసూలు చేశారన్నారు. తమ ప్రభుత్వం చేపట్టే కొత్త ఇళ్ల నిర్మాణానికి నంద్యాల, బేతంచెర్లలో ఉండే క్వారీల్లో దొరికే బండలు, టైల్స్‌ను తీసుకుని మూతపడుతున్న పరిశ్రమలకు జీవం పోయాలని కోరుతున్నాను. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన కోసం మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పడుతున్న ఆరాటాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీయడానికి రివర్స్ టెండర్ విధానం, జ్యుడీషియల్ విచారణకు శ్రీకారం చుట్టార’న్నారు. చివరకు అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన స్పీకర్, ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు చెప్పి ప్రసంగాన్ని ముగించారు. -
మహానేతకు ఘన నివాళులు
పులివెందుల : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 70వ జయంతి వేడుకలను ఇడుపులపాయలో సోమవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సోమవారం ఉదయం కడప నుంచి సతీమణి వైఎస్ భారతిరెడ్డితో కలిసి హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకున్నారు. వీరికి కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ హరికిరణ్ పూలబొకేలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు ఘన స్వాగతం లభించింది. అనంతరం వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. వారితో పాటు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్ జగన్ సోదరి షర్మిలమ్మ, బ్రదర్ అనిల్‌కుమార్, వైఎస్ జగన్ కుమార్తెలు హర్ష, వర్ష, షర్మిల కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్ సోదరులు రవీంద్రనాథరెడ్డి, సుధీకర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్తలు వైఎస్ ప్రకాష్‌రెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, పులివెందుల వైఎస్సార్సీపీ నేత వైఎస్ మనోహర్‌రెడ్డి, చక్రాయపేట మండల నాయకులు వైఎస్ కొండారెడ్డి, లింగాల, సింహాద్రిపురం మండలాల ఇన్చార్జి ఎన్.శివప్రకాష్‌రెడ్డి, వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ గూడూరు రవి, మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్, ఎస్టేట్ మేనేజర్ భాస్కర్‌రాజు తదితరులు పాస్టర్లు బెనహర్ బాబు, నరేంద్రకుమార్, మృత్యుంజయ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలమ్మ వైఎస్సార్ ఘాట్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఇడుపులపాయలోని ఎస్టేట్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో కాసేపు గడిపారు. అక్కడికి వచ్చిన బంధువులందరిని పేరు పేరున ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ నుంచి సీఎం వైఎస్ జగన్ రోడ్డు మార్గాన గండి క్షేత్రానికి వెళ్లారు. -
జిల్లా నుంచి రెండో ముఖ్యమంత్రిగా..
వైఎస్సార్ జిల్లా నుంచి రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో హర్షాతిరేకం వ్యక్తమైంది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2004లో పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ సీఎం పీఠాన్ని అధిరోహించిన వైఎస్సార్ 2009లోనూ అదే రీతిలో పట్టాభిషిక్తులయ్యారు. వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి గురువారం ముఖ్యమంత్రి కావడంతో జిల్లా ప్రజానీకంలో పట్టరాని సంతోషం కలుగుతోంది. తండ్రి మాదిరిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాను మరోమారు దేశపటంలో నిలిపారని గర్వపడుతున్నారు. జిల్లాను ప్రగతిపథంలో పయనింపజేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తారని బలంగావిశ్వసిస్తున్నారు. సాక్షి ప్రతినిధి కడప: ఢిల్లీకి రాజయినా తల్లికి బిడ్డే అంటారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విషయంలోనూ ఈనానుడ్ని జిల్లాప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. రాష్ట్రానికి సారథి అయినా తమ జిల్లాకు మాత్రం ముద్దుబిడ్డేనంటూ వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాయకుడు తమ జిల్లాలోని పులివెందులకు ఎమ్మెల్యేనని వ్యాఖ్యానిస్తున్నారు. కష్టనష్టాలలో తోడుగా ఉంటూ ఆశీర్వదించిన తమ పట్ల కూడా ఆయన అదే తరహాలో ప్రేమ కురిపిస్తారని భావిస్తున్నారు. ఈసందర్భంగా ఆయనలోని పోరాటపటిమను..నాయకుడిగా ఎదిగిన తీరుపై చర్చించుకుంటున్నారు. గురువారం జిల్లావ్యాప్తంగా ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. తమ జిల్లాకు చెందిన నాయకుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే మురిసిపోయారు. ప్రమాణ స్వీకార ఘట్టం జరుగుతున్న సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయంటే ఆ కుటుంబంపై జిల్లా ప్రజానీకం చూపిస్తున్న ఆదరాభిమానాలను అర్ధం చేసుకోవచ్చు. ఆయన ప్రమాణ స్వీకారం ప్రత్యక్షంగా చూసేందుకు బుధవారం సాయంత్రమే వైఎస్సార్సీపీ నాయకులు..కార్యకర్తలు..అభిమానులు విజయవాడకు తరలివెళ్లారు. ఎదురొడ్డి నిలిచిన నాయకుడు తన తండ్రి వైఎస్సార్ అకాల మరణం తర్వాత సుమారు పదేళ్లపాటు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. అదే సమయంలో జరిగిన ఎన్నికల్లో జిల్లా ప్రజానీకం అఖండ మెజారిటీ కట్టబెట్టారు. 2009లో కడప ఎంపీగా 1,78,846 ఓట్ల మెజారిటీ సాధించారు. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో 5,45,671ఓట్ల రికార్డు ఆధిక్యత సాధించి అబ్బురపరిచా రు. అప్పట్లోనే దేశం యావత్తూ కడప వైపు చూసేలా చేశారు. 2104లో వైఎస్ జగన్ పులివెందుల నుంచి 75243 ఓట్లతో మరో మారు రికార్డు సృష్టించారు. ఈదఫా తాజా ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ(90110ఓట్లు) తెచ్చుకుని ఔరా అనిపించుకున్నారు. ఇదీ జిల్లా ప్రజలు వైఎస్ కుటుంబంపై చూపిన అపారమైన ప్రేమకు తార్కాణం. అందుకే ఆయన తరచూ జిల్లాను మదిలో స్మరించుకుంటారు. ‘ఈ పులివెందుల నాకెన్నో పాఠాలు నేర్పింది. కష్టాలకు ఎదురొడ్డే శక్తిని ఇచ్చింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ సడలని ధైర్యాన్ని నూరిపోసింది. ఈ గడ్డకు రుణపడి ఉంటాను’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో ఇటీవల ఎన్నికల్లో నామినేషన్ వేశాక జరిగిన సభలో భావోద్వేగానికి గురయ్యారు. అందుకే ఊపిరి సలపని ఒత్తిళ్లలోనూ ..తక్కువ సమయ వ్యవధి ఉందని గుర్తించినా ప్రమాణ స్వీకారానికి ముందు జిల్లాను సందర్శించారు.బుధవారం ఆయన జిల్లాలో పర్యటనకు రావ డం ఇక్కడి ప్రజలను కూడా ఆశ్చర్యానందాల్లో ముంచింది. రాయచోటి ప్రాంతానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ధనుం జయరెడ్డిని తన పాలన మార్కు టీంలోకి తీసుకోవడమే జిల్లాపై ఆయన చూపించే మక్కువకు ఉదాహరణ అని అధికారులంటున్నారు. నాన్న చూపిన ప్రగతి బాట తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చూపిన మార్గంలోనే ఆయన తనయుడు కూడా నడుచుకుంటున్నారని జిల్లా ప్రజలంటున్నారు. ప్రమాణ స్వీకార వేదికపై వైఎస్ జగన్మోహన్రెడ్డి అవ్వాతాతలకు పించను పెంచుతూ చేసిన ప్రకటనపై హర్షం వ్యక్తంచేస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడంటూ ప్రశంసిస్తున్నారు. గ్రామ సచివాలయాలు నెలకొల్పి యువతకు ఉపాధి కల్పించాలనే సాహసోపేత నిర్ణయం ముమూర్తులా రాజశేఖరుడి స్ఫూర్తిని తలపింపజేసిందని సంబరపడుతున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టగానే జిల్లాభివృద్ధి పరుగులు పెట్టింది. సమగ్రాభివృద్ధి దిశగా పయనించింది. అదే చొరవ వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా చూపిస్తారని జిల్లా ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల హామీలో భాగంగా కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సంగతిని గుర్తుచేసుకుంటున్నారు. ఈ ఏడాది డిసెంబర్ లోగానే ఈ కర్మాగారానికి శంకుస్థాపన చేసే అవకాశం ఉందని వైఎస్సార్సీపీ శ్రేణులు చెబుతున్నాయి. 2022 నాటికి ఈ పెద్ద ప్రాజెక్టు పూర్తి చేయాలనే సంకల్పంతో చర్యలు మొదలయ్యాయని తెలుస్తోంది. బుడ్డ శనగలు (బెంగాల్ గ్రామ్)కు గిట్టుబాటు ధరపై కొత్త సీఎం ప్రత్యేక చొరవ చూపనున్నారు. రూ.6,500తో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఇదివరకే ఆయన ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వమున్న జగన్ ఈదిశగా కసరత్తు చేపట్టనున్నట్లు భోగట్టా. గండికోట ప్రాజెక్టు నిర్వాసితుల ప్యాకేజీ మార్చేందుకు సన్నహాలు చేయనున్నట్లు వైఎస్సార్సీపీ నేతలు పేర్కొంటున్నారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పెండింగ్ పనులపై వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టిసారిస్తారని జిల్లా వాసులు ప్రగాఢంగా నమ్ముతున్నారు. -
ఏపీలో కొనసాగిన ఆనవాయితీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఆనవాయితీ కొనసాగింది. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేసిన నాయకులు అధికారం చేపట్టడం అనే సంప్రదాయం ఈసారి కూడా కొనసాగింది. తన తండ్రి బాటలో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా అధికారం చేపట్టబోతున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సాగిన ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్ 3,648 కిలోమీటర్ల దూరం నడిచి నూతన అధ్యాయాన్ని లిఖించారు. కాలినడన అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. టీడీపీ సర్కారు మోసాలను, వైఫల్యాలను సాధికారికంగా ప్రజలకు వివరించి చెప్పారు. ఎల్లో మీడియా, పచ్చ నాయకుల కుట్రలను దీటుగా ఎదుర్కొని తాజా ఎన్నికల్లో వైఎస్ జగన్ విజేతగా నిలిచారు. తండ్రి తగ్గ వారసుడు అనిపించుకున్నారు. 2003లో ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేపట్టి 1,467 కిలోమీటర్లు పర్యటించారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 2012, అక్టోబర్ 2న ‘వస్తున్నా ... మీ కోసం’ అంటూ పాదయాత్ర చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2014 శాసనసభ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. తాజా ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు దక్కించుకోవడంతో వైఎస్ జగన్ సీఎం కాబోతున్నారు. దీంతో పాదయాత్ర చేసిన ముగ్గురు నాయకులు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించినట్టైంది. -
నిరుద్యోగ సమస్య పరిష్కారమవ్వాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలి