సాక్షి, తాడేపల్లి: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర.. ఏపీ రాజకీయ ప్రస్థానంలో మరిచిపోలేని ఒక ఘట్టం. నేటితో(సోమవారం) ఆ యాత్ర పూర్తై నాలుగు సంవత్సరాలు అయ్యింది. ఈ సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు పార్టీ నేతలు, కార్యకర్తలు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్టారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ సురేష్ తదితరులు హాజరయ్యారు.
దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. ప్రజల్లో ఉండటమే రాజకీయం అని నమ్మిన వ్యక్తి జగన్. పాదయాత్రలో చూసిన ప్రజల కష్టాలు మ్యానిఫెస్టోలో రూపొందించారు. ఇప్పటివరకూ 98 శాతం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు పూర్తి చేశారు. ప్రజలకు ఏమీ కావాలో అది చేసిన ఏకైక నాయకుడు సీఎం జగన్. ప్రజలకు మంచి చేశారు కనుకే దైర్యంగా ఎమ్మెల్యేలను ఇంటింటికీ పంపుతున్నారు. జగన్ జీవితం తెరచిన పుస్తకం.
వైఎస్సార్‌సీపీ అంటే దేశంలోనే విలక్షణమైన పార్టీగా నిలబడింది. ప్రజల నమ్మకాన్ని జగన్ ఏనాడూ వమ్ము చెయ్యలేదు. చాలా వరకూ అధికార పార్టీలు ముందస్తు కోరుకుంటారు. కానీ మన రాష్ట్రంలో ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయి. వెంటిలేటర్ పై ఉన్న పార్టీలు ముందస్తు ఎన్నికలు కోరుకుంటున్నాయి. 2024లో షెడ్యుల్ ప్రకారమే రాష్టంలో ఎన్నికలు జరుగుతాయి. పవన్-చంద్రబాబులు తమ అక్రమ సంబంధాన్ని పవిత్రం చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి పరామర్శిస్తారు. కానీ చావుకు కారణం అయిన వారిని పరామర్శించడం ఏంటి?
అక్రమ సంబంధాన్ని సక్రమం చెయ్యడం కోసం కలుస్తున్నారు. తెలంగాణలో కిందా మీదా పడి బీజేపీకి దగ్గర అవ్వాలని చూస్తున్నాడు చంద్రబాబు. టీడీపీ -జనసేన కలవడం శుభపరిణామం అని సీపీఐ రామకృష్ణ అంటున్నాడు. ఎరుపు కాషాయం కలిస్తే పసుపు అవుతుందేమో.?, బలమైన జగన్నీ ఎదుర్కోడానికి వీళ్లంతా ఏకం అవుతున్నారు. చంద్రబాబు, పవన్‌లు ఎన్ని పగటి కలలు కన్నా ప్రజాబలం ఉన్న జగన్‌నీ ఏమీ చెయ్యలేరు.
ఒకవైపు జగన్ ఉన్నారు.. ఆటు వైపు గుంట నక్కలు ఉన్నాయి. ప్రజల్లో ఉండి, ప్రజలకు ఏం కావాలో అది చేసిన నాయకుడు జగన్. చంద్రబాబు, పవన్ ఏ విలువలు, సిద్దాంతాలకు కట్టుబడి ఉన్నారో ప్రజలకు అర్థం అయింది. ఒక బలవంతమైన నాయకుడిని ఎదుర్కొనేందుకు ఇలాంటి వారంతా ఒకటవుతున్నారు. సీపిఐ రామకృష్ణ కామెంట్స్ విచిత్రంగా ఉంది. మరి బీజేపీ కూడా వారితో కలిస్తే ఏం చెప్తారు?, ఎరుపు, కాషాయం కలిస్తే పసుపు అవుతుందేమో చూడాలి. దుష్టశక్తులు ఇంకా ఏమేమి చేస్తాయో చూడాలి. పందికొక్కులు, గుంటనక్కలు ఏకం అవటాన్ని జనం చూడాలి. ఇలాంటి వారికి ప్రజలే బుద్ది చెప్తారు’ అని పేర్కొన్నారు.
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ‘పాదయాత్రలో వేల సమస్యలు జగన్ దృష్టికి వచ్చాయి. ప్రజా సమస్యలు తెలుసుకుని మ్యానిఫెస్టోలో పెట్టాం. జగన్ చెప్పాడంటే.. చేస్తాడంతే అనే నినాదం వచ్చింది’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment