
సాక్షి, విశాఖ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 80 రోజుల పాలనలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం దేశంలోనే ఒక రికార్డని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి కొనియాడారు. నవరత్నాల అమలుతోపాటు కీలక బిల్లులు తీసుకురావడంతో విమర్శకుల నుంచి సైతం ముఖ్యమంత్రి ప్రశంసలు అందుకున్నారని స్పష్టం చేశారు. కృష్ణా బ్యారేజ్ వచ్చిన వరద నీటిపై కూడా చంద్రబాబు, టిడిపి నేతలు రాజకీయం చేయడం దిగజారుడు తనమని ఎద్దేవా చేశారు.