సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి విమర్శించారు. గురువారం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై బురద చల్లడానికి చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తూన్నారని మండిపడ్డారు. గత టీడీపీ పాలనలో నాయకులు ఏ విధంగా రాష్ట్రాన్ని దోచుకుతిన్నారో ప్రజలందరికీ తెలుసునన్నారు. చంద్రబాబు పాలన అంతా అవినీతిమయమని, టీడీపీ నాయకులు విచ్చలవిడిగా కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు తనయుడు లోకేష్ దారుణమైన దోపిడీకి తెరలేపారని నిప్పులు చెరిగారు.
జగన్ పాలనలో ఏపీ సస్యశ్యామలం..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఏపీ సస్యశ్యామలంగా మారిందన్నారు. రైతు భరోసాతో రైతుల జీవితాల్లో సీఎం జగన్ కొత్త వెలుగు నింపారన్నారు. చేనేతలకు రూ.24 వేల ఆర్థిక సాయం చేయాలని క్యాబినెట్ నిర్ణయం అభినందనీయమన్నారు. మత్స్యకార కుటుంబాలకి పది వేల రూపాయిలు ఇవ్వాలని తీసుకున్ననిర్ణయంతో వారికి మేలు జరుగుతుందన్నారు. నాడు మహానేత వైఎస్సార్ పాలనను నేడు సీఎం జగన్ మరిపిస్తున్నారని ప్రశంసించారు. ఏపీలో జరుగుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్ర్రాలకు ఆదర్శంగా ఉన్నాయన్నారు.
నిరుద్యోగులకు వరం..
జనవరి నుంచి ప్రతీ ఏటా ఏపీపీఎస్సీ క్యాలెండర్ విడుదల చేయడం నిరుద్యోగులకు వరమని పేర్కొన్నారు. రివర్స్ టెండరింగ్‌తో వేల కోట్ల ఆదా జరుగుతోందని వెల్లడించారు. ఇసుక కొరత లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఏపీలో సీఎం జగన్ తన పాలనతో అవినీతికి చెక్ పెట్టారని కొయ్య ప్రసాద్‌రెడ్డి ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment