koyya prasad reddy
-
వైఎస్సార్సీపీ నుంచి కొయ్యా ప్రసాద్‌రెడ్డి సస్పెన్షన్
సాక్షి, తాడేపల్లి : విశాఖపట్నానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొయ్యా ప్రసాద్ రెడ్డిని పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. విశాఖ కలెక్టరేట్ పేరును, రాజ్యసభ ఎంపీ విజయ సాయిరెడ్డి పేరును ఉపయోగించి ల్యాండ్ డీల్స్ పేరుతో అక్రమ కార్యకలాపాలను నిర్వహించడం పార్టీ క్రమశిక్షణ సంఘం తీవ్రంగా పరిగణించింది. అందుకే ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును, పార్టీలోని పార్లమెంట్ సభ్యులు, సీనియర్ నాయకుల పేర్లను ఉపయోగించి భూములు, ఇతరత్రా డీల్స్ అంటూ.. ఎవరు అక్రమాలకు ఒడిగట్టినా ఇదే స్థాయిలో క్రమశిక్షణా చర్యలు ఉంటాయని పార్టీ కేంద్ర కార్యాలయం స్పష్టం చేసింది. -
‘బాబు కరోనా కంటే ప్రమాదం’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు నాయుడు, టీటీపీ నాయకులు కరోనా వైరస్ కంటే ప్రమాదరంగా తయారయ్యారని ఏపీ టెక్నాలజీస్ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాద్‌రెడ్డి అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనాపై ప్రపంచ మొత్తం ఆందోళన చెందుతుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివృద్ధి కార్యక్రమాల క్యాలెండర్‌ను విడుదల చేయటం అభినందనీయమని ఆయన కొనియాడారు. పోతిరెడ్డిపాడుపై స్పందించని చంద్రబాబు మద్యం సేవించిన డాక్టర్ సుధాకర్‌పై మాట్లాడతారని ఆయన ఎద్దేవా చేశారు. కొత్త మెడికల్ కాలేజీలు, పోర్ట్ జట్టీలతో లాక్డౌన్ అనంతరం రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీయడం ఖాయమని ప్రసాద్‌రెడ్డి తెలిపారు. -
‘మీ వల్లే విశాఖలో ఉద్రిక్తత తలెత్తింది’
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా టీడీపీ మరోసారి అబద్ధపు ప్రచారానికి దిగిందని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ మాజీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొయ్య ప్రసాద్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చే ముందే ప్రజలను కించపరిచేలా మాట్లాడారని పేర్కొన్నారు. దీంతో ఆందోళన తెలిపేందుకు ప్రజలు విమానాశ్రయానికి చేరుకోగా.. వారిని టీడీపీ నేతలు.. పులివెందుల, కడప నుంచి వచ్చారని, పెయిడ్ ఆర్టిస్టులని అనడంతో ఉద్రికత్త తలెత్తిందన్నారు. సతీసమేతంగా బంధువుల పెళ్లికి వచ్చిన బాబు ఈ రాజకీయ డ్రామా చేయడం ఏమిటని? ఇది ప్రజలను రెచ్చగొట్టడం కాదా అని ప్రశ్నించారు. విశాఖకు రాజధాని వద్దన్న ఆయనకు ప్రజల మద్దతు ఏమాత్రం లభించలేదన్నారు. కనీసం ఎయిర్‌పోర్టుకు ప్రాతినిధ్యం వహించే గణబాబు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. బాబు దగ్గరికి రాలేదని ఎద్దేవా చేశారు. అక్కడ పట్టుమని వందమంది కార్యకర్తలు కూడా లేరని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.(లక్షల్లో ఫీజులు.. పురుగులతో భోజనం) సబ్బం హరిని ఎన్నిసార్లు తిట్టారో అందరికీ తెలుసు ‘సబ్బం హరి టీవీలోనే తప్ప విమానాశ్రయానికి వచ్చి ఆయనకు మద్దతిచ్చారా? ఎన్నికల్లో బాబు వైఖరికి ఆగ్రహం చెంది భరత్, కావూరీ నీ ఇంటిమీదకు రాలేదా? నువ్వు టీవీలో శాంతి ప్రవచనాలు చెప్తున్నావు, నీ చరిత్రంతా సెటిల్మెంట్లు దౌర్జన్యాలు కాదా? చంద్రబాబు, ఆయన పార్టీ వాళ్లు ఎన్నిసార్లు సబ్బం హరిని రౌడీ, గూండా అని తిట్టారో అందరికీ తెలిసిందే. ఇక ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ కాలేజీల్లో ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో పోలీసులకు అందిన ఫిర్యాదులను చూస్తే తెలుస్తుంది. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, ఆయన కుమారుడు ఎన్ని భూదందాలు చేశారో అందరికీ తెలుసు. అందుకే చిత్తుగా ఓడించారు. ఇపుడు ఆయన భూముల సేకరణ అక్రమం అంటున్నారు. వీళ్లా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని, వైసీపీని తప్పుబట్టేది? మీరు ఎంత విషం కక్కినా ప్రజాభిమానంతో సీఎం జగన్ ముందుకు వెళతారు. రాజధాని వికేంద్రీకరణ జరిగి తీరుతుంది’ అని కొయ్య ప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. -
అచ్చెన్నా.. కులాన్ని అడ్డుపెట్టుకుంటావా?
సాక్షి, విశాఖపట్నం: ఈఎస్ఐ వ్యవహారంలో వేల కోట్లు అవినీతికి పాల్పడిన మాజీ మంత్రి అచ్చెన్నాయడు.. ఇప్పుడు తన సామాజికవర్గాన్ని అడ్డుపెట్టుకోవడం ఆశ్చర్యంగా ఉందని ఏపీ టెక్ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ నేత కొయ్య ప్రసాదరెడ్డి అన్నారు. కార్మికుల ఆరోగ్య నిధులని కూడా చూడకుండా తమ ఖాతాల్లోకి మళ్లించుకోవడం సిగ్గు చేటన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ నగర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈఎస్ఐ కుంభకోణంలో వేల కోట్లు తినేసి, ఇప్పుడు వాటిని కప్పి పుచ్చుకునేందుకు టీడీపీ నేతలు సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుంటున్నారని విమర్శించారు. ఐటీ దాడుల్లో రూ.2 వేల కోట్లు అవినీతి జరిగినట్టు తేటతెల్లమైతే.. టీడీపీ నేతలు తమకు సంబంధం లేదంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పుడు ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు పాత్ర ఉందని నేరుగా విజిలెన్స్ అధికారులు చెబుతుంటే.. కక్ష సాధిస్తున్నారంటూ గోల చేయడం తగదన్నారు. గత ఐదేళ్లలో టీడీపీ నేతలు తిన్నదంతా కక్కిస్తామని ఆయన స్పష్టం చేశారు. బీసీల అభ్యున్నతికి సీఎం కృషి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడి 9 నెలల పాలనలో బీసీల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారని కొయ్య తెలిపారు. ఇది ఓర్వలేకనే టీడీపీ నేతలు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. నిరంతరం కులాల మధ్య.. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చంద్రబాబు అండ్ కో చేస్తోందని దుయ్యబట్టారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్‌పై కుట్ర పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని కొయ్య ప్రసాద్‌రెడ్డి అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానుల ఏర్పాటుపై సీఎం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమన్నారు. ఏపీ తరహాలోనే ఇతర రాష్ట్రాలు కూడా పాలన వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నాయన్నారు. ఇది చూసి ఓర్వలేని టీడీపీ నేతలు పదేపదే విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ని దెబ్బతీయాలనే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అమరావతి రైతులను రెచ్చగొడుతూ.. మరో వైపు ఉత్తరాంధ్ర ప్రజలకు తప్పుడు సమాచారం పంపించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, పార్టీ రాష్ట్ర మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శి ఎండీ ఫరూఖీ, నగర, పార్లమెంట్ అనుబంధ సంఘాల అధ్యక్షులు, ముఖ్యనేతలు సతీష్ వర్మ, పీలా వెంకటలక్షి్మ, కాళిదాసురెడ్డి, రేయి వెంకటరమణ, బోని శివరామకృష్ణ, రాధ, సత్యాల సాగరిక, అడిగర్ల ఆనంద్‌బాబు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
‘టీడీపీ నేతలు వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారు’
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేతలు శ్రీనివాసరెడ్డి, పత్తిపాటి పుల్లారావు, పితాని సత్యారాయణలకు చంద్రబాబు సహాయకుడు శ్రీనివాసరావు అక్రమాస్తులతో సంబంధాలు ఉన్నాయని ఏపీ టెక్నాలిజీ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాద్‌రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టు వైఎస్సార్సీపీ అయిదేళ్ల నుంచి చెబుతోందని తెలిపారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకి ఈఎస్ఐ కుంభకోణంతో ప్రమేయం ఉందన్నారు. కానీ టీడీపీ నేతలు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. (ఏం బతుకులు మీవి..?: విజయసాయిరెడ్డి) అచ్చెన్నాయుడు బీసీ నేత అని టీడీపీ నాయకులు వెనుకేసుకు వస్తున్నారని ప్రసాద్‌రెడ్డి విమర్శించారు. బీసీ నేతలను దోచుకోమని ఎవరైనా చెప్పారా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు దివాకర్ రెడ్డి, నారాయణ, పీలా గోవింద్ అక్రమాలు బయటకు వస్తే కక్ష సాధింపు అని టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. విశాఖలో రాజధానికి నేవి అనుమతి ఇవ్వడం లేదని అత్యంత దారుణంగా పచ్చ మీడియా ప్రచారం చేస్తోందని ఆయన దుయ్యబాట్టారు. (అక్రమాలపై విచారణకే ‘సిట్’) టీడీపీ నేతలు పనిగట్టుకొని వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారని ప్రసాద్‌రెడ్డి ఫైర్ అయ్యారు. పేదలకు ఇళ్లు ఇవ్వాలని భూసేకరణ జరుపుతుంటే.. బండారు సత్యనారాయణ లాంటి అక్రమార్కులు తప్పుడు ప్రచారంతో ప్రజలను రెచ్చగొడుతున్నారని తెలిపారు. నదుల అనుసంధానం ద్వారా రైతులకు మేలు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారని ఆయన గుర్తు చేశారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశిస్తే రేషన్ కార్డులు తొలగిస్తున్నారని టీడీపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు. ఈఎస్ఐ స్కాంలో కాంట్రాక్టర్ లోకేష్‌కు అత్యంత ఆప్తుడని ప్రసాద్‌రెడ్డి తెలిపారు. (రోగుల అందం.. అదిరిందయ్యా చంద్రం!) -
‘నీ చిల్లర పనులను జనం గుర్తు పెట్టుకున్నారు’
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర అభివృద్ధిని పట్టించుకోని దద్దమ్మల పార్టీ టీడీపీ అని ఆంధ్రప్రదేశ్ టెక్నాలిజీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి అన్నారు. విశాఖపట్నంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నం నగరాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావిస్తే.. అశోక్ గజపతిరాజు లాంటి వ్యక్తులు విమర్శలు చేయడం తగదన్నారు. పార్టీలు మారిన సబ్బం హరికి.. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిని విమర్శించే అర్హత లేదని ఆయన మండిపడ్డారు. కంచరపాలెంలో సబ్బం హరి చేసిన చిల్లర పనులు ఇంకా జనం గుర్తుంచుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. కిరణ్‌కుమార్‌రెడ్డిని నట్టేట ముంచి.. సబ్బంహరి అభ్యర్థుల నుంచి డబ్బులు దోచుకున్నాడని ప్రసాద్‌రెడ్డి దుయ్యబట్టారు. పార్టీ ఫండ్లు, అభ్యర్థుల నిధులు మింగేసిన ఘన చరిత్ర సబ్బం హరిది ఆయన విమర్శించారు. చంద్రబాబు నాయుడు తన అనుచరుల ఆస్తులు పోతాయనే ఉద్దేశంతో రాజధానిపై రాద్ధాంతం చేస్తున్నారని కొయ్యప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. -
‘ప్రతిపక్ష నేతగా చంద్రబాబు విఫలం’
సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి విమర్శించారు. గురువారం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై బురద చల్లడానికి చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తూన్నారని మండిపడ్డారు. గత టీడీపీ పాలనలో నాయకులు ఏ విధంగా రాష్ట్రాన్ని దోచుకుతిన్నారో ప్రజలందరికీ తెలుసునన్నారు. చంద్రబాబు పాలన అంతా అవినీతిమయమని, టీడీపీ నాయకులు విచ్చలవిడిగా కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు తనయుడు లోకేష్ దారుణమైన దోపిడీకి తెరలేపారని నిప్పులు చెరిగారు. జగన్ పాలనలో ఏపీ సస్యశ్యామలం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఏపీ సస్యశ్యామలంగా మారిందన్నారు. రైతు భరోసాతో రైతుల జీవితాల్లో సీఎం జగన్ కొత్త వెలుగు నింపారన్నారు. చేనేతలకు రూ.24 వేల ఆర్థిక సాయం చేయాలని క్యాబినెట్ నిర్ణయం అభినందనీయమన్నారు. మత్స్యకార కుటుంబాలకి పది వేల రూపాయిలు ఇవ్వాలని తీసుకున్ననిర్ణయంతో వారికి మేలు జరుగుతుందన్నారు. నాడు మహానేత వైఎస్సార్ పాలనను నేడు సీఎం జగన్ మరిపిస్తున్నారని ప్రశంసించారు. ఏపీలో జరుగుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్ర్రాలకు ఆదర్శంగా ఉన్నాయన్నారు. నిరుద్యోగులకు వరం.. జనవరి నుంచి ప్రతీ ఏటా ఏపీపీఎస్సీ క్యాలెండర్ విడుదల చేయడం నిరుద్యోగులకు వరమని పేర్కొన్నారు. రివర్స్ టెండరింగ్‌తో వేల కోట్ల ఆదా జరుగుతోందని వెల్లడించారు. ఇసుక కొరత లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఏపీలో సీఎం జగన్ తన పాలనతో అవినీతికి చెక్ పెట్టారని కొయ్య ప్రసాద్‌రెడ్డి ప్రశంసించారు. -
టీడీపీ దుష్ఫ్రచారాలు ప్రజలు నమ్మరు
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు పాలనలో ప్రజలు పండగలు కూడా చేసుకోలేకపోయారని..వైఎస్ జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా దసరా పండగను చేసుకుంటున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎన్ని దుష్ఫ్రచారాలు చేసిన ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. పెట్టుబడుల సదస్సుల పేరిట చంద్రబాబు సర్కారు కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర్ర కార్యదర్శి రొంగలి జగన్నాధం ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను ఇతర రాష్ట్ర్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు పక్కి దివాకర్, రామన్నపాత్రుడు తదితరులు పాల్గొన్నారు. -
‘కబ్జాదారుల చేతుల్లో ఉన్న భూములు స్వాధీనం’
సాక్షి, విశాఖపట్నం : విశాఖ అభివృద్ధిని ఓర్వలేకే టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి విమర్శించారు. మాజీ మంత్రి అయ్యన్న విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని, ఐదేళ్ల భూ కబ్జాలను అడ్డుకున్న పోలీసులపై విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. రానున్న కాలంలో కబ్జాదారుల చేతుల్లో ఉన్న సర్కారు భూములు స్వాధీనం చేసుకోవడం ఖాయమని స్పష్టం చేశారు. టీడీపీ నేతల ఐదేళ్ల అక్రమాలకు అడ్డుకట్ట పడుతోందని వెల్లడించారు. వంద రోజుల్లోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన సంక్షేమ పథకాలకు జనం నీరాజనం పలుకుతున్నారని ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. చదవండి : దేవతల యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్టు.. -
‘సీఎం జగన్ పాలన దేశంలోనే రికార్డు’
సాక్షి, విశాఖ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 80 రోజుల పాలనలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం దేశంలోనే ఒక రికార్డని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి కొనియాడారు. నవరత్నాల అమలుతోపాటు కీలక బిల్లులు తీసుకురావడంతో విమర్శకుల నుంచి సైతం ముఖ్యమంత్రి ప్రశంసలు అందుకున్నారని స్పష్టం చేశారు. కృష్ణా బ్యారేజ్ వచ్చిన వరద నీటిపై కూడా చంద్రబాబు, టిడిపి నేతలు రాజకీయం చేయడం దిగజారుడు తనమని ఎద్దేవా చేశారు. -
అవినీతి రహిత పాలనకు సహకరించాలి
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించే అవినీతి రహిత పాలనకు అందరూ సహకరించాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి కోరారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ. 1150 కోట్ల నిధిని ఏర్పాటు చేశారని తెలిపారు. జగన్ నిర్ణయం పట్ల అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయన్నారు. ఐదేళ్ల పాలనతో చంద్రబాబు అగ్రిగోల్డ్ బాధితులను కష్టాల పాలు చేశారని మండి పడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం జనగ్ తీసుకునే నిర్ణయాల పట్ల రాజకీయ వర్గాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయన్నారు. గ్రామ సచివాలయ పాలన ద్వారా జాతిపిత మహాత్మాగాంధీ కలను జనగ్‌మోహన్‌రెడ్డి నిజం చేశారని ప్రసాద్ రెడ్డి ప్రశంసించారు. -
‘వెలగపూడి భూ ఆక్రమణలపై విచారణ జరిపించాలి’
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ భూ ఆక్రమణలపై విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో విశాఖలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒలంపిక్స్‌లో అబద్ధాల పోటీ పెడితే.. మాజీ సీఎం చంద్రబాబుకే అన్ని పతకాలు దక్కుతాయన్నారు. జీవీఎంసీ, వుడా కేంద్రంగా టీడీపీ నేతలు జరిపిన అక్రమాల్లో త్వరలోనే అసలు సూత్రధారులను బయటకు తీయడం జరుగుతుందన్నారు. పార్టీలకతీతంగా గ్రామ వాలంటీర్ల నియామకారలు జరుగుతాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధింస్తుందని సుధాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు -
‘ఎందుకు ఓడిపోయారో చెప్పరు.. తన వల్లే గెలిచిందంటారు’
సాక్షి, విశాఖపట్నం : తెలంగాణలో ఎందుకు ఓడిపోయామో చెప్పని చంద్రబాబు, ఉత్తరాదిలో మాత్రం తన వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పడం దౌర్భాగ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్యా ప్రసాద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా కోసం ఎవరితోనైనా కలిసి ఉంటామని చెప్పారే తప్ప.. చంద్రబాబులా పూటకో మాట మార్చే నైజం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిది కాదని పేర్కొన్నారు. తనకు గిట్టని వారినందరినీ వైఎస్ జగన్‌తో ముడిపెడుతూ చంద్రబాబు నాయుడు తన ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చుకుంటున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ ఒక పద్ధతి ప్రకారం, దివంగత మహానేత వైఎస్సార్‌లాగా హుందాగా వ్యవహరిస్తారని తెలిపారు. తగిన బుద్ధి చెప్పారు... విశాఖ ప్రజల దాహార్తిని తీర్చడానికి టీడీపీ, బీజేపీలు ఎటువంటి కార్యాచరణ రూపొందించలేదని ప్రసాద్ రెడ్డి విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబును మించి ప్రపంచంలో మరో ముఖ్యమంత్రి లేరని.. ఆయన అబద్ధాలకు తెలంగాణ ప్రజలు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కనీసం ప్రతిపక్షంలో కూర్చోవడానికి కూడా వీల్లేకుండా తెలంగాణ సహా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. -
భూదందా.. హుద్‌హుద్ కన్నా తీవ్రమైంది
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): విశాఖలో 2014లో సంభవించిన హుద్‌హుద్ కన్నా.. భూదందా తుపాను తీవ్రమైందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి అన్నారు. జగదాంబ జంక్షన్ సమీపంలోని పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భూదందా తుపాన్‌ను తీరం దాటించి, బయటపడేందుకు టీడీపీ నేతలు రాత్రింబవళ్లు నిద్రలేకుండా ఉన్నారన్నారు. భూకుంభకోణంపై ఎంపీ హరిబాబు గానీ.. పలుమార్లు విశాఖ వస్తున్న కేంద్ర మంత్రి వెంకయ్య గానీ స్పందించకపోవడం శోచనీయమన్నారు. రూ.25వేల కోట్ల విలువైన భూములు ట్యాంపరింగ్ అయ్యాయని ముందుగా కలెక్టరే చెప్పారని, మంత్రి లోకేష్ విశాఖ వచ్చిన తర్వాత కేవలం 276 ఎకరాల భూములే ట్యాంపరింగ్ అయ్యాయని కలెక్టర్ మాట మార్చడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. ప్రభుత్వం సిట్‌తో విచారణ చేపట్టడం చూస్తే కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. భూఅక్రమాలపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో టీడీపీ మంత్రుల మధ్య యుద్ధం మొదలైందన్నారు. ప్రజాపాలనను గాలికొదిలేసి.. భూకబ్జాలపై టీడీపీ ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే అనిత, ఆమె అనుచరులు రైతుల నుంచి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి, ప్రభుత్వం నుంచి ఎక్కువ పరిహారం తీసుకున్నారని ఆరోపించారు. భూకుంభకోణంపై తలపెట్టిన భారీ ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్ మాట్లాడుతూ ఎంపీ విజయసాయిరెడ్డిని విమర్శించే అర్హత పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు లేదన్నారు. తన నియోజకవర్గంలో జరిగిన భూకబ్జాలపై సీబీఐ విచారణ చేపట్టాలని అడిగే దమ్ము అనితకు లేదని, చంద్రబాబు, లోకేష్ మెప్పు కోసం ఇష్టానుసరంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, బీసీడీఎఫ్ అధ్యక్షుడు పక్కి దివాకర్, మహిళ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీలా వెంకటలక్ష్మి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, మహిళ విభాగం నగర కార్యదర్శి శ్రీదేవివర్మ, నగర అధికార ప్రతినిధులు వారాది శ్రీదేవి, మళ్ల ధనలత, ప్రచార కమిటీ నగర అధ్యక్షుడు బర్కత్ ఆలీ, జిల్లా సహాయ కార్యదర్శి నూకిరెడ్డి పాల్గొన్నారు. -
బడ్జెట్ అంతా అంకెల గారడీ
-
'నారాయణ సంస్థలపై గవర్నర్ దృష్టి పెట్టాలి'
విశాఖపట్నం : ఓటుకు కోట్లు కేసు రాజీ కోసం డ్రామాలాడుతున్నారని వైఎస్ఆర్ సీపీ నేత కొయ్య ప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. ఓట్లు కోట్లు కేసు కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన నిప్పులు చెరిగారు. శనివారం విశాఖపట్నంలో కొయ్య ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్ట్, ప్రత్యేక హోదా, విభజన హామీకు బ్రేక్ పడినట్లే అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి.నారాయణ విద్యాసంస్థలపై దృష్టి పెట్టాలని గవర్నర్‌కు కొయ్య ప్రసాద్‌రెడ్డి సూచించారు. -
'చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారు'
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్ సీపీ నేత కొయ్య ప్రసాదరెడ్డి శనివారం విశాఖపట్నంలో నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. స్వప్రయోజనాల కోసం బీజేపీతో టీడీపీ సావాసం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబుకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఆగస్టు 2వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న బంద్‌కు సహకరించాలని అన్ని పార్టీలకు కొయ్య ప్రసాదరెడ్డి విజ్ఞప్తి చేశారు. -
చంద్రబాబు విదేశీ టూర్లు చేయడమే తప్ప...
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి శనివారం విశాఖపట్నంలో నిప్పులు చెరిగారు. చంద్రబాబు విదేశీ టూర్లు చేయడమే తప్ప... రాష్ట్రానికి పైసా పెట్టుబడి కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. బ్యూటిపికేషన్ పేరుతో ఆలయాలను తొలగించడం చాలా దుర్మార్గమ ఆయన మండిపడ్డారు. దీనిపై తమ పార్టీ పోరాటం చేస్తుందని కొయ్య ప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. -
'తెలుగు ప్రజలను ఉలికిపాటుకు గురి చేసింది'
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా వ్యాఖ్యలు తెలుగు ప్రజలను ఉలికిపాటుకు గురి చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి అన్నారు. గురువారం విశాఖపట్నంలో కొయ్య ప్రసాద్‌రెడ్డి విలేకర్లలో మాట్లాడుతూ... ఈ వార్తతో తెలుగు ప్రజలంతా బాధాతప్త హృదయాలతో ఉన్నారని చెప్పారు. ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాదాలకింద తాకట్టు పెట్టిన ఘనత చంద్రబాబుదని ఆయన ఎద్దేవా చేశారు. ఎంపీ మేకపాట రాజమోహనరెడ్డి సారథ్యంలో శుక్రవారం రైల్వేమంత్రి సురేష్ ప్రభును కలిసి రైల్వేజోన్‌పై ఒత్తిడి తీసుకొస్తామని కొయ్య ప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. -
'అవి కాంట్రాక్టర్ల మెయిన్‌టెయిన్ కు సరిపోతాయి'
విశాఖ: ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రజలను మోసం చేసేలా ఉందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి విమర్శించారు. ఆయనిక్కడ మాట్లాడుతూ విశాఖకు నిధులు ఇవ్వకుండా కేంద్ర బడ్జెట్ ఏ విధంగా నిరాశపర్చిందో.. అదే రీతిలో రాష్ట్ర బడ్జెట్ ఉందన్నారు. నిధులు లేకుండా విమ్స్ ను ఎలా అభివృద్ది చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాజెక్టులకు రూపాయి కూడా కేటాయించక పోవడం దురదృష్టకరమన్నారు. సుజల స్రవంతికి రూ. 10 వేల కోట్లు అవసరముంటే కేవలం రూ. 2 వేల కోట్లు కేటాయించడం ఎంత వరకూ సమంజసమన్నారు. విశాఖకు తాగునీరు అందించే రైవాడ ప్రాజెక్టు కు 75 లక్షలు అవసరమైతే రూ. 6 లక్షల ను బడ్జెట్ లో కేటాయించారని తెలిపారు. ఈ కేటాయింపులు చూస్తుంటే కేవలం కాంట్రాక్టర్లను మెయిన్ టెయిన్ చేయడానికే సరిపోతుందని ప్రసాద రెడ్డి ఎద్దేవా చేశారు. -
'ఆ ఇద్దరు ఎంపీలు చేతకాని దద్దమ్మలు'
విశాఖ: రైల్వే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ఆయనిక్కడ శుక్రవారం మాట్లాడుతూ సీఎం చంద్రబాబు చేతకాని తనం, మెతక వైఖరే రైల్వే జోన్ రాకపోవడానికి కారణమని ఆరోపించారు. రాష్ట్రంలో సమస్యలు పక్కన పెట్టి ప్రతిపక్షాన్నీ నిరివీర్యం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. విశాఖ ఎంపీ హరిబాబు కూడా ఇచ్చిన హామినీ నిలబెట్టు కోలేదని, బడ్జెట్ పై ఇప్పటి వరకు పెదవి విప్పక పోవడం నగర ప్రజలకు ద్రోహం చేసినట్టే అని ఆయన విమర్శించారు. అవంతి శ్రీనివాస్, హరిబాబులు ఇద్దరు చేతకాని దద్దమ్మలని విరుచుపడ్డారు. మరో వైపు చంద్రబాబుకు, ప్రధాని మోదీ కి పడటం లేదని, అందువల్లే నిధులు, రైల్వే జోన్ రావడం లేదన్నారు. చంద్రబాబు తక్షణం తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
'టీడీపీ అవినీతి పార్టీ'
విశాఖపట్నం : టీడీపీ అవినీతి పార్టీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం విశాఖపట్నంలో మాట్లాడుతూ... టీడీపీ ఎమ్మెల్యేలు వందల కోట్లు సంపాదించుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో విఫలమైందంటూ టీడీపీ ప్రభుత్వపై కొయ్య ప్రసాద్‌రెడ్డి నిప్పులు చెరిగారు. -
శ్వేతపత్రం కాదు అబద్ధాల పత్రం
అల్లీపురం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇసుక విధానంపై విడుదల చేసిన శ్వేతపత్రం అబద్ధాల పత్రంగా ఉందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొయ్యప్రసాద్ రెడ్డి విమర్శించారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రవేశపెట్టిన ఇసుక విధానం వల్ల మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కోట్లకు పడగలెత్తారే కానీ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఈ ఇసుక విధానం వల్ల సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదన్నారు. బాక్సైట్ తవ్వకాలపై గిరిజనుల ఆందోళనతో వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల ఒత్తిడి మేరకు మళ్లీ అనుమతులిచ్చేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. బాక్సైట్ తవ్వకాలపై గిరిజనులకు అండగా పోరాడతామని, అలా కాకుండా ప్రభుత్వం ముందుకు వెళ్లితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. -
'పుష్కర పనులు బినామీ వ్యక్తులకు అప్పగించారు'
విశాఖపట్నం : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కోటగుమ్మం పుష్కరాల దుర్ఘటన, అవినీతిపై తక్షణమే విచారణ జరిపించాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుష్కరాల పనులను బినామీ వ్యక్తులకు అప్పగించిందని ఆయన ఆరోపించారు. బినామీ వ్యక్తులతో పనులు చేయించి అవినీతికి పాల్పడ్డారని ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. -
బాబు అవినీతి.. తెలుగువారికి సిగ్గుచేటు
విశాఖపట్నం: చంద్రబాబు తన అవినీతితో ప్రపంచంలో తెలుగువారంతా సిగ్గుతో తల వంచుకునేలా చేశారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. విజయవాడ బెంజిసర్కిల్‌లో చంద్రబాబు ఏర్పాటు చేసిన నవనిర్మాణ దీక్ష.. ధనదాహ దీక్ష అంటూ మండిపడ్డారు. ఏడాదికి 10 వేల కోట్లు సంపాదించి.. తన కొడుక్కి రాష్ట్ర పగ్గాలు అప్పగించాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని కొయ్య ప్రసాదరెడ్డి సూటిగా ప్రశ్నించారు. -
'వరంగల్ ఎన్ఐటీలో ప్రవేశాలు కల్పించబోమనడం దారుణం'
విశాఖపట్నం : వరంగల్ ఎన్ఐటీలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రవేశం కల్పించబోమని తెలంగాణా విద్యాశాఖ మంత్రి ప్రకటించడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి అన్నారు. తెలంగాణ మంత్రి దారుణంగా మాట్లాడుతున్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించకపోవడం శోచనీయమన్నారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ.. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ కళాశాలలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ఆంధ్ర విశ్వ కళాపరిషత్‌లో చదువుకున్న కేంద్రమంత్రి వెంకయ్యనాయిడు, విశాఖ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు ఆ వర్సిటీని విస్మరిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పీతల మూర్తి యాదవ్, స్టూడెంట్స్ యూనియన్ నాయకుడు కాంతారావు, జోగారావు, కోటి గణపతి పాల్గొన్నారు. -
కడియం చెప్పినా... బాబు కేబినెట్ స్పందించ లేదు
విశాఖపట్నం: వరంగల్ నిట్‌లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అవకాశం లేదని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పినా...ఏపీ సీఎం చంద్రబాబు ఆయన కేబినెట్ స్పందించకపోవడంపై వైఎస్ఆర్ సీపీ నేత కొయ్య ప్రసాదరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం విశాఖపట్నంలో కొయ్యప్రసాదరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. నిట్ అంశంపై ఏపీకి జరుగుతున్న అన్యాయంపై టీడీపీ అనుసరిస్తున్న వైఖరి దుర్మార్గమని ఆయన ఆరోపించారు. మెడికల్ కాలేజీ సీట్ల ఫీజులు పెంచి... ప్రైవేట్ యాజమాన్యాలతో కుమ్మక్కై విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. బీ,సీ కేటగిరి సీట్లకు మళ్లీ ప్రత్యేక ప్రవేశ పరీక్ష పెట్టడం ద్వారా మరో అవినీతికి తెరలేపారన్నారు. ఆంధ్రయూనివర్శిటీ చితికిపోయేలా ప్రైవేట్ యూనివర్శిటీలకు లబ్ది చేకూరేలా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు,ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు గంటా, కామినేని, నారాయణ వ్యవహరించడం దుర్మార్గమని కొయ్య ప్రసాదరెడ్డి వ్యాఖ్యానించారు. డబ్బున్నవారికే సీట్లు ఇచ్చేలా ఏపీ విద్యావిధానం ఉందని కొయ్య ప్రసాదరెడ్డి అభిప్రాయపడ్డారు. -
'చంద్రబాబు చైనా టూర్‌పై అనుమానాలు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చైనా పర్యటనపై పలు అనుమానాలు ఉన్నాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు పలు సూచనలు చేశారు. 'చంద్రబాబు గారూ చైనా, సింగపూర్, స్విట్జర్లాండ్ వెళ్లండి. కానీ, ఆఫ్ఘనిస్తాన్ వెళ్లకండి. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఆఫ్ఘాన్లా మారుతుంది' అని ఎద్దేవా చేశారు. ఏపీలో దోచుకున్న సొమ్మును దాచుకునేందుకే చంద్రబాబు నాయుడు చైనా, సింగపూర్, స్విట్జర్లాండ్ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని నడిరోడ్డులో అమ్మకానికి పెట్టిన ఘనత టీడీపీ సర్కారుదేనని కొయ్య ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు తనయుడు నారాలోకేశ్, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కొన్ని కోట్లు దోచుకున్నారని ఆయన అన్నారు.