
సాక్షి, విశాఖపట్నం : విశాఖ అభివృద్ధిని ఓర్వలేకే టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి విమర్శించారు. మాజీ మంత్రి అయ్యన్న విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని, ఐదేళ్ల భూ కబ్జాలను అడ్డుకున్న పోలీసులపై విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. రానున్న కాలంలో కబ్జాదారుల చేతుల్లో ఉన్న సర్కారు భూములు స్వాధీనం చేసుకోవడం ఖాయమని స్పష్టం చేశారు. టీడీపీ నేతల ఐదేళ్ల అక్రమాలకు అడ్డుకట్ట పడుతోందని వెల్లడించారు. వంద రోజుల్లోనే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందించిన సంక్షేమ పథకాలకు జనం నీరాజనం పలుకుతున్నారని ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment