'ఆ ఇద్దరు ఎంపీలు చేతకాని దద్దమ్మలు'
విశాఖ: రైల్వే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ఆయనిక్కడ శుక్రవారం మాట్లాడుతూ సీఎం చంద్రబాబు చేతకాని తనం, మెతక వైఖరే రైల్వే జోన్ రాకపోవడానికి కారణమని ఆరోపించారు. రాష్ట్రంలో సమస్యలు పక్కన పెట్టి ప్రతిపక్షాన్నీ నిరివీర్యం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు.
విశాఖ ఎంపీ హరిబాబు కూడా ఇచ్చిన హామినీ నిలబెట్టు కోలేదని, బడ్జెట్ పై ఇప్పటి వరకు పెదవి విప్పక పోవడం నగర ప్రజలకు ద్రోహం చేసినట్టే అని ఆయన విమర్శించారు. అవంతి శ్రీనివాస్, హరిబాబులు ఇద్దరు చేతకాని దద్దమ్మలని విరుచుపడ్డారు. మరో వైపు చంద్రబాబుకు, ప్రధాని మోదీ కి పడటం లేదని, అందువల్లే నిధులు, రైల్వే జోన్ రావడం లేదన్నారు. చంద్రబాబు తక్షణం తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.