Rail way budget
-
'ఆ ఇద్దరు ఎంపీలు చేతకాని దద్దమ్మలు'
విశాఖ: రైల్వే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ఆయనిక్కడ శుక్రవారం మాట్లాడుతూ సీఎం చంద్రబాబు చేతకాని తనం, మెతక వైఖరే రైల్వే జోన్ రాకపోవడానికి కారణమని ఆరోపించారు. రాష్ట్రంలో సమస్యలు పక్కన పెట్టి ప్రతిపక్షాన్నీ నిరివీర్యం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. విశాఖ ఎంపీ హరిబాబు కూడా ఇచ్చిన హామినీ నిలబెట్టు కోలేదని, బడ్జెట్ పై ఇప్పటి వరకు పెదవి విప్పక పోవడం నగర ప్రజలకు ద్రోహం చేసినట్టే అని ఆయన విమర్శించారు. అవంతి శ్రీనివాస్, హరిబాబులు ఇద్దరు చేతకాని దద్దమ్మలని విరుచుపడ్డారు. మరో వైపు చంద్రబాబుకు, ప్రధాని మోదీ కి పడటం లేదని, అందువల్లే నిధులు, రైల్వే జోన్ రావడం లేదన్నారు. చంద్రబాబు తక్షణం తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఈ సారైనా ‘కూత’ పెట్టేనా?
నత్తనడకన కడప-మదనపల్లె వయా బెంగళూరు రైలు మార్గం పనులు ప్రతి బడ్జెట్లోనూ అరకొర నిధులే గత ఏడాది అదీ లేదు ఈ సారి ఏమవుతుందో..ఏమో! కడప-మదనపల్లె వయా బెంగళూరు రైలుమార్గంపైనే పడమటి మండలాల ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఈ నెలలో ప్రవేశపెట్టనున్న 2014-15 రైల్వే బడ్జెట్లోనైనా పాలకులు ప్రత్యేక చొరవ చూపుతారేమోనని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. మదనపల్లె సిటీ, న్యూస్‌లైన్ : కడప-మదనపల్లె వయా బెంగళూరు రైలుమార్గంపైనే పడమటి మండలాల ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఈ నెలలో ప్రవేశపెట్టనున్న 2014-15 రైల్వే బడ్జెట్లోనైనా పాలకులు ప్రత్యేక చొరవచూపుతారేమోనని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. కడప నుంచి లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, మదనపల్లె, పుంగనూరు, రామసముద్రం మీదుగా బెంగళూరుకు రైలుమార్గం ఏర్పాటు చేసేందుకు ఐదేళ్ల క్రితం రైల్వేశాఖ పచ్చజెండా ఊపింది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి రెండు రాష్ట్రాల ప్రయాణికుల సమస్యలను దృష్టిలో ఉంచుకని సర్వే పనులు చేపట్టారు. 350కిలో మీటర్ల దూరం ఉన్న ఈ మార్గంలో రైలు నడిపితే కడప, బెంగళూరు మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయని భావించారు. ఈ మేరకు రూ.1080 కోట్ల అంచనాతో శంకుస్థాపన చేశారు. ఆయన మరణానంతరం దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాలికొదిలేశాయి. 2010లో రూ.40 కోట్లు, 2011లో రూ.56 కోట్లు, 2012లో రూ.60 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు. 2013లో మొండి చెయ్యి చూపారు. మంజూరైన నిధులు ఈ మార్గంలోని రాళ్లు, చెట్లను తొలగించేందుకు సరిపోయాయి. సర్వే పనులు వైఎస్సార్ కడప జిల్లా పెండ్లిమర్రి వరకు చేపట్టి మిన్నకుండి పోయారు. పాలకులు ఈ సారి బడ్జెట్లోనైనా పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయిస్తారో లేదోనని పడమటి మండలాల ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. -
‘వ్యాగన్’ స్థల సేకరణకు 18 కోట్లు మంజూరు
సాక్షి, హన్మకొండ : వ్యాగన్ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి మరో కీలక అడుగు ముందుకు పడింది. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూమిని సేకరించేందుకు 18 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ ఉత్వర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వుల ప్రతులను ఎంపీ సిరిసిల్ల రాజయ్య గురువారం హన్మకొండలో మీడియాకు అందజేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిన కాజీపేటలో వ్యాగన్ పరిశ్రమను నిర్మిస్తామని 2010-11 బడ్జెట్లో రైల్వేశాఖ ప్రకటించింది. అందులో భాగంగా మడికొండ సమీపంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధీనంలో ఉన్న 54.15 ఎకరాల భూమిని వ్యాగన్ పరిశ్రమ ఏర్పాటుకు అనువైనదిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. పరిశ్రమ ఏర్పాటుకు ఈ భూమిని దేవాదాయశాఖ నుంచి రవాణాశాఖకు బదలాయించాల్సిందిగా రాష్ర్ట ప్రభుత్వం హైకోర్టును ఆశ్రరుుంచింది. 2013 ఫిబ్రవరిలో హైకోర్టు అనుమతి రాగా... ఎనిమిది నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణకు అవసరమైన నిధులను కేటాయిస్తూ ఈ నెల ఏడో తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వేబడ్జెట్ కసరత్తు జరుగుతున్న దశలో భూ సేకరణకు నిధులు మంజూరు కావడంతో అతిత్వరలో పరిశ్రమ ప్రారంభం కావొచ్చనే ఆశలు చిగురిస్తున్నాయి. ఈ పరిశ్రమ ఏర్పాటైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా జిల్లాలో పదివేల మందికి ఉపాధి లభించే అవకాశముంది. -
సర్వే పనులకు శ్రీకారం
దశాబ్దాల కల సాకారమైనట్లే.. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గద్వాల -మాచర్ల బ్రాడ్‌గేజ్ కొత్తలైన్, ఉందానగర్ -మహబూబ్‌నగర్ మధ్య డబ్లింగ్ సర్వే పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ఈ ప్రక్రియను త్వరగా ప్రారంభిస్తే వచ్చే బడ్జెట్లో నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. రాయిచూర్- మాచర్ల రైల్వేలైన్ పనులకు శ్రీకారం చుడితే వెనకబడిన వనపర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, దేవరకొండ, కల్వకుర్తి ప్రాంతాలకు రైల్వే రవాణా సౌకర్యం అందుబాటులోకి రావడంతో పాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందనుంది. విద్యా, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. గద్వాల, న్యూస్‌లైన్: ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తు న్న గద్వాల -మాచర్ల బ్రాడ్‌గేజ్ కొత్తలైన్, ఉందానగర్ -మహబూబ్‌నగర్ మధ్య డబ్లింగ్ సర్వే పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ఈ ప్రక్రియ పూర్తయితే కొత్త బ్రాడ్‌గేజ్ లైన్ నిర్మాణానికి 2014-15 బడ్జెట్లో నిధులు మంజూరయ్యే అవకా శం ఉంది. నిజాం ప్రభుత్వ హయాంలో గద్వాల మీదుగా ప్రస్తుత కర్ణాటకలోని రాయిచూర్ నుంచి గుంటూరు జిల్లాలోని మాచర్ల వరకు కొత్త బ్రాడ్‌గేజ్ లైన్‌ను ఏ ర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. దశాబ్దాల తరువాత మొదటిదశ కింద 2002లో గద్వాల - రాయిచూర్‌ల మధ్య 59 కిలోమీటర్ల బ్రాడ్‌గేజ్ లైన్‌కు శంకుస్థాపన చేశారు. ఇక రెండోదశలో గద్వాల నుంచి వనపర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపే ట, దేవరకొండ మీదుగా మాచర్ల వరకు కొత్త బ్రాడ్‌గేజ్ లైన్‌ను నిర్మించాలని ప్రతి పాదించారు. ఇందుకోసం గత రైల్వేబడ్జెట్‌లో తుదిసర్వే కోసం అనుమతిచ్చారు. అలాగే మూడేళ్ల క్రితం మంజూరైన ఉందానగర్, మహబూబ్‌నగర్‌ల మధ్య డబ్లింగ్ ట్రాక్ నిర్మాణం కోసం ఈ బడ్జెట్లో సర్వే కు అనుమతిచ్చారు. ఈ రెండింటి సర్వే పనులు చేపట్టేందుకు రూ.4కోట్ల అంచన్యావయంతో ప్రైవేట్ సంస్థకు బాధ్యతలు అ ప్పగించగా, నెలరోజుల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. గద్వాల - రాయిచూర్‌ల మధ్య కొత్త బ్రాడ్‌గేజ్ లైన్‌కు స ర్వే ప్రారంభ మవడంతో గద్వాల రైల్వేస్టేష న్ నాలుగు వైపుల లైన్లతో కీలక జంక్షన్‌గా అభివృద్ధి చెందే అవకాశం ఏర్పడింది. గద్వాల సంస్థానాదీశుల కాలంలోనే.. రాయిచూర్ నుంచి గుంటూరు జిల్లాలోని మాచర్ల వరకు బ్రాడ్‌గేజ్ లైన్ ప్రతిపాదన కు అనుగుణంగా గద్వాల రైల్వేస్టేషన్‌ను జంక్షన్‌గా అభివృద్ధి చేయడంతోపాటు, అవసరమైన మౌలికవసతులు కల్పించేం దుకు గద్వాల సంస్థానాదీశుల కాలంలో నే 105 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. సి కిందారాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో ఇం త విస్తీర్ణంలో స్థలం ఉన్న రైల్వేస్టేషన్ గద్వా ల కావడం విశేషం. ఇక్కడ రైల్వే శిక్షణ సం స్థలు, మరమ్మతులకు సంబంధించిన మె కానిల్ విభాగం ఏర్పాటు చేయాలని రైల్వేబోర్డు పరిశీలనలో ఉంది. రాయిచూర్- మాచర్ల రైల్వేలైన్‌కు శ్రీకారం చుడితే వెనకబడిన వనపర్తి, నాగర్‌కర్నూల్, అచ్చం పేట, దేవరకొండ, కల్వకుర్తి ప్రాంతాలకు రైల్వే రవాణా సౌకర్యం అందుబాటులోకి రావడంతో పాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మొత్తం 244 కి.మీ మేర ఈ లైన్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. రైల్వేట్రాఫిక్ పరిష్కారం కోసం.. కాచిగూడ-మహబూబ్‌నగర్ మధ్య రైల్వే ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు డబ్లింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేయాలని సం బంధిత అధికారులు బోర్డుకు పలుమార్లు నివేదికలు పంపారు. ఈ డబ్లింగ్‌కు అనుమతివ్వాల్సిందిగా మహబూబ్‌నగర్ పా ర్లమెంట్ సభ్యులు చంద్రశేఖర్‌రావు మూ డేళ్ల క్రితం అప్పటి రైల్వేశాఖ మంత్రి మమతా బెనర్జీతో చర్చించి మంజూరు లభించేవిధంగా చేశారు. నాటినుంచి నేటివరకు ఈ డబ్లింగ్ ప్రక్రియ ప్రారం భం కాలేదు. గత రైల్వేబడ్జెట్‌లో కొత్తలైన్ నిర్మాణానికి, డబ్లింగ్ కోసం ప్రతిపాదిం చిన పనుల సర్వేకు అనుమతి లభించిం ది. వీటితో పాటు మహబూబ్‌నగర్ - గు త్తి వరకు డబుల్‌లైన్ ట్రాక్ సర్వేకు అనుమతి లభించినప్పటికీ సర్వే ప్రారంభం కాలేదు. ఈ ప్రక్రియను త్వరగా ప్రారంభిస్తే వచ్చే బడ్జెట్లో నిధులు మంజూర య్యే అవకాశం ఉంది.