'అవి కాంట్రాక్టర్ల మెయిన్టెయిన్ కు సరిపోతాయి' | ysrcp spokesperson fired on ap budget 2016-17 | Sakshi
Sakshi News home page

'అవి కాంట్రాక్టర్ల మెయిన్టెయిన్ కు సరిపోతాయి'

Published Fri, Mar 11 2016 2:50 PM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM

ysrcp spokesperson fired on ap budget 2016-17

విశాఖ: ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రజలను మోసం చేసేలా ఉందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి విమర్శించారు. ఆయనిక్కడ మాట్లాడుతూ విశాఖకు నిధులు ఇవ్వకుండా కేంద్ర బడ్జెట్ ఏ విధంగా నిరాశపర్చిందో.. అదే రీతిలో రాష్ట్ర బడ్జెట్ ఉందన్నారు. నిధులు లేకుండా విమ్స్ ను ఎలా అభివృద్ది చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాజెక్టులకు రూపాయి కూడా కేటాయించక పోవడం దురదృష్టకరమన్నారు.

సుజల స్రవంతికి రూ. 10 వేల కోట్లు అవసరముంటే కేవలం రూ. 2 వేల కోట్లు కేటాయించడం ఎంత వరకూ సమంజసమన్నారు. విశాఖకు తాగునీరు అందించే రైవాడ ప్రాజెక్టు కు 75 లక్షలు అవసరమైతే రూ. 6 లక్షల ను బడ్జెట్ లో కేటాయించారని తెలిపారు. ఈ కేటాయింపులు చూస్తుంటే కేవలం కాంట్రాక్టర్లను మెయిన్ టెయిన్ చేయడానికే సరిపోతుందని ప్రసాద రెడ్డి ఎద్దేవా చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement