శ్వేతపత్రం కాదు అబద్ధాల పత్రం | ysrcp leader slams chandrababu naidu over on sand policy | Sakshi
Sakshi News home page

శ్వేతపత్రం కాదు అబద్ధాల పత్రం

Published Fri, Nov 27 2015 12:27 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

ysrcp leader slams chandrababu naidu over on sand policy

అల్లీపురం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇసుక విధానంపై విడుదల చేసిన శ్వేతపత్రం అబద్ధాల పత్రంగా ఉందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొయ్యప్రసాద్ రెడ్డి విమర్శించారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రవేశపెట్టిన ఇసుక విధానం వల్ల మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కోట్లకు పడగలెత్తారే కానీ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.
 
ఈ ఇసుక విధానం వల్ల సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదన్నారు. బాక్సైట్ తవ్వకాలపై గిరిజనుల ఆందోళనతో వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల ఒత్తిడి మేరకు మళ్లీ అనుమతులిచ్చేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. బాక్సైట్ తవ్వకాలపై గిరిజనులకు అండగా పోరాడతామని, అలా కాకుండా ప్రభుత్వం ముందుకు వెళ్లితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement