White Paper
-
సూపర్ సిక్స్ కాస్త డకౌట్ అయ్యింది: బుగ్గన
హైదరాబాద్, సాక్షి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని.. అది ఒక సాకు పత్రమని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. అసలు శ్వేతపత్రానికే అర్ధం మార్చిన చంద్రబాబు.. రాష్ట్రాభివృద్ధి కోసం వాస్తవ పరిస్థితులు వివరిస్తూ, తామేం చేయబోతున్నామో చెప్పకుండా.. గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ.. అన్నింటికీ మమ్మల్ని బాధ్యులను చేస్తూ.. వైట్పేపర్ల పేరుతో డ్రామాలు చేస్తున్నారని బుగ్గన ఆక్షేపించారు.ఎన్నికల ముందు టీడీపీ అట్టహాసంగా ప్రకటించిన సూపర్ సిక్స్.. అమలుకు ముందే, తొలి ఓవర్లోనే డకౌట్ అయిందని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.అది హాస్యాస్పదంరాజకీయాల్లో 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్లు సీఎంగా పని చేశానని పదే పదే చెప్పుకునే చంద్రబాబు.. సంపద సృష్టించడం తనకు మాత్రమే తెలుసని గొప్పగా ప్రచారం చేసుకున్నారన్న బుగ్గన.. అదే చంద్రబాబు ఇప్పుడు తమ సూపర్‌సిక్స్ పథకాలపై ప్రజలను అడుగుతానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. బాబు వైఖరి చూస్తుంటే.. ‘మీరంతా కొండను ఎత్తి, నా నెత్తిపై పెట్టండి. నేను దాన్ని మోస్తాను’ అన్నట్లు ఉందని బుగ్గన వ్యాఖ్యానించారు.ఎలా ప్రకటించారు?రాష్ట్ర ఆదాయం రూ.2.40 లక్షల కోట్లు కాగా.. రెగ్యులర్ జీతభత్యాలు, పెన్షన్లు, సబ్సిడీలు, పీడీఎస్, అప్పులకు వడ్డీలు, ఇతర పరిపాలన అవసరాల కోసమే రూ.2.50 లక్షల కోట్లు ఖర్చవుతుందన్న ఆయన.. ఆ అవసరల కోసమే ఏటా రూ.10 వేల కోట్లు అప్పు చేయల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. మరి అలాంటప్పుడు ఏటా, దాదాపు లక్షన్నర కోట్ల వ్యయమయ్యే పథకాలను చంద్రబాబు ఎలా ప్రకటించారని ప్రశ్నించారు. వాటిని అమలు చేయలేరన్న విషయం తెలుసు కాబట్టే.. ఇప్పుడు శ్వేతపత్రాల పేరుతో సాకు పత్రాలు రిలీజ్ చేస్తున్నారని దుయ్యబట్టారు.వీటి కోసం ఎదురుచూస్తున్నారుతల్లికి వందనం కింద ప్రతి పిల్లాడికి రూ.15 వేలు, 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500, ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.20 వేలు.. వీటన్నింటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా స్కూళ్లు తెరిచిన నేపథ్యంలో తల్లికి వందనం అమలు కావాల్సి ఉందని గుర్తు చేశారు.తప్పుడు లెక్కలుతమ హయాంలో 2014–19 మ«ధ్య, స్ధూల ఉత్పత్తి బ్రహ్మాండంగా పెంచామని చంద్రబాబు వైట్‌పేపర్‌లో చెప్పుకోవడాన్ని తప్పు పట్టిన బుగ్గన, కోవిడ్ పీరియడ్.. అది లేని కాలంతో ఎలా పోలుస్తారని ప్రశ్నించారు. నిజం చెప్పాలంటే.. టీడీపీ పాలన కంటే, తమ హయాంలోనే స్థూల ఉత్పత్తిలో కాస్త వృద్ధి సాధించామన్న ఆయన.. 2014 నుంచి 2019 వరకు దేశ స్ధూల ఉత్పత్తిలో రాష్ట్ర స్ధూల ఉత్పత్తి నిష్పత్తి 4.47 కాగా, అదే 2019 నుంచి 2024 వరకు 4.82 గా నమోదైందని చెప్పారు. అది 0.4 శాతం ఎక్కువని వివరించారు.అసత్య ప్రచారాలుఅదే విధంగా పారిశ్రామిక రంగానికి సంబ«ంధించి, దేశ జీడీజీలో రాష్ట్ర జీడీపీ వాటా 2014 నుంచి 2019 వరకు 2.98 శాతం కాగా, అదే 2019 నుంచి 2024 వరకు 4 శాతమని గుర్తు చేసిన ఆయన, తమ హయాంలో 1.1 శాతం పెరిగిందని.. అయినా తమ పాలనలో ఇక్కడికి పరిశ్రమలు రాలేదని అసత్య ప్రచారం చేశారని ఆక్షేపించారు.తలసరి ఆదాయంరాష్ట్రంలో టీడీపీ పాలన చివరి ఏడాది 2018–19లో తలసరి ఆదాయం రూ.1,54,031 కాగా, ఆ పెరుగుదల 11.38 శాతం అని చెప్పారు. అదే తమ ప్రభుత్వ పాలనలో చివరి ఏడాది.. 2023–24లో తలసరి ఆదాయం రూ.2,19,518 కాగా, అది 13.98 శాతం పెరుగుదల అని వెల్లడించారు. దీంతో మన రాష్ట్రం 18వ స్థానం నుంచి 13వ స్థానానికి చేరిందని చెప్పారు. అంతేకాక, సులభతర వాణిజ్యం (ఈఓడీబీ)లో రాష్టం వరసగా నెంబర్ వన్‌గా నిల్చిందన్న బుగ్గన, ఇది అభివృద్ధి కాక, మరేమిటని ప్రశ్నించారు.మద్యాన్ని నియంత్రించాంటీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం మద్యం విక్రయాలు ప్రైవేటు వారి చేతిలో ఉండేవని, దాంతో వారంతా సిండికేట్‌గా ఏర్పడి ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్మారని మాజీ మంత్రి బుగ్గన గుర్తు చేశారు. అంతే కాకుండా, ప్రతి షాప్‌కు ఒక పర్మిట్‌రూమ్, ఊరూరా బెల్టు షాప్‌లు.. మొత్తం 43 వేల బెల్టు షాప్‌లు ఉండేవని చెప్పారు. తమ ప్రభుత్వం రాగానే, వైన్ షాప్‌లను 33 శాతం తగ్గించడంతో పాటు, అన్ని పర్మిట్‌రూమ్‌లు, బెల్టు షాప్‌లను రద్దు చేశామని తెలిపారు. షాప్‌లను పూర్తిగా ప్రభుత్వమే నడపడం, మద్యం విక్రయ వేళలు తగ్గించడం, మరోవైపు ధరలు పెంచడం వల్ల, మద్యం అమ్మకాలు తగ్గినా, ప్రభుత్వ ఆదాయం పెరిగిందని తెలిపారు.అలా ఎలా ఆపాదిస్తారు?అన్నింటి కంటే ఎక్కువగా జీత భత్యాలకే రూ.95 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందన్న ఆయన, జీత భత్యాల వ్యయం ఉద్యోగులకు 42 శాతం ఫిట్మెంట్ వల్ల వ్యయం పెరిగిందని చెప్పారు. మరోవైపు సామాజిక పెన్షన్ల వ్యయం రూ.33 వేల కోట్లు కాగా.. దాన్ని కూడా ఇతరులకు ఎలా ఆపాదిస్తారని నిలదీశారు.ఇది పట్టదా?నాడు, రాష్ట్రావసరాల కోసం అప్పు చేస్తే.. అప్పులతోనే నెట్టుకొస్తున్నామంటూ నిత్యం దుయ్యబట్టిన ఎల్లో మీడియా, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అదే పని చేస్తున్నా.. పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు.ఇవీ ఈ ప్రభుత్వ అప్పులుటీడీపీ కూటమి ప్రభుత్వం ఈ 50 రోజుల్లోనే అపరిమితంగా అప్పు చేసిందని మాజీ ఆర్థిక మంత్రి తెలిపారు. గత జూన్ 20న రూ.2 వేల కోట్లు, జూలై 2న రూ.5 వేల కోట్లు, జూలై 16న మరో రూ.2 వేల కోట్లు అప్పు చేశారని చెప్పారు. ఈ విషయాన్ని ఎల్లో మీడియా ఎందుకు రాయదని ప్రశ్నించిన ఆయన.. ‘మరి మేం చేస్తే అప్పు, టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తే నిప్పా’ అని కడిగి పారేశారు. అంతకు ముందు హయాంలో ఒకేరోజు రూ.5 వేల కోట్ల అప్పు చేసినా, ఎల్లో మీడియా రాయలేదని ఆక్షేపించారు.గతంలోనూ వారివే ఎక్కువ2014–19 మధ్య రాష్ట్ర అప్పులు 21 శాతం పెరిగితే, తమ హయాంలో 2019–24 మధ్య ఆ పెరుగుదల 12 శాతం మాత్రమే అని మాజీ ఆర్థిక మంత్రి వెల్లడించారు. రాష్ట్ర విభజన తరవాత, ఆంధ్రప్రదేశ్ అప్పులు 2014లో రూ.1,18,051 కోట్లు ఉంటే, 2019 నాటికి, అంటే టీడీపీ ప్రభుత్వం గద్దె దిగేనాటికి అవి రూ.2,71,795 కోట్లకు చేరుకున్నాయని.. అంటే టీడీపీ హయాంలో అప్పులు 21.63 శాతం పెరిగాయని చెప్పారు. అదే తమ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పులు రూ.5.18 లక్షల కోట్లు కాగా, అది 2019–24 మధ్య కేవలం 12.9 శాతం పెరుగుదల మాత్రమే అని తెలిపారు. అయినా ఎల్లో మీడియా దారుణంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.సంపద సృష్టి ఒట్టి మాటే..సంపద సృష్టిలో తాము స్పెషలిస్టులమని చంద్రబాబు చెప్పుకుంటారని.. కానీ అది పూర్తిగా అవాస్తవమని బుగ్గన వెల్లడించారు.2014–15లో రాష్ట్ర ఆదాయం రూ.90,672 కోట్లు కాగా, 2019లో ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆ మొత్తం కేవలం రూ.1,14,671 కోట్లు మాత్రమే అన్న ఆయన, ఆదాయం ఏటా 6.09 శాతం పెరిగిందన్నారు. అదే తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆదాయం 16.7 శాతం పెరిగిందన్న ఆయన, ఆ గణాంకాలు చెబుతూ.. 2019–20లో రాష్ట్ర ఆదాయం రూ.1,11,034 కోట్లు కాగా, 2023–24 నాటికి అది రూ.1,76,448 కోట్లకు చేరిందని వివరించారు.ఆనాడు మేము అధికారంలోకి వచ్చిన తరవాత, 2019 జూలైలో అయినా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టామన్న ఆయన, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఓట్ ఆన్ ఎక్కౌంట్‌కు పోవడాన్ని ప్రశ్నించారు.వాస్తవాలు బయటపడతాయనే..పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే.. పథకాలకు కేటాయింపులు, రాష్ట్ర అప్పులతో సహా, అన్ని వివరాలు ప్రకటించాల్సి ఉంటుందని.. టీడీపీ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో గొప్పగా ఇచ్చిన హామీలు ఇప్పుడు అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదని.. అందుకే ఓట్ ఆన్ ఎక్కౌంట్‌కు వెళ్తున్నారని ఆక్షేపించారు.అంతే కాకుండా, మా హయాంలో విచ్చలవిడిగా అప్పులు చేశామని, అదేపనిగా దుష్ప్రచారం చేశారని.. ఇష్టానుసారం అంకె చెప్పి, తాము 14 లక్షల కోట్ల అప్పులు చేశామని కూడా ఆరోపించారని గుర్తు చేశారు.నిజానికి తాము అంత అప్పు చేయలేదని, రాష్ట్ర అప్పు ఎంత అన్నది.. ఒకవైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, మరోవైపు సీఏజీ, ఆర్బీఐ రిపోర్టుల్లో ఉందని తెలిపారు. ఆ వివరాలన్నీ బయట పడతాయన్న భయంతోనే, ఈ ప్రభుత్వం ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్‌కు వెళ్లడం లేదని తేల్చి చెప్పారు.ఇవీ వాస్తవ అప్పులునిజానికి రాష్ట్ర నికర అప్పు రూ.4,38,278 కోట్లు అన్న బుగ్గన, పబ్లిక్ అకౌంట్స్ లయబిలిటీ కింద మరో రూ.80,914 కోట్ల రుణాలున్నాయని తెలిపారు. కార్పొరేషన్ రుణాలు రూ.2.18 లక్షల కోట్లు కాగా, అవి రూ.2.48 లక్షల కోట్లు అని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు రూ.90 వేల కోట్లు, ఇంకా అప్లోడ్ చేయలేదన్న ఆయన, వాటిని రుణాలుగా ఎలా చూపుతారని ప్రశ్నించారు. ఇంకా ఉద్యోగుల బకాయిలు కూడా కలుపుకున్నా, మొత్తం అప్పులు దాదాపు రూ.7 లక్షల కోట్లు మాత్రమే అని స్పష్టం చేశారు.ప్రాధాన్య రంగాలకు ఎక్కువ తమ ప్రభుత్వ హయాంలో ప్రాధాన్య రంగాలకు ఎక్కువ ఖర్చు చేశామని మాజీ ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ వెల్లడించారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, కీలక మౌలిక రంగాలకు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగంపై కేవలం రూ.13,255 కోట్లు ఖర్చు చేస్తే, తాము అంతకు మూడు రెట్లకు పైగా ఎక్కువ రూ.47,800 కోట్లు ఇచ్చామని మాజీ ఆర్థిక మంత్రి ఉదహరించారు.ఇంకా, తాము తీసుకొచ్చిన ‘గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్’ (జీపీఎస్) ను ఇప్పుడు దేశమంతా అమలు చేయాలని కేంద్రం యోచిస్తోందని చెప్పారు. -
పీక్ స్టేజ్‌కు పచ్చ మూక హింస.. శ్వేతపత్రంపై వెనక్కి తగ్గిన చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. నారా లోకేష్ రెడ్ బుక్ అండతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ హత్యలకు, దాడులకు పాల్పడుతున్నారు. అలాగే, కొన్ని చోట్ల అత్యాచారాలు జరుగుతున్నా మంత్రుల నుంచి సీఎం చంద్రబాబు వరకు ఎవరూ స్పందించడం లేదు.మరోవైపు.. చంద్రబాబు శ్వేతపత్రాల పేరుతో ప్రతీరోజు ఏదో ఒక అంశంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పచ్చ మీడియాలో రాసిన వార్తలను శ్వేతపత్రం పేరుతో చదవి వినిపిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌పై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాల్సి ఉండగా.. దాన్ని వాయిదా వేశారు.కాగా, ఈరోజు శాంతి భద్రతల అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని చంద్రబాబు భావించిన్పటికీ చివరి నిమిషంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఎందుకంటే నిన్న రాత్రి వినుకొండలో వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్‌ను టీడీపీ కార్యకర్తలు దారుణంగా హత్య చేశారు. ఈరోజు ఉదయం వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఉన్న నివాసంపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇలా టీడీపీ నేతల హింసాకాండ కొనసాగుతున్న క్రమంలో.. లా అండ్ ఆర్డర్ వైట్ పేపర్ విడుదల చేస్తే అది తమకే తిప్పి కొడుతుందని ఆయన భావిస్తున్నారు. దీంతో ఇవాళ్టి శ్వేతపత్రం విడుదలపై చంద్రబాబు వెనక్కి తగ్గారు. ఇక, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దారుణ హత్యలు, బాలికలపై అత్యాచారాలు, మహిళల హత్యలు జరుగుతున్న విషయం తెలిసిందే. -
అసత్య 'శ్వేత' పత్రం ఆధారం ఉందా బాబు
-
బాబు శ్వేతపత్రం ఓ బూటకం
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం ఓ బూటకమని, అబద్ధాలతో కూడిన నిందల పత్రమని మాజీ మంత్రి మేరుగ నాగార్జున దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిందలు మోపి, అనరాని మాటలు అనడానికే ఈ తంతు సాగించారని మండిపడ్డారు.ఆయన సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు అత్యంత దారుణంగా పొగరు, కొవ్వు, ఉన్మాదం, మదం వంటి పదజాలం వాడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. సీఎం స్థానంలో ఉన్న బాబు నోటి నుంచి వచ్చిన ప్రతి అక్షరానికి అకౌంట్‌బులిటీ ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలన్నారు. శ్వేతపత్రంలోని ప్రతి అంశం టీడీపీ వారికి సంబంధించినవేనని చెప్పారు. నాగార్జున చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..హామీలు అమలు చేయకుండా దృష్టిని మళ్లించడానికేచంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేసి, ఇప్పుడు ఇస్తున్న పథకాలను కూడా ఆపేసి, డబ్బుల్లేవని చెబుతున్నారు. ఎన్నికలప్పుడు ఈ విషయం తెలియదా? హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే శ్వేతపత్రాల తంతు తీసుకొచ్చారు. బాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారు. ఇచ్చిన మాట మీద నిలబడే నాయకుడు జగన్ మాత్రమేనని, అలా నిలబడలేకే బాబు దూషణలకు పరిమితమయ్యారు.దసపల్లా భూములు ప్రభుత్వానివి కావని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అయినా దాన్ని పట్టుకుని బాబు నిస్సిగ్గుగా ఆరోపణలు చేస్తున్నారు. ఇన్ని మాట్లాడుతున్న చంద్రబాబు గీతం కాలేజీ అక్రమాలపై ఎందుకు నోరెత్తరు? వందల కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిని గీతం వర్సిటీ ముసుగులో మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి స్వాహా చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందులో 24.13 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. దీనిపై ఎందుకు మాట్లాడరు?ఇళ్ల పట్టాలపై నిరాధార ఆరోపణలువైఎస్ జగన్ నిరుపేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలపైనా చంద్రబాబువి నిరాధార ఆరోపణలు. వైఎస్ జగన్ 28వేల ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకిచ్చారు. మరో 25వేల ఎకరాలు అత్యంత పారదర్శకంగా కొనుగోలు చేసి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నా ఎప్పుడైనా ఒక్క కుటుంబానికి సెంటు భూమైనా ఇచ్చారా? పైపెచ్చు కేసులతో అడ్డుకున్నారు. రాజధానిలో 52 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారు. ఆ స్థలాల్లో పేదలకు ఇళ్లు కట్టించే దమ్ము బాబుకు ఉందా?ల్యాండ్ టైట్లింగ్ యాక్టు రద్దు చేయించండిల్యాండ్ రీసర్వే, టైట్లింగ్ చట్టంపైనా చంద్రబాబు అవహేళనగా, తప్పుడు మాటలు కూడా మాట్లాడారు. చంద్రబాబు తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందారు. ఆ చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అది సరైంది కాదని అనుకుంటే, బాబే ప్రధానమంత్రి మోదీని ఒప్పించి, ఆ చట్టాన్ని రద్దు చేయించవచ్చు. ఆ ధైర్యం చంద్రబాబుకు ఉందా?అడ్డూ అదుపూ లేకుండా ఇసుక దోపిడీఎన్నికల్లో గెలిచిన రోజు నుంచి అడ్డూ అదుపూ లేకుండా ఇసుకను దోచుకుంటున్నారు. ఇసుక ఉచితం అని చెప్పి సీనరేజ్, రవాణా చార్జీల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదీ గర్భాల్లో ఉన్న ఇసుకను కొల్లగొట్టిన గజదొంగలు కూడా బాబు పార్టీ మనుషులే. వైఎస్ జగన్ హయాంలో ప్రతి ఒక్కటీ పారదర్శకంగా చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్లాట్‌ఫాం మీద టెండర్లు పిలిచారు. మా ఇసుక విధానం వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.765 కోట్లు, ఐదేళ్లలో రూ.3,825 కోట్లు ఆదాయం వచ్చింది.గతంలో బాబు పాలనలో ఇన్ని వేల కోట్లు ఎవరి జేబులోకి వెళ్లాయి? దశాబ్దాలుగా గనులను దోచుకుని, అడ్డగోలుగా సంపాదించింది బాబు మనుషులే. ఆయన హయాంలో మైన్స్పై ఆదాయంలో పెరుగుదల (సీఏజీఆర్) 17 శాతం నమోదైతే, వైఎస్ జగన్ హయాంలో 40 శాతం. అంటే దోపిడీ బాబు మనుషులు చేసినట్టు కాదా? బాబు హయాంలో నిరుపేదలకు ఒక్కరికి కూడా ఒక ఎకరం భూమి ఇవ్వలేదు.పైగా రికార్డుల్లో క్లారిటీ లేదంటూ లేనిపోని సాకులు చూపి లక్షలాది ఎకరాలను నిషేధిత జాబితా (22 ఏ)లో చేర్చారు. దీంతో ఆ భూములపై హక్కులు దక్కక, ఆపత్కాలంలో అమ్ముకునే అవకాశం లేక లక్షలాది రైతు కుటుంబాలు నానా ఇబ్బంది పడ్డాయి. అందుకే జగన్ చుక్కల భూములు, నిషేధిత భూములను ఆ జాబితాల నుంచి తొలగించి, అటవీ, ఇనాం భూములు సాగు చేసుకుంటున్న రైతులకు హక్కులు కల్పించి, మేలు చేశారు. -
సమగ్ర భూ సర్వే రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సమగ్ర భూ రీ సర్వే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తన హయాంలో ఒకసారి రీ సర్వే చేయాలని భావించామని, కెనడా నుంచి హెలికాప్టర్లు తెప్పించి సర్వే చేస్తే హద్దులు మారిపోతుండటంతో ముందుకు వెళ్లలేదని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు కూడా రీసర్వే తలపెట్టి విఫలమైందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం శాశ్వత భూహక్కు–భూరక్ష పథకం పేరుతో అనాలోచితంగా రీ సర్వేను చేపట్టిందని విమర్శించారు. ఇకపై భూ యజమానులు వచ్చి తమ హద్దులు నిర్ణయించాలని కోరితే మినహా ఎవరికీ సర్వే చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.భూములు, సహజ వనరులకు సంబంధించి సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో సీఎం శ్వేతపత్రం విడుదల చేసి మాట్లాడారు. రాష్ట్రంలో భూ యజమానులకు రక్షణ కలి్పంచేందుకు గుజరాత్ తరహాలో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని తెస్తామని చెప్పారు. ఈ చట్టం ప్రకారం కబ్జాదారులే భూమి తమదని నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు. తమ భూములు కబ్జాకు గురైనట్లు బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే వెంటనే వారి భూములను వెనక్కి ఇప్పిస్తామన్నారు.ల్యాండ్ టైట్లింగ్ చట్టం పేరుతో గత సర్కారు భూ దోపిడీకి కుట్రలు పన్నితే తాము రద్దుకు క్యాబినెట్లో తీర్మానం చేశామన్నారు. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం దేశంలో ఎక్కడా అమలులో లేదన్నారు. ప్రజల భూములు లాక్కునేందుకే ఏపీలో అమలు చేశారన్నారు. అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేయడంతో పేదలకు హక్కులు కలి్పంచినట్టే చేసి వైఎస్సార్ సీపీ నాయకులు దోచేశారన్నారు. భూ దందాలపై ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు త్వరలోనే టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెస్తామన్నారు. రూ.35 వేల కోట్ల భూ దోపిడీ వైఎస్సార్ సీపీ హయాంలో భూములతో పాటు ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూములు కబ్జాలకు గురయ్యాయన్నారు. రీ సర్వేతో భూ హద్దులు మార్చేశారన్నారు. అసైన్మెంట్, అసైన్డ్, చుక్కల, నిషేధిత భూముల విషయంలో కొత్త రకం దోపిడీకి పాల్పడ్డారన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీలో మార్కెట్ కంటే ఐదు రెట్లు అధిక ధర చెల్లించి భూములు కొన్నారని ఆరోపణలు చేశారు. వైఎస్సార్ సీపీ కార్యాలయాలకు రూ.300 కోట్ల విలువైన 40.78 ఎకరాలను కేటాయించుకున్నారని చెప్పారు.తమకున్న సమాచారం మేరకు రూ.35 వేల కోట్ల భూ దోపిడీ జరిగినట్లు అంచనా వేస్తున్నామన్నారు. ఒంగోలు భూ కబ్జాలపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. 22–ఏలో భూములను చేర్చి అక్రమాలు చేశారని, అసైన్డ్ భూములను వైఎస్సార్సీపీ నాయకులు దోచేసి పట్టాలు పొందారని ఆరోపించారు. పుంగనూరులో భూ వ్యవహారాలను పునఃపరిశీలన చేస్తున్నామన్నారు. మైనింగ్, క్వారీ లీజుల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నారు.బెదిరింపులు, భారీ జరిమానాలతో లీజులను లాక్కుని గనులు కొల్లగొట్టారన్నారు. అధికారులను డిప్యూటేషన్లపై తెచ్చి పథకం ప్రకారం దోపిడీ చేశారన్నారు. ఇసుక, లేటరైట్, ఇతర ఖనిజ నిక్షేపాలతో రూ.19 వేల కోట్లు దారి మళ్లించారన్నారు. తమ హయాంతో పోలిస్తే ఎర్ర చందనం విక్రయాల ద్వారా గత ఐదేళ్లలో 27 శాతం మాత్రమే ఆదాయం వచి్చందన్నారు. వీటన్నింటిపై ప్రజల్లో, అసెంబ్లీలో విస్తృతంగా చర్చించిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.. రూ.500 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రుషికొండపై భవంతులు కట్టారని సీఎం చంద్రబాబు విమర్శించారు. వాటిని ఇప్పుడు ఏం చేయాలో తనకు అర్థం కావట్లేదన్నారు. మద్యం, గంజాయికి బానిసలై సంఘ విద్రోహ శక్తులుగా మారిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రాజకీయ వివక్షకు తావులేకుండా తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ చట్ట ప్రకారం శిక్షిస్తామన్నారు. ఒక్క కిలో కూడా ఖనిజం దోపిడీకి గురికాకుండా అడ్డుకుంటామన్నారు. గతంలో దోపిడీని ప్రశి్నస్తే దాడులు చేశారని, మడ అడవులను కబ్జా చేసి ఇళ్ల స్థలాలిచ్చారని చెప్పారు.తప్పులు చేసిన అధికారులను తొలగిస్తే దోమల మందు కొట్టించేందుకు కూడా ఎవరూ ఉండరని వ్యాఖ్యానించారు. విశాఖలో రామానాయుడు స్టూడియో భూమిలో వాటా కొట్టేయాలని చూశారన్నారు. దసపల్లా భూముల్లో అక్రమంగా అపార్ట్మెంట్లు నిరి్మంచారని చెప్పారు. హయగ్రీవ భూముల్ని మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కొట్టేయాలని చూశారని చెప్పారు. టీడీఆర్ బాండ్లలోనూ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. శారదా పీఠానికి ఎకరా రూ.లక్షకే 15 ఎకరాలు ఇచ్చారని చెప్పారు. ఒంగోలులో రూ.101 కోట్ల ఆస్తులు, తిరుపతిలో మఠం భూములనూ కొట్టేశారన్నారు.చిత్తూరు జిల్లాలో 982 ఎకరాలు 22ఏ జాబితా నుంచి తొలగించి రిజి్రస్టేషన్ చేసుకున్నారని చెప్పారు. భూ కబ్జాలపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇళ్ల పట్టాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన 10 వేల ఎకరాలు లాక్కున్నారని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో సిలికా శాండ్ లీజ్ ఓనర్లను బెదిరించి వైఎస్సార్సీపీ నాయకులకే అమ్మేలా ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. క్వార్జ్, లేటరైట్‌ను దోచేసి సొంత సిమెంట్ ఫ్యాక్టరీలకు సరఫరా చేసుకున్నారన్నారు. పెద్దిరెడ్డి మనుషులకు ఇష్టానుసారం లీజులిచ్చారన్నారు. పోలవరం కుడి కాల్వ పనుల్లో రూ.800 కోట్ల మట్టిని తరలించారని ఆరోపించారు. -
వహ్.. జగన్ స్కీమ్‌లు కాస్త స్కామ్‌లుగా!
అమరావతి, సాక్షి: అబద్దాలు, ఆరోపణలతో ఏపీలో మరో శ్వేతపత్రం విడుదలయ్యింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సచివాలయంలో భూములు, గనులు, అటవీ సంపద దోపిడీ జరిగిందంటూ ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. ఒకపక్క.. వాస్తవాలు అన్నీ ఎస్టాబ్లిష్ చేయలేమంటూ, మరోపక్క.. గత పాలనపై బురద చల్లారు. ఇంతకాలం ఎల్లో పేపర్లో వచ్చిన వార్తలనే వైట్పేపర్గా ప్రొజెక్ట్ చేసి చూపించారాయన. కోర్టుకు వెళ్లి మరీ పేదల ఇళ్ల స్థలాలు, పట్టాల పంపిణీ అడ్డుకోవాలని చూసిన టీడీపీ.. ఏ కోర్టులోను అవినీతి అని నిరూపించలేకపోయింది. ఇప్పుడేమో అధికారం ఉందని పేదల ఇళ్ల పట్టాల భూములపై అవినీతి ముద్ర వేస్తూ శ్వేతపత్రం విడుదల చేసింది. జగన్ హయాంలో పేదలకు భూములను పంచడం.. 14 ఏళ్లు సీఎంగా ఉండి పేదలకు సెంట్ భూమి కూడా పంచని చంద్రబాబు దృష్టిలో ఇప్పుడు పెద్ద స్కామ్ అయ్యింది. పేదల ఇళ్ల పట్టాలకు భూములను సేకరించడం, రైతులకు పరిహారం చెల్లించడం, దళితులకు అసైన్డ్ భూములపై హక్కులు కల్పించడం గత ఐదేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసింది. దళితులకు భూములపై హక్కులు కల్పించడం, వాళ్లను యజమానులుగా చేయడం అది చంద్రబాబుకి స్వతహాగానే నచ్చనట్లుంది. అందుకే ఇందులోనూ స్కామ్ అంటూ అడ్డగోలుగా ఆరోపణలు చేశారు ఇవాళ. ఇక.. గతంలో చంద్రబాబు ఇచ్చిన జీవో 340 ఆధారంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు స్థలం కేటాయింపు జరిగింది. అయితే.. టీడీపీ ఆఫీస్ లకు స్థలాలు కేటాయిస్తే ఒప్పు అయ్యిందేమో. అదే వైఎస్సార్ సీపీ ఆఫీస్ లకు స్థలాలు ఇస్తే అవినీతంటూ సీఎం చంద్రబాబు బురద జల్లారు. దీనికి తోడు లోకేష్ తోడల్లుడు భరత్‌కి చెందిన గీతం ఆక్రమణల్ని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉండగా స్వాధీనం చేసుకుంది. అది మాత్రం ఇవాళ్టి శ్వేతపత్రంలోకి మాత్రం ఎక్కలేదు.పైగా 10 వేల ఎకరాల అసైన్డ్ భూములు లాగేసుకున్నారంటూ ఆరోపణలు చేసిన చంద్రబాబు.. ఎక్కడి అసైన్డ్ భూములో మాత్రం శ్వేతపత్రంలో చెప్పలేదు. కొసమెరుపు: గతంలో చంద్రబాబు పాలనలో రైతుల భూములను చుక్కల భూముల జాబితాలో చేర్చేసింది. అయితే జగన్ పాలనలో నిజమైన యాజమానులకు వాటిని తిరిగి అప్పగించారు. అయితే ఆ చుక్కల భూములను నిజమైన యజమానులకు ఇవ్వడం పెద్ద స్కామ్ అంటూ సీఎం చంద్రబాబు ఇవాళ శ్వేతప్రతం విడుదల సందర్భంగా గగ్గోలు పెట్టారు. -
ఏపీలో మరో తప్పుడు శ్వేత పత్రం రెడీ!
అమరావతి, సాక్షి: ‘‘అవునా.. అలా కనిపించడం లేదా?. అయినాసరే రూ. 14 లక్షల కోట్లు అప్పులు ఉన్నట్లు ఎలాగైనా లెక్కలు చూపించండి’’.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ అధికారులకు జారీ చేసిన ఆదేశాలివి!. శ్వేత పత్రాల పేరిట జగన్ పాలనను ఏదో ఒకరకంగా తప్పుబట్టాలని చూస్తున్న చంద్రబాబు.. ఈ క్రమంలోనే ఈ ఆదేశాలిచ్చారని స్పష్టమవుతోంది. గత ఐదేళ్ల పాలనకు సంబంధించి అన్ని రంగాలపై వరుసగా చంద్రబాబు ప్రభుత్వం వైట్ పేపర్లు విడుదల చేస్తోంది. అమరావతి, ఆ వెంటనే విద్యుత్ శాఖపై లేనిపోని లెక్కలు చెబుతూ స్వయంగా చంద్రబాబు ఆ పత్రాలు విడదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై అధికారులతో సమీకక్షించారు. ఆపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రానికున్న అప్పుల లెక్కలపై చంద్రబాబు ఆరా తీశారు. అయితే.. ఇదీ చదవండి: అన్నన్న చంద్రన్నా.. పచ్చి అబద్ధాలతో విద్యుత్ శ్వేత పత్రం!ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసే యోచనలో ఉన్న ఆయన.. ఎలాగైనా 14 లక్షల కోట్లు అప్పులు ఉన్నట్టు చూపాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశించినట్టు సమాచారం. ఈ సమావేశం కంటే ముందే.. అన్ని రకాల అప్పులు కలిపి మొత్తంగా రూ. 14 లక్షలు కోట్లు ఉన్నాయంటూ ఎల్లో మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే.. కేంద్ర ప్రభుత్వ లెక్కలు, రిజర్వ్ బ్యాంకు గణాంకాలకు విరుద్ధంగా అప్పుల లెక్క చూపలేక అధికారులు అవస్థలు పడుతోంది. ఇదీ చదవండి: శ్వేత పత్రం కాదది.. ‘పచ్చ’ పత్రం -
KSR Comments: మరోసారి అమరావతి గ్రాఫిక్స్
-
అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ప్రభుత్వం..
-
పచ్చి అబద్ధాలతో విద్యుత్ శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
-
చంద్రబాబు శ్వేతపత్రంపై కాకాని సెటైర్లు
-
‘అమరావతి’ సాక్షిగా.. ఇంకెన్ని దారుణాలు వినాలో!
ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ అబద్దాల మబ్బులు కమ్ముకుంటున్నాయి. అమరావతి పేరుతో అందమైన గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మభ్య పెట్టడానికి సన్నాహాలు సాగుతున్నట్లు కనిపిస్తుంది. రాజధానికి సంబంధించి కొన్ని భవనాలు నిర్మిస్తే అభ్యంతరం లేదు. కానీ, అమరావతి అంటూ పాత పాటే పాడి ఏపీని మరోసారి ముంచుతారా? అనే సందేహం వస్తోంది. ప్రజలను ఊహలలో ముంచెత్తుతూ.. గాలి మేడలు కట్టేస్తారా? అనే భావన ఏర్పడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన అమరావతి శ్వేతపత్రం చూస్తే అత్యధిక భాగం అసత్యాలు, అర్ద సత్యాలే కనిపిస్తాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫలానా,ఫలానా పనులు చేసి ఉంటే బాగుండేదని చెబితే మర్యాదగా ఉండేది. తాను వచ్చే ఐదేళ్లలో ఏమి చేస్తానో చెప్పి ఉంటే పద్దతిగా ఉండేది. అలా కాకుండా చంద్రబాబు యధావిధిగా విధ్వంసపు భాష వాడారు. అక్రమంగా ప్రభుత్వమే నిర్మించిన ప్రజావేదికను తొలగిస్తే అది విధ్వంసమట. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చితే , వందలాది ఆ పార్టీ నేతలు, అభిమానుల ఇళ్లను టిడిపి వారు నాశనం చేస్తే, ప్రభుత్వ భవనాలను పాడు చేస్తే, చివరికి ఇండోర్ స్టేడియంను కూల్చితే, అనేకమందిపై దాడులు చేస్తే అదంతా గొప్ప నిర్మాణాత్మక కార్యక్రమమని చంద్రబాబు కొత్త నిర్వచనం చెబుతున్నారు. శ్వేతపత్రం లో ఎక్కడా అమరావతిలో గత ప్రభుత్వం దర్యాప్తు చేయించిన కుంభకోణాల గురించి ప్రస్తావించకపోవడం కూడా విశేషంగానే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని అనుకున్నారు. తప్పు లేదు. దానిని ఏ విధంగా తాను అభివృద్ది చేయదలిచింది!. అందుకు అవసరం అయ్యే వ్యయం ఎంత? ఆ డబ్బు ఎలా సమకూర్చుకోవాలని భావిస్తున్నది!. గతంలో మాదిరి నవనగరాలు ఇక్కడే నిర్మిస్తామని చెబుతున్నారా?. ఏపీ ప్రజలందరి నుంచి వచ్చే పన్నుల ఆదాయం అంతా అమరావతిలోనే పెట్టి కొన్ని భవంతులు నిర్మించి ఇదే సింగపూర్ అని అనుకోండని చెబుతారా?. ఇలా అనేక సంశయాలు ప్రజలలో వస్తున్నాయి. వీటిమీద శ్వేతపత్రంలో వివరణ ఇచ్చి ఉంటే ప్రజలకు క్లారిటీ వచ్చేది. కాని ఎవరికి ఏమీ అర్ధం కాని రీతిలో,అసలు ఏమీ చేస్తారో చెప్పకుండా, మాజీ సీఎం జగన్ ను తిట్టడానికే మాత్రమే ఈ శ్వేతపత్రాల తంతు నడుపుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం అమరావతి రాజధాని సమస్య వల్ల వచ్చింది కాదు. అలా అనుకుంటే అది భ్రమే అవుతుంది. వారి గెలుపునకు పలు ఇతర కారణాలు ఉన్నాయి. ఈవీఎంల వల్ల గెలిచారా? లేదంటే వైఎస్సార్సీపీ అతి విశ్వాసంతో నష్టపోయిందా? అనేదానిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. అమరావతి అంశం ఆధారంగా కృష్ణా,గుంటూరు జిల్లాలలో ప్రజలలో కొంత వ్యతిరేకత తీసుకురావడానికి టీడీపీ కూటమి ప్రయత్నించి ఉండవచ్చు. కానీ ఆ కారణంతోనే తాము రాష్ట్రం అంతటా గెలిచామని అనుకుని,మళ్లీ రెచ్చిపోతే నష్టం వారికే జరుగుతుంది. 2014-2019 మధ్య నడిచిన అమరావతి డ్రామా వల్ల టీడీపీపై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. అదొక్కటే కాకుండా చంద్రబాబు నాయుడు అప్పట్లో చేసిన పలు వాగ్దానాలను అమలు చేయడం లో విఫలం అవడంపై ప్రజలలో అసంతృప్తి ఏర్పడింది. సరిగ్గా ఇప్పుడు కూడా టీడీపీ కూటమి అదే బాటలో వెళ్లే అవకాశం ఉంది. సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలు ఆకాశమే హద్దుగా ఉన్నాయి. అన్ని అబద్దపు వాగ్దానాలు చేశారు. వాటిని నెరవేర్చితే గొప్ప విషయమే. కాని అందుకు బహుశా రెండు,మూడు రాష్ట్రాల బడ్జెట్ అవసరం అవుతుంది. ఇప్పటికే ఒక హామీ అమలుకు ఏడువేల కోట్ల రూపాయల అప్పు చేశారు. ఈ సంగతి పక్కనబెడితే.. అమరావతి కోసం గతంలోనే వేల కోట్ల అప్పులు చేశారు. అయినా అది ఒకరూపానికి రాలేదు. తాత్కాలిక ప్రాతిపదికన అసెంబ్లీ, సచివాలయం వంటివాటిని నిర్మించారు. ఈ తరుణంలో ప్రభుత్వం మారింది. వైఎస్ జగన్ ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో ఏదైనా చేద్దామని అనుకున్నా.. నిత్యం కోర్టు కేసులు వేసి అడుగు పడనివ్వలేదు. ఆయన ఈ ప్రాంతాన్ని శాసన రాజధాని చేద్దామని అనుకున్నారు. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేయడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఆ నగరానికి ఒక గుర్తింపు తీసుకు రావాలని తలపోశారు. కర్నూలుకు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి అక్కడ న్యాయ రాజధాని ఏర్పాటుకు సన్నద్దం అయ్యారు. టీడీపీ దీనిని గందరగోళం చేయడంలో విజయవంతం అయింది. జగన్ ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో ఒక కొత్త అసెంబ్లీ నిర్మించి ఉంటే ఎలా ఉండేదో కాని.. ఆ అవకాశమే ఇవ్వకుండా టీడీపీ నిత్యం ఒక వర్గం ప్రజలను రెచ్చగొడుతూ వచ్చింది. ఇక శ్వేతపత్రంలో ఇచ్చిన అంశాలను పరిశీలిస్తే చంద్రబాబు తన ఒరిజినల్ స్టైల్ లో నిరాఘాటంగా అవాస్తవాలు చెప్పినట్లు కనిపిస్తుంది. అవేమిటో చూద్దాం. ➤ విభజన జరిగి పదేళ్లయినా రాజధాని నగరం లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని ఆయన అన్నారు. అది ఎంతవరకు కరెక్టు!. ఓటుకు నోటు కేసు లో ఇరుక్కునే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని పదేళ్లు ఉంటుందని ఆయన చెప్పేవారా?లేదా?దానిని వదలుకుని ఎందుకు విజయవాడకు వెళ్లారు. ఆ తర్వాత రాజధాని పేరుతో ఎన్ని ఊహాగానాలు చేశారు!. తత్ఫలితంగా వేలాది మంది నూజివీడు ప్రాంతంలో భూములు కొని ఎంత నష్టపోయారు!. అవేమీ శ్వేతపత్రంలో కనిపించలేదే!. రామోజీరావు కోరిక మేరకు అమరావతి పేరుతో రాజధాని ప్రకటన చేశారు కదా!➤ సచివాలయం, అసెంబ్లీ మొదలైనవాటిని అక్కడ తాత్కాలికమైనవే అయినా నిర్మించారు కదా! ఆ తర్వాత జగన్ కూడా అక్కడ నుంచే పాలన చేశారు కదా!ఆయన అనుకున్న మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నారు కదా!అలాంటప్పుడు అమరావతి రాజధాని కాకుండా ఎలా పోతుంది!రాజధాని లేదని చెప్పడం పచ్చి అబద్దం అనే సంగతి రుజువు అవుతుంది. ➤ ఉపాధి కల్పించే నగరం లేక యువత వలస పోతున్నారట!. ఎంత పెద్ద నగరం ఉన్నా ఎవరి అవకాశాలను బట్టి వారు వలస వెళుతుంటారు. మరి అంత గొప్ప దార్శనికుడు అయితే ఐదు కోట్ల జనాభా ఉన్న కోస్తా, రాయలసీమలలో ఎందుకు పరిశ్రమలను చంద్రబాబు తన పద్నాలుగేళ్ల సీఎం పదవీకాలంలో తేలకపోయారు!. విశాఖ అయితే సత్వరమే ఉపాధి కేంద్రం అవుతుందనే కదా జగన్ దానికి ప్రాముఖ్యత ఇచ్చింది. పోర్టులు మొదలైనవాటిని నిర్మించడం ఆరంభించింది. సింగపూర్ కన్సార్టియం కు చంద్రబాబు వేల కోట్ల రాయితీలు ఇచ్చింది అక్కడ ఏవైనా పరిశ్రమల ఏర్పాటు కోసమా!లేక రియల్ ఎస్టేట్ వెంచర్ కోసమా?మొత్తం అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా మార్చింది చంద్రబాబా?కాదా?. ➤ అభివృద్ది అంటే రియల్ ఎస్టేటేనా? కృత్రిమంగా ధరలు పెరిగేలా చేసి,ఇన్ సైడ్ ట్రేడింగ్, అస్సైన్ మెంట్ భూముల కుంభకోణం వంటివాటికి అవకాశం కల్పించి అదేదో గొప్ప విషయంగా ప్రచారం చేసుకుంటే ప్రయోజనం ఏమి ఉంటుంది. యాభైవేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేలాతన గత టరమ్ లో ప్రణాళికలు రూపొందించామని చంద్రబాబు అన్నారు. ప్రణాళిక సరే! ఆ డబ్బు ఎందుకు సమకూర్చుకోలేకపోయారు?. ➤ 2018 నాటికే ఒక దశ నిర్మాణం అయిపోతుందని గాలి మాటలు అప్పట్లో చెప్పారా?లేదా?. మరి ఎందుకు పదిశాతం కూడా చేయలేకపోయారు?. ఏభైవేల కోట్ల వ్యయం చేస్తే ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఇరవైవేల కోట్ల నుంచి ముప్పైవేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదట. ఎవరి చెవిలో పువ్వు పెట్టడానికి ఇలాంటి మాటలు చెబుతున్నారు!➤ రాజధానిలో ఏర్పాటైన రెండు యూనివర్శిటీలలో చదుకున్న పేద పిల్లలకు ఏడాదికి కోటి రూపాయల ప్యాకేజీతో ఉద్యోగాలు వస్తున్నాయట. అసలు పిల్లలు ఎందరికి ఉద్యోగాలు వస్తాయి. అందులో ఎంతమందికి కోటి రూపాయల జీతం వస్తుంది?ఎవరిని మోసం చేస్తున్నారు!. ➤ భూమి విలువ ఎకరా ఇరవై కోట్లకు పెరిగేదని, తద్వారా లక్షాఅరవై వేల కోట్ల సంపద ప్రభుత్వానికి వచ్చేదని ఆయన కాకి లెక్కలు చెబుతున్నారు. అంటే ఇక్కడ పేద,మద్య తరగతివారెవ్వరికి జీవించే అవకాశం లేనట్లు ఒప్పుకున్నట్లే కదా!. సంపద సృష్టిం సంగతి దేవుడెరుగు!ముందుగా లక్షన్నర కోట్ల రూపాయలు వ్యయం చేసి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి కదా?ఇదంతా దేనికి !ప్రైవేటు ఆసాముల భూముల విలువలు పెంచడానికే కదా!అదే ప్రభుత్వ భూమి తీసుకుని రాజధానికి అవసరమైన నిర్మాణాలు చేసుకుంటే మహా అయితే ఐదువేల నుంచి పదివేల కోట్ల వ్యయంతో అయిపోయేవి కదా!ఆ తర్వాత ప్రైవేటు వారు తమకు కావల్సిన రీతిలో వారి భూములను అభివృద్ది చేసుకునే వారు కదా!ఆ ఖర్చంతా ప్రభుత్వానికి ఉండేది కాదు కదా!. ➤ కృష్ణా నది పరివాహంలో రాజధాని నిర్మించవద్దని శివరామకృష్ణన్ కమిటీ చెబితే.. ఆ కమిటీ రాష్ట్రం మధ్యలో రాజధాని ఉండాలని సిఫారస్ చేసిందని ప్రచారం చేయడం చంద్రబాబుకు తగునా?. అక్కడ భూములు భారీ భవంతుల నిర్మాణానికి తగవని,పునాదులకే చాలా వ్యయం చేయవలసి ఉంటుందని నిపుణులు చెప్పారా?..లేదా?. ➤ విశాఖలో రిషికొండలో అప్పటికే ఉన్న కొన్ని భవంతులు తొలగించి ఆధునికమైన రీతిలో భవనాలు నిర్మిస్తే.. పర్యావరణం దెబ్బతిందని దుర్మార్గపు ప్రచారం చేసినవారు అమరావతిలో మూడు పంటలు పండే ముప్పైమూడు వేల ఎకరాల భూమిని విధ్వసం చేస్తే పర్యావరణం నాశనం కాదట. పవన్ కల్యాణ్.. అమరావతి అన్నది ఒక వర్గం రాజధాని అని, రాయలసీమ,ఉత్తరాంధ్రవారికి ఇక్కడ అవకాశం ఏమి ఉంటుందని గతంలో ప్రశ్నించిన మాటేమిటి?. ఇప్పుడు ఎందుకు మాట మార్చారు?వరదలు వస్తే మునిగిపోయే ప్రదేశంలో రాజధాని నిర్మాణం చేపట్టారన్న విమర్శలకు ఈనాటికి సమాధానం దొరికిందా!. కొండవీటివాగు మళ్లింపునకు లిఫ్ట్ ప్రాజెక్టులు పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది!. ➤ జగన్ ప్రభుత్వం అమరావతి రైతులకు కౌలు చెల్లించిన మాట వాస్తవం కాదా!అలాగే వ్యవసాయ కూలీలకు పరిహారం ఇచ్చింది నిజం కాదా!అయినా రైతులకు ఏదో అన్యాయం జరిగిందని ప్రచారం చేశారు. రైతులు తమ భూములకు గాను ప్లాట్లతో పాటు కౌలు పొందుతున్నా,వారందరిని త్యాగజీవులుగా ప్రొజెక్టు చేయడంలోని సెంటిమెంట్ రాజకీయం ఎవరికి తెలియనిది!. ఆరు లక్షల మందికి నిర్మాణ పనులలో అవకాశం వచ్చేదని చంద్రబాబు అంటున్నారు. కొంతకాలం పాటు కొన్నివేల మందికి అవకాశం ఉండవచ్చు. అది విశాఖలో అయినా ,కర్నూలులో అయినా వస్తుంది. ➤ అమరావతి గ్రామాలలో తప్ప ,చుట్టుపక్కల గుంటూరు,కృష్ణా జిల్లాలలో భూముల రేట్లు చంద్రబాబు టైమ్ లో ఎందుకు దెబ్బతిన్నాయి?ఇంత భారీగా ప్లాట్లు వేయడం వల్ల అవన్ని అమ్ముడు పోయేవరకు మిగిలిన ప్రాంతాలవారు నష్టపోవలసిందేనా?గతంలో మాదిరి నవ నగరాలు ఇక్కడే చేపడతారా?లేదా?అన్నది ఎందుకు చెప్పడం లేదు?. తాజాగా అమరావతి నిర్మాణానికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుందన్న అంచనా గురించి, ఆ మొత్తం ఎక్కడ నుంచి తెచ్చేది చెప్పకుండా కధలు వినిపించి జనాన్ని మభ్య పెట్టడమే లక్ష్యంగా చంద్రబాబు పని చేస్తున్నారా?. ఇకపై ఇలాంటి ఎన్ని అబద్దాలు వినాల్సి ఉంటుందో!.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
అన్నన్న చంద్రన్నా.. పచ్చి అబద్ధాలతో విద్యుత్ శ్వేత పత్రం!
అమరావతి, సాక్షి: కాకి లెక్కలు.. పచ్చి అబద్ధాలతో పవర్ సెక్టార్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైట్‌పేపర్ ప్రసంగం సాగింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై అభాండాలు వేస్తూ.. గత ఐదేళ్లలో విద్యుత్‌రంగానికి జరిగిన మంచిని ఏమాత్రం ప్రస్తావించకుండా.. పైగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్టు చెబుతూ వింత వింత లెక్కలను తెరపైకి తెచ్చారు సీఎం చంద్రబాబు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఇందులో తెలంగాణ ఇవ్వాల్సిన రూ. 7వేల కోట్ల విద్యుత్ బకాయిలు జగన్ వైఫల్యమన్న చంద్రబాబు.. తన పాలనలోనే తెలంగాణ విద్యుత్ వినియోగించుకున్నదని మాత్రం గుర్తించకపోవడం గమనార్హం. అలాగే.. ప్రభుత్వం శాఖలు ఇవ్వాల్సిన బిల్లులు కూడా వైఎస్ జగన్ వైఫల్యం అంటూ తప్పుడు ప్రచారం చేశారు.చంద్రబాబు శ్వేత పత్రం.. జగన్ హయాంలో వాస్తవాల్ని పరిశీలిస్తే👉పోలవరం జల విద్యుత్ కేంద్రం పూర్తికాక 4737 కోట్లు నష్టమంటూ మరో అబద్ధం అచ్చేసిన వైనంవాస్తవానికి.. పోలవరం జల విద్యుత్ కేంద్రం పనులు వేగంగా జరిగింది వై ఎస్ జగన్ హయాంలోనేచంద్రబాబు హయాంలో కనీసం పునాదులు దాటని జల విద్యుత్ కేంద్రం పనులు👉ఎన్నికలకు ముందు ట్రూ అప్ ఛార్జెస్ రద్దు చేస్తామంటూ చంద్రబాబు ప్రచారంట్రూ అప్ ఛార్జెస్ రద్దు చేస్తారా?.. మీడియా ప్రతినిధులు అడిగిన సమాధానం చెప్పని చంద్రబాబు.. రూ. 17,137 కోట్ల ట్రూ అప్ ఛార్జెస్ రద్దుపై మాట దాటేసిన చంద్రబాబు👉విద్యుత్ ఛార్జీలు ఐదేళ్లు పెంచారా..? అన్న ప్రశ్నకు సమాధానం దాటవేసిన చంద్రబాబు👉చంద్రబాబు గత పాలనలోనే తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిన విద్యుత్ రంగంగత ఐదేళ్లలో విద్యుత్ రంగానికి ఊపిరిపోసిన వైఎస్ జగన్ ప్రభుత్వంచంద్రబాబు దిగిపోయే నాటికి రూ.68,596 కోట్ల అప్పుల్లో డిస్కమ్ లుగత ఐదేళ్లలో డిస్కమ్ లకు నిధులు పెద్ద ఎత్తున చెల్లించిన వైఎస్ జగన్ ప్రభుత్వంరూ. 56 వేల కోట్లు డిస్కమ్ లకు చెల్లించిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఇదీ చదవండి: మళ్లీ చంద్రబాబు మోసం.. ఉచిత ఇసుక ఒట్టిదే!రాష్ట్ర ప్రయోజనాల కోసం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెద్ద ఎత్తున పెంచిన వైఎస్ జగన్ ప్రభుత్వంకృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్)లో 800 మెగావాట్లు,నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో 800 మెగావాట్ల యూనిట్లను జాతికి అంకితంప్రపంచంలోనే అతిపెద్ద 5,230 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్ట్‌కు ఉమ్మడి పిన్నాపురంలో శంఖుస్థాపననెడ్కాప్ ఆధ్వర్యంలో 44,240 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారంజగన్ హయాంలో.. వ్యవసాయానికి 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్‌ను వచ్చే 30 ఏళ్ల పాటు కొనసాగించేందుకు, 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) తో ప్రభుత్వం ఒప్పందంయూనిట్ కేవలం రూ.2.49 పైసలకే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నంసబ్సిడీ బకాయిలను కూడా సకాలంలో విడుదల చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వంగత ఐదేళ్లలో ఒక్క సారి కూడా పవర్ హాలిడే విధించకుండా సమర్థవంతంగా విద్యుత్ రంగ నిర్వహణవైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన ఇంధన రంగ ప్రాజెక్టులకు ప్రముఖ పెట్టుబడిదారులతో 42 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్న వైఎస్ జగన్ ప్రభుత్వంఇంధన పొదుపు, ఇంధన సామర్ధ్య కార్యక్రమాల ద్వారా రూ.3800 కోట్లు విలువైన 5600 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా చేసిన గత ప్రభుత్వం వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రానికి ప్రతిష్టాత్మక ‘జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు’. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఏపీ అధికారులుఏపీట్రాన్స్కో, నెడ్కాప్, ఏపీకి మూడు ఎనర్షియా అవార్డులు, పీఎస్పీడీసీఎల్కు రెండు జాతీయ అవార్డులు‘కన్సూ్యమర్ సర్వీస్ రేటింగ్ ఆఫ్ డిస్కమ్స్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఏపీలోని మూడు డిస్కంలకు ‘ఏ’ గ్రేడ్👉మాచ్‌ఖండ్‌లో ఒడిశా హైడ్రో పవర్ కార్పొరేషన్ (ఓహెచ్‌పీసీ), ఏపీ జెన్కో సంయుక్తంగా మాచ్‌ఖండ్ ప్రాజెక్టు ఎగువ, దిగువ 98 మెగావాట్ల సామర్థ్యం గల మూడు జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు👉అప్పర్ సీలేరులో రూ.11,154 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే 1350 మెగావాట్ల పంప్డ్ స్టోరేజి ప్లాంట్ (పీఎస్పీ)కు కేంద్ర విద్యుత్ మండలి (సీఈఏ) నుంచి అనుమతి తీసుకువచ్చిన గత ప్రభుత్వం. -
Big Question: ఒక అమరావతి వంద అబద్ధాలు
-
శ్వేత పత్రం కాదది.. ‘పచ్చ’ పత్రం: ఆదిమూలపు సురేష్
సాక్షి, తాడేపల్లి: అమరావతిపై చంద్రబాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని.. పచ్చ పత్రం అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆధారాలు లేకుండా రాజకీయ కోణంలో శ్వేతపత్రం ఉందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో అమరావతిలో నిర్మాణాలు చేపట్టాం. రోడ్లు, భవనాల నిర్మాణాలు ముందుకు తీసుకెళ్లాం. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో అమరావతి నిర్మాణాలు చేపట్టాం.’’ అని ఆదిమూలపు చెప్పారు.అమరావతిని ఎందుకు పూర్తి చేయలేదు?‘‘తనది విజన్ అని చెప్పుకునే చంద్రబాబు.. అమరావతిని ఎందుకు పూర్తి చేయలేదంటూ ఆదిమూలపు ప్రశ్నించారు. ‘‘సంపద సృష్టిస్తానని చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. సంపద సృష్టించి ఎవరికి ఇస్తారు? రాజధానిలో అన్ని వర్గాలు ఉండాలి. అమరావతిలో అన్ని వర్గాలు ఉండాలని ఇళ్ల స్థలాలు ఇచ్చాం. అమరావతిలో పేదలకు భూములు ఎందుకు ఇవ్వలేకపోయారో చంద్రబాబు చెప్పాలి. రాజధాని ప్రకటనకు ముందే ప్రభుత్వ సమాచారంతో పెద్ద ఎత్తున భూముల కొనుగోళ్లు జరిగాయి.’’ అని ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు.అమరావతి కోసం చంద్రబాబు చేసిన ఖర్చు ఎంత?‘‘ వైఎస్ జగన్ పాలనపై ఆధారాల్లేకుండా ఆరోపణలు చేశారు. అమరావతి స్మార్ట్ సిటీ, కోర్ కేపిటల్ అభివృద్ధి వంటివన్నీ ముందుకు తీసుకెళ్లాం. చంద్రబాబు చేసిన అప్పులన్నీ తీర్చాం. అసలు అమరావతి కోసం చంద్రబాబు చేసిన ఖర్చు ఎంత?. చేసిన అప్పులు ఎన్నో కూడా చంద్రబాబు తన శ్వేతపత్రంలో చెప్తే బాగుండేది. సంపద సృష్టిస్తానని పదేపదే చంద్రబాబు ఆ సంపద ఎవరి కోసం సృష్టిస్తారో చెప్పాలి. తన వారికే సంపద సృష్టిస్తారా? ప్రజలందరికీ చేస్తారా?. రాజధాని ప్రాంతంలో భూమిలేని కూలీలకు కూడా జగనే పెన్షన్ పెంచారు. 9 సిటీల పేరుతో లక్షల కోట్లతో నిర్మిస్తామనటం మీదే మేము వ్యతిరేకించాం. అన్ని లక్షలు ఒకేచోట ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని ప్రశ్నించాం’’ అని ఆదిమూలపు పేర్కొన్నారు.వేలాది ఎకరాలు చేతులు మారాయి..‘‘రాజధాని కడతానన్న చంద్రబాబు కనీసం రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను కూడా ఎందుకు ఇవ్వలేదు?. రాజధాని ప్రకటన జరిగే లోపు అమరావతిలో పెద్ద ఎత్తున భూకుంభకోణం జరిగింది. 2014 జూన్ నుండి డిసెంబర్ మధ్యలో వేలాది ఎకరాలు చేతులు మారాయి. ఇది ఎలా జరిగిందో చంద్రబాబు ప్రజలకు చెప్పాలి. రాజధానిలో ఇవ్వాల్టి పరిస్థితికి టీడీపీదే బాధ్యత. సీడ్ యాక్సెస్ రోడ్ కూడా ఎందుకు పూర్తి చేయలేదు?. ఆ రోడ్ మీద వెలుగుతున్న లైట్లు కూడా మా హయాంలో వేసినవే. దాన్ని కూడా తామే వేసినట్టు చంద్రబాబు చెప్పుకోవటం హాస్యాస్పదం. రాజధానిలో 14 వందల ఎకరాలను 52 వేల మందికి పట్టాలు ఇచ్చాం. దానిపై చంద్రబాబు తన శ్వేతపత్రంలో ఎందుకు ప్రస్తావించలేదు?’’ అంటూ ఆదిమూలపు ప్రశ్నించారు.దాని గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటలేదు?‘‘అమరావతిలో 17 అంగన్ వాడీ సెంటర్లు, 14 స్కూళ్ల నిర్మాణం చేశాం. చంద్రబాబు లాగా గ్రాఫిక్స్ చేయలేదు, నిర్మాణాలు పూర్తి చేసి చూపించాం. అమరావతి మీదుగా వేసిన వెస్ట్ బైపాస్ నిర్మాణం మా హయాంలోనే చేశాం. దాని గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటలేదు?. చంద్రబాబు ఐకానిక్ బ్రిడ్జి అంటూ గ్రాఫిక్స్‌లో చూపిస్తే.. జగన్ వాస్తవరూపంలో నిర్మించి చూపారు. రూ.841 కోట్లు రైతులకు కౌలు కింద అందించాం. కూలీలకు పెన్షన్ కింద రూ.580 కోట్లు అందించాం. అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు కేంద్రం నుండి మట్టి, నీళ్లు తప్ప ఏం సాధించారు?. ఇప్పుడైనా నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలి. ప్రజలకు చేస్తామన్న సంక్షేమ మేలును పూర్తి చేయాలి. రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లను త్వరగా ఇవ్వాలి’’ అని ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. -
పోలవరానికి ‘చంద్ర’శాపం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2014–19 మధ్య టీడీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాల వల్లే పోలవరంలో పెను విధ్వంసం చోటు చేసుకుంది. ఆ తప్పిదాలే పోలవరానికి శాపంగా మారాయి. ప్రాజెక్టు పనుల్లో తీవ్ర జాప్యానికి.. రూ.వేల కోట్ల నష్టానికి దారితీశాయి. కమీషన్లకు ఆశ పడి తాను చేసిన తప్పిదాల వల్ల ప్రాజెక్టులో జరిగిన విధ్వంసం.. ఫలితంగా పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వంపై నెడుతూ నిస్సిగ్గుగా సీఎం చంద్రబాబు పదే పదే అబద్ధాలు వల్లిస్తున్నారు.ఈనెల 17న పోలవరం పర్యటనలోనూ.. శుక్రవారం శ్వేతపత్రం విడుదల చేస్తున్నప్పుడూ వైఎస్ జగన్‌పై వ్యక్తిగత దూషణలు చేస్తూ.. నిరాధారమైన అసత్య ఆరోపణలు చేస్తూ.. పచ్చి అబద్ధాలతో కట్టుకథలు అల్లుతూ చంద్రబాబు చిందులు తొక్కారు. రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేని వ్యక్తులకు అధికారం ఇస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆక్రోశం వెళ్లగక్కారు. చివరకు పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తామనేది చెప్పలేక చేతులెత్తేశారు. సీఎం చంద్రబాబు చెప్పినట్టుగా రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేని వారు ఎవరు.. అర్హత ఉన్న వారు ఎవరో చూద్దాం..నిర్మాణ బాధ్యతల కోసం 30 నెలలు వృథా రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును వంద శాతం వ్యయంతో తామే పూర్తి చేస్తామని ఏపీ పునర్విభజన చట్టం–2014 ద్వారా కేంద్రం హామీ ఇచ్చింది. కమీషన్లకు ఆశపడిన నాటి సీఎం చంద్రబాబు.. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకుని చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారు. ద్రవ్యోల్బణం వల్ల ధరలు పెరిగి అంచనా వ్యయం పెరుగుతుందని తెలిసినా, 2013–14 ధరలతోనే పోలవరాన్ని పూర్తి చేస్తానని 2016 సెప్టెంబరు 7న కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారు. ఇది పోలవరానికి నిధుల సమస్యకు ప్రధాన కారణమైంది. ఆ మరుసటి రోజే.. జలాశయం పనుల అంచనా వ్యయాన్ని 2015–16 ధరల ప్రకారం పెంచి రూ.1,481.41 కోట్ల మేర కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చారు. 2014 జూన్ 8 నుంచి 2016 డిసెంబర్ 30 వరకు ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి పనులు చేపట్టకుండా 30 నెలలు వృథా చేశారు.ప్రణాళికాయుతంగా వడివడిగా పనులు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–3లో 162 మీటర్ల పొడవున కాంక్రీట్ డ్యామ్ నిర్మాణాన్ని వైఎస్ జగన్ పూర్తి చేశారు. గ్యాప్–1లో 543 మీటర్ల పొడవున పునాది డయాఫ్రమ్ వాల్ నిర్మించారు. కుడి కాలువతోపాటు ఎడమ కాలువలో అత్యంత సంక్లిష్టమైన వరహ నదిపై అతి పొడవైన అక్విడెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి దాదాపుగా కొలిక్కి తెచ్చారు. జలాశయంతో కుడి, ఎడమ కాలువలను అనుసంధానం చేసే కనెక్టివిటీస్(హెడ్ రెగ్యులేటర్, సొరంగాలు)ను పూర్తి చేశారు.చంద్రబాబు చారిత్రక తప్పిదం వల్ల ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన భారీ అగాధాలను సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు ఇసుకతో నింపి, వైబ్రో కాంపాక్షన్ చేస్తూ యథాస్థితికి తెచ్చారు. గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా కొత్తది నిర్మించాలా? లేదంటే దెబ్బతిన్న చోట్ల ‘యూ’ ఆకారంలో డయాఫ్రమ్ వాల్ నిర్మించి.. పాత దానితో అనుసంధానం చేయాలా? అన్నది తేల్చి.. డిజైన్లను ఖరారు చేస్తే 18 నెలల్లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ 2022 డిసెంబర్ నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం కేంద్ర జల్ శక్తి శాఖ, సీడబ్ల్యూసీ, పీపీఏలను కోరుతూ వచ్చింది.అంతర్జాతీయ నిపుణుల సహకారం తీసుకుని డిజైన్లను ఖరారు చేద్దామని సీడబ్ల్యూసీ ఛైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా ప్రతిపాదించారు. ఆ మేరకు కాంట్రాక్టు సంస్థ స్వీడన్‌కు చెందిన యాఫ్రిని అంతర్జాతీయ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. ఫిబ్రవరిలో యూఎస్ఏకు చెందిన ఇద్దరు, కెనడాకు చెందిన మరో ఇద్దరు నిపుణులను పీపీఏ ఎంపిక చేసింది. యాఫ్రి, అంతర్జాతీయ నిపుణులు ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన డిజైన్లతో సవాళ్లను అధిగమిస్తూ.. పనులు చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు. చంద్రబాబు చారిత్రక తప్పిదానికి పాల్పడకపోయి ఉంటే.. 2022 నాటికే వైఎస్ జగన్ పోలవరాన్ని పూర్తి చేసి ఉండేవారని సాగు నీటి రంగ నిపుణులు చెబుతున్నారు.కరోనా వేళ రికార్డు సమయంలో స్పిల్ వే పూర్తి వైఎస్ జగన్ సీఎంగా 2019 మే 30న బాధ్యతలు స్వీకరించారు. 2019 జూన్ రెండో వారంలోనే గోదావరి వరద ప్రారంభమైంది. నవంబర్‌కు తగ్గుముఖం పట్టింది. ఆ వెంటనే ప్రోటోకాల్ ప్రకారం.. నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 2020 మార్చిలో కరోనా మహమ్మారి విజృంభించి.. 2021 ఆఖరు వరకు అతలాకుతలం చేసింది. అయినప్పటికీ స్పిల్ వే నిర్మాణాన్ని పరుగులెత్తించారు.స్పిల్ వే ఫియర్స్‌ను 53.32 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసి.. వాటికి 25.72 మీటర్ల నుంచి 45.72 మీటర్ల మధ్య 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో ప్రపంచంలోనే అతి పెద్ద గేట్లను బిగించారు. వరద వచ్చినప్పుడు దిగువకు విడుదల చేయడానికి వీలుగా గేట్లను ఎత్తడానికి, దించడానికి జర్మనీ, జపాన్ల నుంచి హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లను దిగుమతి చేసుకుని వాటికి అమర్చారు. స్పిల్ వేపై రాకపోకలకు వీలుగా 1,118 మీటర్ల పొడవున స్పిల్ వే బ్రిడ్జిని పూర్తి చేశారు.నదీ ప్రవాహాన్ని స్పిల్ వే వైపునకు మళ్లించేందుకు వెయ్యి మీటర్ల వెడల్పు.. 2,100 మీటర్ల పొడవుతో అప్రోచ్ ఛానల్ తవ్వారు. స్పిల్ వే నుంచి దిగువకు వదలిన వరద ప్రవాహాన్ని తిరిగి నదిలోకి కలపడం కోసం 2,920 మీటర్ల పొడవున స్పిల్ ఛానల్, వెయ్యి మీటర్ల పొడవున పైలట్ ఛానల్లను పూర్తి చేశారు. ఆలోగా ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేశారు. దాంతో 2021 జూన్ 11న గోదావరి వరద ప్రవాహాన్ని అప్రోచ్ ఛానల్, స్పిల్ వే, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్ మీదుగా 6.1 కి.మీల పొడవున గోదావరి ప్రవాహాన్ని మళ్లించి రికార్డు సృష్టించారు.కాఫర్ డ్యామ్‌ల లీకేజీల పాపం బాబు సర్కార్‌దే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులను చేపట్టడానికి వీలుగా లీకేజీలకు అడ్డుకట్ట వేయడానికి జెట్ గ్రౌటింగ్ చేయాలి. అయితే నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడం కోసం గోదావరి నదిలో ఇసుక ఫర్మియబులిటీ విలువను 2018లో అప్పటి కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ తప్పుగా మదింపు చేసింది. దాన్నే పరిగణనలోకి తీసుకుని 30 నుంచి 35 మీటర్ల లోతు వరకూ స్టోన్ కాలమ్స్ వేసి జెట్ గ్రౌటింగ్ చేయకుండా కేవలం 20 మీటర్ల లోతు వరకూ జెట్ గ్రౌటింగ్ చేసేలా డిజైన్లు రూపొందించింది.నవయుగ సంస్థ ఆ మేరకే జెట్ గ్రౌటింగ్ చేసి కాఫర్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టింది. జెట్ గ్రౌటింగ్ నిబంధనల మేరకు చేసి ఉంటే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లలో లీకేజీ సమస్య ఉత్పన్నమయ్యేది కాదని సాగు నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తన హయాంలో జరిగిన ఈ తప్పిదాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వంపై నెట్టేందుకు సీఎం చంద్రబాబు యత్నించడం గమనార్హం.చారిత్రక తప్పిదంతో విధ్వంసం⇒ ఏదైనా నదిపై ఒక ప్రాజెక్టును కట్టాలంటే.. తొలుత నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వేను పూర్తి చేయాలి. ఆ తర్వాత ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతానికి ఎగువన, దిగువన నదికి అడ్డంగా కాఫర్ డ్యామ్‌లు నిర్మించాలి. దీని వల్ల నదీ ప్రవాహం స్పిల్ వే మీదుగా మళ్లుతుంది. అప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రధాన డ్యామ్ పనులు చేపట్టి, పూర్తి చేయవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలోనైనా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఇదే ప్రోటోకాల్ పాటిస్తారు. ⇒ కానీ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మాత్రం నాటి సీఎం చంద్రబాబు ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కారు. నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వేను పూర్తి చేయకుండా పునాది స్థాయిలోనే వదిలేశారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ గ్యాప్–2లో నది గర్భంలో 1,396 మీటర్ల పొడవున పునాది డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని 2018 జూన్ 11 నాటికే పూర్తి చేశారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణానికి ప్రాంతానికి ఎగువన, దిగువన నదికి అడ్డంగా కాఫర్ డ్యామ్‌ల నిర్మాణాన్ని 2018 నవంబర్‌లో ప్రారంభించి పూర్తి చేయలేక 2019 ఫిబ్రవరిలో చేతులెత్తేశారు. ⇒ స్పిల్ వే, స్పిల్ ఛానల్ పూర్తి చేయకపోవడం వల్ల నదీ ప్రవాహాన్ని మళ్లించడం సాధ్యం కాదు. అప్పుడు కాఫర్ డ్యామ్‌ల మీదుగా వరద ప్రవాహిస్తే కొట్టుకుపోతాయనే నెపంతో.. కాఫర్ డ్యామ్‌లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేశారు. పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద గోదావరి నది వెడల్పు 2,400 మీటర్లు. 2019, 2020లలో గోదావరికి వచ్చిన భారీ వరద 2,400 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిందిపోయి..ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీగా వదిలిన 800 మీటర్లకు కుంచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో వరద ఉద్ధృతి మరింత అధికమవడం వల్ల ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం చోటుచేసుకుంది. గరిష్టంగా 36.5 మీటర్లు.. కనిష్టంగా 26 మీటర్ల లోతుతో నాలుగు చోట్ల భారీ అగాధాలు ఏర్పడ్డాయి. గ్యాప్–2లో 1396 మీటర్ల పొడవుతో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ నాలుగు చోట్ల కోతకు గురై 485 మీటర్ల పొడవున దెబ్బతింది. ఇదే పనుల్లో జాప్యానికి, రూ.వేల కోట్ల నష్టానికి కారణమైంది. ఐఐటీ (హైదరాబాద్), ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్) నిపుణులు ఇదే విషయాన్ని తేల్చి చెబుతూ నివేదిక ఇచ్చాయి.రూ.12,157.53 కోట్లకు మోకాలడ్డుపోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేస్తానని 2016 సెప్టెంబరు 7న చంద్రబాబు కేంద్రానికి హామీ ఇచ్చారు. ఆ మేరకు ఒప్పందం చేసుకున్నారు. 2013–14 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లే. ఇందులో 2014 ఏప్రిల్ 1 వరకూ చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లుపోనూ మిగతా రూ.15,667.9 కోట్లే ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది.అయితే 2017–18 ధరల ప్రకారం పునరావాసం, భూసేకరణ వ్యయమే రూ.33,168.23 కోట్లు. అందువల్ల రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని, తాజా ధరల మేరకు నిధులిచ్చి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని 2019 మే 30 నుంచి పలుదఫాలు ప్రధాని మోదీని అప్పటి సీఎం వైఎస్ జగన్ కోరుతూ వచ్చారు. దానికి ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ప్రధాని ఆదేశాల మేరకు తొలి దశ పూర్తికి రూ.12,157.53 కోట్లు అవసరమని కేంద్ర జల్ శక్తి శాఖ తేల్చింది. ఆ మేరకు నిధులు విడుదల చేయాలని మార్చి 6న కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదన పంపింది.అప్పటికే బీజేపీతో పొత్తు కుదరడంతో పోలవరానికి నిధుల విడుదల ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ముందు పెట్టవద్దని, తమకు రాజకీయంగా ఇబ్బందులు వస్తాయంటూ చంద్రబాబు అడ్డుపుల్ల వేశారు. ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందున, ఆ ప్రతిపాదనపై కేంద్ర కేబినెట్‌తో ఆమోద ముద్ర వేయిస్తే నిధుల సమస్య తీరుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సాంకేతిక సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వం సీడబ్ల్యూసీ ద్వారా ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. ఆ ప్రణాళికను అమలు చేయడం ద్వారా ప్రాజెక్టు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని సాగు నీటి రంగ నిపుణులు సూచిస్తున్నారు. -
అబద్ధాలు, అర్ధసత్యాలు.. పోలవరంపై చంద్రబాబు శ్వేతపత్రం
సాక్షి, విజయవాడ: అబద్ధాలు, అర్ధ సత్యాలతో పోలవరంపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు సీఎం చంద్రబాబు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు చాలానే అవస్థలు పడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఆరోపణలతోనే తొలి శ్వేతపత్రాన్ని విడుదల చేసిన చంద్రబాబు.. ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో మాత్రం చెప్పలేదు.చంద్రబాబు ప్రభుత్వ ప్రణాళిక లోపంతోనే డయాఫ్రం వాల్ కొట్టుకుపోగా, నాడు చంద్రబాబు పునాది స్థాయిలో వదిలేసిన స్పిల్‌ను 48 గేట్లతో సహా వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది. డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి ముమ్మాటికి చంద్రబాబు ప్రభుత్వమే కారణం. ఇదే అంశాన్ని ఐఐటీ హైదరాబాద్, ఎన్‌హెచ్‌పీసీ నివేదికలు స్పష్టం చేశాయి. రెండేళ్ల కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ పోలవరం పనులను వైఎస్ జగన్ ప్రభుత్వం పరుగులు పెట్టించింది. సీడబ్ల్యూసీ డిజైన్ కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా.. వైఎస్ జగన్‌పై నిందమోపే ప్రయత్నం చేశారు చంద్రబాబు.భజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన పోలవరాన్ని కమీషన్లకు ఆశ పడి దక్కించుకున్న చంద్రబాబు సర్కార్ ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళికను తుంగలో తొక్కింది. సులభంగా చేయగలిగి, కాంట్రాక్టర్లకు అధికంగా లాభాలు వచ్చే పనులకే ప్రాధాన్యత ఇచ్చింది. ప్రపంచంలో ఎక్కడైనా వరదను మళ్లించేలా స్పిల్‌వే, కాఫర్ డ్యామ్‌లు కట్టాకే ప్రధాన డ్యామ్ పనులు చేపడతారు. 2014–19 మధ్య పోలవరంలో చంద్రబాబు సర్కార్ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది.గోదావరి వరదను మళ్లించే స్పిల్‌వే పునాది స్థాయి కూడా దాటలేదు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను ప్రారంభించనే లేదు. కానీ.. డ్యామ్ గ్యాప్–2లో పునాది డయాఫ్రమ్‌వాల్ పనులను 2017లో ప్రారంభించి 2018 జూన్ 11 నాటికి పూర్తి చేశారు. 35 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పింస్తామంటు హామీ ఇచ్చి 2018 నవంబర్‌లో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులను ప్రారంభించారు. ఇదే ప్రధాన డ్యామ్‌గా చిత్రీకరించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు.2019 ఫిబ్రవరి నాటికి కూడా నిర్వాసితులకు పునరావాసం కల్పింంచకపోవడంతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సీడబ్ల్యూసీ ఇదే అంశాన్ని ప్రస్తావిస్త⇒ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ కాఫర్ డ్యామ్‌ల పనులు చేయాలని ఆదేశించింది. అయితే పునరావాసం కల్పింంచలేక ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి పనులు ఆపేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడంతో అదే ఏడాది మే 30న సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టారు. జూన్ రెండో వారంలోనే గోదావరికి వరద ప్రారంభమైంది. అంటే.. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి, గోదావరి వరద ప్రారంభం కావడానికి మధ్య కేవలం 10 నుంచి 12 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ వ్యవధిలో కాఫర్ డ్యామ్‌లలో ఖాళీ ప్రదేశాలను భర్తీ చేయడం ఎలా సాధ్యమన్నది చంద్రబాబే చెప్పాలి.గోదావరికి 2019లో భారీగా వరదలు వచ్చాయి. పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 2.4 కి.మీ. వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి వరద.. కాఫర్ డ్యామ్‌లు వదిలిన 800 మీటర్ల ఖాళీ ప్రదేశానికి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో వరద ఉద్ధృతి పెరిగి డయాఫ్రమ్‌వాల్‌లో నాలుగు చోట్ల కోతకు గురై 485 మీటర్ల పొడవున దెబ్బతింది. ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై గ్యాప్–1లో 35 మీటర్ల లోతు, గ్యాప్–2లో 26 నుంచి 36.50 మీటర్ల లోతుతో కూడిన అగాధాలు ఏర్పడ్డాయి.వీటిన్నింటినీ అధ్యయనం చేసిన ఐఐటీ–హైదరాబాద్, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ సంస్థలు మానవ తప్పిదం వల్లే పోలవరంలో విధ్వంసం చోటుచేసుకుందని తేల్చి చెప్పాయి. అంటే ఆ తప్పిదం చేసింది చంద్రబాబేనని తేల్చాయని సాగునీటిరంగ నిపుణులు పేర్కొంటున్నారు. -
సంతకాన్ని జంతర్‌మంతర్ చేసినచో...
శూన్యంలో నుంచి కూడా కళను సృష్టించే నైపుణ్యం ఆర్టిస్ట్‌ల సొంతం. తాజా విషయానికి వస్తే... ఇండిగో ఫ్లైట్ అటెండెంట్ తెల్లకాగితంపై చేసిన సంతకాన్ని క్షణాల్లో అందమైన చిత్రంగా మార్చాడు రాబిన్ బార్. సంతకం నుంచి అప్పటికప్పుడు ప్రేయసీప్రియులను సృష్టించిన రాబిన్ బార్ ఇలాంటి అలాంటి ఆర్టిస్ట్ కాదు...రికార్డ్ హోల్డర్ స్పీడ్ పెయింటర్. జస్ట్...కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ వీడియో క్లిప్ 21 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. రాబిన్ బార్‌పై నెటిజనుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. -
ధరణిపై సంచలన నిర్ణయాల దిశగా ప్రభుత్వం అడుగులు!
హైదరాబాద్, సాక్షి: ధరణి ప్రక్షాళన దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో త్వరలోనే ధరణిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇతర వ్యక్తుల పేర్లపై రిజిస్టర్ అయిన ప్రభుత్వ భూముల వివరాలతో శ్వేత పత్రం ఉండనుందని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. ఇక.. ధరణిపై తాజా రివ్యూలో రైతులకు ఇబ్బందులు కలగకుండా పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న 2.45లక్షల దరఖాస్తుల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ధరణిపై ఏర్పాటైన కమిటీ చేసిన సూచనలకు అనుగుణంగా విధివిధానాలను రూపొందించాలని, రైతులు ఇబ్బందిపడకుండా దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ధరణిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసింది. పోర్టల్‌ను పరిశీలించిన కమిటీ.. పూర్తిగా పోర్టల్ పునర్మిర్మాణం అవసరమనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే సాంకేతిక సమస్యల పరిష్కారం దిశగానే కాకుండా.. చట్టాల్ని మార్చాల్సిన అవసరమూ ఉందని కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించింది. ఇక.. ఈ కమిటీ సూచనలకు తగ్గట్లుగా నిర్ణయాలు ఉంటాయని తొలి నుంచి ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ధరణి సమస్యల పరిష్కారానికి మార్చిలో సదస్సులు నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. మార్చి 1వ తేదీ నుంచి నుంచి 7వ తేదీ వరకు సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఇరిగేషన్, పవర్‌పై శ్వేతపత్రాలు విడుదల చేసి బీఆర్ఎస్ను ఇరుకునపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. -
అంచనాలు పెంచి అవినీతి
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. శనివారం అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చలో మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రసంగానికి అడ్డు వచ్చిన భట్టి, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ల అంచనాలు పెంచారని చెప్పారు. కాళేశ్వరంలో మేడిగడ్డ ప్రాజెక్టు నిట్టనిలువునా చీలిపోవడానికి గత పాలకులే కారణమని, అన్నారం, సుందిళ్ల కూడా అవే పరిస్థితుల్లో ఉన్నాయన్నా రు. 15.5 లక్షల ఎకరాలకు నీరందించేందుకు ఉద్దేశించిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రూ.38 వేల కోట్లతో చేపట్టాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయిస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1.47 లక్షల కోట్లకు పెంచిందని విమర్శించారు. రూ.38 వేల కోట్లలో రూ.10 వేల కోట్లు వివిధ పను ల కోసం ఖర్చు చేయగా, మరో రూ.28 వేల కోట్లతో పూర్తి కావలసిన ప్రాజెక్టు బీఆర్ఎస్ అవినీతితో వ్యయం పెరిగిందన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన రాజీవ్‌సాగర్, ఇంది రా సాగర్ ప్రాజెక్టులకు రూ.1,420 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యేవని, రీ డిజైనింగ్ పేరుతో రూ.23 వేల కోట్లకు పెంచి ఇప్పటివరకు ఎకరానికి కూడా నీరివ్వలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కరెంటు ఖర్చు, నిర్వహణ ఖర్చు కలిపి ఏటా రూ.20 వేల కోట్లు అవుతుందని, ఇంత పెద్ద మొత్తాన్ని ఎలా కట్టాలని భట్టి ప్రశ్నించారు. -
ప్రాజెక్టులన్నీ పూర్తయితే.. మొత్తంగా 1.27 కోట్ల ఎకరాలకు సాగునీరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తయితే.. మొత్తంగా 1.27 కోట్ల ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రభుత్వం తెలిపింది. ప్రాజెక్టుల పూర్తికి మరో రూ.97 వేల కోట్లు అవసరమని, ఖర్చు మరింత పెరిగే అవకాశం కూడా ఉందని వెల్లడించింది. ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టులపై చేసిన 1.81 లక్షల కోట్ల వ్యయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెను భారంగా మారిందని పేర్కొంది. ప్రభుత్వం శనివారం రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రాజెక్టులు, తెలంగాణ ఏర్పాటు తర్వాత నిర్మాణం కొనసాగిన, పూర్తయిన, కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు, వ్యయం, సాగులోకి వచ్చిన ఆయకట్టు వంటి అంశాలను అందులో వెల్లడించింది. గత సర్కారు అద్భుతంగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగి, పగుళ్లు వచ్చిందని.. మరో రెండు బ్యారేజీలు కూడా కుంగిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. 2014 వరకు రాష్ట్ర నిధులతోనే ప్రాజెక్టుల నిర్మాణం చేపడితే.. 2014 తర్వాత అధిక వడ్డీకి రుణాలు తీసుకొచ్చి ప్రాజెక్టుల ను నిర్మించడం వల్ల అప్పుల భారం పెరిగిపోయిందని తెలిపింది. వచ్చే పదేళ్లలో రూ.1.35 లక్షల కోట్లను తిరిగి చెల్లించాల్సి ఉందని వివరించింది. ప్రాజెక్టులపై శ్వేతపత్రంలోని ముఖ్యాంశాలు.. ► 2014కు ముందు ఆయకట్టు 57.79 లక్షల ఎకరాలు. ప్రాజెక్టులకు మొత్తం ఖర్చు రూ.54,234 కోట్లు. ► 2014–2023 మధ్య రూ.1.81 లక్షల కోట్ల వ్యయంతో.. 15.81 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది. ► కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల కోసం రూ.1.29 లక్షల కోట్ల ఖర్చు జరిగింది. ► రాష్ట్రంలో మొత్తం ఆయకట్టు అంచనా 1.27 కోట్ల ఎకరాలు.. ఇప్పటికే ఉన్న ఆయకట్టు 73.6 లక్షల ఎకరాలు. ► ప్రస్తుత ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తిచేసి మిగతా 53.98 లక్షల ఎకరాలకు నీరివ్వాలంటే రూ.97,774 కోట్లు కావాలి. ► వచ్చే ఐదేళ్లలో అప్పులు, వడ్డీల కింద రూ.77,369 కోట్లు చెల్లించాలి. ► కాళేశ్వరానికి రూ.93,872 కోట్లు ఖర్చుచేసి 98,590 ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చారు. ► పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులకు రూ.36 వేలకోట్లు వ్యయం చేసినా ఒక్క ఎకరాకూ నీరివ్వలేదు. ► పదేళ్లలో కృష్ణాజలాల దోపిడీ 4 రెట్లు పెరిగింది. ► సాగునీటికోసం ఉద్యమించిన పార్టీ అధికారంలోకి వచ్చాక ఒంటెద్దు పోకడ పోయింది. ► కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడానికి గత ప్రభుత్వం 2015లోనే అంగీకరించింది. ► శ్రీశైలం నుంచి రోజుకు 9.3 టీఎంసీల నీటిని తరలించుకుపోయేలా ఏపీ చేపట్టిన ప్రాజెక్టులకు గత ప్రభుత్వం సహకరించింది. ► పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రోజుకు రెండు టీఎంసీల నుంచి ఒక టీఎంసీ సామర్థ్యానికి కుదించింది. ► గత ప్రభుత్వ తీరువల్ల శ్రీశైలంపై ఆధారపడిన ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రాజెక్టుల భవితవ్యం ప్రమాదంలో పడింది. ► కృష్ణా నీటి వాటాల్లో మనకు అన్యాయం జరిగింది. న్యాయంగా రావాల్సిన నీటిని కోల్పోయాం. ► జలయజ్ఞంలో భాగంగా కాంగ్రెస్ సర్కారు తుమ్మిడిహెట్టి వద్ద రూ.38,500 కోట్లతో 152 మీటర్ల ఎత్తుతో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టింది. 160 టీఎంసీలు ఎత్తిపోసి, 16 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా రూపొందించింది. ► ఎల్లంపల్లికి ఒకదశలో నీటిని పంపు చేయాల్సిన చోట రీడిజైన్ చేసి అనవసరంగా వ్యయం పెంచారు. ప్రాణహిత–చేవెళ్లకు విద్యుత్ వ్యయం ఏటా రూ.1,010 కోట్లు అయి ఉండేది. కాళేశ్వరం ద్వారా రూ.10వేల కోట్లు అవుతోంది. ► కాళేశ్వరం ద్వారా ఇప్పటివరకు 162.36 టీఎంసీలు ఎత్తిపోసి.. అందులో 30 టీఎంసీలను తిరిగి సముద్రంలోకి వదిలిపెట్టారు. ► ఈ ప్రాజెక్టు ప్లానింగ్, డిజైన్, నాణ్యత, నిర్వహణ నియంత్రణ లోపాలు ఉన్నట్లు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెల్లడించింది. ► మేడిగడ్డ బ్యారేజీ ర్యాఫ్ట్ దెబ్బతిని, పిల్లర్స్ కుంగి కదిలిపోయాయి. ఈ బ్యారేజీలోని లోపం మొత్తం ప్రాజెక్టు పనితీరుపైనే ప్రభావం చూపు తుంది. విజిలెన్స్ నివేదిక సైతం లోటుపాట్లను సవివరంగా వెల్లడించింది. ► కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి కట్టుబడి ఉంది. పాలమూరు–రంగారెడ్డికి ఏఐ బీపీ కింద నిధులు తెస్తాం. కృష్ణా జలాల్లో న్యాయంగా రావాల్సిన నీటివాటా కోసం చర్యలు తీసుకుంటాం. -
Parliament Session 2024: యూపీఏపై నిర్మల నిప్పులు
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో ఒక్క కుటుంబానికే ప్రాధాన్యమిచ్చి, దేశ ఆర్థిక పరిస్థితిని దయనీయ స్థితికి దిగజార్చారంటూ కాంగ్రెస్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దుమ్మెత్తిపోశారు. ‘‘దేశ ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం, భారతీయులపై దాని ప్రభావం’ అంశంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘మోదీ ప్రభుత్వానికి దేశమే తొలి ప్రాధాన్యం. యూపీఏకు మాత్రం ఆ ఒక్క (గాం«దీ) కుటుంబమే ముఖ్యం. 2008లో దేశం ఆర్థికమాంద్యం కోరల్లో చిక్కుకుంటే జాతి ప్రయోజనాల పరిరక్షణకు యూపీఏ ప్రభుత్వాలు ముందుకు రాలేదు. ఆర్థిక వ్యవస్థను కాపాడే ప్రయత్నాలు చేయకపోగా కాంగ్రెస్ చేతులెత్తేసింది. పలు స్కామ్‌లతో దేశార్థికాన్ని దీనావస్థలోకి నెట్టి 2014లో ని్రష్కమించారు. వాళ్లు అధికారంలో కొనసాగితే ఇంకెన్ని దారుణాలు జరిగేవో దేవుడికే తెలుసు. సోనియా గాంధీ సూపర్ పీఎంగా ఉండటం వల్లే యూపీఏ హయాంలో ఆర్థికవ్యవస్థ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండేది. వాళ్లిప్పుడు మాకు సంక్షోభాలను ఎలా ఎదుర్కోవాలో నేరి్పస్తున్నారా?’’ అంటూ ఆగ్రహించారు. కోవిడ్ సంక్షోభంలో మోదీ సర్కార్ ఎంతటి సమర్థతతో, అంకితభావంతో పనిచేసిందో, పరిస్థితిని చక్కదిద్దిందో అంతా చూశారన్నారు. వరుస కుంభకోణాలు ‘‘బొగ్గు కుంభకోణం కారణంగా దేశం రూ.1.86 లక్షల కోట్ల ఆదాయం కోల్పోయిందని కాగ్ ఆక్షేపించింది. సుప్రీంకోర్టు సైతం యూపీఏ ప్రభుత్వాన్ని తలంటి ఏకంగా 214 బొగ్గు బ్లాకుల లైసెన్స్‌ను రద్దుచేసింది. కోల్‌స్కామ్ ధాటికి చివరకు చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. బొగ్గు కొరత ఏర్పడింది. విద్యుదుత్పత్తి తగ్గింది. మొత్తంగా పెట్టుబడులూ దెబ్బతిన్నాయి. అదే మోదీ ప్రభుత్వ పాలనలో పారదర్శకంగా బొగ్గు బ్లాకుల వేలం జరిగింది. వాళ్లు బొగ్గును బూడిదగా మార్చారు. మా మోదీ సర్కార్ లాభసాటి విధానాలతో బొగ్గును వజ్రాల వ్యాపారమంత విలువైనదిగా మార్చింది’’ అన్నారు. నాడు పరువు పోతే నేడు ప్రతిష్ఠ పెరిగింది ‘‘యూపీఏ హయాంలో కామన్వెల్త్ క్రీడల కుంభకోణంతో దేశం పరువు పోయింది. ఇప్పుడు ప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సును ఔరా అనిపించేలా నిర్వహించి దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా పెంచాం. బ్యాంకింగ్ రంగమంటే మాకు గౌరవం. కానీ యూపీఏ హయంలో ప్రభుత్వ పెద్దలు తాము చెప్పిన వారికి రుణాలొచ్చేలా చేసి మొండిబకాయిలు పెరగడానికి కారకులయ్యారు. మోదీ హయాంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు 3.2 శాతానికి దిగొచ్చాయి’’ అన్నారు. యూపీఏ పాలనపై బురదజల్లుతున్నారంటూ నిర్మల ప్రసంగానికి విపక్ష సభ్యులు అడ్డుతగిలారు. -
‘బ్లాక్ అండ్ వైట్’ నిజాలు!
సందిగ్ధతకు తావు లేకుండా విషయం తేటతెల్లమయ్యే స్థితివుంటే, తప్పొప్పులు స్పష్టంగా అర్థమవు తుంటే... అలాంటి పరిస్థితిని వ్యక్తీకరించటానికి ఆంగ్లంలో ‘బ్లాక్ అండ్ వైట్’ అనే నుడికారాన్ని ఉపయోగిస్తారు. గురువారం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం శ్వేతపత్రం (వైట్ పేపర్) విడుదల చేయగా, దీనికి పోటీగా కాంగ్రెస్ నల్లపత్రం (బ్లాక్ పేపర్) ప్రకటించింది. ఇది ఎన్నికల రుతువు గనుక అధికారంలోకొచ్చి పదేళ్లవుతున్న సందర్భంలో ఆర్థిక రంగంలో తమ ఘనతను చాటుతూ ఎన్డీయే సర్కారు శ్వేతపత్రాన్ని తీసుకొచ్చింది. ఈ పదేళ్లూ ‘కర్తవ్య కాలమ’ని ఆ పత్రం అభివర్ణించింది. 2014కు ముందు యూపీఏ ప్రభుత్వ విధానాల పర్యవసానంగా ఆర్థికరంగంలో ఎంతటి అరాచకత్వం, ఎలాంటి విచ్చలవిడితనం చోటుచేసుకున్నాయో వివరించింది. 2004లో యూపీఏ అధికారంలోకి రావడానికి ముందున్న ఎన్డీయే సర్కారు దృఢమైన, ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థను అందించివెళ్తే యూపీఏ దాన్ని కాస్తా ధ్వంసం చేసిందన్నది శ్వేతపత్రం ఆరోపణ. కాంగ్రెస్ విడుదల చేసిన బ్లాక్ పేపర్ ఎన్డీయే ప్రభుత్వ పదేళ్ల వైఫల్యాలను ఏకరువు పెట్టింది. ఈ కాలాన్ని ‘అన్యాయ కాలం’గా అభివర్ణించించింది. అందులో ఆర్థిక రంగంతోపాటు ఇతరేతర అంశాలను కూడా ప్రస్తావించింది. రెండూ ఒకేరోజు విడుదల కావటంవల్ల వాస్తవ స్థితి ఏమిటో ‘బ్లాక్ అండ్ వైట్’లో తేటతెల్లమవుతుందని ఎదురుచూసిన వారికి మాత్రం నిరాశే మిగిలింది. ఇప్పుడు యూపీఏ ఉనికిలో లేదు. దాని స్థానంలో ‘ఇండియా’ పేరుతో కొత్త కూటమి రంగంలోకొచ్చింది. గతంలో యూపీఏకు నేతృత్వం వహించినట్టే ఇప్పుడు ‘ఇండియా’కు తానే అన్నీ అయి కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. అయినా శ్వేతపత్రానికి కూటమి తరఫున కాక ఆ పార్టీయే సమాధానం ఇవ్వాల్సివచ్చింది. ఉన్న స్థితిగతులను గణాంక సహితంగా చెప్పటానికి విడుదల చేసే పత్రాన్ని శ్వేతపత్రం(వైట్ పేపర్) అంటున్నారు. ఎన్డీయే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసినంత మాత్రాన దానికి పోటీగా బ్లాక్ పేపర్ పేరిట కాంగ్రెస్ ఎందుకు విడుదల చేయాలనుకుందో తెలియదు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం నింద తొలగించుకోవటానికీ, బీజేపీ ‘నమ్మకద్రోహాన్ని’ చాటడానికీ 1993 మొదట్లో అప్పటి పీవీ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దాన్ని పూర్వపక్షం చేస్తూ, జరిగిన తప్పిదాలకు కేంద్రానిదే బాధ్యతని వివరిస్తూ బీజేపీ సైతం శ్వేతపత్రాన్నే ప్రకటించింది. ఒకటి మాత్రం వాస్తవం... పత్రాలకు ఏ పేర్లున్నా వాటిల్లో వుండేవి గణాంకాలే. సామాన్యుల బతు కులు చూస్తే తప్ప వాస్తవ స్థితిగతులేమిటో అర్థంకావు. వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం గురించి శ్వేతపత్రం ఘనంగానే చెప్పింది. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఎన్డీయేది అదే మాట. తమ అయిదేళ్ల పాలన పరమాద్భుతంగా ఉన్నదంటూ ‘భారత్ వెలిగిపోతోంది’ అనే నినాదంతో నాటి ఎన్డీయే 2004 లోక్‌సభ ఎన్నికలకు వెళ్లింది. కానీ ప్రజలు తిరస్కరించారు. తాజా శ్వేతపత్రం మాత్రం నాటి ఎన్డీయే సర్కారు సుదృఢమైన ఆర్థిక వ్యవ స్థను అప్పగించిందని చెబుతోంది. దాని మాటెలావున్నా యూపీఏ తొలి అయిదేళ్ల పాలన ఒడిదుడు కులు లేకుండానే గడిచిందని చెప్పాలి. రెండోసారి నెగ్గాక అతి విశ్వాసమో, ఎదురులేదన్న దురహంకారమో యూపీఏను దెబ్బతీశాయి. పార్టీలోనూ, వెలుపలా ప్రత్యర్థులను అణచివేసేందుకు అప్రజా స్వామిక విధానాలు అమలయ్యాయి.శ్వేతపత్రం ప్రస్తావించిన బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం తదితర 15 స్కాములలో అధికభాగం రెండో దశ పాలనలోనివే. పీవీ ప్రభుత్వం తీసుకొచ్చిన 1991 నాటి ఆర్థిక సంస్కరణలు తన ఘనతేనని చెప్పుకుని కూడా వాజ్‌పేయి సర్కారు అందించిన అవకాశాలను వినియోగించుకోలేని చేతగాని స్థితిలో యూపీఏ పడిందన్నది శ్వేతపత్రం ప్రధాన ఆరోపణ. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఆర్థిక సంస్కరణల పర్యవసానంగా చేతివృత్తులు దెబ్బ తిని, వ్యవసాయం గిట్టు బాటు కాక, కొత్తగా ఏర్పడిన ఉపాధి అవకాశాలను అందుకోలేక భిన్న వర్గాలు పడిన యాతనలు అన్నీ ఇన్నీ కాదు. ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న రాసిన ‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల’ గీతం ఈ దీనస్థితికి అద్దం పట్టింది. సంస్కరణలు మాన వీయ దృక్పథంతో వుండాలన్న ఆలోచన ఆ తర్వాత వచ్చిందే. అనుత్పాదక ప్రయోజనాలకు వ్యయం చేయటంతో 2003–04లో 31 శాతంగా వున్న పెట్టుబడి వ్యయం 2013–14 నాటికి 16 శాతానికి దిగజారిందని శ్వేతపత్రం అంటోంది. అయితే 2008–09లో ప్రకటించిన రూ. 52,000 కోట్ల రుణమాఫీని ఈ జాబితాలో చేర్చటం సరికాదు. సాగురంగానికి జవసత్వాలివ్వటానికీ, గ్రామీణ ఆర్థికవ్యవస్థ పుంజుకోవటానికీ ఆ చర్య దోహదపడింది. సగటు ద్రవ్యోల్బణ శాతం 8నుంచి 5కు తీసుకురావటం, తలసరి జీడీపీలో వృద్ధి, పెట్టుబడి వ్యయం పెరుగుదల, పరోక్ష పన్ను రేటులో తగ్గుదల వంటివి తమ విజయాలుగా శ్వేతపత్రం తెలిపింది. అయితే నల్లధనాన్ని వెలికి తీయటానికంటూ అమలు చేసిన పెద్దనోట్ల రద్దు ప్రస్తావన ఇందులో లేదు. యూపీఏ కాలంనాటి అవ్యవస్థనూ, దాని చేతగానితనాన్నీ గణాంక సహితంగా చెప్పకపోవటంవల్ల అప్పటి పరిస్థితులపై కాంగ్రెస్ స్వోత్కర్షలకు పోతోందని ఏనాటినుంచో బీజేపీ శ్రేణుల్లో అసంతృప్తి వుంది. తాజా శ్వేతపత్రం ఆ లోటైతే తీర్చింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఈఅంశాలు బీజేపీకి ఆయుధాలవుతాయి. అటు కాంగ్రెస్ అప్పట్లో తాము సాధించిందేమిటో చెబుతుంది. భావోద్వేగాలతో ముడిపడిన అంశాలు కాక, జనం మౌలిక సమస్యలు ప్రధాన చర్చనీయాంశాలు కావటం ఎప్పుడూ మంచిదే. -
Parliament Budget Session 2024: ‘ఇది కర్తవ్య కాలం’
న్యూఢిల్లీ: ‘‘కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వదిలిపెట్టిన సవాళ్లను ఎన్డీయే ప్రభుత్వం గత పదేళ్లలో విజయవంతంగా అధిగమించింది. దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించడానికి కఠిన నిర్ణయాలు తీసుకుంది’’ అని కేంద్ర ప్రభుత్వం తమ శ్వేతపత్రం(వైట్ పేపర్)లో వెల్లడించింది. దేశ ఆర్థిక వ్యవస్థపై రూపొందించిన 59 పేజీల ఈ శ్వేతపత్రాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. యూపీఏ సర్కారు హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి, మోదీ ప్రభుత్వ పాలనలో సాధించిన ఆర్థిక ప్రగతిని వైట్ పేపర్లో ప్రస్తావించారు. దీనిపై శుక్రవారం లోక్‌సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. చర్చ అనంతరం మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తారు. ‘‘2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయానికి దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉంది. ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఆర్థిక క్రమశిక్షణ మచ్చుకైనా లేదు. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. నిజంగా అదొక సంక్షోభ పరిస్థితి. యూపీఏ ప్రభుత్వ నిర్వాకాల వల్ల ఆర్థిక వ్యవస్థ వెనక్కిపోయింది. ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో అప్పటి ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. యూపీఏ పాలనలో భారత్ ప్రపంచంలో అత్యంత బలహీన ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉండేది. యూపీఏ హయాంలో లెక్కలేనన్ని కుంభకోణాలు జరిగాయి. అప్పటి అవినీతి వ్యవహారాలు దేశ ప్రజల విశ్వాసాన్ని బలహీనపర్చాయి. 2013లో విదేశీ మారక నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. దానివల్ల మనం పెద్ద మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. అప్పటి బలహీన నాయకత్వం వల్ల రక్షణ రంగం సైతం సన్నద్ధత కోల్పోయింది. 2014లో దారుణంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ యూపీఏ నుంచి ఎన్డీయే ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చింది. ఆర్థిక వ్యవస్థను, పరిపాలనా వ్యవస్థను గాడిలో పెట్టే పనికి ఎన్డీయే ప్రభుత్వం పూనుకుంది. ఒక క్రమపద్ధతిలోకి తీసుకొచ్చింది. ఆర్థికంగా దేశానికి మంచి జరగాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను మోదీ ప్రభుత్వం గుర్తించింది. దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులను పటిష్టంగా మార్చింది. ఇప్పుడు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారింది. ప్రపంచంలో పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా భారత్ అవతరించింది. మోదీ నాయకత్వంలో మన దేశం ప్రస్తుతం ప్రపంచంలో మొదటి ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారింది. మోదీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల కేవలం పదేళ్లలోనే ఈ ఘనత సాధ్యమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిణామాలు, సవాళ్లు ఉన్నప్పటికీ మన ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో కొనసాగుతోంది. చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది. నిద్రించేలోగా చేరాల్సిన మైళ్లు, ఎక్కాల్సిన పర్వతాలు ఎన్నో ఉన్నాయి. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలి. అదే మన గమ్యం. ఇది మనందరి కర్తవ్య కాలం’’ అని శ్వేతపత్రంలో ఎన్డీయే ప్రభుత్వం పిలుపునిచ్చింది. -
యూపీఏ పాలనపై వైట్‌పేపర్.. లోక్‌సభలో రిలీజ్
న్యూఢిల్లీ: యూపీఏ పదేళ్ల పాలన(2004-2014)ను తూర్పార పడుతూ కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం లోక్‌సభలో శ్వేతపత్రం ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వైట్‌పేపర్‌ను టేబుల్ చేశారు. వైట్‌పేపర్‌లోని మొదటి 24 పేజీల్లో పదేళ్ల యూపీఏ పాలనలో జరిగిన వైఫల్యాలను, అవినీతిని వివరించారు. అప్పట్లో వెలుగు చూసిన 2జీ, కామన్వెల్త్, శారదా చిట్‌ఫండ్ తదితర కుంభకోణాలను ప్రస్తావించారు.1991లో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చింది తామేనని చెప్పే యూపీఏ నేతలు 2004లో పవర్లోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా మరిచిపోయారని వైట్‌పేపర్‌లో కేంద్రం విమర్శించింది. కేవలం పదేళ్లలో దేశాన్ని ‘ఫ్రాజైల్ ఫైవ్’ స్థితి నుంచి టాప్ ఫైవ్‌లోకి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపింది. కొవిడ్, పలు దేశాల మధ్య యుద్ధాలు లాంటి పరిస్థితులను కూడా అధిగమించి దేశ ప్రగతిని పరుగులు పెట్టించామని పేర్కొంది. ఇదీ చదవండి.. ఇండియా కూటమికి మరో షాక్ -
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పొడిగింపు.. అందుకేనా..!
న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం ఒక రోజు పొడిగించింది. ముందుగా ఈ నెల 9వ తేదీ శుక్రవారం వరకే సమావేశాలు జరుగుతాయని ప్రకటించినప్పటికీ తాజాగా శనివారం కూడా సెషన్ జరుగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం ప్రకటించారు. కాగా, యూపీఏ పదేళ్ల పాలనలో అస్తవ్యస్థమైన దేశ ఆర్థిక వ్యవస్థపై ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తుందన్న పుకార్ల నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల పొడిగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. పదేళ్ల యూపీఏ పాలనలో అవలంబించిన అస్తవ్యస్థమైన ఆర్థిక విధానాలు, అవినీతి వల్ల దేశం చాలా విలువైన పదేళ్ల కాలాన్ని కోల్పోయిన వైనాన్ని మోదీ ప్రభుత్వం శ్వేతపత్రం ద్వారా ఎండగట్టనున్నట్లు సమాచారం. యూపీఏ పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో భారత్ తీసుకొని ఉండాల్సిన చర్యలు కూడా శ్వేతపత్రంలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యూపీఏ పదేళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థ నిర్వహణపై శ్వేతపత్రం విడుదల చేయాలని భావిస్తున్నట్లు చెప్పడం గమనార్హం. ఇదీచదవండి.. ఇండియా కూటమికి నితీశ్ అంత్యక్రియలు చేశారు -
శ్వేత-స్వేద పత్రాలు కాదు కావాల్సింది! మరి..
తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య పత్రాల యుద్దం మరీ రక్తి కట్టించినట్లు అనిపించదు. ప్రభుత్వం బీఆర్ఎస్ పై ఏవో కొన్ని ఆరోపణలు చేయడానికే శ్వేతపత్రాలు విడుదల చేసినట్లు కనిపిస్తుంది. దానికి సమాధానంగా బీఆర్ఎస్ విడుదల చేసిన స్వేదపత్రం తమ ప్రభుత్వంపై వచ్చిన విమర్శలకు సమాధానం కన్నా,సెంటిమెంట్ ప్రయోగానికే ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ఉంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్దిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ఆర్దిక, విద్యుత్ శాఖల శ్వేతపత్రాలలో గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగట్టే యత్నం చేశారు. విద్యుత్ ఆర్ధిక రంగంలో వివిధ శాఖల ద్వారా ,కార్పొరేషన్ ల ద్వారా చేసిన అప్పులను ఆయన వివరించారు. మొత్తం మీద 6.71 లక్షల కోట్ల అప్పులు గత ప్రబుత్వం చేసిందని లెక్కగట్టారు. ✍️కాని ఆ అప్పులు వినియోగించిన తీరు, దాని వల్ల మంచి జరిగిందా?లేదా? ఎక్కడ లోపం జరిగింది?దానివల్ల తెలంగాణకు ఏ రకంగా నష్టం వాటిల్లింది అనేదానిపై స్పష్టంగా మాట్లాడినట్లు కనబడదు. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రస్తుతం అప్పులు చేయక తప్పని స్థితి. ఆ అప్పులు ఏ రకంగా తెచ్చారు? వాటికి ఎంత వడ్డీ చెల్లించాలి?కరోనా వంటి క్లిష్ట పరిస్థితి ఏర్పడినప్పుడు అప్పులు లేకుండా ప్రభుత్వం ఎలా నడవాలి అన్న ప్రశ్నలకు సమాదానం లేదు. పోనీ తాము అప్పులు తేబోమని కాని, అప్పులు తెచ్చినా ఫలానా అందుకే వినియోగిస్తామని కాని భట్టి విక్రమార్క చెప్పలేకపోయారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు చూస్తే కొన్ని కొంత అభ్యంతరకరంగానే కనిపిస్తాయి. నీళ్లు అమ్మి అప్పులు కడతామని వేల కోట్ల అప్పు తేవడం ఆశ్చర్యంగానే ఉంది. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లో మంచినీటిని రెండువేల లీటర్ల వరకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. దీనితో వాటర్ వర్క్స్ సంస్థ ఆర్దిక పరిస్థితి కుదేలు అయ్యే ప్రమాదం ఏర్పడింది. ✍️ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం దానిని మార్చగలుగుతుందా?అన్నది అనుమానమే. ప్రైవేటు సంస్థలు అప్పులు తెచ్చేటప్పుడు ఏదో రకంగా బ్యాంకర్లను ఒప్పించేందుకు రకరకాల అబద్దాలు చెబుతుంటాయి.అంకెలను పెంచి ప్రాజెక్లు రిపోర్లులు ఇస్తుంటాయి. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసిందన్న భావన కలుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు లక్ష కోట్ల అప్పు తేవడం విశేషం. అది ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటే దానికి అంత అప్పు అయినా ఫర్వాలేదు. ఆ అప్పు పూర్తిగా సద్వినియోగం అయి ఉంటే మంచిదే. కాని అక్కడే పలు సందేహాలను ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. దీనికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక బారేజీ కుంగడం బీఆర్ఎస్ కు తీరని అప్రతిష్ట తెచ్చిపెట్టింది. విద్యుత్ రంగానికి సంబందించిన శ్వేతపత్రంలో కూడా ఆయా బకాయిల గురించి భట్టి విక్రమార్క వెల్లడించారు. అందులో ప్రభుత్వ సంస్థల బకాయిలే ముప్పైవేల కోట్ల వరకు ఉన్నాయి. ✍️ప్రభుత్వమే అతిపెద్ద బాకీదారుగా ఉంటే ప్రజలు మాత్రం విద్యుత్ బిల్లులు సకాలంలో ఎందుకు చెల్లిస్తారు?దీనిపై ప్రభుత్వ వివరణ ఇచ్చి ఉండాల్సింది. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ మెంట్ ఆఫీస్ లకు సంబంధించి బకాయిలను ఎప్పటికప్పుడు తీర్చివేస్తామని ఎందుకు చెప్పలేకపోయిందన్నది ప్రశ్న. లిఫ్ట్ ఇరిగేష్ స్కీములకు సంబంధించి పెద్ద ఎత్తున సుమారు 15 వేల కోట్ల వరకు పెండింగులో ఉండడం ఊహించిందే.కాకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం అవి బయటపడకుండా కప్పిపుచ్చింది.డిస్కంలకు సంబంధించి ఎనభైఒక్కవేల కోట్ల మేర అప్పులు,నష్టాలు చూస్తే ఆ వ్యవస్థ కోలుకోవడం ఎలా అన్న ప్రశ్న వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు మాత్రం విద్యుత్ సరఫరాలో దాదాపు కోత లేకుండానే అందించింది. విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరిగాయని గతంలో కాంగ్రెస్ ఆరోపించేది. కాని శ్వేతపత్రంలో దానికి ఆధారాలు చూపించలేదు. ✍️గత ప్రభుత్వం చత్తీస్ గడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసినప్పుడు అక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. అయినా అక్రమాలు జరిగాయని భట్టి విక్రమార్క చెబుతారా! కొత్త విద్యుత్ ప్రాజెక్టులలో అవినీతి జరిగిందని విక్రమార్క చేసిన ఆరపణలపై మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి సవాల్ చేయడం, దానిపై న్యాయ విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. అందులో ఏమి బయటపడుతుందన్నది ఇప్పుడే చెప్పలేం.ఈ శ్వేతపత్రాలు ఇవ్వడంలో తప్పు లేదు.కాని గత ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలను కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్న రోజులోల చేసినవే.రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలిసినా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో అలవిగాని హామీలను ఎలా ఇచ్చిందన్నదానికి జవాబు దొరకదు. ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయల సాయం,200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు రెండు లక్షల రుణ మాఫీ ,గ్యాస్ బండ ఐదువందల రూపాయలకే ఇవ్వవలసి ఉంది.రైతు భరోసా గా తక్షణం ఎకరాకుపదిహేనువేల రూపాయల చొప్పు ఆర్ధిక సాయం అందించవలసి ఉంది. ✍️దళిత బంధు వంటి భారీ స్కీములు ఉండనే ఉన్నాయి. అన్ని స్కీములకు కలిపి అయ్యే వ్యయం నమూడు లక్షల కోట్లపైనే ఉంటుందన్నది ఒక అంచనా . ప్రభుత్వం వీటికి ఎంత వ్యయం అవుతుది అన్నదాని గురించి కూడా ఏమైనా పత్రాలు విడుదల చేస్తుందా అన్నది డౌటే. ఈ స్కీముల అమలులో ఎలాంటి కోత పెడతారో చూడాలి.ప్రజాపాలన పేరుతో ఈ స్కీములు కావాల్సిన వారు నమోదు చేసుకోవాలని అనడమే కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది. ఎన్నికల మానిఫెస్టోలో అలా చెప్పారా అన్నది ప్రశ్న.ఏపీలో వలంటీర్ల వ్యవస్థ ద్వారా అర్హులందరికి స్కీములు అమలు చేస్తున్నారు. ఇక్కడ కూడా వలంటీర్ల వ్యవస్థను పెడతామని గతంలో ఒక సందర్భంలో రేవంత్ అన్నారు. బస్‌లలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ నిలబెట్టుకున్నప్పటికీ, దాని వల్ల ఆర్టిసికి ఎంత నష్టం వాటిల్లిందన్నది చెప్పాలి. ✍️దానిని ఎలా భర్తీ చేస్తారు? ఈ స్కీము వల్ల ఆటోలు,క్యాబ్ ల వారికి జరుగుతున్న నష్టంపై ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఏమి చూపుతుంది?ఇలాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి.గత ప్రభుత్వం ఆర్దిక నిర్వహణ సరిగా లేదు కనుక తాము స్కీములు అమలు చేయలేకపోతున్నామంటే ప్రజలు అంగీకరించకపోవచ్చు. వందరోజుల తర్వాత కాంగ్రెస్ జవాబు ఇవ్వక తప్పనిస్థితి ఏర్పడుతుంది. ఇక కేటీఆర్ స్వేదపత్రం పేరుతో ప్రభుత్వానికి జవాబు ఇచ్చినప్పటికీ, అందులో అతిశయోక్తులు కూడా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ఆరులక్షల కోట్లలో ప్రభుత్వ అప్పు మూడున్నరలక్షల కోట్లేనని, మిగిలినవి గ్యారంటీల కింద తెచ్చిన అప్పులని అన్నారు. ఏ అప్పు అయినా ఒకటే అని అనుకుంటారు. పదమూడు లక్షల కోట్లు వ్యయం చేస్తే ఏభై లక్షల కోట్ల సంపద సృష్టించామని కేటీఆర్ చెబుతున్నారు. ✍️ఆ సంపద నిజంగానే ప్రజలకు ఉపయోగపడితే సంతోషమే. ఆ సంపద ద్వారా ఆదాయం వస్తున్నట్లయితే ఇన్ని వేల కోట్ల బకాయిలు ఎందుకు పెండింగులో ఉన్నది వివరించాలి. ప్రభుత్వం శ్వేతపత్రంలో వెల్లడించిన వాటికి సమాధానం లేనప్పుడు కేటీఆర్ సెంటిమెంట్ ప్రయోగించారు. రాష్ట్రం అప్పుల పాలైందని పదే,పదే ప్రభుత్వం చెబితే తెలంగాణ పరపతి దెబ్బతింటుందని, తెలంగాణ అస్తిత్వం నిలబడిందంటే దానికి కేసీఆర్ కారణమని కేటీఆర్ అంటున్నారు. ప్రభుత్వపరంగా చూస్తే కేసీఆర్ పాలన మరీ అద్వాన్నం అని అనలేకపోయినప్పటికీ, కొన్ని విషయాలలో మితిమీరి వ్యవహరించడం వల్ల నష్టపోయారన్నది వాస్తవం. నిజానికి వారు చెబుతున్నదాని ప్రకారం అంత స్వేదం చేసి సంపాదించి ఉంటే ప్రజలు ఎందుకు అర్ధం చేసుకోలేకపోయారు?వారిని ఎందుకు ఓడించారు?కేవలం రాజకీయ కారణాలతోనే ఓటమిపాలయ్యారా?లేక ప్రభుత్వంలో జరిగిన తప్పుల వల్ల కూడానా అన్నది వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ✍️అప్పుడు కేసీఆర్ మరీ అతిగా వెళ్లకుండా ఉంటే ఇప్పుడు ఈ ఓటమి ఎదురయ్యేది కాదు. అలాగే కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంపై అన్నిటిని నెట్టేసి కాలం గడుపుదామన్నా కుదరదు. ఎందుకంటే ప్రజల ఆకాంక్షలు ఎప్పటికప్పుడు పెంచుతున్నది రాజకీయ పార్టీలే. వాటిని నెరవేర్చకపోతే ప్రజలు వెంటనే స్పందించే అవకాశం కూడా ఉంటుంది. వారికి కావల్సింది శ్వేతపత్రాలు,స్వేదపత్రాలు కాదు. రాజకీయ పార్టీలు తాము విడుదల చేసిన ఎన్నికల పత్రాలలోని వాగ్దానాలను నెరవేర్చడం. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
TS: ‘స్వేద’పత్రం.. కేటీఆర్ కీలక ప్రజెంటేషన్
సాక్షి,హైదరాబాద్: అసెంబ్లీలో ఉద్దేశ్యపూర్వకంగా తమపై బురద జల్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అయినా మాజీ మంత్రులు జగదీష్‌రెడ్డి, హరీశ్‌రావు తాను ధీటుగా ఎదుర్కొన్నామని చెప్పారు. ప్రభుత్వ శ్వేతపత్రాలకు కౌంటర్‌గా ఆదివారం ఉదయం తెలంగాణ భవన్లో స్వేద పత్రం విడుదల చేసే సందర్భంగా కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.50 లక్షల కోట్ల సంపద సృష్టించినట్లు చెప్పారు. ‘అసెంబ్లీలో పూర్తిస్థాయిలో మాకు మాట్లాడే అవకాశమివ్వకపోయినా మేం ఇచ్చిన సమాధానాలకు ప్రభుత్వం పారిపోయింది. బీఆర్ఎస్ పాలనలో మూడు లక్షల కోట్లు మాత్రమే అప్పు చేస్తే దానిని 6 లక్షల 71 వేల కోట్లుగా ప్రభుత్వం చూపించింది. ప్రభుత్వ శ్వేతపత్రాలన్నీ తప్పుల తడకలు. తొమ్మిదేళ్లలో రక్తాన్ని రంగరించి రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపాం. విధ్వంసం నుంచి వికాసం వైపు సంక్షోభం నుంచి సంక్షేమం వైపు తీసుకెళ్లాం’ అని కేటీఆర్ తెలిపారు. 60 ఏళ్ల గోస 10 ఏళ్లలో మాయం చేసి చూపించాం. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం చేసిన కాంగ్రెస్ నాయకులు మరొకసారి శ్వేతపత్రాల పేరుతో మోసం చేయాలని చూస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో సంక్షేమం, కరెంటు,వ్యవసాయం, చెరువులు, పల్లె,పట్టణ ప్రగతి లాంటి అంశాలను ప్రాధాన్య క్రమంలో తీసుకుని పనిచేశాం.రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణం ప్రారంభించాం. దీని ఫలితంగానే తొమ్మిదేళ్లలో తెలంగాణ తలసరి ఆదాయం డబుల్ అయిందని’అని కేటీఆర్ వివరించారు. విద్యుత్, సాగునీరు,తాగునీరు రంగాల్లో బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో పెట్టిన పెట్టుబడులు, చెమటోడ్చి సృష్టించిన ఆస్తులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వడ్డించిన విస్తరి. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతం. కాలువలు కడితే 200 టీఎంసీల నీళ్లు పొలాల్లో పారేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాళేశ్వరంలోని చిన్న మేడిగడ్డ బ్యారేజ్‌లో ఏదో తప్పు జరిగిందని నిందిస్తున్నారు. ఎలాంటి విచారణకైనా సిద్ధం’అని కేటీఆర్ అన్నారు. ఇదీచదవండి..లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్! -
TS: బీఆర్ఎస్ ‘స్వేద పత్రం’లో ఏముంది?
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ రిలీజ్ చేయనున్న స్వేద పత్రం ఆసక్తి రేపుతోంది. తమ తొమ్మిదేళ్ల తమ పాలనలో తెలంగాణలో అభివృద్ధి చేసిన ఆస్తులు, అప్పులపై గులాబీ పార్టీ కాసేపట్లో స్వేదపత్రం పేరిట వైట్‌పేపర్ రిలీజ్ చేయనుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషేన్ ద్వారా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస్తులు, అప్పులను వివరించనున్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలకు కౌంటర్‌గా బీఆర్ఎస్ ఈ స్వేద పత్రం విడుదల చేయనుంది. తొమ్మిదేళ్లలో ప్రభుత్వంలో తాము,తెలంగాణప్రజలు కలిసి చెమటోడ్చి ఆస్తులు సృష్టించుకున్నందునే వైట్‌పేపర్‌కు స్వేదపత్రం అని పేరు పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆస్తుల సృష్టికే అప్పులు చేశామని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకే ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. నిజానికి శనివారమే స్వేదపత్రం రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటికీ కేటీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా కార్యక్రమానికి నేటికి వాయిదా వేశారు. స్వేదపత్రం రిలీజ్ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలు పలువురు హాజరవనున్నారు. ఇదీచదవండి..లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్! -
కేటీఆర్ ‘స్వేద పత్రం’ వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు శ్వేత పత్రం వర్సెస్ స్వేద పత్రంతో వేడెక్కాయి. శాసనసభ వేదికగా రెండు రోజుల పాటు కాంగ్రెస్ సర్కారు విడుదల చేసిన శ్వేతపత్రాలపై కౌంటర్‌గా బీఆర్ఎస్ తన వాదన వినిపించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు సిద్ధం అవ్వగా.. ఇవాళ్టి ఆ కార్యక్రమం వాయిదా పడింది. శనివారం ఉదయం తెలంగాణ భవన్ వేదికగా కేటీఆర్ గత తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణ సాగించిన ప్రగతి ప్రస్థానం పేరిట పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు సిద్ధమని ప్రకటించారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే.. చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియదు.. కార్యక్రమం వాయిదా పడింది. ఆదివారం ఆ కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. అయితే వాయిదాకి గల కారణం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. తెలంగాణలో బీఆర్ఎస్ పాలన సువర్ణ అధ్యాయమని.. దానికోసం తమ ప్రభుత్వం చిందించిన చెమటను ప్రజలకు వరించేందుకే ‘స్వేద పత్రం’పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నామని మాజీ మంత్రి కేటీఆర్ చెబుతున్నారు. తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం పగలూ రాత్రి తేడా లేకుండా.. రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన.. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం.. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం.. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే… — KTR (@KTRBRS) December 22, 2023 -
కాంగ్రెస్ కు బీఆర్ఎస్ స్ట్రాంగ్ కౌంటర్
-
విద్యుత్ సంస్థలపై రూ.1.14 లక్షల కోట్ల భారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పురోగతిలో, అభివృద్ధిలో కీలక పాత్ర విద్యుత్ రంగానిదేనని, ప్రజల నాణ్యమైన జీవన శైలిని సూచించేది కూడా విద్యుత్ వినియోగమేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలో అలాంటి విద్యుత్ రంగం ఆర్థిక పరిస్థితి ప్రమాదకర స్థితిలో ఉందని వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి చేయకపోగా.. విద్యుత్తు సంస్థలపై రూ.1.14 లక్షల కోట్ల భారం మోపిందని ఆరోపించారు. అసలు తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న విద్యుత్ సరఫరాకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుచూపుతో చేపట్టిన ప్రాజెక్టులే కారణమని.. బీఆర్ఎస్ ప్రభుత్వం చొరవ ఏమాత్రం లేదని పేర్కొన్నారు. గురువారం భట్టి శాసనసభలో రాష్ట్ర విద్యుత్ రంగం పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసి.. స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. చివరిగా చర్చకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా సభలో భట్టి చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘కరెంటును ఒక్కరోజులో ఉత్పత్తి చేయలేరు. కానీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే 24 గంటల కరెంటు అందించామని చెప్పిన బీఆర్ఎస్.. అందుకు అవసరమైన విద్యుత్‌ను ఎలా అందుబాటులోకి తెచ్చిందో చెప్పలేదు. అందుకే వాస్తవాలు ప్రజలకు తెలియటం కోసం శ్వేతపత్రాన్ని విడుదల చేశాం. తెలంగాణ ఏర్పడే నాటికి టీఎస్ జెన్కో స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 4,365.26 మెగావాట్లు. దీనికితోడు తెలంగాణ ఏర్పాటుకు ముందే.. ఇక్కడ 2,960 మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన ప్రణాళికలను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అవి ఉత్పత్తి ప్రారంభించాయి. ఆ కొత్త విద్యుత్ కేంద్రాలే అనంతర కాలంలో తెలంగాణలో నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో కీలకపాత్ర పోషించాయి. గత ప్రభుత్వం పూర్తి చేసినది ఒక్కటే.. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం రూపకల్పన సమయంలోనే తెలంగాణ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. ఇక్కడి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యానికి అదనంగా 1,800 మెగావాట్లు వచ్చేలా నాటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను పొందుపరిచింది. రాష్ట్రం ఏర్పడ్డాక గత ప్రభుత్వం మొదలుపెట్టి పూర్తి చేసినది కేవలం 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టు మాత్రమే. ఇది పూర్తి కావడానికీ సుదీర్ఘకాలం పట్టింది. ప్రమాణాలకు విరుద్ధంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల పెట్టుబడి వ్యయం గణనీయంగా పెరిగింది. ఎక్కువ బొగ్గు వినియోగించాల్సి రావటం, కాలుష్యం వెదజల్లటం వంటి సమస్యలు ఏర్పడ్డాయి. దీనితో వేల కోట్ల నష్టం వాటిల్లనుంది. మరో ప్రాజెక్టు బొగ్గుగనులకు అత్యంత దూరంగా నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకు బొగ్గు సరఫరా కోసమే ఏటా రూ.800 కోట్లు అదనపు వ్యయం అవుతుంది. ప్రాజెక్టు జీవితకాలం 30 ఏళ్లు అనుకుంటే.. ఈ వ్యయం మరింత భారీగా ఉండబోతోంది. భారీగా పెండింగ్ బకాయిలు రాష్ట్ర డిస్కంలు మొత్తం రూ.62,461 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. 2023 అక్టోబర్ 31 నాటికి విద్యుత్ శాఖ అప్పుల మొత్తం రూ.81,516 కోట్లు. ఇందులో రూ.30,406 కోట్లు విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించడం కోసం తీసుకున్న రోజువారీ నిర్వహణ మూలధన రుణం. ఇదేకాకుండా విద్యుదుత్పత్తి, సరఫరా సంస్థలకు మరో రూ.28,673 కోట్ల బకాయిలను ఇంకా చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని రూ.28,842 కోట్ల బకాయిల వల్లే డిస్కంలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాయి. ఈ బకాయిల్లో ఒక్క సాగునీటి శాఖ చెల్లించాల్సినవే రూ.14,193 కోట్లు. విద్యుత్ కొనుగోళ్ల వాస్తవ సర్దుబాటు ఖర్చుల (ట్రూఅప్) కింద గత ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తానని మాటిచ్చి.. చెల్లించని రూ.14,928 కోట్ల భారం డిస్కంలపైనే పడింది. గుండె బరువెక్కుతోంది విద్యుత్ శాఖ అప్పులకు తోడు ప్రభుత్వం కరెంటు సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలతో కలుపుకొంటే ఈ మొత్తం రూ. 1.14 లక్షల కోట్లకు చేరింది. నాకు అప్పు అంటేనే భయం. వ్యక్తిగతంగా నేను అప్పు చేయను. కానీ ప్రస్తుతం నాకు వచ్చిన ఆర్థిక, విద్యుత్ శాఖల సమీక్షల సందర్భంగా గత ప్రభుత్వం చేసిపెట్టిన అప్పులు చూసి గుండె బరువెక్కుతోంది. ముందు చూపు ఏది? రాష్ట్రంలో 2014 నాటికి కరెంటు డిమాండ్ 5,661 మెగావాట్లు. దానికి 2.7 రెట్లు ఎక్కువ విద్యుత్ అందించేలా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అలా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ముందుచూ పుతో ఉంటే.. ఇప్పటి డిమాండ్‌కు 2.7 రెట్లు ఎక్కు వగా అంటే 39 వేల మెగావాట్ల కరెంటు అందుబాటులో ఉండాలి. అలా జరగలేదు. కనీసం డిమాండ్‌కు తగ్గట్టు కూడా ఉత్పత్తి చేయలేకపోయింది. కాంగ్రెస్ హయాంలోని ప్రణాళికలతోనే.. యూపీఏ ప్రభుత్వం రెండు దశాబ్దాల క్రితమే ముందుచూపుతో తగిన ప్రణాళికలను అమల్లోకి తేవటంతో దేశవ్యాప్తంగా కరెంటు ఉత్పత్తి పెరిగింది. తెలంగాణ వచ్చేనాటికి రాష్ట్రంలో ఉత్పత్తి కేంద్రాల ద్వారా 7,778 మెగావాట్లు అందుబాటులో ఉంది. పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్ అందాలన్న ఉద్దేశంతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం.. కొత్తగూడెం థర్మల్ కేంద్రం, కాకతీయ రెండో దశ, సింగరేణి జైపూర్ కేంద్రం, పులిచింతల హైడల్ కేంద్రం సహా పలు కొత్త విద్యుదుత్పత్తి సంస్థలకు ప్రణాళికలు రూపొందించి పనులు ప్రారంభించింది. వీటితో 2,960 మెగావాట్ల కరెంటు అందుబాటులోకి వచ్చింది. దీనికితోడు రాష్ట్ర విభజన చట్టం ద్వారా తెలంగాణకు ఏపీ నుంచి 1,800 మెగావాట్లు, ఎనీ్టపీసీ రామగుండం నుంచి 4 వేల మెగావాట్లు.. కలిపి 5,800 మెగావాట్లు సమకూరాయి. ఇలా అన్నీ కలిపి 16,538 మెగావాట్ల విద్యుత్ నాటి కాంగ్రెస్ ప్రభుత్వ చొరవతోనే రాష్ట్రానికి అందుతోంది. అదే బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్లతో నష్టాలే తప్ప ఒరిగిందేమీ లేదు. రోజువారీ మనుగడకూ కష్టంగా.. డిస్కంలు రోజువారీ మనుగడ కోసం కూడా అలవికాని అప్పులు చేయాల్సిన స్థితికి చేరాయి. విద్యుత్ కొనుగోళ్లకు అవసరమైన నిధులను ఈ అప్పుల మార్గంలో సమకూర్చుకోవడం చాలా కష్టం. గత ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు జరపకపోవడం వల్ల, సంస్థలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోకపోవడం వల్ల.. డిస్కంలు అప్పుల ఊబిలోకి కూరుకుపోయి ఉన్నాయి. విద్యుత్ సంస్థలకు సకాలంలో నిధులు విడుదల చేయాల్సిన గత సర్కారు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడంతో కుదేలయ్యాయి. ఇలాంటి విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా పొందినా.. మేం రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరికీ నాణ్యమైన విద్యుత్‌ను బాధ్యతాయుత, పారదర్శక మార్గంలో అందించడానికి, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించడానికి కట్టుబడి ఉన్నాం..’’ అని భట్టి పేర్కొన్నారు. -
TS: శ్వేతపత్రం వెనుక సీఎం పాత గురువు..హరీశ్‌రావు
సాక్షి,హైదరాబాద్: ఆరు గ్యారెంటీల అమలును ఎగ్గొట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాల పేరుతో దగా చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేసిన శ్వేత పత్రం మీద జరిగిన స్వల్పకాలిక చర్చలో హరీశ్‌రావు మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి పాత గురువు శిష్యులు ఈ శ్వేతపత్రం స్టోరీ వండి వార్చారని హరీశ్‌రావు మండిపడ్డారు. ఏపీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈ శ్వేతపత్రం తయారీ వెనుక ఉన్నారన్నారు.దీనికి మంత్రి శ్రీధర్‌బాబు అభ్యంతరం చెప్పగా అవసరమైతే తయారు చేసిన వాళ్ల పేర్లు కూడా చెప్తామని హరీశ్‌రావు బదులిచ్చారు. శ్వేతపత్రంలో కేవలం అప్పులు చూపించి ఆదాయం ఎలా పెరిగిందో చెప్పకపోవడం సరికాదని హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వమే తప్పుడు ప్రచారం చేస్తే పెట్టుబడులు ఆగిపోయి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని హెచ్చరించారు. కరోనా, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల తెలంగాణకు లక్ష కోట్ల రుణ భారం అదనంగా పడిందని చెప్పారు. దేశ జీడిపీకి ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్న టాప్ 5 స్టేట్స్లో తెలంగాణ ఒకటన్నారు.తలసరి ఆదాయం వృద్ధిలో తెలంగాణ నెంబర్‌వన్‌గా ఉందన్నారు. ఇవీ చూడండి..తెలంగాణ శాసన సభ సమావేశాలు.. లైవ్ అప్డేట్స్ -
TS: వాస్తవాలను ప్రజల ముందుంచుతాం : భట్టి విక్రమార్క
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. 42 పేజీలతో ఉన్న బుక్‌ను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాస్తవ పరిస్థితులను ప్రజల ముందుంచాల్సిన బాధ్యత తమ మీద ఉందన్నారు. ప్రజలకు సహేతుకమైన పాలన అందించడం తమ బాధ్యత అని భట్టి చెప్పారు. శ్వేతపత్రం బుక్ విడుదలపై బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి హరీశ్‌రావు అభ్యంతరం చెప్పారు. అరగంట ముందు బుక్ రిలీజ్ చేసి చర్చించమంటే ఎలా అని ప్రశ్నించారు. బుక్‌లో ఉన్న అంశాలపై అవగాహన కోసం కొంత సమయం కావాలని అడిగారు. ఇదే రీతిలో ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీనణ్ ఒవైసీ, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ అరగంట పాటు అసెంబ్లీని వాయిదా వేసి టీ బ్రేక్ ఇచ్చారు. 👉: కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రం.. క్లిక్ చేయండి అరగంట ముందు 40 పేజీల శ్వేతపత్రం విడుదల చేసి చర్చ ప్రారంభించడాన్ని లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రి శ్రీధర్‌బాబు సమర్థించుకున్నారు. గతంలో కూడా ఇలాంటి సంప్రదాయం ఉందన్నారు. తాము కొత్తగా చేసిందేమీ లేదన్నారు. శ్వేతపత్రంపై సభ్యులు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఇవీ చూడండి..తెలంగాణ శాసన సభ సమావేశాలు.. లైవ్ అప్డేట్స్ -
ఎల్ఏసీ వద్ద పరిణామాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. చైనాతో సరిహద్దు వివాదంపై పార్లమెంట్లో సమగ్రంగా చర్చ జరపాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘సరిహద్దులు దాటి మన భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదు. మన ఆర్మీ పోస్టులను ఎవరూ స్వాధీనం చేసుకోలేదని మూడేళ్ల క్రితం గల్వాన్ ఘర్షణలు జరిగాక అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ చెప్పారు. చైనా సైనికులు సరిహద్దులు దాటి చొచ్చుకొచ్చేందుకు, మన భూభాగంలో టెంట్లు వేసేందుకు ప్రయతి్నంచడంతో గల్వాన్ ఘటన జరిగిందంటూ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇవి రెండూ పరస్పర విరుద్ధ ప్రకటనలు’అని తివారీ తెలిపారు. అందుకే భారత్–చైనా సరిహద్దు వివాదంపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరపడంతోపాటు గత మూడేళ్లుగా ఎల్ఏసీ వెంట జరుగుతున్న వాస్తవ పరిణామాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బాధ్యతాయుత ప్రతిపక్షంగా కాంగ్రెస్ కోరుతోందన్నారు. ‘ఎల్ఏసీ వెంట ఉన్న 65 పెట్రోలింగ్ పాయింట్లకు గాను 26 వరకు మన ఆర్మీ నియంత్రణలో లేవన్న విషయం నిజమా? చైనా ఆక్రమణలను మనం ఎందుకు ఆపలేకపోయాం?’అని తివారీ కేంద్రాన్ని నిలదీశారు. -
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ‘రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. సంక్షేమ కార్యక్రమాల అమలు, ఇతర ఖర్చులకు డబ్బులు లేని పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున తీసుకున్న రుణాలకు గాను భారీ మొత్తంలో వడ్డీలు చెల్లించాల్సి వస్తోంది’అని ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ ఆర్థిక కష్టాలు బయటపడకుండా ఉండేందుకుగాను రాజకీయ ప్రకటనలతో కాలం వెళ్లదీసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా, ఆర్థిక ఆంక్షలు విధిస్తూ తెలంగాణను అణగదొక్కేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. దేశంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రమని చూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిజాలను మరుగున పెడుతోందన్నారు. ఇతరులను నిందించడం, రాజకీయ ప్రకటనల ద్వారా కాలక్షేపం చేయడంతో ఆర్థిక కష్టాలు తీరవని, అసెంబ్లీ సమావేశాలకు ముందే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. -
సమాచారం అడిగితే.. తెల్లకాగితాలు పంపారు
జడ్చర్ల: సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద సమాచారం అడిగిన ఓ వ్యక్తికి అధికారులు వివరాలేమీ లేని తెల్లకాగితాలు పంపారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక రంగారావుతోటలో నివాసం ఉంటున్న సామాజికవేత్త అనిల్‌కుమార్ 40 రోజుల క్రితం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని మిషన్ భగీరథ, సీసీ రోడ్లు తదితర సమస్యలపై పూర్తి వివరాలు అందించాలని ఆర్టీఐ కింద మున్సిపల్ అధికారులకు దరఖాస్తు చేశారు. ఈ క్రమంలో అనిల్‌కుమార్‌కు సంబంధిత అధికారులు పోస్టులో ఓ కవర్ పంపారు. దాన్ని విప్పి చూసిన అనిల్‌కుమార్ ‘తెల్ల’బోయారు. అందులో ఎలాంటి వివరాలు లేకుండా తెల్లకాగితాలు మాత్రమే ఉన్నాయి. ఈ విషయాన్ని ఆయన వెంటనే స్థానిక విలేకరుల దృష్టికి తెచ్చారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ మహ్మద్ షేక్‌ను వివరణ కోరగా తాము పూర్తి సమాచారాన్ని కవర్లో పెట్టి పోస్టు చేశామని, ఇందుకు సంబంధించిన కాపీ ఒకటి తమ దగ్గర ఉందని పేర్కొన్నారు. అయితే మున్సిపల్ అధికారుల నిర్వాకాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని అనిల్‌కుమార్ చెప్పారు. -
పది గంటల్లోనే సినిమా పూర్తి.. ఎమ్మెల్యే రోజా అభినందనలు
‘‘చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలు లేవు. కథ బాగుండి ప్రేక్షకులను ఆకట్టుకునే ఏ సినిమా అయినా పెద్ద సినిమాయే. తమి ళంలో ‘స్వయంవరం’ సినిమాను 24 గంటల్లో పూర్తి చేశాం. పది గంటల్లోనే ‘వైట్ పేపర్’ను పూర్తి చేసిన టీమ్‌కి నా అభినందనలు. అభి హీరోగా నటించిన ఈ సినిమా హిట్ కావాలి’’ అని ప్రముఖ నటి, నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. అదిరే అభి, అభినయ కృష్ణవాణి, తల్లాడ సాయికృష్ణ, స్నేహ, నందకిశోర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వైట్ పేపర్’. శివ దర్శకత్వంలో శివ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను రోజా విడుదల చేశారు. ‘‘నాలుగు కెమెరాలతో ఈ సినిమాని షూట్ చేశాం. మా ప్రయత్నానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు సత్కరించారు. త్వరలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఎక్కనుంది’’ అన్నారు అభి. -
స్విస్ నల్లధనంపై మోదీ మాట్లాడరేం ?
న్యూఢిల్లీ: అధికారంలోకి వస్తే స్విట్జర్లాండ్‌లోని నల్లధనాన్ని బయటకు తీసుకొస్తానని వాగ్దానం చేసిన మోదీ ప్రస్తుతం నల్ల ధనం గురించి ఎందుకు మాట్లాడటం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీని ప్రశ్నించింది. స్విస్‌లో ఖాతాలు కలిగి నల్లధనం దాచుకుంటున్న వారి పేర్లను బయటపెట్టాలని కాంగ్రెస్ అధికారప్రతినిధి గౌరవ్ వల్లభ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అంతేగాక విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును తెచ్చేందుకు మోదీ తీసుకున్న చర్యలేమిటో వివరించాలని, దానిపై ప్రభుత్వం ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. 2020లో స్విస్ బ్యాంకులో భారతీయులు దాచుకున్న నల్ల ధనం విలువ ఏకంగా 286 శాతం పెరిగి రూ. 20,700 కోట్లకు చేరుకుంది. గత 13 ఏళ్లలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీని టార్గెట్ చేసింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా దీనిపై స్పందిస్తూ.. ‘మోదీజీ దయ చేసి సమాధానం ఇవ్వండి. నల్ల ధనాన్ని మూడేళ్లలో తీసుకొస్తానన్న మీ వాగ్దానం ఏమైంది. ఇప్పటికే మీరు అధికారంలోకి వచ్చి ఏడేళ్లయింది. మీ స్నేహితుల డబ్బును తీసుకొచ్చేందుకు మీకు శక్తి లేదా ?’అని ట్వీట్‌చేశారు. ఓ వైపు కరోనా కారణంగా పేదలు మరింత పేదలవుతుంటే, స్విస్ బ్యాంకులో రికార్డులు బద్దలు చేస్తూ నల్లధనం పోగవుతోందని కాంగ్రెస్ విమర్శించింది. దీనిపై మోదీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, స్విస్ బ్యాంకు ఖాతాదారుల పేర్లు బయటపెట్టాలని డిమాండ్చేస్తోంది. -
శ్రీవారి హుండీలో బంగారు బిస్కెట్లు..
సాక్షి, తిరుమల: టీటీడీ ఆస్తులపై పూర్తి అధ్యయనం తర్వాత శ్వేత పత్రం విడుదల చేస్తామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని, ప్రస్తుతం బ్రహ్మోత్సవాలకు టెండర్లు పిలిచామని ఈవో వెల్లడించారు. వివాదాలకు తావులేకుండా పూర్తిస్థాయిలో పరిశీలన చేసిన తర్వాతే శ్వేత పత్రం విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. జూన్ 11నుంచి జూలై 10 వరకు హుండి ఆదాయం రూ.16.73 కోట్లు వచ్చిందని ఈవో తెలిపారు. భక్తులు సమర్పించిన తలనీలాల విలువ పెరగడంతో రూ.7కోట్లు అదనంగా ఆదాయం వచ్చిందని వెల్లడించారు. కాగా, తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి హుండిలో ఓ అజ్ఞాత భక్తుడు బంగారు బిస్కెట్లు విరాళంగా వేశారు. ఒక్కొక్కటి 100 గ్రాములు ఉన్న 20 బంగారు బిస్కెట్లను సమర్పించిన విషయం వెలుగు చూసింది. -
‘దేశం’ జమానాలో రాష్ట్రం దివాలా
గత తెలుగుదేశం పాలనలో రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా దివాలా తీసింది. నిధుల వినియోగంలో టీడీపీ ప్రభుత్వం భారీ అవినీతి, అక్రమాలకు పాల్పడింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బిల్లుల చెల్లింపులో ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) జోక్యం చేసుకుంది. గత ప్రభుత్వ పాలనలో ఆర్థిక రంగం పూర్తిగా క్షీణ దశకు చేరుకుంది. టీడీపీ సర్కారు కొత్త ప్రభుత్వానికి ఖాళీ ఖజానా, భారీగా అప్పుల కుప్పను మాత్రమే అప్పగించింది. గత ప్రభుత్వం వెళ్తూ వెళ్తూ ఏకంగా రూ.వేల కోట్ల బకాయిల భారాన్ని కొత్త ప్రభుత్వంపై నెట్టేసింది. రూ.లక్షల కోట్ల అప్పులను తీసుకొచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆ సొమ్ముతో ఏదైనా సాధించిందా? అంటే సమాధానం శూన్యం. ఆస్తుల కల్పన, మానవ వనరుల అభివృద్ధికి ఆ సొమ్మును ఖర్చు చేయాల్సి ఉండగా, సొంత ప్రయోజనాల కోసం దారి మళ్లించింది. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక రంగంలో చోటు చేసుకున్న వ్యవహారాలు, అవకతవకలపై కొత్త ప్రభుత్వం బుధవారం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ప్రతికూల పరిస్థితులను అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం దిశగా నడిపిస్తామని శ్వేతపత్రంలో వాగ్దానం చేసింది. అవినీతి రహిత, పారదర్శక పాలన కచ్చితంగా అందిస్తామని స్పష్టం చేసింది. దిగజారిన ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడానికి, అభివృద్ధి పరంగా నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రజలను కోరింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.. గత ప్రభుత్వం విద్యుత్ శాఖలో మే 31, 2019 నాటికి 18,375 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు పెట్టింది. అత్యంత కీలకమైన విద్యుత్ రంగాన్ని నష్టాల నుంచి గట్టించడానికి 2018–19 ఏపీఈఆర్సీ టారిఫ్ ఆర్డర్ ప్రకారం 7,983.39 కోట్ల రూపాయలు అవసరం ఉండగా కేవలం బడ్జెట్లో 2,500 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందులో ఎన్నికల ముందు సంక్షోభం నుంచి గట్టెక్కడానికి 1,250 కోట్ల రూపాయలనే విడుదల చేశారు. దీంతో విద్యుత్ రంగం నష్టాల్లో కూరుకుపోయింది. 2019 మార్చి 31 నాటికి విద్యుత్ బకాయిలు రూ.18,375 కోట్ల మేర పేరుకుపోయాయి. బకాయిలు పేరుకుపోవడంతో ఎన్టీపీసీ విద్యుత్ సరఫరా నిలిపేసే స్థితికి విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం దిగజార్చింది. ప్రతీ నెలా ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లడంతో రాష్ట్ర పరపతిని దిగజార్చింది. ఎక్కువ వడ్డీకి రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు. దీంతో వడ్డీల భారం భారీగా పెరిగిపోయింది. నిధులు వినియోగంలో భారీ అక్రమాలకు పాల్పడ్డారు. ఒక శాఖ నుంచి మరో శాఖకు అక్రమంగా నిధులు మళ్లించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్ల కోసం పౌరసరఫరాల శాఖ బ్యాంకుల నుంచి అప్పు చేసిన రూ.4,800 కోట్లను టీడీపీ సర్కారు ఎన్నికల ముందు పసుపు–కుంకుమ పథకానికి మళ్లించింది. అలాగే ఫౌరసరఫరాల సంస్ధకు సబ్సిడీ రూపేణా బడ్జెట్లో కేటాయించిన రూ.3,000 కోట్లను విడుదల చేయనందున ఈ సంస్థ ఆర్థిక స్థితి క్షీణించింది. ఎన్నికల ముందు ఖజానా నుంచి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఓట్లు కొనుగోలు కోసం పసుపు– కుంకమ పేరుతో కుమ్మరించారు. ఇలాంటి చర్యలతో వివిధ రంగాలను ఆర్థికంగా దెబ్బతీశారు. ట్రెజరీ కంట్రోల్‌ను ఒక ప్రైవేట్ చేతికి అప్పగించారు. పీఏవో, వర్క్స్ అండ్ అకౌంట్స్‌కు సంబంధం లేకుండా బిల్లుల చెల్లింపు జరిగింది. బిల్లుల చెల్లింపులో ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవడం, ఏ బిల్లు చెల్లించాలో ఏ బిల్లు చెల్లించకూడదో ఆదేశాలు ఇవ్వడం కొనసాగింది. ఇది రాష్ట్ర చరిత్రతో తొలిసారి. టీడీపీ సర్కారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కోలుకోలేని స్థితికి దిగజార్చింది. అప్పుల భారాన్నీ భారీగా పెంచేశారు. 2014లో రూ.1.48 లక్షల కోట్లుగా ఉన్న అప్పులను రూ.2.58 లక్షల కోట్లకు పెంచేశారు. దీనికి అదనంగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల పేరుతో గ్యారెంటీలు ఇవ్వడం ద్వారా మరో రూ. 57 వేల కోట్ల అప్పుల భారం మోపారు. చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు కాకుండా రెవెన్యూ రంగాలకు వెచ్చించడంతో ఎటువంటి అభివృద్ధీ జరగకపోగా అప్పుల భారం రెండింతలైంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల వాటా 22.22 శాతం నుంచి 28.18 శాతానికి పెరిగింది. గత సర్కారు ఇష్టానుసారం చేసిన అప్పులతో పుట్టే ప్రతీ పిల్లాడితో సహా ప్రతి ఒక్కరిపై రూ.42,500 అప్పు ఉంది. అలాగే స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీ), ఇతర కంపెనీల పేరు మీద చేసిన రుణాలను తీసుకుంటే ప్రతీ ఒక్కరిపై అప్పు ఒక లక్ష రూపాయలు దాటుతుంది. అంటే జీవితాంతం ప్రతీ ఏటా వడ్డీ రూపంలో పది వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అప్పుల గుప్పిట్లో వ్యవసాయ కుటుంబాలు గత ప్రభుత్వం ఎన్నికల్లో మొత్తం వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చింది. దాని ప్రకారం చూస్తే మార్చి 31, 2014 నాటికి రూ. 87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేయాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వం అనేక నిబంధనలు, షరతులు విధించి కేవలం రూ. 24 వేల కోట్ల రూపాయలు మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించింది. కానీ ఈ మొత్తంలో ఇంకా రూ. 8,500 కోట్లు రైతులకు చెల్లించలేదు. 2016–17 నాబార్డుకు చెందిన జాతీయ గ్రామీణ ఆర్థిక సమ్మిళత సర్వే ప్రకారం వ్యవసాయ కుటుంబాల అప్పులు దేశ సగటుతో పోల్చితే రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయని తేలింది. జాతీయ సగటు వ్యవసాయ కుటుంబాల అప్పులు 47 శాతం ఉంటే రాష్ట్రంలో మాత్రం 77 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల్లో ఉన్నట్లు తేలింది. దీన్ని బట్టి చూస్తే గత ప్రభుత్వం వ్యవసాయ రుణ మాఫీని ఎంత అపహాస్యం చేసిందో అర్థం అవుతుంది. రైతులను రుణ భారం నుంచి బయట వేయకుండా మరింత రుణాల ఊబిలోకి నెట్టేసినట్లు స్పష్టం అవుతోంది. 10.32 శాతం వడ్డీ రేటా? గత టీడీపీ సర్కారు నూతన రాజధాని నిర్మాణానికి రూ.2 లక్షల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసింది. అయితే గడిచిన ఐదేళ్లలో కేవలం స్పల్ప మొత్తాన్ని వ్యయం చేశారు. ఇదే సమయంలో బహిరంగ మార్కెట్లో అధిక వడ్డీ రేటుకు రుణాలను సేకరించారు. ప్రభుత్వ డిపాజిట్లపై 7 శాతం కన్నా తక్కువ వడ్డీ రేటు ఉంటే సీఆర్డీఏ ఏకంగా 10.32 శాతం వడ్డీ రేటుకు బాండ్ల ద్వారా నిధులను సేకరించింది. దీనికి ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినప్పటికీ స్పందన మాత్రం నామమాత్రంగానే వచ్చింది. గత ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు విశ్వాసం లేదనడానికి ఇదొక నిదర్శనం. బడ్జెట్లో పరిమితికి మించి రుణాలు (రూ.60 వేల కోట్లు) కన్పిస్తున్నాయి. టీడీపీ పాలనలో ప్రజారోగ్యం నిర్వీర్యం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడడంతో పాటు పేదరికం గణనీయంగా తగ్గింది. 2010 నాటికి రాష్ట్రంలో పేదరికం రికార్డు స్థాయిలో 9.2 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో పేదరికం జాతీయ స్థాయిలో 21.92 శాతంగా ఉంది. ఈ ప్రయోజనాలను గత ఐదేళ్ల పాలనలో ధ్వసం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలతో ఇప్పుడు ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రధానంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ క్షీణించడం, గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరిగిపోవడం, కనీసం సౌకర్యాలు లేకుండా మురికివాడలు భారీగా పెరగడం, గ్రామీణ, పట్టణాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం విద్య వ్యవస్థను నిర్వీర్యం చేయడం, ప్రజా ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేయడం, సచివాలయం నుంచి గ్రామ స్థాయి వరకు ఉన్న ప్రభుత్వ విభాగాలను బలహీన పర్చడం జరిగాయి. వీటి అన్నింటినీ తిరిగి గాడిన పెట్టడమే ఇప్పటి ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. అలాగే మానవ సూచికల్లో రాష్ట్ర ర్యాంకు దిగువ స్థాయిలో ఉంది. ప్రధానంగా మహిళా అక్షరాస్యత, మాతా శిశు మరణాలు ఆందోళనకర స్థాయికి చేరాయి. పౌష్టికాహార లోపాలు అధికంగా ఉన్నాయి. ఇవన్నీ మానవ సూచిక ర్యాంకును దిగజార్చాయి. సహజ వనరులతో పాటు యువత తగినంత ఉన్నందున వారికి తగిన శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. ప్రతీ సవాల్‌ను అవకాశంగా తీసుకుంటూ రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి దిశగా నడిపించడానికి పక్కా ప్రణాళికతో కొత్త ప్రభుత్వం వెళ్తోంది. ఇందుకోసం నూతనమైన అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి చర్యలు చేపడుతున్నారు. అప్పుడే పుట్టిన పిల్లవాడి నుంచి వృద్ధుడి వరకు, పేదవాడి నుంచి ధనికుడి వరకు, ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ, మైనారిటీతో పాటు ఇతర కులాలందరికీ నమ్మకం కలిగే విధంగా కొత్త వ్యవస్థ రూపొందుతోంది. ఈ వ్యవస్థలో ప్రతీ ఒక్కరు తమకు రావాల్సిన అవకాశాలను పొందుతున్నామనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని పొందుతారు. స్వల్ప కాలంలోనే ప్రజల ఆకాంక్షలు ఆశలను నెరవేర్చే దిశగానే కొత్త ప్రభుత్వం అడుగులు వేసింది. వ్యవసాయం తిరోగమనం గత ఐదేళ్లు వ్యవసాయంలో రెండంకెల అభివృద్ధి సాధిస్తున్నామనే ప్రచారం డొల్లతనమేనని తేలింది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి హయాంలో (2004–2009) వ్యవసాయరంగం 5.70 శాతం వృద్ధిని నమోదు చేస్తే గత ఐదేళ్ల కాలంలో వ్యవసాయం రంగ వృద్ది 4.12 శాతం క్షీణించింది. ఇంత కాలం ఎటువంటి ప్రాతిపదిక లేని పశు సంవర్థక, మత్స్య సంపద అధిక వృద్ధిని చూపించడం ద్వారా మొత్తం వ్యవసాయ రంగం అభివృద్ధి చెందినట్లు ప్రచారం చేశారు. ఐదేళ్లలో పశుసంవర్దక శాఖలో 14.26 శాతం, మత్స్య సంపదలో 29.38 శాతం వృద్ది నమోదైంది. ఈ రెండు రంగాల వృద్ధిని కలిపేసి వ్యవసాయంలో రెండంకెల వృద్ధి రేటు నమోదైనట్లు చూపిస్తూ మోసం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004–09 మధ్యకాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి అత్యధికంగా 9.56 శాతం నమోదు చేసింది. విభజన తర్వాత ఏపీలో 2014–19 మధ్య కాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 10.36 శాతం ఉన్నప్పటికీ 2011–12లో అనేక విమర్శలకు గురైన జీడీపీ ఫార్ములా బేస్ రేటును పెంచడం వల్లే ఈ వృద్ధి కనిపిస్తోంది. పాత బేస్ రేటు పరిగణనలోకి తీసుకుంటే దివంగత నేత వైఎస్ఆర్ హయాంలోనే అధిక వృద్ధి రేటు నమోదైనట్లుగా గమనించవచ్చు. పడిపోయిన పారిశ్రామిక వృద్ధి రాష్ట్ర అభివృద్ధికి కొలమానంగా భావించే రాష్ట్ర స్థూల విలువ వృద్ధి రేటు నామమాత్రంగానే ఉంది. 2014–17 మధ్యకాలంలో రాష్ట్ర స్థూల విలువ కేవలం ఐదు శాతం నమోదు చేయడం ద్వారా దేశంలో 16 పెద్ద రాష్ట్రాల్లో 13వ స్థానంలో నిలిచింది. ఇదే సమయంలో జాతీయ స్థూల విలువ వృద్ధి రేటు 7.1 శాతంగా ఉంటే గుజరాత్లో అత్యధికంగా 11.6 శాతం నమోదైంది. రాష్ట్ర స్థూల విలువలో తయారీ రంగం వాటా 2012లో 14.5 శాతంగా ఉంటే 2017 నాటికి 10.2 శాతానికి పడిపోయింది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి హయాంలో సెజ్‌లు, పారిశ్రామిక క్లస్టర్లు, కోస్టల్ జోన్స్ పేరుతో సాధించిన పారిశ్రామిక అభివృద్దిని గత ప్రభుత్వం ధ్వసం చేసింది. భారీగా పెరిగిన ధరలు గత ఐదేళ్ల పాలనలో పెరిగిన ధరలు సామాన్యుడిని నడ్డివిడిచాయి. 2013–17 మధ్యకాలంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ధరలు తగ్గితే ఒక్క మన రాష్ట్రంలోనే ధరలు పెరిగాయి. వర్షాలు బాగా పడటం, అంతర్జాతీయంగా ఇంధన ధరలు తగ్గడంతో 2013–17 మధ్య కాలంలో జాతీయ ద్రవ్యోల్బణం 9 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గింది. కానీ 2014–17 మధ్య కాలంలో రాష్ట్ర సగటు ద్రవ్యోల్బణం 7.6 శాతంగా నమోదైంది. ముఖ్యంగా వినియోగదారుల ద్రవ్యోల్బణం, ఆహార ద్రవ్యోల్బణంలో ఇతర రాష్ట్రాల కన్నా మన రాష్ట్రం గరిష్ట స్థాయిలో ఉంది. తలసరి ఆదాయం వృద్ది అంతంతే రాష్ట్ర తలసరి ఆదాయంలో గత ఐదేళ్లలో వృద్ది అంతంత మాత్రంగానే ఉంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి హయాంలో కన్నా తలసరి ఆదాయం వృద్ధి గత ఐదేళ్లలో తక్కువగా ఉంది. 2004–09 మధ్య కాలంలో తలసరి ఆదాయంలో 15.08 శాతం వృద్ధి నమోదు కాగా 2014–19 మధ్యకాలంలో 14.96 శాతమే నమోదైంది. ఇంతే కాకుండా గత ఐదేళ్లలో రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లోనే తలసరి ఆదాయం భారీగా పెరగడం మిగతా జిల్లాల్లో పెరగకపోవడంతో జిల్లాల మధ్య అంతరాన్ని మరింత పెంచింది. వైఎస్ఆర్ కడప జిల్లాలో తలసరి ఆదాయం కంటే కృష్ణా జిల్లా తలసరి ఆదాయం రెట్టింపు ఉండటం దీనికి నిదర్శనం. -
అప్పుల సుస్తీ–అభివృద్ధి నాస్తి
రాష్ట్ర ఖజానా నుంచి ఇష్టానుసారం దోచేస్తూ అప్పుల ఊబిలోకి నెట్టేసిన ముఖ్యమంత్రి ఎన్నికల ముందు అవాస్తవాలతో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అప్పులను ఆస్తుల కల్పనకు కాకుండా రెవెన్యూ, దుబారాకు, ప్రచార ఆర్భాటాలకు, ఈవెంట్లకు పెద్దఎత్తున వ్యయం చేశారు. ప్రాజెక్టుల పాత అంచనాలను పెంచేసి ఎస్కలేషన్ పేరుతో కాంట్రాక్టర్లకు చెల్లిస్తూ ప్రభుత్వ పెద్దలు భారీ ఎత్తున కమీషన్లు పొందుతున్నారు. నీరు–చెట్టు పనులన్నీ నామినేషన్‌పై అధికార పార్టీ నేతలకు పంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాప్టులను చెల్లించనందున నాలుగేళ్లలో రూ.124.31 కోట్ల మేర వడ్డీని చెల్లించాల్సిన పరిస్థితి తీసుకువచ్చింది. కాగా, రాష్ట్ర ఖజానాను సొంత ఖజానాగా సర్కారు మార్చేసిందని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ప్రజాధనానికి ధర్మకర్తగా ఉంటూ ప్రతీ పైసాకు జవాబుదారీగా పాలన అందించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. నాలుగేళ్లలో అప్పుల్లో భారీ వృద్ధిని చంద్రబాబు సాధించారు. ఆర్థిక వ్యవస్థను, రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తూ మరో పక్క రాష్ట్ర ఖజానా నుంచి దోచేస్తూ సొంత జేబులు నింపుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని అధికార యంత్రాంగమే కోడై కూస్తోంది. గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర ఖజానా నుంచి ఇష్టానుసారం దోచేస్తూ అప్పుల ఊబిలోకి నెట్టేసిన ముఖ్యమంత్రి ఎన్నికల ముందు అవాస్తవాలతో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. తాత్కాలిక నిర్మాణాలు, ఐటీ పేరుతో భారీగా అనుత్పాదక వ్యయాన్ని చేశారు. అంతేకాకుండా చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు కాకుండా రెవెన్యూ, దుబారాకు, ప్రచార ఆర్భాటాలకు, ఈవెంట్లకు పెద్దఎత్తున వ్యయం చేశారు. దీంతో రాష్ట్ర అప్పులు ప్రమాదకర స్థాయికి చేరిపోయాయి. నాలుగేళ్లలో ఏకంగా 1,63,670 లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేశారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు, రాష్ట్ర ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం మేరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 25.9 శాతానికి మించరాదు. అయితే ముఖ్యమంత్రి అస్థవ్యస్థ ఆర్థిక నిర్వహణ కారణంగా, స్థోమతకు మించి అప్పులు చేయడంతో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు ఏకంగా 32.03 శాతానికి చేరాయి. రాష్ట్ర విభజన నాటికి 13 జిల్లాలకు కలిపి ఏపీ అప్పు 96 వేల కోట్ల రూపాయలు ఉండగా ఇప్పుడు 2017–18 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి అకౌంటెంట్ జనరల్ గణాంకాల మేరకే 2,59,670 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. వివిధ కార్పొరేషన్ల పేరుతో భారీఎత్తున అంటే ఏకంగా 71,815 కోట్ల రూపాయల మేర వాణిజ్య బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి అప్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించేస్తూ ఆ అప్పులకు గ్యారెంటీ కూడా ఇచ్చేసింది. ఇందులో ఇప్పటికే ఏకంగా 35,768 కోట్ల రూపాయలను అప్పులు చేశారు. ఈ విధంగా చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు కాకుండా ప్రాజెక్టుల్లో పాత అంచనాలను పెంచేసి ఎస్కలేషన్ పేరుతో కాంట్రాక్టర్లకు చెల్లిస్తూ ఆ చెల్లింపుల నుంచి ప్రభుత్వ పెద్దలు భారీ ఎత్తున కమీషన్లు పొందుతున్నారు. నీరు–చెట్టు పనులన్నీ కూడా నామినేషన్‌పై అధికార పార్టీ నేతలకు పంచేశారు. ఇప్పటివరకు ఏకంగా 16 వేల కోట్ల రూపాయల పనులు పంచేశారు. ఈ పనులకు సంబంధించిన బిల్లులను అప్పులు చేసి చెల్లింపచేస్తున్నారు. ఇన్ని కోట్లు వ్యయం చేసినప్పటికీ రాష్ట్రంలో సగం జిల్లాలు కరువుతో అల్లాడుతుండటంతో రైతులకు ఎటువంటి ప్రయోజనం కలగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రభుత్వం నిత్యం వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాప్టులతోనే కొనసాగేది. ఇప్పుడు గత రికార్డులను అధిగమించి మళ్లీ గత నాలుగేళ్ల నుంచి వేస్ అండ్ మీన్స్ ఓవర్ డ్రాఫ్టుల్లో రికార్డు సృష్టించింది. మన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతీ ఆర్థిక సంవత్సరంలో 1500 కోట్ల రూపాయల మేర వేస్ అండ్ మీన్స్ సౌకర్యాన్ని ఆర్బీఐ కల్పించింది. ఈ సౌకర్యాన్ని అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకుని 14 రోజుల్లోగా చెల్లిస్తే ఎటువంటి వడ్డీని చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాప్టులను సకాలంలో చెల్లించనందున గత నాలుగేళ్లలో 124.31 కోట్ల రూపాయల మేర వడ్డీని చెల్లించాల్సిన పరిస్థితి తీసుకువచ్చింది. చేబదుళ్లకు వడ్డీ చెల్లించిందంటే ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ ఎంత అస్థవ్యస్థంగా ఉందో అద్దం పడుతుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తొమ్మిదేళ్ళ పాలనలో కూడా ఏడాదిలో 365 రోజుల్లో అత్యధికంగా 230 రోజులు చేబదుళ్లలోనే నడిపిన చరిత్ర ఉంది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ, ద్రవ్య లోటులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వృద్ధి సాధించడం గమనార్హం. 2017–18 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల్లో రెవెన్యూ లోటు –415.80 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించగా ఆర్థిక సంవత్సరం ముగిసిన తరువాత రెవెన్యూ లోటు –16,772.83 కోట్ల రూపాయలకు వెళ్లింది. అలాగే బడ్జెట్ అంచనాల్లో ద్రవ్య లోటు –23,054.44 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించగా ఆర్థిక సంవత్సరం ముగిసిన తరువాత ద్రవ్య లోటు –33,591.92 కోట్ల రూపాయలుగా తేలింది. ద్రవ్య, రెవెన్యూ లోటులు ద్రవ్య జవాబు దారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) నిబంధనలకు మించి ఉండటం గమనార్హం. ‘మళ్లీ ఎలాగూ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకుందాం’ అనే రీతిలో చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తోందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వచ్చే ప్రభుత్వానికి ఆర్థి కంగా వెసులుబాటు లేకుండా చేసే విధంగా చంద్రబాబు సర్కారు అప్పులు చేస్తోందని, ఇందుకు ఉదాహరణ ఇప్పటికే బడ్జెట్ పరిమితికి మించి అప్పులు చేసిన సర్కారు ఇప్పుడు మరీ బరితెగించి వివిధ కార్పొరేషన్ల పేరుతో బడ్జెట్ బయట ఏకంగా 71,815 వేల కోట్ల రూపాయలు అప్పు చేయడమేనని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. బడ్జెట్ బయట కార్పొరేషన్ల పేరు మీద అప్పులు చేయడానికి సర్కారు గ్యారెంటీ ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ గత ఆర్థిక సంవత్సరంలో సొంత ఆదాయంలో 90 శాతం మేర అప్పులకు గ్యారెంటీ ఇవ్వవచ్చునని, అయితే ఇప్పుడు ఆ పరిమితి కూడా పూర్తి అయ్యేలాగ బడ్జెట్ బయట అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చేసింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో గ్యారెంటీ పరిమితి కూడా మించిపోవడంతో ఇటీవల మున్సిపల్ ఆస్తులు తాకట్టు పెట్టి బడ్జెట్ బయట వాణిజ్య బ్యాంకుల నుంచి 11,340 కోట్ల రూపాయల అప్పునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్యారెంటీ పరిమితి మించిపోవడంతో కేవలం 3,000 కోట్ల రూపాయల అప్పునకే సర్కారు గ్యారెంటీ ఇస్తూ మిగతా మొత్తానికి తదుపరి ఆర్థిక సంవత్సరాల్లో గ్యారెంటీ ఇస్తామని ప్రభుత్వం జారీచేసిన జీవోలోనే స్పష్టం చేసిందంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎంత వరకు చంద్రబాబు సర్కారు దిగజార్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో సీఆర్డీఏకు వాణిజ్య బ్యాంకులు, బాండ్లు ద్వారా 14,275 కోట్ల రూపాయలు అప్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. అలాగే సాగునీటి ప్రాజెక్టులను తాకట్టు పెట్టి 30 వేల కోట్ల రూపాయలు అప్పు చేయాలని నిర్ణయించి ఇప్పటికే ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు. గత నాలుగేళ్లలో ఆస్తుల కల్పన వ్యయానికి కేవలం 49,367 కోట్ల రూపాయలు వ్యయం చేసినట్లు ఇటీవల 15వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికలోనే స్పష్టం చేసింది. అంటే గత నాలుగేళ్లలో 1,63,670 లక్షల కోట్ల రూపాయలు అప్పుచేస్తే ఆస్తుల కల్పనకు 49,367 కోట్ల రూపాయలే వ్యయం చేసినట్లు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే పేర్కొన్నందున మిగతా అప్పుల మొత్తం 1,14,303 లక్షల కోట్ల రూపాయలు అనుత్పాదక రంగాలకు వ్యయం చేసినట్లు స్పష్టం అయింది. ఆస్తుల కల్పనకు చేసిన వ్యయంలో నీరు–చెట్టు, ఎస్కలేషన్ తాత్కాలిక సచివాలయం, జల్సాలు, ఈవెంట్లు, దుబారాల కోసం మొత్తం 27,101 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. ఇందులో పెద్ద మొత్తంలో ప్రభుత్వ పెద్దలు భారీగా ఆర్థిక ప్రయోజనాలు పొందారని స్పష్టం అవుతోంది. ఖజానా నుంచే దోపిడీకి పాల్పడటంలో ఈ సర్కారు అందెవేసిన చేయిగా మారిపోయిందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. కాంట్రాక్టర్లకు జీవో 22 ప్రకారం అంచనాలను పెంచేసి ఎస్కలేషన్ పేరుతో ఏకంగా 9,100 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించింది. దీనివల్ల అదనంగా ఎటువంటి ఆస్తి సమకూరకపోగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల జేబులు మాత్రం కమీషన్ల రూపంలో నిండాయనేది జగమెరిగిన సత్యం అని అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఆస్తుల కల్పనకు చేసిన వ్యయంలో ఇప్పటివరకు ఒక్క శాశ్వత ఆస్తిని కూడా కల్పించకపోగా తాత్కాలిక సచివాలయం పేరుతో 1,000 కోట్ల రూపాయలను వ్యయం చేసింది. అలాగే ఈవెంట్లు, ముఖ్యమంత్రి భవనాలు మరమ్మతులు, లగ్జరీ జల్సాల కోసం గత నాలుగేళ్లలో ఏకంగా 2,615 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. ఈ సొమ్ము వ్యయాన్ని నివారించదగినదని, అయితే ఒక పక్క ప్రజల నుంచి విరాళాలను సేకరిస్తూ మరో పక్క పెద్దఎత్తున జల్సాలకు వ్యయం చేయడాన్ని అధికార వర్గాలు తప్పుపడుతున్నాయి. మరో పక్క ఐటీ పేరుతో ఎటువంటి ఆస్తులు ఒనగూరని రంగానికి భారీగా వ్యయం చేస్తున్నారని ఆర్థిక శాఖ వర్గాలు తప్పుపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులను కాదని ప్రైవేట్ సంస్థలు చేయాల్సిన పనులకు రాష్ట్ర ఖజానా నుంచి నిధులను వెచ్చిస్తున్నారని, ఇందులో భారీ దోపిడీ జరుగుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర ఖజానాను సొంత ఖజానాగా సర్కారు మార్చేసిందని, లెక్కాపత్రం లేకుండా వ్యవహరిస్తోందని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇంత అప్పు చేసిన రాష్ట్ర సర్కారు కేవలం తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక పట్టిసీమ తప్ప ఎటువంటి శాశ్వత ఆస్తులను కల్పించలేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంత అప్పులు చేసినా శాశ్వత ఆస్తి కల్పించకపోయినా కేంద్రం నుంచి గత నాలుగేళ్లలో రాష్ట్రానికి నిబంధనల మేరకు పన్నుల వాటా రూపంలో రావాల్సిన నిధులు 88,214 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇదే కాకుండా వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలు, రెవెన్యూ లోటు రూపంలో కేంద్రం నుంచి గత నాలుగేళ్లలో గ్రాంటు రూపంలో 84,245 కోట్ల రూపాయలు వచ్చినట్లు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘానికి సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. అంటే కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో, గ్రాంటు రూపంలో నాలుగేళ్లలో 1,72,428 కోట్ల రూపాయలు వచ్చినట్లు స్పష్టమైంది. కేంద్రం గ్రాంటు రూపంలో పేదల ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చిన నిధులను కూడా వెచ్చించకుండా ఇతర అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది. అంతే కాకుండా పట్టణ పేదలకు సబ్సిడీపై మూడు లక్షల రూపాయల వ్యయంతో ఇంటి నిర్మాణం చేయాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు లక్షల రూపాయలు పేదవాడి పేరు మీద అప్పు చేయిస్తోంది. అలాగే రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు కేంద్రం ఇచ్చిన 1500 కోట్ల రూపాయల నిధులను శాశ్వత భవనాలకు కాకుండా తాత్కాలిక భవనాలకు వెచ్చించారు. అంతే కాకుండా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందుకు వెచ్చించడం లేదు. దీనికి అదనంగా రాష్ట్ర సొంత, పన్నేతర ఆదాయం ఎలాగా ఉంది. ఉద్యోగుల జీత భత్యాలు, ఇతర నిర్వహణ వ్యయం పోగా మిగతా మొత్తాన్ని ఆస్తుల కల్పనకు వెచ్చించకుండా దుబారాకు, కమీషన్లు వచ్చే రంగాలకు వెచ్చిస్తున్న విషయం తేటతెల్లం అవుతోంది. మరో పక్క రెవెన్యూ వ్యయం ఏటేటా భారీగా పెరిగిపోతోంది. -సి. మాణిక్యాలరావు, సాక్షి ప్రతినిధి -
ప్రచారం మిన్న... ప్రగతి నిండుసున్నా
కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించకపోయినా వ్యక్తిగతంగా తనకున్న పేరును చూసి లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వస్తున్నాయంటూ తొమ్మిదవ శ్వేతపత్రం విడుదల సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. మరి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తుంటే గత మూడేళ్లుగా రాష్ట్ర పారిశ్రామిక రంగం ఎందుకు నేల చూపులు చూస్తోందో సీఎం మాత్రమే సమాధానం చెప్పగలరు. ఒక పక్క రాష్ట్రంలో పారిశ్రామిక రంగం ముఖ్యంగా తయారీ రంగం వృద్ధిరేటు భారీగా క్షీణించినట్లు శ్వేతపత్రంలో విడుదల చేసిన గణాంకాలే స్పష్టం చేస్తున్నా ఆ విషయాలను పేర్కొనకుండా పెట్టుబడులు వచ్చేశాయని నోటితో చెపుతూ కాగితాల్లో మాత్రం ‘కమిటెడ్’ ఇన్వెస్ట్మెంట్ అని పేర్కొనడం గమనార్హం. గడిచిన మూడేళ్లుగా రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి ముఖ్యంగా తయారీ రంగం వృద్ధిరేటు గణనీయంగా పడిపోయిందంటూ శ్వేత పత్రంలోని గణాంకాలు స్పష్టం చేస్తున్నా.. పారిశ్రామిక రంగం దేశం కంటే వేగంగా దూసుకుపోతోందంటూ ఎటువంటి బెరుకు లేకుండా అబద్ధాలు, అవాస్తవాలు చెప్పడం ముఖ్యమంత్రి చంద్రబాబుకి మాత్రమే దక్కుతుంది. నాలుగేళ్లు కేంద్రంలో అధికారం పంచు కున్నా ఒక్క భారీ ప్రాజెక్టునూ తీసుకురాకపోగా, ప్రారంభమైన ఎన్టీపీసీ–భెల్ ప్రాజెక్టు కూడా అటకెక్కింది. రాష్ట్ర పారిశ్రామిక వృద్ధిలో కీలకపాత్ర పోషించే బందరు, భావనపాడు పోర్టులకు టెండర్లు పూర్తయినా భూసేకరణ పూర్తి చేయలేకపోవడంతో ప్రాజె క్టులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. భాగ స్వామ్య సదస్సుల్లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, పెట్టుబ డుల ఆకర్షణ పేరుతో విదేశీ పర్యటనలలో చంద్రబాబు మునిగితే లినా, ఈ నాలుగున్నరేళ్లుగా ఎలాంటి భారీ ప్రాజెక్టులనూ ఆకర్షించ లేకపోయారు. ఒకపక్క లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చామంటూనే అంతకు రెండింతలమంది నిరుద్యోగులున్నారంటూ కళ్ళార్పకుండా అబ ద్ధాలను వల్లెవేస్తున్నారు. వెలుగులు ఎక్కడ? రాష్ట్రానికి లక్షల కోట్ట పెట్టుబడులు వస్తున్నాయని, కేంద్రం సహక రించకపోయినా వ్యక్తిగతంగా నాకున్న పేరును చూసి ఈ పెట్టుబ డులు తరలి వసున్నాయంటూ తొమ్మిదవ శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రూ.1.77 లక్షల కోట్ల భారీ, మెగా ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, అలాగే రూ.5.27 లక్షల కోట్ల పెట్టుబడుల పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. మరి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తుంటే గత మూడేళ్లుగా రాష్ట్ర పారిశ్రామిక రంగం ఎందుకు నేల చూపులు చూస్తోందో సీఎం మాత్రమే సమాధానం చెప్పగలరు. ఒక పక్క రాష్ట్రంలో పారిశ్రామిక రంగం ముఖ్యంగా తయారీ రంగం వృద్ధి రేటు భారీగా క్షీణించినట్లు శ్వేతపత్రంలో విడుదల చేసిన గణాంకాలే స్పష్టం చేస్తున్నా ఆ విషయాలను పేర్కొనకుండా పెట్టుబడులు వచ్చే శాయని నోటితో చెపుతూ కాగితాల్లో మాత్రం ‘కమిటెడ్’ ఇన్వెస్ట్ మెంట్ అని పేర్కొనడం గమనార్హం. 2015–16లో 9.61 శాతంగా ఉన్న తయారీ రంగ వృద్ధిరేటు 8.49 శాతానికి క్షీణించింది. ఇదే సమ యంలో తయారీ రంగ వృద్ధిరేటు 13.89 శాతం నుంచి 8.36 శాతానికి పడిపోయింది. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి ఏకంగా రూ.2.51 లక్షల కోట్ల విలువైన 810 మెగా, భారీ పరిశ్రమలు నిజంగా ఉత్పత్తి ప్రారంభిస్తే వృద్ధిరేటు రెట్టింపు కావాలే కాని ఎలా క్షీణించిందో అర్థం కాదు. ఏది నిజం? ఉద్యోగాల కల్పన విషయంలో కూడా ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాల్లో పరస్పర విరుద్ధమైన గణాంకాలను పేర్కొన్నారు. ఈ నాలుగేళ్లలో 7.7 లక్షల మందికి ఉపాధి కల్పించినట్లు సీఎం ఒకపక్క డబ్బాలు కొడుతూనే మరో పక్క అంతకు రెండింతల మంది నిరు ద్యోగ భృతికోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు చెపుతున్నారు. ప్రాధి కారిక సర్వే ప్రకారం రాష్ట్రంలో 12 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటించారు. ఇప్పుడు ఇందులో సీఎం చెప్పిన విధంగా 7.7 లక్షల మందికి ఉపాధి కల్పించినట్లయితే నిరుద్యోగుల సంఖ్య 4.3 లక్షలకు మించకూడదు. కానీ మరి యువ నేస్తం పథకానికి 11.27 లక్షల మంది నిరుద్యోగులు ఎలా దరఖాస్తు చేసుకుంటారు? పైగా దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య ప్రతీనెలా పెరుగుతూనే ఉంది. పరిశ్రమల ద్వారా ఏకంగా 7.7 లక్షల మందికి ఉపాధి కల్పించినట్లయితే కొత్తగా ఇంత మంది నిరుద్యోగులు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రాధికారిక సర్వే గణాంకాలతో నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని పోల్చి చూస్తే ఈ నాలు గేళ్లలో 73,000 మందికి లోపే ఉద్యోగాలు లభించినట్లు అర్ధమవు తోంది. అలాంటప్పుడు 7.7 లక్షల మందికి ఎలా ఉద్యోగాలు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఇచ్చారో ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలి. కాగా, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. రాష్ట్రంలో నిరు ద్యోగులు 65 లక్షల మంది ఉన్నారని వివిధ సర్వేలు చెపుతున్నాయి. అందరికీ నిరుద్యోగభృతి చెల్లించడానికి ఇష్టపడని సర్కారు విభిన్న నిబంధనలతో వారి సంఖ్యను 12 లక్షలకు కుదించి దానికి ప్రాధికా రిక సర్వే అని ముక్తాయింపు ఇచ్చింది. దశ దిశ మార్చే ప్రాజెక్టు ఒక్కటి వచ్చిందా? విభజన తర్వాత పారిశ్రామికంగా బాగా వెనుకబడిన ఆంధ్రప్రదే శ్ను ఆదుకోవడానికి అనేక భారీ ప్రాజెక్టులను విభజన చట్టంలో పేర్కొనడం జరిగింది. నాలుగేళ్లు కేంద్రంలో అధికారం పంచుకున్న తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర దశ దిశ మార్చే కాకినాడ పెట్రో కెమి కల్స్, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంటు వంటి ప్రాజెక్టుల్లో ఒకటి కూడా తీసుకురాలేకపోగా, రాయలసీమలో అప్పటికే ఏర్పా టైన ఎన్టీపీసీ భెల్ ప్రాజెక్టును అటకెక్కించినా మౌనంగా చూస్తు కూర్చుని ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే రాయలసీమను రత నాల సీమను చేయాలని భావించిన మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మరీ చిత్తూరు జిల్లా మన్నవరంలో ఎన్టీపీసీ–భెల్ ప్రాజెక్టును ఏర్పాటు చేయించే విధంగా ఒప్పందం చేసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత ఇచ్చిన మాట మేరకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడమే కాకుండా తొలిదశ ఉత్పత్తి ప్రారంభించడం కూడా జరిగింది. 2017లోనే ఈ ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు భాగస్వామ్య కంపెనీ ఎన్టీపీసీ ప్రకటించినా కేంద్రంలో అధికారం పంచుకుంటున్న తెలుగుదేశం ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకుండా మౌనంగా ఉంది. అదే విధంగా కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ముడి ఇనుము లభ్యత గురించి కేంద్రం స్పష్టమైన వివరాలను అడుగుతున్నా ఇవ్వకుండా ఇప్పుడు కేంద్రం నిర్మించడం లేదు కాబట్టి తానే స్వయంగా నిర్మిస్తు న్నట్లు ఎన్నికల ముందు శంకుస్థాపనలతో హడావుడి చేస్తున్నారు. దక్షిణ కోస్తాను వాణిజ్య రాజధానిగా చేసే దుగరాజపట్నం పోర్టు విషయంలో కూడా ఇలాగే జరిగింది. కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల దుగరాజపట్నంలో పోర్టు నిర్మాణం సాధ్యం కాదని, దీనికి ప్రత్యామ్నాయంగా మరోచోటు చూపిస్తే ఏర్పాటుచేస్తామని కేంద్రం చెపుతున్నా రాష్ట్రప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంది. ఈ విషయంలో కూడా రాజకీయం చేస్తూ దుగరాజ పట్నం బదులు రామాయపట్నంలో మైనర్ పోర్టును తామే కడుతున్నామంటూ ప్రభుత్వం ప్రకటన చేసింది. దీనిపై కూడా కేంద్రం దిగివచ్చి రామాయపట్నంలో ప్రతిపాదిత మైనర్ పోర్టు స్థానే తామే మేజర్ పోర్టును నిర్మిస్తామంటూ ప్రతిపాదన పంపింది. అయినా రాష్ట్రం స్పందించకుండా ఈ వారంలో శంకుస్థాపన చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. కాకినాడ–వైజాగ్ పెట్రోకెమిల్స్ కారిడార్ విష యంలోనూ ఇదే జరిగింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో మాదిరే వయబులిటీ గ్యాప్ ఫండ్‌ను (వీజీఎఫ్) సమ కూరిస్తే తక్షణం ప్రారంభిస్తామని ఓన్జీసీతో సహా ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. ఈ వీజీఎఫ్‌ను ఇచ్చేది లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం కూర్చుంది. కానీ ఇదే సమయంలో ఎన్ని కల ముందు ప్రైవేటు సంస్థ హల్దియాకు వీజీఎఫ్ కింద ఇచ్చే మొత్తం కంటే రెట్టింపు రాయితీలు ఇస్తూ ఒప్పందం కుదుర్చుకుంది. అయిన వారికి ఆకుల్లో... 974కి.మీ సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో ఓడరేవులు పారిశ్రామిక రంగంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఈ అంశాన్ని గుర్తించిన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కృష్ణపట్నం ఓడ రేవు, గంగవరం పోర్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభించడమే కాకుండా బందరు పోర్టుకు శంకుస్థాపన కూడా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత గడిచిన నాలుగున్నర ఏళ్లలో ఒక్క ఓడరేవు పనులను కూడా ప్రారంభించలేకపోయారు. కనీసం రాష్ట్ర రాజ ధానికి అత్యంత సమీపంలో ఉన్న కీలకమైన బందరు పోర్టుకు ఇప్పటి వరకు భూ సేకరణ పూర్తి చేయలేకపోయారు. ఎన్నికల వేల ఇప్పుడు భూ సేకరణ పూర్తి చేసి శంకుస్థాపన చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు ఓడరేవు టెండర్లు ఆదాని గ్రూపు దక్కించు కుని రెండేళ్లు అయినా ఇప్పటి వరకు భూ సేకరణ పూర్తి చేయకపోవడంతో పనులు మొదలు కాలేదు. అలాగే హీరో గ్రూపు భారీ ద్విచక్ర వాహన తయారీ కేంద్రం ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే హైకోర్టు వివాదాల్లో ఉన్న భూమిని కేటా యించడంతో సంస్థ పనులు ప్రారంభించ లేకపోయింది. చివరకు హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తే అప్పటి వరకు చేసిన పెట్టుబడిని అణా పైసలతో సహా తిరిగి చెల్లిస్తామంటూ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేయాల్సి వచ్చింది. విశాఖకు సమీపంలో భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ విషయంలోనూ అదే జరిగింది. ఎయిర్‌పోర్టు టెండర్లను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్‌పోర్టు అథార్టీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) రాష్ట్ర ప్రభుత్వానికి అధిక రెవెన్యూ వాటాను ఆఫర్ చేయడం ద్వారా దక్కించుకోవడంతో ఏకంగా టెండర్లనే బాబు ప్రభుత్వం తర్వాత రద్దు చేసింది. అంతే కాదు తిరిగి పిలిచే టెండర్లలో ఏఏఐ పాల్గొనే అవకాశం లేకుండా నిబంధనలను మార్చి మరీ టెండ ర్లను పిలిచింది. ఇలా కీలకమైన ప్రాజెక్టులు ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్ల ఆలస్యం అయిపోతున్నాయి. కానీ ఇదే సమయంలో అయిన వారికి చెందిన ప్రాజెక్టులకు భూసేకరణ దగ్గర నుంచి అనుమతుల వరకు వేగంగా పనులు జరిగిపోతున్నాయి. తిరు పతిలో ఏర్పాటు అయిన ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పార్కు, కియా మోటార్స్, విజయవాడలోని హెచ్‌సీఎల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ప్రచార పాలసీలు– బూటకపు ఒప్పందాలు గడిచిన నాలుగున్నర ఏళ్లుగా పారిశ్రామిక పాలసీలు, భాగస్వామ్య సదస్సులు, విదేశీ పర్యటనలు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రియాల్టీ షోలను నిర్వహిస్తూనే ఉంది. ఈ నాలుగున్నర ఏళ్లలో పెట్టుబడు లను ఆకర్షించడం కోసమంటూ ఏకంగా 22కు పైగా పారిశ్రామిక పాలసీలను విడుదల చేయడం గమనార్హం. అదే విధంగా 2016, 2017, 2018 సంవత్సరాల్లో వరుసగా మూడేళ్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(సీఐఐ)తో కలిసి వైజాగ్ వేదికగా భాగస్వామ్య సదస్సులను నిర్వహించారు. ఇలా మూడు భాగస్వామ్య సదస్సుల ద్వారా మొత్తం రూ.19.6 లక్షల కోట్ల విలు వైన 1,761 ఒప్పందాలు కుదిరినట్లు గతంలో ప్రభుత్వం ప్రకటిం చింది. టీ కొట్లో పనిచేసే వారు, రాజకీయ నాయకుల కారు డ్రైవర్లకు సూటు బూటు తొడిగి వారిని పారిశ్రామిక వేత్తలుగా వేషాలు వేయించి ఒప్పందాలు చేసుకున్న వైనాన్ని గతంలో ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన వైనం తెలిసిందే. ఇప్పుడు ఈ విషయం శ్వేత పత్రం సాక్షిగా బయట పడింది. భాగస్వామ్య సదస్సులు కాకుండా రాష్ట్రంలో ఉన్న వన రులను దృష్టిలో పెట్టుకొని కొన్ని కంపెనీలు స్వతహాగానే పెట్టుబ డులు పెట్టడానికి ముందుకురాగా, మరికొన్ని ముఖ్యమంత్రి విదేశీ పర్యటనల్లో ఒప్పందాలు కుదిరాయి. ఈ నాలుగున్నర ఏళ్లలో మొత్తం 2,622 ఒప్పందాల ద్వారా రూ.15.48 లక్షల కోట్ల పెట్టుబ డులు, 32.35 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నట్లు శ్వేతపత్రంలో పేర్కొన్నారు. కానీ గత మూడు భాగస్వామ్య సద స్సుల్లోనే రూ.19.6 లక్షల కోట్ల ఒప్పందాలు వచ్చినట్లు చెప్పగా ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.15.48 లక్షలకు తగ్గించేశారు. కేంద్ర మంత్రి ఉండి కూడా.. కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతి రాజు ఉన్నప్పటికీ కొత్తగా ఒక్క ఎయిర్‌పోర్టును కూడా నిర్మించుకోలేక పోయాం. గత నాలుగేళ్లుగా జిల్లాకో ఎయిర్‌పోర్టు నిర్మిస్తామని చెప్పగా ఇప్పటి వరకు ఒక్కటి కూడా అందుబాటులోకి రాలేదు. చివరకు సొంత నియోజకవర్గం కుప్పంలో జనవరి 3న శంకుస్థాపన చేశారు. కేవలం ఒక్క కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయ పనులు మాత్రమే పూర్తి కావొచ్చాయి. నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయ టెండర్లు టర్బో మెఘాకు ఇవ్వగా ఇంకా అక్కడ భూ సేకరణ పూర్తి కాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. భోగా పురం టెండర్లు మొదటికి రావడంతో ఇది ఎప్పటికి పూర్తి అవు తుందో చెప్పలేని పరిస్థితి. అంతేకాదు విజయవాడ, తిరుపతి విమా నాశ్రయాలకు అంతర్జాతీయ హోదా వచ్చినా ఒక్క సర్వీసును కూడా ప్రారంభించలేకపోయారు. చివరకు విజయవాడ నుంచి కేవలం ఆరు నెలల కాలానికి ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగోకు రూ.18 కోట్లు ఎదురు చెల్లించి మరీ గత నెలలో సర్వీసులు ప్రారం భించారు. ఇలా అన్ని రంగాల్లో కొత్త పెట్టుబడులను ఆకర్షించలేక చతికిలబడిన ప్రభుత్వం శ్వేతపత్రాల్లో మాత్రం రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేస్తున్నాయని, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యే లేదన్నట్లు చెబుతుండటం చంద్రబాబు అబద్ధాలకు నిదర్శనం. -చంద్రశేఖర్ మైలవరపు, సాక్షి ప్రతినిధి -
సత్యంపై ‘శ్వేత’వస్త్రం!
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విడుదల చేసిన శ్వేతపత్రాలు వాస్తవాలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఎదుటివారిపై నిందలు, తన పాలనపై స్వోత్కర్షలతో సొంత డబ్బా కొట్టుకున్నారు. అవి శ్వేతపత్రాలు కాదు, నల్ల పత్రాలు. ఆంధ్రప్రదేశ్ విభజనచట్టంలో పొందుపరచిన అంశాలన్నింటినీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. 14వ ఆర్థ్ధిక సంఘం సిఫారసుల మేరకు అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధులు కేటాయించారు. పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచారు. దీనితో ఏపీకి రూ.2,06,910 కోట్లు లబ్ధి చేకూరింది. ప్రత్యేకహోదాతో ఏడాదికి వెయ్యి కోట్లు మాత్రమే వస్తాయి. కానీ దానికంటే ఎక్కువగా ప్యాకేజీ పేరుతో ఏడాదికి రూ.3 వేల కోట్లకు పైగా ఆర్థిక ప్రయోజనం రాష్ట్రానికి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రత్యేకప్యాకేజీ వద్దంటూనే ఇంత వరకు వివిధ సంస్థల ద్వారా రూ. 12 వేల కోట్లకు పైగా ప్రాజెక్టులను తీసుకుంటున్నారు. రుణమాఫీలు, పింఛన్లను కలిపి రెవెన్యూలోటు రూ. 16,078 కోట్లుగా చూపించడం తప్పనే విషయాన్ని శ్వేతపత్రంలో చెబితే బాగుండేది. కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు అంచనా లను భారీగా రూ.57,940.86 కోట్లకు పెంచేసి కేంద్రానికి పంపారు. రూ.10,069.66 కోట్లు ఖర్చు చేస్తే కేంద్రం రూ. 6,727.26 కోట్లు విడుదల చేసిం దని ఇంకా రూ. 3,342 కోట్లు రావాలని చెప్పారు. కానీ 2010–11 ధరల ప్రకారం రూ. 7,158.53 కోట్లు మాత్రమే వాస్తవంగా ఖర్చయినట్లు కేంద్రం ప్రకటించింది. మిగిలిన రూ. 431.27 కోట్లకు, రూ. 399 కోట్లు పంపింది. పెరిగిన అంచనాలకు సరైన కారణాలు కేంద్రానికి చెప్పకపోవడం వల్లే పోలవరం నిర్మాణం జాప్యం జరుగుతోందనే విషయాన్ని పత్రంలో ఎందుకు రాయలేదు. రాజధాని నిర్మాణానికి 20 వేల ఎకరాలు చాలు. కానీ ఎందుకు 54 వేల ఎకరాలు సేకరించారో చెప్పలేదు. సెక్రటేరియట్, హైకోర్టు, శాసనసభల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.1,500 కోట్లకు లెక్కాపత్రంలేదు. కనీసం శంకుస్థాపనలు చేయలేదు. డ్రైనేజీల కోసం ఇచ్చిన వెయ్యి కోట్ల గురించి ఎందుకు ప్రకటించలేదు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం రూ. 1,050 కోట్లు కేంద్రప్రభుత్వం ఇస్తే, కొన్ని పనులు పూర్తిచేశామని అంటున్నారు. వాటిని చూపించగలరా? 11 జాతీయ విద్యాసంస్థలు ఏర్పాటు చేయాల్సి ఉండగా గిరిజన వర్సిటీ తప్ప అన్నీ ఏర్పాటై అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి. ఈ సంస్థలకు స్థల సేకరణ విషయంలో మీరు చేసిన జాప్యం గురించి ఎందుకు పత్రంలో పేర్కొనలేదు. రక్షణ అవసరాల దృష్ట్యా దుగరాజపట్నం పోర్టు సాధ్యం కాకపోవడంతో దానికి ప్రత్యామ్నాయంగా మరో ప్రాంతంలో పోర్టును ఏర్పాటు చేసుకోమన్న విషయం చెప్పలేదు. కడపలో ఉక్కుకర్మాగారం ఏర్పాటుకు వేసిన మేకాన్ టాస్క్‌ఫోర్స్‌కు నెలల తరబడి అనుమతి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవçహరించారు. విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు రూ. 4,211 కోట్లు కేటాయించి, మొదటి విడతగా ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుండి రూ. 2,500 కోట్లు విడుదల చేసిన విషయాన్ని దాచి ఉంచారెందుకు? రాష్ట్రంలో జరుగుతున్న రూ.1.63 లక్షల కోట్ల విలువైన కేంద్ర ప్రభుత్వపు అభివృద్ధి పనుల గురించి మీ శ్వేతపత్రంలో ఎందుకు లేవు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు రూ.3.50 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. సాగరమాల పథకం ద్వారా మంజూరైన రూ. 68 వేల కోట్ల విలువైన 104 ప్రాజెక్టులున్నాయనే విషయాన్ని ఎందుకు చెప్పలేదు?. ఇవి కాక రూ. 3 లక్షల కోట్ల విలువ గల పథకాలు, ప్రాజెక్టులను కేంద్రం, రాష్ట్రానికి మంజూరు చేసిన విషయాన్ని మర్చిపోయారు. రాష్ట్రంలో జరిగిన 4,193 కి.మీ. జాతీయ రహదారులు అభివృద్ధి ప్రస్తావించలేదు ఎందుకని? 3,720 కి.మీ. జాతీయ రహదారుల ఏర్పాటుకు అనుమతి లభించిన విషయాన్ని ప్రజలకు చెప్పాలి కదా. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయాలను, ‘ఉడాన్’’ పథకంద్వారా రాజమండ్రి, కడప విమానాశ్రయాలను అభివృద్ధి చేసిన విషయాన్ని ఎందుకు ప్రకటించలేదు. కమిటీ నివేదిక కొత్త రైల్వే జోన్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉన్నా రాజకీయంగా అయినా నిర్ణయం తీసు కుని జోన్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం పునఃపరిశీలన చేస్తోంది. ప్రపంచ బ్యాంకు నుండి తెచ్చిన లక్షా 25 వేల కోట్లు అప్పులతో ఏ ప్రాజెక్టులు నిర్మించారో చెప్పలేదెందుకు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ప్రపంచ బ్యాంకు తమకు ప్రథమ స్థానం కట్టబెట్టిందంటున్నారే టీడీపీ హయాంలో ఎన్ని పరిశ్రమలు ఏర్పడ్డాయో చెప్పగలరా? ఇది అభివృద్ధా, తిరోగమనమా? చెప్పండి సీఎంగారు. తురగా నాగభూషణం(వ్యాసకర్త బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు) మొబైల్ : 98488 06399 -
అంకెల గారడీ... అదే సంక్షేమం!
శ్వేతపత్రాల విడుదలతో తలమునకలుగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంక్షేమ కార్యక్రమాలకు కూడా దేశంలో తానే నంబర్ వన్ అని ఘనంగా తనను తాను పొగిడేసుకున్నారు. తెలంగాణతో సహా మరే రాష్ట్రంలోనూ మరే ముఖ్యమంత్రీ చేయనన్ని సంక్షేమ చర్యలు తన హయాంలో జరిగాయని, తన ప్రభుత్వం చేపట్టిన పథకాల పట్ల ప్రజలు పూర్తి సంతృప్తి చెందుతున్నట్లు చెప్పుకున్నారు. కానీ నాలుగున్నరేళ్ల బాబు పాలన తర్వాత చూస్తే బడ్జెట్ పేరిట అంకెల గారడీ తప్ప నిజమైన సంక్షేమం ఏపీలో గాలికి కొట్టుకుపోయిందని గణాంకాలు వివరిస్తున్నాయి. రుణమేళాలు, ఫీజు రీయింబర్స్‌మెంటు, నిరుద్యోగ భృతి, బీసీ ఉపప్రణాళిక, ఎస్సీ ఉపప్రణాళిక, ఎస్టీ సబ్‌ప్లాన్ అన్నీ దగాకోరు చర్యలుగా మిగిలిపోయాయి. సంక్షేమంపై చెప్పిందే పదేపదే చెబుతూ ప్రజలకు ఎంతో చేశానని మెప్పుపొందేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాపత్రయ పడుతున్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలన్నీ గత ప్రభుత్వాలు అమలు చేసినవే. ఈయన కొత్తగా చేసిందేమీ లేదు. 70 పేజీల శ్వేత పత్రంలో చెప్పిందే మళ్లీ చెప్పుకొచ్చారు. ఐదు సంవత్సరాల బడ్జెట్ అంకెలు చూపించి అదే సంక్షేమం అంటున్నారు.. స్కాలర్‌షిప్‌ల పంపి ణీలో తెచ్చిన మార్పేమీలేదు. సంక్షేమ హాస్టళ్లు రద్దుచేసి ఘోర తప్పిదం చేశారు. కొత్త రెసిడెన్సియల్ స్కూళ్లంటూ పచ్చి అబద్ధం ఆడుతున్నారు. నిరుద్యోగ భృతిని సీఎం ఎన్నికల ఎరగా ప్రారంభించారు. మూడేళ్లుగా రుణాల పంపిణీనే జరగకున్నా ఎన్నికల సందర్భంగా రుణమేళాలంటూ ప్రత్యేక సభలు పెడుతున్నారు. రుణాల పంపిణీ ఓ మాయ నాలుగున్నర ఏళ్ళలో రుణాల పంపిణీ పూర్తిస్థాయిలో జరగలేదు. మొదటి సంవత్సరం అసలు పట్టించుకోలేదు. ఈ మూడు సంవత్సరాలు కలిపి మెగా రుణమేళాల పేరుతో సభలు పెట్టి ఇప్పుడు హడావుడి చేస్తు న్నారు. ఒక్కో రుణమేళాలో లక్ష మందికి రుణాలు ఇస్తామని చెబుతు న్నారు. గత నెల 12, ఈనెల 6న రుణమేళాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిం చారు. ఈనెల 28న విశాఖపట్నంలో మూడో రుణమేళాను ప్రారంభిస్తా మని సీఎం సెలవిచ్చారు. 2016–17లో అన్ని కార్పొరేషన్లు, ఫెడరేష న్ల నుంచి 92,199 మందికి రూ.1,111.93 కోట్లు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారు. 2017–18లో 82,741 మందికి రూ.1,193.54 కోట్లు రుణంగా ఇవ్వాల్సి ఉండగా వాటిని పెండింగ్‌లో ఉంచారు. 2018–19 సంవత్సరానికి అన్ని కార్పొరేషన్లు, బీసీ ఫెడరేషన్ల నుంచి 3,52,793 మందికి రూ.6,643.90 కోట్లు రుణంగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 10 శాతం రుణాలు కూడా లబ్ధిదారులకు అందలేదు. 2016– 17, 2017–18 ఆర్థిక ఏడాదిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులకు ఈ ఆర్థిక ఏడాదిలో నిర్వహిస్తున్న భారీ రుణమేళాల్లో సర్దుబాటు చేస్తున్నట్లు ప్రభుత్వం చెపుతోంది. ఈ ఆర్థిక ఏడాదిలో ఎస్సీ కార్పొరేషన్ నుంచి కేవలం 8 శాతం మందికి మాత్రమే రుణాలు అందాయి. నాలుగున్నరేళ్లుగా కళ్లు మూసుకొని పేదలకు ఆర్థిక సాయం అందించడంలో ఘోరంగా విçఫలమైన ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల ఎరగా మాత్రమే ఈ మేళాలు నిర్వహిస్తున్నది. సంక్షేమ హాస్టళ్ల రద్దు ఘోరం సంక్షేమ హాస్టళ్లను రద్దు చేసి ప్రభుత్వం ఘోర తప్పిదం చేసింది. ఎస్సీ సంక్షేమ శాఖలో 648 సంక్షేమ హాస్టళ్లు రద్దు చేసింది. గిరిజన సంక్షేమ శాఖలో ఉన్న మొత్తం 298 హాస్టళ్లను రద్దుచేసింది. ఎస్సీ సంక్షేమ శాఖలో రద్దయిన హాస్టల్ విద్యార్థులను ప్రస్తుతం ఉన్న గురుకుల స్కూళ్లలోనే విలీనం చేశారు. దీంతో సుమారు 20 శాతం మంది విద్యార్థులు అంటే సుమారు 15 వేల మంది చదువులు మానేశారు. ఈ విషయాన్ని ఉన్నతా ధికారులు స్వయంగా అంగీకరిస్తున్నారు. ఇక గిరిజన సంక్షేమ శాఖలో ఉన్న 298 హాస్టళ్లను రద్దుచేసి వాటి స్థానంలో కొత్తగా 80 గురుకుల స్కూళ్ళు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతున్నది. బోర్డులు మాత్రం గురుకుల స్కూళ్లు అని ఉంటున్నాయి. అక్కడ రద్ద యిన సంక్షేమ హాస్టళ్ళ భవనాల్లోనే కనీస వసతులు లేకుండా చదువులు కొనసాగిస్తున్నారు. ఇక్కడ వీరికి తరగతి గది, పడకగది ఒక్కటిగానే ఉంది. బీసీ సంక్షేమంలోనూ 400 హాస్టళ్లు రద్దు చేశారు. వీరిని కూడా ప్రస్తుతం నడుస్తున్న గురుకుల స్కూళ్లలో చేర్పించినట్లు చెబుతున్నా 25 శాతం మంది బడిమానివేశారు. ఇంటికి దగ్గరలో తల్లిదండ్రులకు చేదో డుగా ఉంటూ హాస్టళ్లలో చదువును కొనసాగిస్తున్న పేద విద్యార్థులకు ఇది శరాఘాతంగా మారంది. బీసీ విద్యార్థుల కోసం 61 కొత్త గురుకుల స్కూళ్లు మంజూరు చేస్తున్నట్లు చెబుతున్నా కాగితాలకే పరిమితమైంది. నిరుద్యోగులను మభ్యపెట్టే యత్నం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల హామీలను పట్టించుకోని సీఎం ఎన్నికలు సమీపిస్తుండటంతో రెండు నెలల క్రితం సీఎం యువ నేస్తం పేరుతో నిరుద్యోగులకు భృతి ఇస్తున్నట్లు ప్రకటించారు. నెలకు రెండు వేలు ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చి ఇప్పుడు వెయ్యి రూపాయ లకు కుదించారు. మొత్తం 12 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని లెక్కలు చెప్పిన సీఎం చివరకు లక్షన్నరకు పరిమితం చేశారు. ప్రస్తుతం 3 లక్షల మందికి భృతి ఇస్తున్నట్లు ప్రభుత్వం చెబు తున్నది. ఇస్తున్నది మాత్రం 1.70 లక్షల మందికేనని నిరుద్యోగులు చెబుతున్నారు. ఉన్న పథకాలకు కొత్త రంగులు పెళ్ళి కానుక పథకం గతంలో అమలైనదే. గిరిపుత్రిక కళ్యాణ పథకం పేరుతో గిరిజనులకు పెళ్లి కానుక ఇచ్చేవారు. ఇది కూడా ఎన్నికలకే ముడిపెట్టాడు. నాలుగు నెలల నుంచి ఎస్సీ, బీసీ, విభిన్న ప్రతిభావం తులు, మైనార్టీలకు కూడా అమలు చేస్తున్నామని చెబుతూ సవాలక్ష ఆంక్షలు పెట్టారు. చివరకు ఎంపిక చేసే వ్యవహారాన్ని కూడా డ్వాక్రా గ్రూపులకు అప్పగించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం సాయం చేసింది పెళ్ళి కానుక కింద రూ.139.25 కోట్లు మాత్రమే. దీనిని అన్ని వర్గాల పేదలకు ఉదారంగా సాయం చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. డప్పు కళాకారులకు నెలకు రూ. 1,500 పింఛన్ ఇస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదు. చెప్పులు కుట్టే వారికి నెలకు రూ.1000 పింఛన్ ఇస్తామని, ముడి సరుకులు కొనుగోలు చేసేందుకు సాయం అందిస్తా మని చెప్పారేగాని ఇంతవరకు పట్టించుకోలేదు. ఇంకా పాలసీలు తయారు చేసే పనిలోనే ఉన్నట్లు సర్కారు వల్లెవేస్తోంది. దళిత క్రిస్టియన్లకు మోసం దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఇప్పిస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు. శ్వేతపత్రం విడుదలలో దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా వచ్చేవరకు పోరాడతానని సెలవిచ్చారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా అంబే డ్కర్ సూక్తులు ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చి ఐదేళ్ళు కావస్తుంటే అమరావతి కేంద్రంగా స్మృతివనం నిర్మిస్తామని ఇప్పటికి రెండు బడ్జెట్లలో రూ.100 కోట్లు చొప్పున కేటాయించి మురిగిపోయేలా చేశారు. 2017 ఏప్రిల్ 14న స్మృతివనం నిర్మాణానికి బౌద్ధ భిక్షువులను పిలిపించి అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఆ తరువాత పట్టించుకోలేదు. తిరిగి 2018 ఏప్రిల్ 14న మరోసారి భూమి పూజ చేశారు. గ్రాఫిక్ల్లో మాత్రం భూతల స్వర్గాన్ని చూపించారు. ఇప్ప టికీ ఇటుకరాయి పడలేదు. ‘ఆదరణ’ ఓ నిరాదరణ ఆదరణ పథకం కేవలం ఎన్నికల ఎత్తుగడ మాత్రమే. నాలుగు రుణ మేళాల్లో నాలుగు లక్షల మందికి ఆదరణ పథకం కింద వస్తువులు అంది స్తామని సెలవిచ్చారు. 7.49 లక్షల మంది వస్తువుల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటి వరకు అర్హులైన వారు 2,00,000 మందిగా తేల్చారు. అయితే ఇప్పటి వరకు కనీసం 50 వేల మందికి కూడా వస్తువులు అందించలేదు. ఈ వస్తువులతో ఆర్థిక స్థితి మెరుగుపడేది లేదని వస్తు వులు తీసుకున్న వారే చెబుతున్నారు. వస్తువులు కూడా నాసిరకంగా వుంటున్నాయి. తీసుకున్న రోజే పనికి రాకుండా పోతున్నాయని లబ్ధి దారులు చెబుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ అస్తవ్యస్థం జ్ఞానభూమి ద్వారా స్కాలర్షిప్లు ఎంతో మెరుగ్గా పంపిణీ చేస్తున్నా మని చెబుతున్న సీఎం అసలు విషయాన్ని గుర్తించడం లేదు. సాంక్షన్ వేరు, రిలీజ్ వేరు, గ్రౌండింగ్ వేరనే విషయాలను బయటకు చెప్పడం లేదు. ఈ సంవత్సరం ఇంతవరకు కాలేజీల అకౌంట్స్‌లోకి స్కాలర్షి ప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ జమకాలేదు. ఎంతో మంది విద్యార్థులు గత సంవత్సరం ఫీజు రీయింబర్స్మెంట్ కాలేజీలకు అందక సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితి ఉంది. 15 లక్షల మంది విద్యార్థులకు పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.2500 కోట్లు అందిం చాల్సి ఉంది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముఖ్యమంత్రి పలు వేదికలపై నెలనెల స్కాలర్షిప్లు ఇస్తామని, ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థి అడ్మిషన్ తీసుకోగానే కాలేజీకి ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఈ హామీ నెరవేరలేదు. గత సంవత్సరం మేనెలలో జ్ఞానభూమి వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఇప్పటికి కూడా వెబ్సైట్ బాలారిష్టాలు దాటలేదు. నిత్యం ఏదో ఒక ఎర్రర్ చూపిస్తూనే ఉంది. బీసీ ఉప ప్రణాళిక ఓ మోసం బీసీ ఉప ప్రణాళిక కింద ఏడాదికి రూ. 10 వేల కోట్లు బడ్జెట్లో ఐదేళ్లుగా కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఉప ప్రణాళికకు చట్ట బద్ధత లేదు. బడ్జెట్లో నిధులు కేటాయింపు అబద్ధం. కాగితాల్లో మాత్రమే ఉంది. బీసీ ఏరి యాల్లో ఎంత మొత్తం ఖర్చుపెట్టారో లెక్కలు వేసి దానిని బీసీ సబ్‌ప్లాన్ కింద ఖర్చుపెడుతున్నట్లుగా చూపిస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ అధికా రుల వద్ద అసలు సబ్‌ప్లాన్ వివరాలంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. దీనిపై ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించిన దాఖ లాలు లేవు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధులు పర్సెంటేజీల పనులకే... ఎస్సీ ఉప ప్రణాళిక కింద అయిదు బడ్జెట్ల వివరాలు పరిశీలిస్తే భారీ స్థాయిలోనే ఖర్చుపెట్టారు. అయితే కేవలం పర్సెంటేజీలు వచ్చే పనులకే ఖర్చుచేశారు. దాదాపు పనులన్నీ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా రోడ్లు, డ్రైనేజీ కాలువల కోసం ఖర్చుచేశారు. నిజానికి ఈ నిధులు ఎస్సీల జీవనోపాధులకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంది. నాలుగేళ్లలో 88.22 శాతం నిధులు ఖర్చు చేశారు. ఈ నిధులన్నీ కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల జేబులు నింపడానికి తప్ప పేదలైన ఎస్సీలకు ఉపయోగ పడలేదు. ఎస్టీ సబ్‌ప్లాన్‌లోనూ ఇదే పరిస్థితి నాలుగు సంవత్సరాల్లో ప్రాథమిక రంగానికి రూ.769.46 కోట్లు, సామా జిక రంగానికి రూ. 3554.22 కోట్లు, మౌళిక సదుపాయాల రంగానికి రూ. 2106.33 కోట్లు, జీవనోపాధుల రంగానికి రూ. 3274.99 కోట్లు ఖర్చు చేశారు. అంటే జీవనోపాధులకు కేవలం 30 శాతం నిధులు మాత్రమే కేటాయించారు. అసలు సబ్‌ప్లాన్ నిధులన్నీ జీవనోపాధులకే ఖర్చు చేయాలని చట్టం చెబుతున్నది. -జీపీ వెంకటేశ్వర్లు, సాక్షి ప్రతినిధి -
ఎందుకూ కొరగాని ఆర్టీజీఎస్!
దేశంలో ఏ ముఖ్యమంత్రీ ప్రకటించుకోవడానికి సాహసించని ధోరణి ప్రదర్శిస్తూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సాగిస్తున్న డాంబిక ప్రచారానికి అడ్డూ ఆపూలేకుండా పోతోంది. అన్నీ తానే సాధించినట్లు, అభివృద్ధికి తానే బ్రాండ్ పేరు అన్నట్లుగా నిత్యం ప్రచార మోతలో మునుగుతున్న బాబు రియల్ టైమ్ గవర్నెన్స్ అనే భావనను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇది తాను కనిపెట్టిన అద్భుత సాధనంగా చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ కోట్ల రూపాయల ప్రజాధనం వృధా కావడం తప్ప ఉపయోగం లేదని ఏపీ ప్రభుత్వంలోని అత్యంత సీనియర్ అధికారులే చెబుతున్నారు. ప్రభుత్వ శాఖలు ఇచ్చే నివేదికలను ఆర్టీజీ నివేదికలతో పోల్చి సరిచూడడం వల్ల యంత్రాంగంలో అసహనం రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వం విని యోగించని టెక్నాలజీతో రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నానని చంద్రబాబు చెబుతున్న మాటలు కోటలు దాటుతున్నా ఆచరణలో మాత్రం గడప దాటడంలేదు. తన పాలన ప్రపంచానికే ఆదర్శమని, తాను చేసే అన్ని కార్యక్రమాలు చారిత్రాత్మకమని, గుప్తులకాలం స్వర్ణయుగమైతే ఇప్పటి తన హయాం అంతకు మించిపోయిందని చెబుతున్న అతిశయాలు కాగితాల్లోనే కనిపిస్తున్నాయి. రియల్‌టైమ్ గవర్నెన్స్, ఈ–ప్రగతి ప్రజలకు అంతుబట్టని మిథ్యగా మారిపోయింది. సుపరిపాలన పేరుతో ఆయన విడుదల చేసిన శ్వేతపత్రంలో అంతా భ్రాంతే తప్ప వాస్తవం అణుమాత్రమైనా గోచరించడంలేదు. అన్ని వర్గాలు ప్రశాంతంగా ఉన్నాయని ప్రకటించుకున్నా నాలుగున్నరేళ్లలో జరిగిన అనేక ఘటనలు శాంతిభద్రతల వైఫల్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్)ను తాను కనిపెట్టిన ఒక అద్భుత సాధనంగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నా దానివల్ల కోట్ల రూపాయల ప్రజాధానం వృధాయే తప్ప ఉపయోగం లేదని పలువురు సీనియర్ అధికారులు కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. పరిష్కార వేదిక ఒక బోగస్ ‘ఆర్టీజీఎస్’ను ఒక ప్రభుత్వ శాఖగా ఏర్పాటుచేసి మిగిలిన శాఖలన్నింటిపైనా దానికి పెత్తనం ఇవ్వడంతో ప్రభుత్వ యంత్రాంగంలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వ శాఖలు ఇచ్చే నివేదికలను ఆర్టీజీఎస్ నివేదికలతో పోల్చి సరిచూడడం వల్ల యంత్రాంగంలో అసహనం రోజురోజుకూ పెరిగిపోతోంది. మిగిలిన శాఖలన్నింటికీ సమాం తరంగా చంద్రబాబు ఆర్టీజీఎస్‌ని ప్రోత్సహిస్తుండడంతో ఆయా శాఖల స్వతంత్రత దెబ్బతింటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆర్టీజీఎస్‌లోనే పరిష్కార వేదిక పేరుతో 1100 కాల్‌సెంటర్ ఏర్పాటు చేసి అందులో రెండు వేల మందికిపైగా ఆపరేటర్లను నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదులు చేస్తున్నారు. 2017 నవంబర్‌లో ఇది ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకూ 1,72,11,367 ఫిర్యాదులు రాగా అందులో 1,41,92,898 పరిష్కారమైనట్లు ప్రకటించారు. కానీ ఇదంతా బోగస్ అని అధికారవర్గాలే చెబుతున్నాయి. కొద్దిరోజుల క్రితం మచిలీపట్నం రూరల్ మండలానికి చెందిన ఒక వ్యక్తి తమ గ్రామంలో రోడ్డు వేయాలని కోరితే ఆర్టీజీఎస్ దాన్ని గ్రామీణ నీటిసరఫరా విభాగానికి పంపింది. ఆ పిటీషన్ వివిధ దశల్లో తిరిగి చివరికి ప్రస్తుతం నిధుల్లేవు, ఉన్నప్పుడు రోడ్డు వేస్తామనే సమాధానంతో ముగిసింది. సంబంధిత అధికారి ఇదే విషయాన్ని ఆర్టీజీఎస్ సైట్లో అప్లోడ్ చేస్తే అక్కడి నుంచి మీ సమస్య విజయవంతంగా పరిష్కారమైనట్లు పిటీషన్ పెట్టిన వ్యక్తికి మెసేజ్ వచ్చింది. ఇళ్ల నిర్మాణం, భూసమస్యల ఇతర అంశాలపై వచ్చే ఫిర్యాదుల్లో 90 శాతం ఇలాగే అధికారుల సమాధానంతోనే పరిష్కారమైనట్లు చూపిస్తున్నారు. విజయవాడలోని ఒక మాల్లో సినిమాకు వెళ్లిన కొందరు మిత్రులు అక్కడి కౌంటర్లలో తినుబండారాల ధరలు సాధారణ రేట్ల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నాయని ఫిర్యాదు చేస్తే కాల్‌సెంటర్ నమోదు చేసుకోవడానికే అరగంటకు పైగా విసిగించడంతో వారు వదిలేశారు. దీంతో పరి ష్కార వేదిక ఒక బోగస్ అనే అభిప్రాయం ఉద్యోగుల్లోనే స్పష్టంగా ఏర్పడిపోయింది. సంతృప్తి సర్వేలు సొంతానికి ఆర్టీజీఎస్ చేస్తున్న సంతృప్తి సర్వేలు ప్రభుత్వ పెద్దల అవసరానికే తప్ప ప్రజల కోసం కాదని స్పష్టమవుతోంది. రెండు వేల మందికి పైగా ఆపరేటర్లతో ఏర్పాటైన కాల్ సెంటర్ నుంచి ప్రతిరోజూ 15 లక్షల మందికి ఫోన్లు చేసి ప్రభుత్వ పథకాలపై సంతృప్తిగా ఉన్నారా, లేదా అని వివిధ రకాలుగా ప్రశ్నిస్తున్నారు. ఇవికాకుండా మరో 15 లక్షల ఐవీఆర్ఎస్ కాల్స్‌తో ఈ సర్వేలు చేస్తున్నా అవన్నీ రాజకీయ ప్రయోజనాల కోణంలోనే సాగుతున్నాయి. వీటి ఆధారంగానే ముఖ్యమంత్రి నిత్యం ప్రజల్లో ఇంత సంతృప్తి స్థాయి ఉందని, ఇంకా పెరగాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. నిజానికి ఈ సర్వేలను అధికారులే నమ్మడంలేదు. ముఖ్యమంత్రి వాయిస్‌తో వెళ్లే ఆర్టీజీఎస్ ఫోన్ కాల్స్‌ను 40 శాతం మందికిపైగా జనం తిరస్కరిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. కాల్ సెంటర్ ఫోన్‌రాగానే మెజారిటీ జనం కట్ చేస్తున్నట్లు ఆర్టీజీ వర్గాలే వాపోతున్నాయి. అంటే ఈ సర్వేలపై ప్రజల్లో నమ్మకం లేకపోగా విసుగుపుడుతోందని అర్థమవుతోంది. ప్రజలు ముఖ్యమంత్రిని నేరుగా సంప్రదించే కైజలా యాప్స్‌ను అభివృద్ధి చేశామని మొదట్లో గొప్పలు చెప్పిన ఆర్టీజీఎస్ అది విఫలమవడంతో దాని ఊసే ఎత్తడంలేదు. ఆర్టీజీఎస్, ఏపీ ప్రభుత్వం ఉపయోగిస్తున్న సాంకేతికతపై నీతి ఆయోగ్ పెదవి విరిచింది. నీతి ఆయోగ్ నివేదికలో ఏపీ దేశంలో నాలుగో స్థానంలో ఉందని ప్రకటించుకున్నా అదే నీతి ఆయోగ్ ఏపీ ప్రభుత్వం చేస్తున్న సర్వేలు బూటకమని కొట్టిపారేసింది. తమకు తామే సర్వేలు చేసుకుని చంకలు గుద్దుకోవడం ఏమిటనే ప్రశ్నకు రాష్ట్రం నుంచి సమాధానం కరువైంది. తుఫాను హెచ్చరికల పాత్రతో కామెడీ వాతావరణ కేంద్రం తుఫాను హెచ్చరికలను జారీ చేసే ప్రక్రియను కూడా ఆర్టీజీఎస్ హైజాక్ చేసింది. ఇటీవల పెథాయ్ తుఫానును కచ్చితంగా అంచనా వేశామని ఇది తమ సమర్థతకు నిదర్శనమని చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకు కొద్దిరోజుల ముందు వచ్చిన తిత్లీ తుఫానునూ తాను నియంత్రించినట్లు చెప్పారు. చంద్రబాబు ఆయన పరివారం ఎంత హడావుడిగా తిరిగినా తిత్లీ తుఫాను వల్ల తీవ్ర నష్టం ఏర్పడింది. ఈ హడావుడి వల్ల సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడగా నష్టపరిహారం చెల్లింపులు సక్రమంగా జరగలేదు. పెథాయ్ తుఫాను బాధితులకు 25వ తేదీకల్లా పరిహారం అందిస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చెప్పినా ఇంతవరకూ బాధితులకు సాయం అందలేదు. విపత్తులు వచ్చినప్పుడు వాటి గురించి హెచ్చరించే యంత్రాంగాలు ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నాయి. చంద్రబాబు మాత్రం వీటిని తాను కొత్తగా కనుగొన్నట్లు ప్రచారం చేసుకుంటూ తుఫాను ఎంత వేగంతో ప్రయాణిస్తుంది, ఎక్కడ తీరం దాటుతుంది, ఏ ప్రాంతాలపై ప్రభావం ఉంటుందని వాతావరణ కేంద్రం చెప్పే విషయాలను చెబుతూ కామెడీ చేస్తుండడం అధికారులను నివ్వెరపరుస్తోంది. పిడుగులు ఎక్కడ పడతాయో ముందే చెబుతామంటూ హడావుడి చేసి కొద్దిరోజులు షో చేసినా పిడుగుపాటు మరణాలను ఆపలేకపోయారు. తాను కనిపెట్టిన టెక్నాలజీతో తుఫానుల వల్ల పంటలు దెబ్బతినకుండా కాపాడానని, రైతులను హెచ్చరించానని, మత్స్యకారులను కాపాడానని చెబుతున్నా అవన్నీ ఉత్తిదే అని పలుసార్లు స్పష్టమైంది. ఇటీవల పెథాయ్ తుఫాను సందర్భంగా కాకినాడ తీరంలో మత్స్యకారుల పడవ గల్లంతైంది. ముందే హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తం చేస్తే వారి బోటు ఎందుకు తుఫానులో చిక్కుకుందనే దానికి ఆర్టీజీఎస్ నుంచి సమాధానం కరువైంది. ప్రజలకు దూరంగా మీ–సేవ మీ–సేవ ద్వారా అన్ని ప్రభుత్వ సేవలను ప్రజలకు ఆన్లైన్లోనే అందిస్తున్నట్లు చేస్తున్న ప్రచారంలోనూ వాస్తవం కనిపించడంలేదు. 37 శాఖలకు చెందిన 196 ప్రభుత్వ సేవలను మీ–సేవ పరిధిలోకి తెచ్చినా అందులో ప్రజలకు అందుబాటులో ఉన్నవి పదిలోపే. ఈ సేవలను వినియోగించుకుందామని వెళ్లిన జనానికి సర్వర్ల డౌన్ అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. సర్వర్ల సమస్యతోనే మీ–సేవ చాలా వరకూ విఫలమైంది. వాటి సంఖ్యను 3,506 నుంచి 11835కి పెంచినా సర్వర్ల సమస్యకు ఉపయోగం లేకుండా పోయింది. ఈ–ప్రగతి పేరుతో 76 సర్వీసులను కంప్యూటరీకరించినా వాటివల్ల ఉపయోగంలేదు. ప్రధానంగా రెవెన్యూ శాఖలో భూదార్‌ను ప్రవేశపెట్టినా ప్రజలు ఇంకా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సివస్తోంది. ఆన్లైన్లోనే అంతా జరిగిపోతుందని ప్రభుత్వం చెబుతున్న దానికి వాస్తవ పరిస్థితికి చాలాతేడా కనిపిస్తోంది. ఈ–ప్రగతి ఎటువంటి ప్రయోజనం కనిపించలేదని చెబుతున్నారు. గతం నుంచి ఉన్న సౌకర్యాలే తప్ప కొత్తగా ఇ–ప్రగతి ద్వారా సాధిం చింది పెద్దగా ఏమీ లేదని చెబుతున్నారు. అధికారంలోకి రాగానే చంద్రబాబు మద్యం బెల్టు షాపులు రద్దు చేసే ఫైలుపై సంతకం చేసినా అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బెల్టు షాపుల్ని మొత్తం నిర్మూలించామని, సారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని ప్రకటించినా అదంతా అవాస్తవమనేది బహిరంగ రహస్యం. మద్యం అమ్మకాల్లో రాష్ట్రం రెండంకెల వృద్ధి సాధించింది. చంద్రబాబు అధికారంలోకొచ్చే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 43 వేల వరకు బెల్టు షాపులుంటే, ఇప్పుడు ఈ సంఖ్య 60 వేలకు చేరిందని ఎక్సైజ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 4,380 మద్యం షాపులుంటే, వీటికి అనుబంధంగా 40 వేలకు పైగా బెల్టు షాపులు నడుస్తున్నాయి. ఏడాదికి మద్యం, బీరు అమ్మకాలు మొత్తం కలిపి రూ.17,291 కోట్ల మేర జరుగుతున్నాయి. ఇందులో బెల్టు దుకాణాల వ్యాపారం రూ.9 వేల కోట్లకు పైగా అంటే సగంకు పైగా మద్యం వ్యాపారం బెల్టు షాపుల ద్వారానే జరుగుతోంది. పుష్కరాల్లో ప్రచార యావ.. 29 మంది మృత్యువాత చంద్రబాబు ప్రచార యావతో 2015లో జరిగిన గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 29 మంది ప్రాణాలు గోదాట్లో కలిసిపోయాయి. దీనిపై వేసిన సోమయాజులు కమిషన్ మూడేళ్ల తర్వాత ఇచ్చిన నివేదికలో వాస్తవాలను మసిపూసి మారేడుకాయ చేసింది. కృష్ణా నదిలో 2017 నవంబర్‌లో జరిగిన పడవ బోల్తా ఘటనలో ఏకంగా 22 మంది ప్రాణాలు నీటిపాలయ్యాయి. విశాఖ మన్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యే, టీడీపీ విప్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్య చేయడంలో భద్రతా వైఫల్యం, నిఘా నీరుగారిన వైనంపై విమర్శలు వెల్లువెత్తాయి. అతిపెద్ద ఆర్థిక కుంభకోణంగా సంచలనం రేపిన అగ్రిగోల్డ్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు పోలీసుల మెడకు చుట్టుకున్నాయి. నిజాయితీగా విధులు నిర్వర్తించిన మహిళా తహశీల్దార్ వనజాక్షిపై టీడీపీ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో దాడిచేíసినప్పటికీ ఆమెకు న్యాయం చేయడంలో ప్రభుత్వం పక్షపాతం చూపింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యం విధులకు ఆటంకం కలిగించి దుర్భాషలాడటంతోపాటు ఆయన గన్‌మెన్‌పై దౌర్జన్యం చేసిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై కేసు నమోదు చేయకపోగా కనీసం క్రమశిక్షణ చర్యలు లేవు. శాంతిభద్రతల అదుపులో ఘోర వైఫల్యం రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉందని, ప్రజలు సంతోషంగా ఉన్నారని ప్రభుత్వం నమ్మించే ప్రయత్నం చేస్తున్నా నాలుగున్నరేళ్లుగా చోటుచేసుకున్న అనేక ఘటనలు శాంతిభద్రతల వైఫల్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, వేధింపులు, ఆర్థిక నేరాల సంఖ్య పెరిగిపోయింది. జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం మహిళలపై రాష్ట్రంలో 2016లో 16,362 నేరాలు జరగ్గా 2015లో 15,967 నేరాలు జరిగాయి. మహిళలపై నేరాల్లో ఏపీ దేశంలోనే 4.9 శాతంతో 8వ స్థానంలో ఉంది. మహిళల అక్రమ రవాణాలోను రాష్ట్రం ఏడవ స్థానంలో ఉంది. ఎస్సీలపై జరిగిన నేరాల్లో ఐదు, ఎస్టీలపై నేరాల్లో నాలుగు, ఆర్థిక నేరాల్లో పది, సైబర్ నేరాల్లో ఆరవ స్థానంలో ఉంది. మొత్తం నేరాలన్నింటిలో ఏపీ 13వ స్థానంలో ఉంది. రాష్ట్రమంతటా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలను మట్టుపెట్టడం, వారిపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం పరిపాటిగా మారింది. కర్నూలు జిల్లా పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఉన్న చెరుకులపాడు నారాయణరెడ్డిని 2017 మే నెలలో పెళ్లికి వెళ్లి వస్తుండగా కాపుకాసిన ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి్డపై జరిగిన హత్యాయత్నం కేసును ఏపీ పోలీసులు నీరుగార్చారన్న అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో ఈ ఏడాది అక్టోబర్ 23న కత్తితో హత్యాయత్నం చేసిన ఘటనలో పోలీసులు, ప్రభుత్వం స్పందించిన తీరు ప్రజల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కుట్ర కోణం వైపు దృష్టి పెట్టకుండా నిందితుడు శ్రీనివాసరావు చుట్టూనే దర్యాప్తును పరిమితం చేయడం అనుమానాలకు తావిచ్చింది. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు సీరియస్‌గా తీసుకోకపోవడంతో కుట్ర కోణాన్ని వెలికితీయాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థకు ఈ కేసును అప్పగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించక తప్పని పరిస్థితైంది. ప్రత్యేక హోదా కోసం 2017 జనవరి 26న విశాఖలో తలపెట్టిన కొవ్వొత్తుల నిరసనకు సంఘీభావంగా వెళ్లిన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిని విమానాశ్రయం రన్‌వే పైనే అడ్డుకున్న పోలీసుల తీరు వివాదాస్పదమైంది. అమరావతిలో 2017 ఫిబ్రవరిలో నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంటుకు హాజరయ్యేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను గన్నవరం విమానాశ్రయంలోనే దౌర్జన్యంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌కు తీసుకెళ్లి నిర్బందించారు. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను ఇంటి నుంచి బయటకు రాకుండా అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి, తదితర పలువురు నేతలతోపాటు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణలను పలుమార్లు గృహ నిర్బంధాలు, అరెస్టులు చేసిన తీరు విమర్శలకు తావిచ్చింది. ముఖ్యమంత్రి వస్తున్నారంటే అక్కడ ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, బాధితుల ముందస్తు అరెస్టులు, కేసులను పరిపాటిగా మార్చేశారు. కాపులకు రిజర్వేషన్ల ఉద్యమంలో భాగంగా జరిగిన తుని సభ హింసాత్మకంగా మారి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, పోలీస్ స్టేషన్లు దగ్ధమైన ఘటనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైకి నెట్టి అపఖ్యాతిపాల్జేసేందుకు ప్రయత్నించిన ప్రభుత్వం అభాసుపాలైంది. రాజధాని అమరావతిలో భూ సమీకరణకు తమ భూములు ఇవ్వని రైతులపై కక్ష సాధింపు చర్యలు జాతీయ మానవ హక్కుల నేతలను సైతం విస్మయానికి గురిచేశాయి. తమ మాట వినని రైతుల అరటితోటలు, తాటాకు పాకలు తగలబెట్టించిన కొందరు సంఘ విద్రోహశక్తులు భయాందోళనలు సృష్టించారు. తుందుర్రు, గరగపర్రు, దివీ స్లలో శాంతిభద్రతలను అదుపుచేయలేక ప్రభుత్వం ప్రజలను ఇబ్బం దులకు గురిచేసింది. -బొల్లికొండ ఫణికుమార్, సాక్షి ప్రతినిధి -
శ్వేతపత్రంలోనూ పాతపాటే
నాలుగున్నరేళ్లలో జరిగిన వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచుతున్నానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం విడుదల చేసిన శ్వేతపత్రంలో రోజూ చెప్పే అబద్ధాలు, అసత్యాలే తప్ప కొత్త అంశాలు మచ్చుకైనా కనిపించలేదు. అవసరాన్ని బట్టి ఇన్నాళ్లూ రకరకాల యూటర్న్లు తీసుకుంటూ ముందుకెళ్లిన బాబు.. రానున్న ఎన్నికల నేపథ్యంలో తన వాదనను సమర్ధించుకునేందుకే ఈ పత్రాల వ్యూహం అమలు చేస్తున్నారని శ్వేత పత్రం చూస్తే సులభంగా అర్ధమవుతుంది. ఇందులో అంశాలు కొత్తవేమీ కాదని తెలుగుదేశం నాయకులు సైతం భావిస్తున్నారంటే ఈ శ్వేతపత్రం ఎంత డొల్లగా ఉందో అర్ధమవుతుంది. బీజేపీతో కాపురంపై దాటవేత నవనిర్మాణ దీక్షలు, ధర్మ పోరాట సభలు, పార్టీ, అధికారుల సమావేశాల్లో నిత్యం విసుగొచ్చేలా చెప్పే రాజకీయాంశాలే ఈ పత్రంలోనూ చోటుచేసుకున్నాయి. నాలుగున్నరేళ్లలో జరిగిన పరిణామాల గురించి వాస్తవాలు చెబుతున్నానంటూనే బీజేపీతో కేంద్రంలో నాలుగున్నరేళ్లు కలిసి కాపురం చేయడం, ప్రత్యేక హోదా వద్దని దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించడం, ప్యాకేజీ ఇచ్చినందుకు ప్రధానికి అభినందనలు, సన్మానాలు చేసిన విషయాలను చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా తెరమరుగు చేసే ప్రయత్నం చేశారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటాన్ని అణచివేసేందుకు ప్రయత్నించి కేసులు పెట్టిన చంద్రబాబు ఆ విష యాన్ని మరుగుపరిచి తానే మొదటి నుంచి హోదా కోసం పోరాటం చేశానని ఎలాంటి సంశయం లేకుండా శ్వేతపత్రంలో పేర్కొనడం విస్తుగొలుపుతోంది. తన తప్పుల్ని బీజేపీ ఖాతాలో వేసి చూపడం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్, జనసేన కలిసి తమపై కుట్ర చేస్తున్నారని చూపడం ఈ శ్వేతపత్రం సారాంశం. పట్టని రాష్ట్ర ప్రయోజనాలు నాలుగేళ్లపాటు కేంద్రంలో బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకున్న సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను చంద్రబాబు కావాలని దాట వేశారు. ఆ సమయంలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నించడం, హోదా పేరెత్తితే జైలే అని విద్యార్థులను బెదిరించడం, హోదా పోరాటంలో పాల్గొన్న వారిపై కేసులు పెట్టడం ఎవరూ ఇంకా మరిచిపోలేదు. ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి పదవులు తీసుకుని అధికారాన్ని అనుభవిస్తూ ఏనాడూ ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని చంద్రబాబు అడగలేదు. తరచూ ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఎంతసేపూ నియోజకవర్గాల పెంపు, జగన్మోహన్రెడ్డిపై ఉన్న కేసుల గురించి ప్రధాని, కేంద్ర మంత్రులపై ఒత్తిడి తెచ్చారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోలేదు. ప్యాకేజీకి పట్టం కట్టలేదా? ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా నినాదంతో పోరాటం చేస్తున్న సమయంలో హోదా వద్దని కేంద్రానికి చెప్పిన విషయాన్ని శ్వేతపత్రంలో మరుగుపరిచారు. ప్రత్యేక హోదా కంటే ఈ ప్యాకేజీయే గొప్పని, హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ సరిపోతుందని ప్రకటించిన సంగతి ప్రజలకు గుర్తుండదని ఆయన అనుకుంటున్నారు. 2016 సెప్టెంబర్ 7వ తేదీ అర్థరాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన వెంటనే చంద్రబాబు మీడియా సమావేశం పెట్టి మరీ దాన్ని స్వాగతించారు. ప్రత్యేక హోదా అవసరమే లేదని, అది సంజీవని కాదని, దానివల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని, అది ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఏం బావుకున్నాయనే వాదనలను తెగ ప్రచారం చేశారు. ప్యాకేజీకి ఆమోదం తెలిపినందుకు 2017 మార్చి 16న అసెంబ్లీలో ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు. అదే సమయంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని భుజానికెత్తుకుని తీసుకెళుతుండడంతో దాన్ని నీరుగార్చేందుకు అడుగడుగునా ప్రయత్నాలు చేశారు. జైల్లో పెడతానని బెదిరింపులు జగన్మోహన్రెడ్డి యువభేరి సదస్సుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో వెళుతుండడంతో వారిని ఆపేందుకు ఆ సదస్సుల్లో పాల్గొంటే జైళ్లలో పెడతామని హెచ్చరించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ బంద్‌కు పిలుపు ఇస్తే అరాచకాలు సృష్టించడానికి బంద్ చేస్తున్నారని, దానికి ఎవరూ సహకరించవద్దని సాక్షాత్తూ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అన్ని స్థాయిల్లోనూ హోదా ఉద్యమాన్ని అణచివేతకు యత్నించడం, కేసులు పెట్టారు. గృహ నిర్బంధాలు, దౌర్జన్యాలతో రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించారు. 2017 జనవరి 26న విశాఖపట్నంలో హోదా కోసం జరిగే ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లిన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిని ఎయిర్‌పోర్టులోనే అడ్డుకుని నిర్బంధించారు. సీపీఐ, సీపీఎం నాయకులు హోదా కోసం పోరాడుతుంటే వారిపైనా కేసులు నమోదు చేసి జైళ్లలో పెట్టారు. హోదా ఉద్యమాన్ని రాష్ట్రానికి వ్యతిరేకంగా జరిగే అల్లర్లుగా చిత్రీకరించారు. ఇంత చేసిన చంద్రబాబు హోదా కోసం ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి, జగన్మోహన్రెడ్డి ఉద్యమంలో చురుగ్గా ముందుకెళ్లడంతో రూటుమార్చి వద్దన్న ప్రత్యేక హోదాయే కావాలని ఏడు నెలల క్రితం స్వరం మార్చారు. ఇప్పుడు హోదా కోసం తానే పోరాడినట్లు శ్వేతపత్రంలో ప్రకటించుకోవడం ఎవరికైనా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. నాలుగేళ్ల క్రితం విడుదల చేసిన పలు శ్వేతపత్రాలకు, ఇప్పటి శ్వేతపత్రానికి పెద్ద తేడా లేదని సాధా రణ పౌరులకు కూడా అర్ధమవుతుంది. అధికారులు సైతం ఒప్పుకోకతప్పదు. అప్పట్లో విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కాంగ్రెస్ మోసం చేసిన తీరు గురించి వివరించగా ఇప్పుడు అవే హామీలు, రావాల్సిన నిధుల గురించి ఏకరువు పెట్టారు. అప్పుడు కాంగ్రెస్ మోసం చేసిందని చెప్పగా ఇప్పుడు బీజేపీ మోసం చేసిందని అన్నారు. కేసీఆర్‌తో లింకు మరోవైపు ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పిన టీఆర్ఎస్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్ధతు తెలుపుతున్నదనే ప్రచారాన్ని బాబు వ్యూహాత్మకంగా లేవనెత్తడం గమనార్హం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వ వద్దని చెప్పిన కేసీఆర్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధాలు అంటగడుతూ విమర్శలు చేస్తున్న బాబు తాను టీఆర్ఎస్తో పొత్తుకోసం ప్రయత్నించానని, వారు అందుకు నిరాకరించాకే కాంగ్రెస్‌తో కలిశానని ఈమధ్యవరకూ చెబుతూనే ఉన్నారు. ఇలా పూటకో మాట మాట్లాడుతూ, విపక్షాలపై నిందలేసే బాబు నైజం చూసి ఎవరైనా విస్తుపోక తప్పదు. -బొల్లికొండ ఫణికుమార్, సాక్షి ప్రతినిధి -
శ్వేతపత్రాల్లోనూ బాబు యూటర్న్
-
కేసీఆర్‌ను నిలదీయండి: పొన్నం
సాక్షి, న్యూఢిల్లీ : ప్లీనరీ నిర్వహించాలని చూస్తోన్న టీఆర్ఎస్ పార్టీ హామీల అమలుపై శ్వేత పత్రం విడుదల చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ఎంతవరకు అమలుయ్యయో ఆ వివరాలను ప్రజలకు అందజేయలన్నారు. కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టులకు హెడ్ రెగ్యులేటరీలు కట్టి మొత్తం టీఆర్ఎస్ ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ నీరో చక్రవర్తిలా ప్రత్యామ్నాయ ఫ్రంట్ అంటూ బెంగాల్, బెంగళూరులకు తిరుగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంత రుణభారం ప్రజలపై మోపడం వాస్తవం కాదా అని పొన్నం ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏం సాధించిందో ప్రశ్నించండి అంటూ ప్లీనరీకి హాజరయ్యే కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో లక్షల కోట్ల ప్రజాధనం వృధా చేస్తున్న కేసీఆర్ పొగటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ తన పేరును కల్వకుంట్ల నరసింహన్‌గా మార్చుకోవాలని పొన్నం ఎద్దేవా చేశారు. -
‘బ్యాంకింగ్ వ్యవస్థపై శ్వేతపత్రం’
సాక్షి, న్యూఢిల్లీ : భారీ కుంభకోణాలు వెలుగుచూస్తున్న బ్యాంకింగ్ వ్యవస్థలో వాస్తవ పరిస్థితి ప్రతిబింబిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ సర్కార్‌ను కోరింది. గత ఐదేళ్లుగా బ్యాంకింగ్ రంగంలో రూ 61,000 కోట్ల విలువైన స్కామ్‌లు చోటుచేసుకున్నాయని ఆ పార్టీ పేర్కొంది. బ్యాంకులను మోసం చేస్తున్న వారికి బీజేపీ సర్కార్ అండదండలున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం బ్యాంకింగ్ వ్యవస్థపై శ్వేతపత్రాన్ని ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ డిమాండ్ చేశారు. బిలియనీర్ జ్యూవెలరీ నీరవ్ మోదీ పీఎన్బీని రూ 17,000 కోట్లకు ముంచిన కుంభకోణం వెలుగుచూడగా, తాజాగా రొటోమాక్ అధినేత విక్రమ్ కొఠారీ భారత బ్యాంకులకు రూ 800 కోట్లు ఎగవేసిన మరో స్కాం బయటపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో రోజుకో కుంభకోణం వెలుగుచూస్తోందన్నారు. బ్యాంకులను మోసం చేసిన అక్రమార్కులు, ఎన్పీఏలకు సంబంధించిన వివరాలన్నింటినీ ప్రచురించి, వారి పేర్లను వెల్లడించాల్సిందిగా అన్ని బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలని తివారీ డిమాండ్ చేశారు. -
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆ స్పృహ లేదు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలెన్ని.. ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేసింది అన్నదానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్రమాజీమంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఈ నెల 26న నిర్వహించ తలపెట్టిన ‘నిరుద్యోగ సమరభేరి’ పోస్టరును ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటైతే ఉద్యోగాలు వస్తాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని యువత ఆశపడిందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకు భిన్నమైన పరిస్థితి వచ్చిందని, మానవ వనరులను ఉపయోగించుకోవాలనే స్పృహ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేదన్నారు. టీఎస్పీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్లు అన్నీ కోర్టు వివాదాల్లో ఉన్నాయన్నారు. రాష్ట్రం ఏర్పాటై మూడున్నరేళ్లు గడిచినా ఉద్యోగ సమస్య పరిష్కారం కాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 82వేల మందికి ఉద్యోగావకాశాలను కల్పించిందన్నారు. 2.74 వేలకోట్ల రుణాలను ముద్ర బ్యాంకు ద్వారా యువత ఉపాధికోసం ఇచ్చిందని, దీనివల్ల కోటిమందికి పైగా ఉపాధి పొందుతున్నారని చెప్పారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలుచేస్తున్నదని దత్తాత్రేయ వివరించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులపట్ల నిర్లక్ష్య వైఖరి కనబరుస్తున్నదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 26న బీజేవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగ సమరభేరి పేరుతో సభను నిర్వహిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై, ఇప్పటిదాకా పూర్తిచేసిన నియామకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. -
ఖాళీ ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్యపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. 1.20లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించడం హర్షణీయమని, కానీ ప్రకటించిన ఖాళీల్లో స్పష్టత లేదని శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. నిరుద్యోగుల్లో తీవ్ర గందరగోళం నెలకొందని, శాఖల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్యను పేర్కొంటూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేయాలని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత భర్తీ చేసిన పోస్టుల వివరాలను కేటగిరీల వారీగా స్పష్టం చేయాలని తెలిపారు. -
దేశ ఆర్ధిక స్థితిపై శ్వేత పత్రం తేవాలి
ఎన్డీయే మూడేళ్ల పాలనపై కాంగ్రెస్ డిమాండ్ సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మూడేళ్ల పాలనలో ప్రచారం మినహా సాధించిందేమీ లేదని ఆరోపిస్తూ ఆర్ధికస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మూడేళ్ల ఎన్డీయే పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, మూడేళ్ల పాలనపై ప్రచారానికి ఖజానా నుంచి కోట్లు ఖర్చు చేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ ఆరోపించారు. మూడేళ్లలో ఏం సాధించారని సంబరాలు చేస్తున్నారని మండిపడ్డారు. మూడేళ్లలో ఆర్దికాభివృద్ది లేదని, పాత పద్దతిని మార్చి జీడీపీ గణాంకాలను తయారు చేసి ఎంతో అభివృద్ది సాధించామని గొప్పలు చెబుతున్నారన్నారు. దేశంలోకి పెట్టుబడులు రావడం లేదన్నారు. అధికారంలోకొస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ఎన్నికల హామీ ఇచ్చిందని, గత మూడేళ్లలో కేవలం 1.5 లక్షల ఉద్యోగాలే ఇచ్చారన్నారు. యువతకి ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రాజకీయ విరోధులను అవమానాల పాలు చేయడం ఈ మూడేళ్లలో పరిపాటి అయిందని వ్యాఖ్యానించారు. -
వైద్యసేవలపై శ్వేతపత్రం ప్రకటించాలి
పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధికారం లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అంది స్తున్న వైద్యసేవలపై శ్వేతపత్రం విడుదల చేయాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. మర్రి శశిధర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కల సి గురువారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసు పత్రుల్లో వైద్య పరికరాల్లేక, సిబ్బంది నిర్ల క్ష్యం, ప్రభుత్వ చేతకానితనం వల్ల అనేక మంది మృత్యువాత పడుతున్నారన్నారు. వైద్యశాఖ నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ మంత్రి లక్ష్మారెడ్డి రాజీనామా చేయాలని మర్రి శశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. రెండు న్నరేళ్లుగా ఏ పనీ చేయని మంత్రి హరీశ్ కాంగ్రెస్‌పై నిందలేయడం మానుకోవా లని పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. -
‘జయపై మేం శ్వేతపత్రం విడుదల చేయం’
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వైద్యం నుంచి మృతి చెందిన వరకు జరిగిన పరిణామాలపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు ఏఐఏడీఎంకే నిరాకరించింది. డీఎంకే చేసిన డిమాండ్‌కు ససేమిరా అంది. జయ మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని, ఆమెకు వైద్యం జరిపినప్పటి నుంచి చనిపోయేవరకు ఏమేం జరిగాయో వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ డీఎంకే అధినేత కరుణానిథి తనయుడు ఎంకే స్టాలిన్ డిమాండ్ చేసిన విషయం విధితమే. జయలలితపై ఆమె నిచ్చెలి శశికళ విష ప్రయోగం చేశారని, ఆమె ఆస్పత్రిలో ఉండగానే రాజకీయ వేదికకోసం ప్రయత్నాలు చేసి, అవి పూర్తయ్యాకే జయ మరణ వార్త అర్థరాత్రి ప్రకటించడమే కాకుండా అదే రాత్రి పన్నీర్ సెల్వంతో పదవీ ప్రమాణం చేయించారంటూ పలు కథనాలు రావడంతోపాటు పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. అదే సమయంలో సుప్రీంకోర్టులో కొందరు ఇదే విషయంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పిటిషన్లు కూడా వేశారు. ఈ నేపథ్యంలోనే స్టాలిన్ కూడా అదే డిమాండ్ చేశారు. -
బీసీ రిజర్వేషన్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి
కర్నూలు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవపూజ ధనుంజయాచారి, బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మికాంతయ్య కోరారు. గురువారం స్థానిక బీసీ భవన్లో బీసీ సంఘాల ఐక్యవేదిక సమావేశం జరిగింది. బీసీలకు నష్టం కలగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామంటున్న ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తారో వివరించాలని వారు డిమాండ్ చేశారు. కాపులు, బీసీల మధ్య తగవు పెట్టి ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. బీసీ జేఏసీ నాయకులు హేమంత్‌గౌడ్, బీసీ అభివృద్ధి బోర్డు అధ్యక్షుడు జలం శ్రీను, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు బత్తుల అశోక్‌రాజ్, ప్రధాన కార్యదర్శి బోయ అశోక్, నాయకులు మద్దయ్య, వెంకట్రాముడు పాల్గొన్నారు. -
'ఎన్నికలొస్తే 50 శాతానికిపైగా సీట్లు కాంగ్రెస్ వే'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న వేల కోట్లు నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. రుణమాఫీ, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని నిలదీశారు. కేసీఆర్ కు తన సర్వేపై నమ్మకం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా 50 శాతానికిపైగా సీట్లు కాంగ్రెస్ కు రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికప్పుడు ఎన్నికలొస్తే టీఆర్ఎస్ ఇంటికి వెళ్లక తప్పదని అన్నారు. మైనారిటీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కేసీఆర్ సర్కారు అమలు చేయలేదని, 12శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న వాగ్దానాన్ని మర్చిపోయిందని విమర్శించారు. మొత్తం 7వేల షాదీ ముబారక్ దరఖాస్తులు, 1.60 లక్షల రుణ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. తమ హయాంలో నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వటంతో 10 లక్షల మంది మైనారిటీలకు ఉద్యోగాలు దొరికాయని చెప్పారు. -
'పదవి కోసం అడగని హామీలు కూడా ఇచ్చారు'
ద్వారకాతిరుమల: కాపులకు రుణాలిచ్చామని ఆర్భాటం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అర్హులైన వారికి ఎందరికి రుణాలిచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఆదివారం నిర్వహించిన కాపునాడు కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో గడపగడపకూ వెళ్లి కాపులకు హామీలు ఇచ్చింది చంద్రబాబేనన్నారు. సీఎం పదవి కోసం కాపులకు అడగని హామీలు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. రెండేళ్లు దాటినా ఆ హామీల్ని నెరవేర్చకపోగా ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. ఈ కారణంగానే కాపులంతా ఉద్యమబాట పట్టాల్సి వచ్చిందని చెప్పారు. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై డిసెంబర్ నెలాఖరు నాటికి స్పష్టత ఇవ్వాలని, లేదంటే కార్యాచరణ రూపొందించి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రానికి ఇతర కులాలకు చెందిన అధికారులను ఎందుకు తీసుకురాలేదని ముద్రగడ నిలదీశారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో ఢిల్లీ, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు తీసుకొచ్చిన అధికారుల పూర్తి వివరాలు తెలియజేయాలని కోరారు. -
అభివృద్ధిపై శ్వేతపత్రం ఇవ్వాలి: రావుల
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల పాలనలో ఏవేవో సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం జరిగిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రె డ్డి డిమాండ్ చేశారు. ఎస్టీ, మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్ అమలు అడ్రస్ లేకుండా పోయిందని, తెలంగాణ అమరవీరుల చిరునామాలు కూడా కనుక్కోలేక పోయారని విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కేవలం 231 కరువు మండలాలనే ప్రకటించి మిగిలిన మండలాల కష్టాలను పట్టించుకోక పోవడం సరికాదని అన్నారు. మిషన్ కాకతీయలో సబ్ కాంట్రాక్టులన్నీ టీఆర్ఎస్ నేతలవి కాదా? అని ప్రశ్నించారు. -
శ్వేతపత్రం విడుదల చేయాలి
♦ హామీల అమలుపై షబ్బీర్‌అలీ డిమాండ్ ♦ సర్కారు ఫిరాయింపులు, ఉప ఎన్నికలు, ఉత్సవాలు తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు, అమలైన కార్యక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు టి.జీవన్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలతో కలసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలుచేసినట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం పూర్తిగా అబద్ధమన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో పార్టీ ఫిరాయింపులు, ఉప ఎన్నికలు, ఉత్సవాలు చేయడం తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా రాష్ర్ట అవతరణ ఉత్సవాల ఏర్పాట్లులో మునిగిపోయిందన్నారు. తీవ్రమైన కరువులో ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఉత్సవాల పేరిట కాలయాపన చేస్తున్నారని షబ్బీర్‌అలీ ఆరోపించారు. భౌగోళిక పరిస్థితులు, జనాభా, మౌలిక వసతులను పరిగణనలోకి తీసుకుని శాస్త్రీయంగా కొత్త జిల్లాలను ఏర్పాటుచేయాలని కోరారు. దీనికోసం అన్ని పార్టీలను, నిపుణులను సంప్రదించాలని సూచించారు. ఇళ్లకు నిధులేవీ?: జీవన్‌రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి నిధులు ఇవ్వకుండా ఎలా పూర్తిచేస్తారని సీఎల్పీ ఉపనాయకుడు జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఒక ఇంటికి కేవలం రూ.5.40 లక్షలను కేటాయించారని, వీటితో పూర్తిచేయడం సాధ్యంకాదని అన్నారు. వచ్చే మార్చిలోగా 2 లక్షల ఇళ్లను నిర్మించి పాపాలను కడిగేసుకోవాలని సూచించారు. రహస్య ఎజెండా: పొంగులేటి ఆర్డీఎస్ విషయంలో రాష్ట్రాల మధ్య వివాదాలను పెంచడం వెనక టీఆర్ఎస్, టీడీపీల రహస్య ఎజెండా ఉందని పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. నదీ జల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోకుండా ఎందుకు జఠిలం చేస్తున్నారని ప్రశ్నించారు. -
'ఆ నిధులు తాత్కాలిక సచివాలయానికే మళ్లించాం'
విజయవాడ: కేంద్రం నిధులను తాత్కాలిక సచివాలయానికి ఏపీ ప్రభుత్వం మళ్లిస్తుందని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. శనివారం యనమల విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు రాజధాని కోసం రూ. 1,850 కోట్లను కేంద్రం మంజూరు చేసినట్టు ఆయన గుర్తు చేశారు. వెయ్యి కోట్లు తాత్కాలిక సచివాలయానికి మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. కేంద్రం నిధులనే తాత్కాలిక సచివాలయానికి ఖర్చు చేస్తున్నామన్నారు. వెయ్యి కోట్లు తాత్కాలిక సచివాలయానికి ఖర్చు చేస్తామని యనమల చెప్పారు. దాంతో వినియోగం తర్వాత తాత్కాలిక సచివాలయం కమర్షియల్ కాంప్లెక్స్‌గా మారనున్నది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని యనమల చెప్పారు. కేంద్రం రూ. లక్షా 43 వేల కోట్లు ఇచ్చారని చెబుతున్నారు.. ఆ నిధులు నేరుగా ఏపీ ప్రభుత్వం ఖాతాకు రావని ఆయన అన్నారు. వివిధ పథకాల కింద నిధులు మంజూరు చేసిన మాట వాస్తవమేనని తెలిపారు. అన్ని రాష్ట్రాలతో సమానంగానే ఏపీకి నిధులిస్తున్నారని చెప్పారు. విభజన చట్టం ప్రకారం అదనంగా రూ. 6,400 కోట్లు మాత్రమే నిధులు ఇచ్చారని యనమల అన్నారు. ఏపీ ప్రభుత్వం ఎప్పటికీ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించదని స్పష్టం చేశారు. తాము కేంద్రం నిధులను దారి మళ్లిస్తున్నామనడం వాస్తవం కాదని.. కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అడగలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అనేక సందర్భాల్లో చంద్రబాబు కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడిగారంటూ చెప్పుకొచ్చారు. బీజేపీ, టీడీపీ మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. -
ప్రాజెక్టులపై శ్వేతపత్రం ఇవ్వాలి
సీఎం కేసీఆర్‌కు విపక్షాలు, రైతు సంఘాల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాలకు సాగునీటిని ఎలా అందిస్తారో శ్వేతపత్రం ద్వారా వెల్లడించాలని సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ (రాయల), వివిధ రైతు సంఘాలు డిమాండ్ చేశా యి. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని గతంలో డిమాండ్ చేసిన టీఆర్ఎస్... ఇప్పుడు దానిని విస్మరించి, ప్రాజెక్టుల రీడిజైన్ అంటూ కొత్త ప్రణాళికలు రూపొందించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించాయి. మంగళవారం మఖ్దూంభవన్‌లో జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరిగింది. చాడ వెంకటరెడ్డి(సీపీఐ), జంగారెడ్డి(సీపీఎం), దాసోజు శ్రవణ్(కాంగ్రెస్), వంటేరు ప్రతాప్‌రెడ్డి(టీడీపీ), వేములపల్లి వెంకటరామయ్య (న్యూడెమోక్రసీ-రాయల), పీఎల్ విశ్వేశ్వరరావు(ఆప్), నైనాల గోవర్దన్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు, జల సంఘం అనుమతులు లేకుండానే శంకుస్థాపనలు చే యడం చట్టవిరుద్ధమని నేతలంతా అభిప్రాయపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు రూ.2వేల కోట్లు కేటాయిస్తే 8 లక్షల ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తే 2లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయన్నా రు. కానీ వాటిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదన్నారు. తడికపల్లి, పాములపర్తి వంటి వాటిని లిఫ్ట్‌లతో చేపట్టడమేమిటని నిలదీశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, వాటి ఉపయోగాలు, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి సమాచారంతో ఒక మెమొరాండం రూపొందించి ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, జల సంఘానికి సమర్పించాలని... ఆ నివేదికపై ప్రభుత్వం స్పందించే తీరుకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవాలని, ఈ నెల 8న మరోసారి సమావేశమై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. -
'ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి'
పాతపట్నం (శ్రీకాకుళం) : మీ ఇంటికే మీ భూమి కార్యక్రమం, జిల్లా కలెక్టరేట్లలో గ్రీవెన్స్ సెల్‌కు వచ్చిన దరఖాస్తుల్లో ఎన్నింటిని పరిష్కరించారో తెలియజేస్తూ వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వల్ల రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. వీటి ద్వారా మిల్లర్లు, దళారులకు లబ్ధి చేకూరిందన్నారు. -
'ప్రతిపక్షం అడిగే అన్ని ప్రశ్నలకూ జవాబిస్తాం'
-
'ప్రతిపక్షం అడిగే అన్ని ప్రశ్నలకూ జవాబిస్తాం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన మూడు శ్వేతపత్రాలపై అసెంబ్లీలో చర్చిస్తామని ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. టీడీపీ అసెంబ్లీ స్ట్రాటజీ కమిటీ శనివారం హైదరాబాద్‌లో భేటీ అయింది. భేటీ అనంతరం మంత్రి యనమల మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షం అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తామని పేర్కొన్నారు. ఇసుక, కల్తీ మద్యం, బాక్సైట్ తవ్వకాలు అంశాలపై సభలో చర్చిస్తామని యనమల వివరించారు. -
చేసింది చెప్పకుండా జగన్‌పై ఆరోపణలా
-
'చేసింది చెప్పకుండా జగన్‌పై ఆరోపణలా'
రాజమండ్రి: బాక్సైట్ తవ్వకాలపై వాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేసి చర్చించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. బాక్సైట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విడుదల చేసిన శ్వేతపత్రంలో అన్ని అవాస్తవాలే ఉన్నాయని ఉండవల్లి ఆరోపించారు. తాము చేసింది చెప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. యనమలతో ఎందుకు అబద్ధాలు చెప్పిస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా వాస్తవాలతో శ్వేతపత్రాలు విడుదల చేసి దానిపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. గతంలో వైఎస్ఆర్ ఇలాగే చేసేవారని గుర్తు చేశారు. -
అదో అబద్ధాల పత్రం
-
అదో అబద్ధాల పత్రం
సీఎం శ్వేతపత్రంపై బృందాకారత్ విసుర్లు సభలో తీర్మానం ఎవరు చేశారు? చంద్రబాబుకు జర్రెల మాజీ సర్పంచ్ సూటిప్రశ్న బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గర్జించిన గిరిజనం చింతపల్లి: బాక్సైట్ తవ్వకాల విషయమై జర్రెల పంచాయతీ గ్రామసభలో తీర్మానించినట్టు శ్వేతపత్రంలో సీఎం చంద్రబాబునాయుడు పేర్కొనడం దారుణమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అన్నారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా సోమవారం చింతపల్లిలో ‘గిరిజనగర్జన’ చేపట్టారు. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ ఆది నుంచి ఆదివాసీలంతా బాైక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారని అన్నారు. 2008లో జర్రెల పంచాయతీ సర్పంచ్‌గా టీడీపీ మద్దతుదారుడైన సాగిన వెంకటరమణ ఉన్నారని, ఆయనే తీర్మానం చేసిందీ లేనిదీ చెబుతారన్నారు. దీంతో వేదికపైకి వచ్చిన ఆయన మాట్లాడుతూ 2008లో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారని, ఆ సమయంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడాలని తమకు చెప్పేవారని, అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తాము ఖనిజ తవ్వకాలకు అనుకూలంగా తీర్మానం ఎలా చేస్తామని ప్రశ్నించారు. చంద్రబాబు శ్వేతపత్రంలో ఏ మాత్రం నిజంలేదని, గిరిజనులంతా దీనిని గమనించాలన్నారు. అప్పటి పంచాయతీ తీర్మాన పుస్తకాన్ని సభలో పెట్టారు. అనంతరం బృందాకారత్ మాట్లాడుతూ సొంత పారీ ్టవారినే మోసం చేయగలిగే చంద్రబాబుకు గిరిజనులు ఒక లెక్కా అన్నారు. ఐదో షెడ్యూల్ ప్రకారం గిరిజనుల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రభుత్వాలకు లేదన్నారు. దొడ్డిదారిలో బాక్సైట్ తవ్వేందుకే చంద్రబాబు గిరిజన సలహామండలి ఏర్పాటు చేయలేదన్నారు. అటవీ హక్కుల చట్టం అమలయ్యేలా పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. జర్రెల ప్రాంతంలో కేవలం 42 మంది మాత్రమే అటవీ భూముల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు ప్రభుత్వం చెబుతోందని, అక్కడున్న మిగిలిన వారంతా మనుషులు కాదా అని ఆమె ప్రశించారు. మాజీ ఎంపీ మిడియం బాబూరావు మాట్లాడుతూ రాష్ట్రం శాంతియుతంగా ఉండాలని తాము కోరుకుంటున్నామన్నారు. ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. బాక్సైట్ తవ్వకాలతో అడవులు నాశనమై గిరిజనుల మనుగడ దెబ్బతింటుందని గతంలో గగ్గోలు పెట్టిన టీడీపీ నేతలు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. మన్యంలోని టీడీపీ నేతలు గిరిజనులను మోసం చేయకుండా చిత్తశుద్ధితో ఉద్యమాలు చేయాలని కోరారు. సీపీఎం నాయకులు సీహెచ్ నర్సింగరావు, లోక్‌నాధం, ప్రభావతి, కిల్లో సురేంద్ర, బి.చిన్నయ్యపడాల్, సీపీఐ నాయకులు బి.రామరాజ్యం, గిరిజనసంఘం నాయకులు జి.సత్యనారాయణ, కె.బలరామ్, పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
శ్వేతపత్రం కాదు అబద్ధాల పత్రం
అల్లీపురం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇసుక విధానంపై విడుదల చేసిన శ్వేతపత్రం అబద్ధాల పత్రంగా ఉందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొయ్యప్రసాద్ రెడ్డి విమర్శించారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రవేశపెట్టిన ఇసుక విధానం వల్ల మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కోట్లకు పడగలెత్తారే కానీ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఈ ఇసుక విధానం వల్ల సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదన్నారు. బాక్సైట్ తవ్వకాలపై గిరిజనుల ఆందోళనతో వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల ఒత్తిడి మేరకు మళ్లీ అనుమతులిచ్చేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. బాక్సైట్ తవ్వకాలపై గిరిజనులకు అండగా పోరాడతామని, అలా కాకుండా ప్రభుత్వం ముందుకు వెళ్లితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. -
బాబు ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారం చేపట్టిన పద్దెనిమిది నెలల కాలంలో ప్రత్యేక విమానాల్లో పర్యటనలకు చేసిన ఖర్చుపై శ్వేత పత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాధనానికి ధర్మకర్తల వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ హెలికాఫ్టర్‌లో పర్యటించాల్సిన సీఎం ప్రత్యేక విమానాల్లో ఎందుకు పర్యటిస్తున్నారో స్పష్టం చేయాలన్నారు. రాష్ర్టంలో ఏదో మూల రైతు ఆత్మహత్యలు జరగుతూనే ఉన్నాయన్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు ఉండగా 5వేల ఎకరాల్లో మంగళగిరిలో ఎయిర్‌పోర్టు ఎందుకు నిర్మించాలనుకుంటున్నారో స్పష్టం చేయాలన్నారు. సింగపూర్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను బహిర్గతం చేయాలన్నారు. రహస్య ఎజెండాతో రాజధాని నిర్మాణం పేరిట వేల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రజా రాజధాని నిర్మించాలని కోరారు. -
పట్టిసీమపై శ్వేతపత్రం విడుదల చేయాలి
రాజమండ్రి: పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబుకు రూ.300 కోట్లు క్విక్ బ్యాక్ ముట్టాయని ఆరోపించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ తీరుపై ప్రభుత్వ వైఖరిని ప్రజలకు తెలియజేసేందుకే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బస్సుయాత్ర చేపడుతున్నారని తెలిపారు. -
శ్వేతపత్రం విడుదల చేయాలి: జేపీ
విజయవాడ బ్యూరో: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ... సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. ‘తెలుగు ప్రజల భవిత కోసం’ అనే నినాదంతో ఆదివారమిక్కడ సంకల్పదీక్ష చేపట్టారు. మౌనదీక్ష ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ర్టం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ఒకవైపు చెబుతూనే మరోవైపు దుబారాఖర్చులు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థికస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. పోలవరం ప్రోజెక్టుకు నిర్దేశించిన వ్యయం రూ.16వేల కోట్లకు నెలకు నూటికి రూపాయి వడ్డీ లెక్కగట్టినా రూ.1,900 కోట్లు అవుతుందన్నారు. అటువంటి ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయించి నాలుగేళ్లలో పూర్తి చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఈ నెల 15న హైదరాబాద్‌లో రాజకీయ పార్టీ నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు.ప్రత్యేక హోదా తదితర డిమాండ్లపై రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు చెందిన విద్యార్ధులు ఈ నెల 16న కనీసం రెండు గంటలపాటు మానవహారాలు, ప్రదర్శనలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. దీక్షలో లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు శ్రీవాస్తవ, జాతీయ కార్యదర్శి హైమా ప్రవీణ్, రాష్ట్ర అధ్యక్షుడు కామినేని పట్టాభిరామయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబ్జి, విజయవాడ నగర అధ్యక్షుడు బి.అశోక్‌కుమార్ పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నగరంలో బహిరంగంగా దీక్ష చేపట్టేందుకు పోలీసులు అనుమతించపోవడంతో ఐఎంఏ హాలులో జేపీ సంకల్ప దీక్ష చేపట్టారు. -
'పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి'
హైదరాబాద్: తన జపాన్ పర్యటన విజయవంతం అయిందని చంకలు గుద్దుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చే నాలుగేళ్లలో జపాన్, సింగపూర్ దేశాల నుంచి నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయో వివరిస్తూ ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్ సీపీ శాసనసభాపక్షం సమన్వయకర్త ఆదిమూలం సురేష్ డిమాండ్ చేశారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, అనంతపురంలో నిర్మించాలని తలపెట్టిన మొత్తం పదివేల మెగావాట్ల విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన కుదుర్చుకున్న ఒప్పందాలు (ఎంఓయులు) ఏమైనా ఉంటే వాటిని, చంద్రబాబుకు జపాన్ ప్రధానమంత్రి ఏవైనా స్పష్టమైనహామీలు ఇచ్చి ఉంటే వాటిని ప్రజలకు తెలియజేయాలని కోరారు. సోమవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు జపాన్ పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. జపాన్ లోని ఆ దేశపు అంతర్జాతీయ సంస్థలైన ‘జట్రో’, ‘జెపిఐసీ’, ‘ఎన్ఇడీఓ’, ‘జైకా’ వంటి సంస్థలతో సమావేశమైన తీరు, అక్కడ జరిగిన హడావుడి చూసి రాష్ట్రానికి ఎన్నో ఒప్పందాలతో వస్తారని ఆశిస్తే ‘నమ్మకం కుదిరితేనే పెట్టుబడులు పెడతారు’అని చంద్రబాబు చావు కబురు చల్లగా చెప్పారని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో 9 ఏళ్లు సుదీర్ఘకాలం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఉమ్మడి రాష్ట్రానికి పెట్టుబడులు ఎందుకు రాలేదు, అపుడు లేని నమ్మకం ఈ ఆరు నెలల్లోనే ఎలా కుదిరిందని సురేష్ ప్రశ్నించారు. పైగా ఇంతకుముందే చేసుకున్న ఒప్పందాలను మళ్లీ కొత్తవిగా చూపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ఆయన సూటిగా ప్రశ్నించారు. పెట్టుబడులు తెస్తానని ప్రగల్భాలు పలుకుతూ జపాన్, సింగపూర్, దావోస్‌కు వెళ్లి చివరికి ఈ రాష్ట్రాన్ని సోమాలియా, ఉగాండాలాగా ఎక్కడ మార్చేస్తారోనని రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు. విదేశీ పర్యటనలతోనే పెట్టుబడులు వస్తాయనుకుంటే గతంలో చంద్రబాబు భాగస్వామ్య సదస్సులు నిర్వహించి లక్షలాది కోట్లు పెట్టుబడులు వస్తాయన్నారని, చివరికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారు విభజన తరువాత ఏర్పడిన రాష్ట్రంలో వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారని, అలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా విదేశీ పర్యటనలకు వెళ్లడం ఏమిటని సురేష్ ప్రశ్నించారు. జపాన్ డెస్క్ ఏర్పాటు చేస్తామని, జపాన్ భాష నేర్చుకోవడానికి కోర్సులు ప్రవేశ పెడతామని చంద్రబాబు చెబుతున్న వాటిల్లో కొత్తవేమీ లేవని ఆయన అన్నారు. జపాన్ భాష నేర్చుకోవడమనే ప్రక్రియ దేశంలోఎప్పటి నుంచో ఉందని, ఇదేదో ఇపుడే కొత్తగా ప్రవేశ పెడుతున్నట్లు చంద్రబాబు చెప్పడం రాష్ట్ర ప్రజలకు మభ్యపెట్టడమేనని ఆయన అన్నారు. జపాన్ భాష నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉందని అయితే చంద్రబాబు కన్నా ముందే మన దేశంలో చాలా సంస్థలు ఈ భాషను నే ర్పిస్తున్నాయనే విషయం గమనించాలని ఆయన అన్నారు. 2000 సంవత్సంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ‘జపాన్ ప్రొఫియన్సీ టెస్ట్’ నిర్వహణ కోసం హైదరాబాదŠలో కేంద్రమే లేదని, అపుడు ప్రథమంగా చెన్నైలో కేంద్రాన్ని పెట్టారని సురేష్ గుర్తు చేస్తూ అపుడు ముఖ్యమంత్రి ఏం చేస్తూ ఉన్నారని ప్రశ్నించారు. జపాన్ భాష పేరు చెప్పి ప్రజలను తపšదోవ పట్టించడం తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు. తన విదేశీ పర్యటనలపై చంద్రబాబు మాయమాటలు చెప్పకుండా రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంపై శ్రద్ధ వహించాలని ఆయన అన్నారు. ఆందోళనను ‘ఈవెంట్’ అంటారా! పింఛన్ల తొలగింపు, రైతుల రుణాలు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ చేయకపోవడం వంటి ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 5న వైఎస్సార్ సీపీ అన్ని జిల్లా కేంద్రాల్లో చేయతలపెట్టిన మహాధర్నాలు ఈవెంట్ మేనేజర్ల సహకారంతో చేస్తున్నారని టీడీపీ అనుకూల పత్రిక ఒకటి రాసిన కథనాన్ని సురేష్ తీవ్రంగా ఖండించారు. ప్రజల పక్షాన చేస్తున్న పోరాటాన్ని ‘ఈవెంట్’ అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవెంట్ మేనేజర్ల అవసరం తమకు లేదని, చంద్రబాబు విదేశీ పర్యటనలూ, ఆయన చేసుకునే ప్రచారార్భాటానికే వారి సహకారం తీసుకుంటున్నారన్నారు. -
ఆర్థికస్థితిపై శ్వేతపత్రం
* వచ్చే బడ్జెట్‌లోగా ప్రవేశపెడతాం... అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన * ‘మెట్రో’ భూములపై చర్చకు సిద్ధం * బీసీలకూ ‘కల్యాణలక్ష్మి’ పరిశీలిస్తాం * ఎస్టీ రిజర్వేషన్లపై కమిషన్ వేస్తాం * తమిళనాడు తరహా చట్టానికి యోచన * ఖాళీల లెక్క తేలాక ఉద్యోగాల భర్తీ * మూడేళ్లలో 20 వేల మెగావాట్ల విద్యుత్ * దళితుల భూమిలో సర్కారు పెట్టుబడి * ప్రభుత్వ స్థలాల్లో ఉన్న పేదలకు * పట్టాలిస్తామని ముఖ్యమంత్రి హామీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. డిసెంబర్ నాటికి వాస్తవ పరిస్థితిపై స్పష్టమైన అవగాహన వస్తుందని, వచ్చే బడ్జెట్‌లోగా శ్వేతపత్రం అందిస్తామని ఆయన అసెంబ్లీలో తెలిపారు. శుక్రవారం బడ్జెట్‌పై చర్చకు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సమాధానం తర్వాత విపక్ష నేతలు లేవనెత్తిన పలు అంశాలకు ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. ‘ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రవేశపెట్టేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. కొన్ని సందర్భాల్లో ఉన్నోళ్లమని చెప్పుకుంటే మంచిదా.. లేనోళ్లమని చెబితే బాగుంటుందా.. అని ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు జనాభా నియంత్రణలో మన రాష్ట్రం ప్రగతి కనబరిచింది. జనాభా వృద్ధి తగ్గింది. ప్రోత్సాహకంగా కేంద్రం మనకే ఎక్కువ నిధులివ్వాలి. కానీ, జనాభా ప్రాతిపదికన రావాల్సిన నిధులు తగ్గిపోయాయి. కొత్త రాష్ట్రం కావడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు కొన్ని ఇప్పటికీ ఏపీ ఖాతాలో జమవుతున్నాయి. వచ్చే బడ్జెట్ నాటికి ఆర్థిక స్థితిగతులపై పూర్తి స్పష్టత వస్తుంది’ అని కేసీఆర్ పేర్కొన్నారు. కడుపు, నోరు కట్టుకున్నాం.. హైదరాబాద్‌లో మెట్రో పనులు శరవేగంగా జరుగుతున్నాయని సీఎం తెలిపారు. ‘మెట్రో భూములపై అన్ని పత్రాలు సభ ముందుంచుతాం. అన్నింటిపై చర్చిస్తాం. మెట్రో భూముల బండారం బయటపడాల్సిందే. మెట్రోకు సంబంధించిన అంగుళం భూమిని కూడా ప్రభుత్వం ఎవ్వరికీ ఇవ్వలేదు. మేం తప్పులు చేయాలని కొందరు కోరుకుంటున్నారు. కానీ అలాంటి పరిస్థితి రానివ్వం. కడుపు, నోరు కట్టుకొని పని చేస్తున్నాం. ప్రపంచంలోనే వేగంగా జరుగుతున్న మెట్రో పనుల్లో హైదరాబాద్ ముందుం ది. అవసరమైతే డబ్బులు ఎక్కువ చెల్లించైనా భూసేకరణ చేస్తాం. అనుకున్న సమయంలో పనులు పూర్తవుతాయి’ అని వివరించారు. ‘కల్యాణ లక్ష్మి’ పథకం అమలు తీరును పరిశీలించిన తర్వాత.. దాన్ని బీసీ వర్గాలకూ విస్తరించే ఆలోచన ఉందని చెప్పారు. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లపై కమిటీని నియమిస్తామని సభలో ప్రకటించారు. ‘వాల్మీకి బోయ, కాయిత లంబాడీ, మరికొన్ని ఉప కులాలను కలిపితే గిరిజనుల జనాభా 11 శాతానికి చేరుతుందని అంచనా వేశాం. తమిళనాడు తరహాలో చట్టం తీసుకురావాలనే ఆలోచన ఉంది’ అని కేసీఆర్ పేర్కొన్నారు. లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని డబ్బా కొట్టుకునే ఆలోచన తమకు లేదని సీఎం అన్నారు. ప్రభుత్వ పోస్టులు, ప్రభుత్వరంగ సంస్థల్లోని ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామన్నారు. ‘ఉద్యోగుల పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. తర్వాతే ఖాళీల సంఖ్య లెక్క తేలుతుంది. అవన్నీ భర్తీ చేస్తాం. ఐటీఐఆర్ ప్రాజెక్టుతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. విప్రోలో 5 వేల ఉద్యోగాలు, టీసీఎస్‌లో మరో 28 వేల మందికి ఉపాధి కల్పించేందుకు ఆ కంపెనీలు ఇప్పటికే ముందుకొచ్చాయి’ అని చెప్పారు. విద్యుత్ విషయంలో అద్భుతాలు విద్యుత్ విషయంలో తామేం అద్భుతాలు సృష్టించడం లేదని, కానీ అద్భుతాలు జరుగుతాయని సీఎం వ్యాఖ్యానించారు. ‘ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుపై అనుమానాలేమీ అక్కర్లేదు. ప్రైవేట్ ప్లాంట్లతో సంబంధం లేకుండా.. నేరుగా ప్రభుత్వంతోనే ఒప్పందం చేసుకున్నాం. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ లైన్లు నిర్మాణంలో ఉన్నాయి. అంగుల్-పలాస లైన్ నాలుగైదు నెలల్లో పూర్తవుతుంది. వార్దా-డిచ్పల్లి లైనుకు మరో ఏడాదిన్నర పడుతుంది. ఏది అందుబాటులోకి వస్తే అది వినియోగించుకుంటాం. వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ ఇచ్చేం దుకు ఇంకా 1,500 మెగావాట్ల కరెంట్ కావాలి. జైపూర్, భూపాలపల్లి, కేంద్రం వాటాతో వచ్చే ఏడాది ఆగస్ట్‌నాటికి 1,500 మెగావాట్ల విద్యుత్ వస్తుంది. ఎన్టీపీసీ నుంచి 4 వేల మెగావాట్లు, బీహెచ్ఈఎల్ నుంచి 3 వేల మెగావాట్లు, జెన్కో ద్వారా మొత్తం 6 వేల మెగావాట్లు.. అన్నీ కలిపితే మూడో ఏడాది నిండేసరికి 20 వేల మెగావాట్లు అందుబాటులో ఉంటుంది. కృష్ణపట్నం, హిందుజా ప్లాంట్ల ద్వారా 2,600 మెగావాట్లలో 54 శాతం వాటా మనకు రావాల్సిందే. మన దగ్గర ఉన్న 1,800 మెగావాట్ల నుంచి 46 శాతం ఆంధ్రాకు ఇవ్వాలి’ అని వివరించారు. దళితుల భూమిలో సర్కారు పెట్టుబడి ‘గతంలో అసైన్డ్‌భూముల పంపకం అశాస్త్రీయంగా ఉందన్నారు. దళితులకు ఇచ్చిన భూమి ఇప్పుడు వాళ్ల దగ్గర లేదు. మా ఊళ్లో 90 ఎకరాలుంటే 130 మందికి పంపిణీ చేశారు. అందుకే బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లు పెట్టుకున్నాం. ముందుగా ఎకరం, రెండెకరాలున్న వారందరికీ.. మూడెకరాలుండేలా భూమి పంపిణీ చేస్తాం. ఏడాదిపాటు దళిత రైతులకు పెట్టుబడి కూడా ఇస్తాం. 3 నెలలకోసారి భూముల స్థితిగతులపై సమీక్ష జరుపుతాం’ అని సీఎం స్పష్టం చేశారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి తీరుతామన్నారు. ‘ఇళ్ల నిర్మాణంలో భారీ కుంభకోణం జరిగింది. సీఐడీ విచారణ జరుగుతోంది. ఎంతమంది జైళ్లో ఉంటారో తెలియని పరిస్థితి. అందరం కలిసి చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుందాం’ అని అన్నారు. ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్న పేదలకు పట్టాలు అందిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఫాస్ట్ పథకంతో ప్రతి పేద విద్యార్థికీ ఫీజులు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమన్నారు. గత ప్రభుత్వం నాలుగేళ్లుగా పెండింగ్‌లో పెట్టిన రూ.1,587 కోట్ల బకాయిల్లో ఇప్పటికే రూ. 500 కోట్లు చెల్లించామన్నారు. పేద విద్యార్థులకు అన్యాయం జరగకూడదనే, గతంలో రూ. 1760 కోట్లు కేటాయిస్తే ఈసారి బడ్జెట్లో రూ. 2735 కోట్లు కేటాయించినట్లు కేసీఆర్ తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ హాస్టళ్లన్నింటికీ ఫైన్ క్వాలిటీ సన్న బియ్యం సరఫరా చేస్తామన్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో ఫ్లోరైడ్ తీవ్రత ఉన్న నల్లగొండ జిల్లాకు మొదటి ప్రాధాన్యమిస్తామని సీఎం ప్రకటించారు. 104, 108 సేవలను విస్తరిస్తామని, మండలానికో 104 సర్వీసు.. 75 వేల జనాభాకో 108 అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అర్హులెవరికైనా రేషన్ కార్డులు, పింఛన్లు రాకపోతే ఉన్నతాధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్లను పంపి న్యాయం చేస్తామని సీఎం తెలిపారు. -
ఇంకా ఏపీ ఖాతాలోకే కేంద్ర నిధులు: కేసీఆర్
హైదరాబాద్: 2015-16 బడ్డెట్ ప్రవేశపెట్టడానికంటే ముందే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై తెలంగాణ ప్రభుత్వం శ్వేత ప్రభుత్వం విడుదల చేస్తుందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన ప్రశ్నకు కేసీఆర్ సమాధానమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిపై శ్వేత పత్రాన్ని విడుదల చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని అన్నారు. విభజన తర్వాత చాలా సమస్యలను పరిష్కరించాల్సి ఉందని, రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు ఆంధ్రప్రదేశ్ ఖాతాలోకి వెళ్తున్నాయని ఆయన అన్నారు. వచ్చే బడ్జెట్ కల్లా ఇలాంటి సమస్యలన్నింటికి పరిష్కారం దొరుకుతుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యుత్ సంక్షోభం, ఆర్ధిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. బడ్జెట్ పై జరిగిన సాధారణ చర్చలో తాము లేవనెత్తిన ప్రశ్నకు సమాధానమివ్వాల్సిందిగా ఈటెల రాజేందర్ ను అక్బరుద్దీన్ మరోసారి డిమాండ్ చేశారు. శ్వేతపత్రంపై మాట్లాడాల్సిందేనని అక్బరుద్దీన్ కు కాంగ్రెస్ నేత జానారెడ్డి మద్దతుగా నిలిచారు. -
ఖాళీ పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
కర్నూలు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎ.అయ్యస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సీఆర్ భవన్లో నగర కార్యదర్శి రమేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్య, వైద్యం, ఉపాధి పౌరుల ప్రాథమిక హక్కుగా గుర్తించాలన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లేక దారి తప్పుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. టెట్‌ను రద్దు చేసి ఈ విద్యా సంవత్సరం నుంచే బీఎడ్ విద్యార్థులకు ఎస్జీటీలో అవకాశం కల్పిస్తూ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి లెనిన్‌బాబు మాట్లాడుతూ జిల్లాలో నూతన పరిశ్రమలు స్థాపించి 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్నారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం శ్రీరాంనగర్, బుధవారపేట, దేవనగర్, భూపాల్‌నగర్‌కు చెందిన 50 మంది యువకులు ఏఐవైఎఫ్‌లో చేరారు. సమావేశంలో ఏఐవైఎఫ్ నగర నాయకులు శివ, అశోక్, దేవనకొండ ఎంపీటీసీ నరసన్న తదితరులు పాల్గొన్నారు. -
రూ.5 లక్షల కోట్లు అవసరం: చంద్రబాబు
హైదరాబాద్: రాష్ట విభజన సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని విభజించారని ఆయన విమర్శించారు. విభజన సమయంలో పార్టీలను సంప్రదించలేదని, విభజన అనంతరం తలెత్తే సమస్యలపై ఆలోచించలేదని ఆరోపించారు. హైదరాబాద్ లాంటి నగరం నిర్మించాలంటే రూ.5 లక్షల కోట్లు అవసరమని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధితోనే తెలంగాణకు మిగులు బడ్జెట్ ఉందన్నారు. ప్రణాళిక ప్రకారం విభజన చేసివుంటే సమస్యలు వచ్చేవి కావని, కాంగ్రెస్ నిర్వాకం వల్లే ఈ సమస్యలు వచ్చాయని విమర్శించారు. 9వ షెడ్యూల్లో 89 సమస్యలు ఉన్నాయని వెల్లడించారు. అప్పుల నిష్పత్తి ఏపీకి ఎక్కువగా, తెలంగాణకు తక్కువగా ఉందని చెప్పారు. విభజనతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, తెలుగువారి మధ్య ఐక్యత దెబ్బతిందని చంద్రబాబు అన్నారు. -
ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగింది
-
'చంద్రబాబు ఇప్పటికైనా నిజాలు చెప్పాలి'
విశాఖపట్నం: శ్వేతపత్రం పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి, శ్వేతపత్రం పరిశీలన కమిటీ ఛైర్మన్ కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. శనివారం విశాఖపట్నంలో చంద్రబాబు ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రాలపై కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... ఇప్పటికైనా చంద్రబాబు నిజాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. 2004 నుంచి 2014 వరకు రైతులకు, మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మేలు చేసిందని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. అంతేకాకుండా తమ ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్ర ప్రజలకు ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో ఇచ్చిందని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు ఇచ్చిన రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రంలోని రైతులు, మహిళలు మైక్రో ఫైనాన్స్ బారిన పడతారని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.