
రూ.5 లక్షల కోట్లు అవసరం: చంద్రబాబు
హైదరాబాద్: రాష్ట విభజన సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని విభజించారని ఆయన విమర్శించారు. విభజన సమయంలో పార్టీలను సంప్రదించలేదని, విభజన అనంతరం తలెత్తే సమస్యలపై ఆలోచించలేదని ఆరోపించారు.
హైదరాబాద్ లాంటి నగరం నిర్మించాలంటే రూ.5 లక్షల కోట్లు అవసరమని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధితోనే తెలంగాణకు మిగులు బడ్జెట్ ఉందన్నారు. ప్రణాళిక ప్రకారం విభజన చేసివుంటే సమస్యలు వచ్చేవి కావని, కాంగ్రెస్ నిర్వాకం వల్లే ఈ సమస్యలు వచ్చాయని విమర్శించారు.
9వ షెడ్యూల్‌లో 89 సమస్యలు ఉన్నాయని వెల్లడించారు. అప్పుల నిష్పత్తి ఏపీకి ఎక్కువగా, తెలంగాణకు తక్కువగా ఉందని చెప్పారు. విభజనతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, తెలుగువారి మధ్య ఐక్యత దెబ్బతిందని చంద్రబాబు అన్నారు.