పది గంటల్లోనే సినిమా పూర్తి.. ఎమ్మెల్యే రోజా అభినందనలు | MLA Roja Comments On White Paper Movie | Sakshi
Sakshi News home page

పది గంటల్లోనే సినిమా పూర్తి.. ఎమ్మెల్యే రోజా అభినందనలు

Published Sun, Dec 5 2021 7:48 AM | Last Updated on Sun, Dec 5 2021 7:50 AM

MLA Roja Comments On White Paper Movie - Sakshi

‘‘చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలు లేవు. కథ బాగుండి ప్రేక్షకులను ఆకట్టుకునే ఏ సినిమా అయినా పెద్ద సినిమాయే. తమి ళంలో ‘స్వయంవరం’ సినిమాను 24 గంటల్లో పూర్తి చేశాం. పది గంటల్లోనే ‘వైట్‌ పేపర్‌’ను పూర్తి చేసిన టీమ్‌కి నా అభినందనలు. అభి హీరోగా నటించిన ఈ సినిమా హిట్‌ కావాలి’’ అని ప్రముఖ నటి, నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. అదిరే అభి, అభినయ కృష్ణవాణి, తల్లాడ సాయికృష్ణ, స్నేహ, నందకిశోర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వైట్‌ పేపర్‌’. శివ దర్శకత్వంలో శివ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను రోజా విడుదల చేశారు. ‘‘నాలుగు కెమెరాలతో ఈ సినిమాని షూట్‌ చేశాం. మా ప్రయత్నానికి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ వారు సత్కరించారు. త్వరలో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ఎక్కనుంది’’ అన్నారు అభి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement