జబర్దస్త్ నటుడు పంచ్ ప్రసాద్ కిడ్నీ సమస్యతో ఇబ్బందిపడుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయనకు యశోద ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరిగిందని యూట్యూబ్ ద్వారా ఆయన భార్య సునీత తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమచారం. రెండు కిడ్నీలు పాడైపోవడం వల్ల కొద్దిరోజులగా ఆయన డయాలసిస్ చేయించుకుంటూ వచ్చాడు. కానీ ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆపరేషన్ ద్వారా కిడ్నీల మార్పిడి జరిగితేనే ఆయన ప్రాణాలు నిలుస్తాయని వైద్యులు చెప్పారు. అందుకు భారీగా ఖర్చు అవుతుందని కూడా వారు తెలిపారు.
ఇదే విషయాన్ని చెబుతూ కొద్దిరోజు క్రితం జబర్దస్త్ మరో నటుడు నూకరాజు ఓ వీడియో షేర్ చేశాడు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం అయ్యే ఖర్చును ప్రసాద్ భరించలేడని అందకుగాను ఎవరైనా సాయం చేయాలని ఆయన కోరిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రముఖ జ్యోతిష్యులు అయిన వేణు స్వామి కూడా పంచ్ ప్రసాద్‌కు లక్ష రూపాయల సాయం చేశారు. అలా పలువురి సాయంతో పంచ్ ప్రసాద్ ఆపరేషన్ విజయవంతమైంది.
పంచ్ ప్రసాద్‌కు ఆపరేషన్.. అండగా ఏపీ ప్రభుత్వం
పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి మంత్రి ఆర్‌కే రోజా గతంలోనే తీసుకెళ్లారు. ఈ మేరకు స్పందించిన సీఎం జగన్.. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పంచ్ ప్రసాద్‌కు వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న పంచ్ ప్రసాద్‌కి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఏపీ ప్రభుత్వం వైద్యం అందించింది.
పంచ్ ప్రసాద్ గతంలో ఏమన్నారంటే
దీనిపై పంచ్ ప్రసాద్ స్పందిస్తూ.. 'మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్.. మీ ప్రేమ, అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. మంత్రి రోజా గారు ఇంతకుముందు కూడా నాకు చాలా సాయం చేశారు. ఈసారి నా ఆరోగ్య సమస్యను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి.. చికిత్సకు కావాల్సిన డబ్బును CMRF ద్వారా మంజూరు చేయించారు. సీఎం జగన్‌కు, మంత్రి రోజాకు చాలా థ్యాంక్స్' అంటూ పంచ్ ప్రసాద్ ఓ వీడియో రిలీజ్ చేశారు.
పంచ్ ప్రసాద్‌కు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ పూర్తి అయిందని తెలిపిన ఆయన భార్య... ప్రస్తుతం ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది ఇంకా పూర్తి వివరాలు తెలుపలేదు. కానీ త్వరలో ఆయన అందరి ముందుకు వస్తారని చెప్పారు. ఎందరో ఆశీషులతో ప్రసాద్‌కు ఆపరేషన్ జరిగిందని ఆమె చెప్పారు. ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితి అంత మెరుగ్గా లేకపోవడం వల్ల ఆయన ఆపరేషన్ చేపించుకోలేక ఇన్ని రోజులు డయాలిసిస్‌తోనే నెట్టుకొచ్చాడు. చివరకు ఏపీ ప్రభుత్వ సాయంతో తాజాగా ఆయన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ విజయవంతంగా పూర్తి అయింది.
Comments
Please login to add a commentAdd a comment