Punch Prasad
-
భార్య కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకున్న కమెడియన్
జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ (Punch Prasad) కొన్నేళ్లపాటు కిడ్నీ సమస్యతో బాధపడ్డాడు. డయాలసిస్ చేయించుకున్నప్పటికీ ఆరోగ్యం మెరుగవలేదు. రెండు మూత్రపిండాలు పాడవడంతో వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని, లేకపోతే కష్టమని వైద్యులు హెచ్చరించారు. అలాంటి సమయంలో ప్రసాద్ భార్య సునీత నేనున్నానంటూ ముందుకు వచ్చింది. తన కిడ్నీ దానం చేసేందుకు సిద్ధమైంది. అయితే డాక్టర్లు అందుకు ఒప్పుకోలేదు. వేరే కిడ్నీదాతను వెతుక్కోమన్నారు. కిడ్నీ మార్పిడి విజయవంతంఅవసరమైతే భవిష్యత్తులో మళ్లీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రసాద్ భార్య కిడ్నీ ఉపయోగిద్దామన్నారు. ఎంతో ఎదురుచూపులు, వెతుకులాట తర్వాత అతడికి కిడ్నీ దాత దొరికారు. ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చవుతుందన్నారు. అతడి విషయాన్ని అప్పటి మంత్రి ఆర్కే రోజా ఆనాటి సీఎం వైస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో చికిత్సకు కావాల్సిన డబ్బు సీఎం సహాయకనిధి ద్వారా మంజూరు చేశారు. అలా 2023లో అతడికి విజయవంతంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగింది.పంచ్ ప్రసాద్ ఎమోషనల్అప్పటి నుంచి ప్రసాద్ ఆరోగ్యంగా ఉంటున్నారు. తాజాగా అతడు తన భార్యతో కలిసి ఓ టీవీ షోకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఏ భర్తా చేయని పని తాను చేశాడు. సునీత గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రేమించుకున్నవాళ్లు కలిసి బతకడానికి పెళ్లి చేసుకుంటారు. కానీ నన్ను బతికించడం కోసమే ఆమె నన్ను పెళ్లి చేసుకుంది. నువ్వు చేసిన పనికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్న కమెడియన్మామూలుగా తల్లిదండ్రుల కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటారు కదా.. నేనూ అదే చేయాలనుకుంటున్నా అన్నాడు. అనడమే ఆలస్యం.. భార్యను కూర్చోబెట్టి తాంబూలంలో ఆమె కాళ్లు కడిగి ఆ నీళ్లను తన నెత్తిన చల్లుకున్నాడు. అది చూసి సునీత సైతం కన్నీళ్లు పెట్టుకుంది. నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆస్పత్రికి వెళ్లాలి. కానీ తన గురించి వదిలేసి నా చుట్టూ తిరిగింది అంటూ ప్రసాద్ భావోద్వేగానికి లోనయ్యాడు.చదవండి: ‘గేమ్ ఛేంజర్’ మూవీ ట్విటర్ రివ్యూ -
పంచ్ ప్రసాద్‌కు ఆపరేషన్ పూర్తి.. అండగా నిలిచిన ఏపీ ప్రభుత్వం
జబర్దస్త్ నటుడు పంచ్ ప్రసాద్ కిడ్నీ సమస్యతో ఇబ్బందిపడుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయనకు యశోద ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరిగిందని యూట్యూబ్ ద్వారా ఆయన భార్య సునీత తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమచారం. రెండు కిడ్నీలు పాడైపోవడం వల్ల కొద్దిరోజులగా ఆయన డయాలసిస్ చేయించుకుంటూ వచ్చాడు. కానీ ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆపరేషన్ ద్వారా కిడ్నీల మార్పిడి జరిగితేనే ఆయన ప్రాణాలు నిలుస్తాయని వైద్యులు చెప్పారు. అందుకు భారీగా ఖర్చు అవుతుందని కూడా వారు తెలిపారు. ఇదే విషయాన్ని చెబుతూ కొద్దిరోజు క్రితం జబర్దస్త్ మరో నటుడు నూకరాజు ఓ వీడియో షేర్ చేశాడు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం అయ్యే ఖర్చును ప్రసాద్ భరించలేడని అందకుగాను ఎవరైనా సాయం చేయాలని ఆయన కోరిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రముఖ జ్యోతిష్యులు అయిన వేణు స్వామి కూడా పంచ్ ప్రసాద్‌కు లక్ష రూపాయల సాయం చేశారు. అలా పలువురి సాయంతో పంచ్ ప్రసాద్ ఆపరేషన్ విజయవంతమైంది. పంచ్ ప్రసాద్‌కు ఆపరేషన్.. అండగా ఏపీ ప్రభుత్వం పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి మంత్రి ఆర్కే రోజా గతంలోనే తీసుకెళ్లారు. ఈ మేరకు స్పందించిన సీఎం జగన్.. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పంచ్ ప్రసాద్‌కు వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న పంచ్ ప్రసాద్‌కి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఏపీ ప్రభుత్వం వైద్యం అందించింది. పంచ్ ప్రసాద్ గతంలో ఏమన్నారంటే దీనిపై పంచ్ ప్రసాద్ స్పందిస్తూ.. 'మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్.. మీ ప్రేమ, అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. మంత్రి రోజా గారు ఇంతకుముందు కూడా నాకు చాలా సాయం చేశారు. ఈసారి నా ఆరోగ్య సమస్యను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి.. చికిత్సకు కావాల్సిన డబ్బును CMRF ద్వారా మంజూరు చేయించారు. సీఎం జగన్‌కు, మంత్రి రోజాకు చాలా థ్యాంక్స్' అంటూ పంచ్ ప్రసాద్ ఓ వీడియో రిలీజ్ చేశారు. పంచ్ ప్రసాద్‌కు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ పూర్తి అయిందని తెలిపిన ఆయన భార్య... ప్రస్తుతం ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది ఇంకా పూర్తి వివరాలు తెలుపలేదు. కానీ త్వరలో ఆయన అందరి ముందుకు వస్తారని చెప్పారు. ఎందరో ఆశీషులతో ప్రసాద్‌కు ఆపరేషన్ జరిగిందని ఆమె చెప్పారు. ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితి అంత మెరుగ్గా లేకపోవడం వల్ల ఆయన ఆపరేషన్ చేపించుకోలేక ఇన్ని రోజులు డయాలిసిస్తోనే నెట్టుకొచ్చాడు. చివరకు ఏపీ ప్రభుత్వ సాయంతో తాజాగా ఆయన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ విజయవంతంగా పూర్తి అయింది. -
సీఎం జగన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు: పంచ్ ప్రసాద్
అందరినీ నవ్వించే కమెడియన్ పంచ్ ప్రసాద్ కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రెండు కిడ్నీలు పాడవడంతో నిత్యం ఏదో ఒక జబ్బు అతని ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూనే ఉంది. అతడికి వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయకపోతే కష్టమని వైద్యులు హెచ్చరించారు. ఈ విషయాన్ని మంత్రి ఆర్కే రోజా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈమేరకు స్పందించిన సీఎం జగన్ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పంచ్ ప్రసాద్‌కు వైద్య సాయం అందించాలని ఆదేశించారు. దీంతో ఆయన ఆపరేషన్ ఖర్చులను ఏపీ ప్రభుత్వమే భరించనుంది. దీనిపై పంచ్ ప్రసాద్ స్పందిస్తూ.. 'మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్.. మీ ప్రేమ, అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. మంత్రి రోజా గారు ఇంతకుముందు కూడా నాకు చాలా సాయం చేశారు. ఈసారి నా ఆరోగ్య సమస్యను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి.. చికిత్సకు కావాల్సిన డబ్బును CMRF ద్వారా మంజూరు చేయించారు. సీఎం జగన్‌కు, మంత్రి రోజాకు చాలా థ్యాంక్స్' అంటూ పంచ్ ప్రసాద్ ఓ వీడియో రిలీజ్ చేశారు. చదవండి: బాలీవుడ్లో కన్నా సౌత్‌లో నెపోటిజం ఎక్కువ: అవికా గోర్ -
జబర్దస్త్ పంచ్ ప్రసాద్ వైద్యానికి సీఎం రిలీఫ్ నుంచి సహాయం
-
పంచ్ ప్రసాద్‌కు ఆపరేషన్.. అండగా ఏపీ ప్రభుత్వం
జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. రెగ్యులర్‌గా డయాలసిస్ చేయించుకుంటున్నా ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో మరోసారి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉందని జబర్దస్త్ కమెడియన్ నూకరాజు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. (ఇది చదవండి: విషమంగా పంచ్ ప్రసాద్ ఆరోగ్యం.. ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు!) వీలైనంత త్వరగా అతడికి ఆపరేషన్ చేయాలని, అందుకు చాలా ఖర్చవుతుందని, దాతలు సాయం చేయాలని కోరాడు. పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో రిలీజ్ చేశారు. పంచ్ ప్రసాద్‌కు ఆపరేషన్.. అండగా ఏపీ ప్రభుత్వం పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు మంత్రి ఆర్కే రోజా. ఈ మేరకు స్పందించిన సీఎం జగన్.. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పంచ్ ప్రసాద్‌కి వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న పంచ్ ప్రసాద్‌కి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఏపీ ప్రభుత్వం వైద్యం చేయిస్తోంది. అంతకుముందు ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి కార్యక్రమాలన్నీ పర్యవేక్షించే డాక్టర్ మామిడి హరికృష్ణకు ఒక నెటిజన్ ట్యాగ్ చేశారు. దీంతో ఈ విషయంపై సీఎం ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ హరికృష్ణ స్పందించారు. ఇప్పటికే తమ టీం పంచ్ ప్రసాద్ కుటుంబసభ్యులతో టచ్‌లో ఉందని వెల్లడించారు. వారితో లెటర్ ఆఫ్ క్రెడిట్ అప్లై చేసేందుకు ప్రయత్నాలు చేసేందుకు కృషి చేస్తున్నామని ట్వీట్ చేశారు. డాక్యుమెంట్లను పరిశీలించి వీలైనంత త్వరగా క్లియర్ చేసే ప్రక్రియ మొదలవుతుందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. దీంతో మంచి ప్రసాద్‌కి త్వరలోనే సర్జరీ జరిగి ఆయన ఆరోగ్యం కుదుటపడాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. (ఇది చదవండి: రెండో పెళ్లికి రెడీ అయిన బుల్లితెర నటి తండ్రి) My team is following up with the family and guiding them in LOC application process. We will LOC under CMRF for renal transplantation as soon as we complete the documents verification.#YSJaganCares https://t.co/CAkeihv0VR — Dr Hari Krishna (@HariKrishnaCMO) June 8, 2023 -
విషమంగా పంచ్ ప్రసాద్ ఆరోగ్యం.. ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు!
జబర్ధస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ గత కొన్ని సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. రెగ్యులర్‌గా డయాలసిస్ చేయించుకుంటున్నప్పటికీ ఆయన ఆరోగ్యంలో ఎటువంటి పురోగతి లేదు. ప్రస్తుతం ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉందని జబర్దస్త్ కమెడియన్ నూకరాజు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. వీలైనంత త్వరగా అతడికి ఆపరేషన్ చేయాలని, అందుకు చాలా ఖర్చవుతుందని, దాతలు సాయం చేయాలని కోరాడు. పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని వెల్లడిస్తూ అతడి యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో నూకరాజు మాట్లాడుతూ.. 'ఎన్నో ఆస్పత్రులు తిరిగాం.. అయినా ప్రసాద్ అన్న ఆరోగ్యంలో ఎటువంటి పురోగతి కనిపించలేదు. మూడు సంవత్సరాల క్రితమే రెండు కిడ్నీలు ఫెయిలవగా అప్పటినుంచి ఆ బాధను అలాగే భరిస్తున్నాడు. ఈ కిడ్నీ సమస్య ఉన్నవారికి ఒకదాని వెనుక ఒకటి జబ్బులు వస్తూనే ఉంటాయి. అన్న విషయంలోనూ అదే జరిగింది. వీలైనంత త్వరగా అతడికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించాలని వైద్యులు చెప్పారు. లేదంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. కిడ్నీ ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చవుతుంది. చేతులెత్తి వేడుకుంటున్నా.. దయచేసి మీకు తోచినంత సాయం చేయండి' అని సాయం కోసం అర్థించాడు నూకరాజు. ఈ వీడియోలో పంచ్ ప్రసాద్ ముఖానికి ఆక్సిజన్ మాస్కు పెట్టుకుని కనిపించాడు. చదవండి: డేటింగ్లో బాలీవుడ్ హీరోయిన్ -
నేనే కిడ్నీ ఇద్దామనుకున్నా.. కానీ వద్దన్నారు: పంచ్ ప్రసాద్ భార్య
జబర్ధస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఆయన డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. అయితే చికిత్స తీసుకుంటున్నా ఆయన ఆరోగ్యం పూర్తిస్థాయిలో సహకరించడం లేదు. ఇటీవల రోజు రోజుకు కొత్త అనారోగ్య సమస్యలు ఆయన్ను చుట్టుముడుతున్నాయి. అయితే ప్రస్తుతం పంచ్ ప్రసాద్ అభిమానులకు ఓ శుభవార్త చెప్పింది ఆయన భార్య. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సి ఉండగా.. ఒక కిడ్నీ దొరికిందని ఆమె తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెల్లడించింది. పంచ్ ప్రసాద్ భార్య మాట్లాడుతూ.. 'ఫస్ట్ నేనే కిడ్నీ ఇద్దామనుకున్నా. ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ముందు నాకు అన్ని టెస్టులు చేశారు. అన్నింటిలోనూ మ్యాచ్ అయ్యాయి. కానీ ఆయనది వయసు చిన్నది కావడంతో డాక్టర్లు వద్దన్నారు. బయట నుంచి తీసుకుందాం అని చెప్పారు. మళ్లీ భవిష్యత్తులో సమస్యలు వస్తే మీ కిడ్నీ తీసుకునేలా ప్లాన్ చేద్దాం అన్నారు. ప్రస్తుతమైతే ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు వెళ్తున్నాం. మీ అందరికీ చెప్పడానికి కారణం ఏంటంటే.. ఆయన ఆరోగ్యం కోసం ఇప్పటికీ చాలా టెస్టులు జరిగాయి. ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి ఆయన అభిమానులందరికీ తెలియజేయడం కోసం వీడియో చేశా. మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్స్. ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీతో పంచుకుంటూ ఉంటా. ఇలాంటి వీడియోలు పెడుతున్నందుకు ఏం అనుకోవద్దు. ఇది కేవలం మా ఛానెల్ ఆదరిస్తున్న వారందరికీ తెలియజేయడం కోసమే. మీ అందరీ ఆశీర్వాదంతోనే ఆయన కోలుకుంటున్నారని భావిస్తున్నా' అని అన్నారు. -
పంచ్ ప్రసాద్‌కు తీవ్ర అనారోగ్యం.. మరోసారి ఆస్పత్రికి!
జబర్ధస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ గత కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఆయన డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. రెగ్యులర్‌గా డయాలసిస్ చేయించుకుంటున్నా ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాలేదు. అంతే కాకుండా రోజు రోజుకు కొత్త అనారోగ్య సమస్యలు ఆయన్ని చుట్టుముడుతున్నాయి. ఇటీవలే తీవ్రమైన జ్వరంతో ఆస్పత్రిలో పంచ్ ప్రసాద్ మరోసారి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం గొంతు సమస్యతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన భార్య తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకున్నారు. (ఇది చదవండి: ‘పుష్ప -2’ టీజర్.. ఐకాన్ స్టార్ దెబ్బకు యూట్యూబ్ షేక్) పంచ్ ప్రసాద్ భార్య మాట్లాడుతూ.. 'ఇప్పుడు ఆసుపత్రికి వచ్చాం. ఇప్పటికే ఆయనకు థైరాయిడ్ సమస్య ఉంది. అది మరింత తీవ్రంగా మారింది. అల్ట్రా సౌండ్ స్కానింగ్ తర్వాత రిపోర్టులు చూసిన డాక్టర్స్ సర్జరీ చేయాలని చెప్పారు. ఆయన కాలికి లెగ్ ఇన్ఫెక్షన్ కూడా ఉండడంతో సర్జరీ ఇప్పుడే వద్దని చెప్పారు. లెగ్ ఇన్ఫెక్షన్ తగ్గిన తరువాత సర్జరీ చేస్తామని డాక్టర్లు అన్నారు. మెడిసిన్స్‌తో తగ్గాలని దేవుడిని కోరుకుంటున్నా.' అని ఆమె అన్నారు. కాగా, పంచ్ ప్రసాద్ తన పేరు మీద ఓ యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్నారు. తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇది చూసిన ఆయన అభిమానులు త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. -
మళ్లీ ఆస్పత్రిలో చేరిన పంచ్ ప్రసాద్.. తీవ్రమైన నొప్పితో!
జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో పంచ్ ప్రసాద్‌కు సాయం చేసేందుకు పలువురు కంటెస్టెంట్స్ అండగా నిలిచారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పంచ్ ప్రసాద్ మరోసారి ఆస్పత్రిలో చేరారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యంపై యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఓ వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం పంచ్ ప్రసాద్ డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటిదాకా ఆయన చేతులకే దాదాపు 50 ఇంజెక్షన్స్ చేశారని పంచ్ ప్రసాద్ సతీమణి తెలిపారు. ప్రస్తుతం కాస్త బాగానే ఉన్నా.. చికిత్స తర్వాత తీవ్రమైన నొప్పి ఉంటోందని వెల్లడించారు పంచ్ ప్రసాద్. ప్రస్తుతం నడవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన భార్య తెలిపారు. ఇటీవలే తీవ్రమైన జ్వరం రావడంతో మరోసారి ఆస్పత్రిలో చేరారు కమెడియన్. నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పంచ్ ప్రసాద్ అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు. -
ఆరోగ్యంపై స్పందించిన పంచ్ ప్రసాద్, ముక్కులోంచి రక్తం...
జబర్దస్త్ కమెడియన్ ‘పంచ్’ ప్రసాద్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో పంచ్ ప్రసాద్‌కు సాయం చేసేందుకు తన తోటి కంటెస్టెంట్స్ ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ‘కిరాక్’ ఆర్పీ పంచ్ ప్రసాద్ ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు అంతా తానే భరిస్తానని ఇటీవల ఓ ఇంటర్య్వూలో వెల్లడించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం స్వల్పంగా కోలుకున్న పంచ్ ప్రసాద్ ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ సందర్బంగా తన ఆరోగ్యంపై స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. చదవండి: నన్ను పెళ్లి చేసుకుంటారా? స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్ తనకు సాయం చేసేందుకు చాలా మంది జబర్దస్త్ కంటెస్టెంట్స్ ముందుకు వచ్చారని, వారందరికీ రుణపడి ఉంటానన్నాడు. ‘పెళ్లయిన కొత్తలో నా ముక్కులో నుంచి తరచూ రక్తం రావడంతో నా భార్య ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పడే నా రెండు కిడ్నిలు పాడయ్యాయని డాక్టర్లు చెప్పారు. కిడ్ని సమస్యలు ఉన్న వారిలో ఒక్కొక్కరికి ఒక్కోలా ప్రభావం చూపిస్తుంది. నా కాలు ఎముకకు చీము రావడంతో నడవలేని స్థితికి వెళ్లిపోయా. ప్రస్తుతానికి స్వల్పంగా కోలుకున్నా. షోలు కూడా చేసుకుంటున్నా. ఇప్పుడు బాగానే నడుస్తున్నాను. త్వరలోనే ఆపరేషన్ కూడా చేయించుకోబోతున్నా’ అని చెప్పాడు. చదవండి: అంతర్జాతీయ వేదికపై ఆసక్తికర సంఘటన, స్టేజ్‌పైనే చరణ్‌కు క్షమాపణలు చెప్పిన నటి అయితే తన కాలుకు చీము రావడం వల్లే ఆపరేషన్ని వాయిదా వేశారని తెలిపాడు. ఇప్పటికే తనకి కిడ్నీ డోనర్ దొరికారని, కాలు నొప్పి తగ్గే వరకు డాక్టర్లు ఆపరేషన్ చేయమని చెప్పారని పంచ్ ప్రసాద్ పేర్కొన్నాడు. అయితే తాను త్వరగా కోలుకోవాలని చాలా మంది తన కోసం ప్రార్థించారని, ఓ అభిమాని అయితే కుటుంబంతో సహా తిరుపతి వెళ్లి కాళి నడకన ఏడుకొండలు ఎక్కాడంటూ పంచ్ ప్రసాద్ ఆసక్తిక విషయం చెప్పాడు. అప్పుడే తనని ఇంతలా అభిమానించే అభిమానులు ఉన్నారా? అని ఆశ్చర్యం వేసిందన్నాడు. అనంతరం తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞుడిని అని అన్నాడు. -
కమెడియన్ పంచ్ ప్రసాద్ ఇల్లు చూశారా?
కమెడియన్ పంచ్ ప్రసాద్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే! కిడ్నీ సంబంధ సమస్యలతో సతమతమవుతున్న ఆయనకు దగ్గరుండి వైద్యం చేయిస్తానన్నాడు కిర్రాక్ ఆర్పీ. ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుంటున్న పంచ్ ప్రసాద్ సిటీ వదిలి తన సొంతింటికి వెళ్లి వారం రోజులు అక్కడే ఉన్నాడు. ఈ సందర్భంగా తమ ఇంటిని చూపిస్తూ హోమ్ టూర్ వీడియో చేశాడు. తమది G+1 అని కాకపోతే కింది పోర్షన్లో పిన్నివాళ్లు ఉంటారని, పై పోర్షన్లో తన తల్లి ఉంటుందని చెప్పాడు. ఆ పిన్ని.. అమ్మకు సొంత చెల్లి కావడంతో ఇంట్లో ఉంటున్నందుకు ఇంతవరకు ఒక్కరూపాయి కూడా తీసుకోలేదన్నాడు. అసలు పిన్నిని వదిలి అమ్మ కూడా ఒక్క రోజు ఉండలేదని చెప్పుకొచ్చాడు. మరోవైపు పంచ్ ప్రసాద్ భార్య.. ఇంట్లో తన భర్తకు వచ్చిన షీల్డ్‌లు చూపిస్తూ మురిసిపోయింది. పనిలో పనిగా ఇల్లునంతటినీ కెమెరాలో బంధించింది. అలాగే కిందకు వెళ్లి అక్కడ ఉన్న గదులను కూడా చూపించింది. ఇంటి లోపలా, బయట వాకిలి నిండా ముగ్గులు వేయగా.. ప్రతి ఏడాది ఇలాగే పెయింటింగ్ ముగ్గులు వేస్తారని చెప్పుకొచ్చింది ప్రసాద్ భార్య. చదవండి: పిచ్చెక్కిస్తున్న పఠాన్.. నాలుగు రోజుల్లోనే రూ.400 కోట్లు -
పంచ్ ప్రసాద్ కిడ్నీ ఆపరేషన్‌కు నేను సాయం చేస్తా!
పైకి నవ్వుతున్నంత మాత్రాన మనిషి సంతోషంగా ఉన్నట్లు కాదు. అందరినీ నవ్వించినంత మాత్రాన అతడికి ఏ కష్టాలూ లేవనీ కాదు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కమెడియన్ పంచ్ ప్రసాద్ ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉన్నాడు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న అతడు ఇంటి అద్దె కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నాడు. ఇప్పటికే చికిత్స కోసం తన దగ్గరున్న డబ్బంతా ఖర్చు పెట్టగా చివరికి అప్పులు కూడా చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పటికీ అతడి ఆరోగ్యం కుదుటపడలేదు. పంచ్ ప్రసాద్ దీనస్థితి తెలిసి అతడిని ఆదుకోవడానికి ముందుకు వచ్చాడు మరో కమెడియన్ కిర్రాక్ ఆర్పీ. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ నుంచి పూర్తిగా కోలుకునేవరకు అవసరమైన మొత్తం డబ్బును తాను అందిస్తానన్నాడు. 'పంచ్ ప్రసాద్ దగ్గర రూపాయి లేదు. అద్దె కట్టేందుకు కూడా డబ్బుల్లేవు. అతడి ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోంది. తనకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. వాడు చాలా మంచివాడు, నాక్కావాల్సిన వాడు. తనను నేను ఆదుకుంటా. వచ్చే నెల మణికొండలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నా. ఆ వచ్చినదాంట్లో అతడికి అవసరమయ్యేదానికంటే పదివేలు ఎక్కువే ఇస్తాను. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌కు 15 లక్షలైనా సరే చెల్లించి కాపాడుకుంటా. తను పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యేవరకు ఆర్థికంగా అండగా నిలబడతా' అని చెప్పుకొచ్చాడు కిర్రాక్ ఆర్పీ. చదవండి: 29 రోజులు కోమాలో, చేతులెత్తేసిన డాక్టర్స్ మర్చిపోయా, నీ బర్త్‌డే కదా.. చిన్న సర్ప్రైజ్: జూనియర్ ఎన్టీఆర్ -
జబర్దస్త్ ‘పంచ్’ ప్రసాద్ ఆరోగ్యంపై డాక్టర్లు ఏమన్నారంటే?
జబర్దస్త్ కమెడియన్ ‘పంచ్’ ప్రసాద్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా కిడ్నీ ఫెయిల్యుర్ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. అతడి వెన్ను భాగం నుంచి కాళ్లకు చీము రావడంతో ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నాడు. పంచ్ ఆరోగ్య పరిస్థితిపై ఇటీవల కమెడియన్ నూకరాజు వ్లాగ్ చేసి పంచ్ ప్రసాద్ యూట్యూబ్‌లో చానల్లో పోస్ట్ చేశాడు. దీంతో పంచ్ ప్రసాద్ కోలుకోవాలని బుల్లితెర ప్రేక్షకులు, అతడి ఫాలోవర్స్ కోరుకున్నారు. చదవండి: ప్రత్యేక ఆకర్షణగా నాగశౌర్య పెళ్లి భోజనాలు, అరేంజ్మెంట్స్ చూస్తే షాకవ్వాల్సిందే తాజాగా నూకరాజు మరో వీడియో షేర్ చేశాడు. ఇందులో పంచ్ ప్రసాద్ కొద్ది కొద్దిగా రికవరి అవుతున్నట్లు చెప్పాడు. ఇప్పటి వరకు కనీసం సొంతంగా లేవలేని స్థితిలో ఉన్న ప్రసాద్ ఇప్పుడు కర్ర, ఒకరి సాయంతో నడవగలుగుతున్నట్లు తెలిపాడు. కాగా గత నాలుగు రోజులుగా ఆయనకు చికిత్స జరుగుతుందని, అప్పటి నుంచి రోజంత సైలెన్స్ ఎక్కుతున్నట్లు చెప్పాడు. అంతేకాదు ప్రత్యేకంగా ఓ నర్స్ ఇంట్లోనే ఉండి 24 గంటలు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు నూకరాజు పేర్కొన్నాడు. మరో నాలుగు రోజుల వరకు ఇలాటే చేయాల్సి ఉంటుందన్నాడు. సైలెన్స్ ద్వారా పంచ్ ప్రసాద్‌కి యాంటిబయోటిక్స్ ఇస్తున్నారని నూకరాజు తెలిపాడు. ఇక హాస్పిటల్‌కు వెళ్లి పంచ్ ప్రసాద్ స్కానింగ్ కూడా చేయించుకున్నాడు. మరో వారం గడిచిన తర్వాతే ప్రసాద్ నడవగలడా? లేదా? అనే విషయం చెబుతామని డాక్టర్స్ చెప్పినట్లు విషయం చెబుతామని ఈ వీడియోలో డాక్టర్స్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వీడియోపై పంచ్ ప్రసాద్ ఫ్యాన్స్, ఫాలోవర్స్ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: ఆందోళనకరంగా జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యం, నడవలేని స్థితిలో.. పంచ్ ప్రసాద్ భార్య నిజంగా గ్రేట్, పెళ్లికి ముందే ప్రాబ్లమ్ తెలిసినా..