
పైకి నవ్వుతున్నంత మాత్రాన మనిషి సంతోషంగా ఉన్నట్లు కాదు. అందరినీ నవ్వించినంత మాత్రాన అతడికి ఏ కష్టాలూ లేవనీ కాదు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కమెడియన్ పంచ్ ప్రసాద్ ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉన్నాడు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న అతడు ఇంటి అద్దె కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నాడు. ఇప్పటికే చికిత్స కోసం తన దగ్గరున్న డబ్బంతా ఖర్చు పెట్టగా చివరికి అప్పులు కూడా చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పటికీ అతడి ఆరోగ్యం కుదుటపడలేదు. పంచ్ ప్రసాద్ దీనస్థితి తెలిసి అతడిని ఆదుకోవడానికి ముందుకు వచ్చాడు మరో కమెడియన్ కిర్రాక్ ఆర్పీ. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ నుంచి పూర్తిగా కోలుకునేవరకు అవసరమైన మొత్తం డబ్బును తాను అందిస్తానన్నాడు.
'పంచ్ ప్రసాద్ దగ్గర రూపాయి లేదు. అద్దె కట్టేందుకు కూడా డబ్బుల్లేవు. అతడి ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోంది. తనకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. వాడు చాలా మంచివాడు, నాక్కావాల్సిన వాడు. తనను నేను ఆదుకుంటా. వచ్చే నెల మణికొండలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నా. ఆ వచ్చినదాంట్లో అతడికి అవసరమయ్యేదానికంటే పదివేలు ఎక్కువే ఇస్తాను. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌కు 15 లక్షలైనా సరే చెల్లించి కాపాడుకుంటా. తను పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యేవరకు ఆర్థికంగా అండగా నిలబడతా' అని చెప్పుకొచ్చాడు కిర్రాక్ ఆర్పీ.
చదవండి: 29 రోజులు కోమాలో, చేతులెత్తేసిన డాక్టర్స్
మర్చిపోయా, నీ బర్త్‌డే కదా.. చిన్న సర్‌ప్రైజ్: జూనియర్ ఎన్టీఆర్
Comments
Please login to add a commentAdd a comment