భార్య కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకున్న కమెడియన్‌ | Comedian Punch Prasad Washes his Wife Feet And Gets Emotional | Sakshi
Sakshi News home page

నన్ను బతికించడం కోసమే పెళ్లి చేసుకుంది.. పంచ్‌ ప్రసాద్‌ ఎమోషనల్‌

Published Fri, Jan 10 2025 8:41 AM | Last Updated on Fri, Jan 10 2025 10:49 AM

Comedian Punch Prasad Washes his Wife Feet And Gets Emotional

జబర్దస్త్‌ కమెడియన్‌ పంచ్‌ ప్రసాద్‌ (Punch Prasad) కొన్నేళ్లపాటు కిడ్నీ సమస్యతో బాధపడ్డాడు. డయాలసిస్‌ చేయించుకున్నప్పటికీ ఆరోగ్యం మెరుగవలేదు. రెండు మూత్రపిండాలు పాడవడంతో వీలైనంత త్వరగా ఆపరేషన్‌ చేయాలని, లేకపోతే కష్టమని వైద్యులు హెచ్చరించారు. అలాంటి సమయంలో ప్రసాద్‌ భార్య సునీత నేనున్నానంటూ ముందుకు వచ్చింది. తన కిడ్నీ దానం చేసేందుకు సిద్ధమైంది. అయితే డాక్టర్లు అందుకు ఒప్పుకోలేదు. వేరే కిడ్నీదాతను వెతుక్కోమన్నారు. 

కిడ్నీ మార్పిడి విజయవంతం
అవసరమైతే భవిష్యత్తులో మళ్లీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రసాద్‌ భార్య కిడ్నీ ఉపయోగిద్దామన్నారు. ఎంతో ఎదురుచూపులు, వెతుకులాట తర్వాత అతడికి కిడ్నీ దాత దొరికారు. ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చవుతుందన్నారు. అతడి విషయాన్ని అప్పటి మంత్రి ఆర్‌కే రోజా ఆనాటి సీఎం వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో చికిత్సకు కావాల్సిన డబ్బు సీఎం సహాయకనిధి ద్వారా మంజూరు చేశారు. అలా 2023లో అతడికి విజయవంతంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ జరిగింది.

పంచ్‌ ప్రసాద్‌ ఎమోషనల్‌
అప్పటి నుంచి ప్రసాద్‌ ఆరోగ్యంగా ఉంటున్నారు. తాజాగా అతడు తన భార్యతో కలిసి ఓ టీవీ షోకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఏ భర్తా చేయని పని తాను చేశాడు. సునీత గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. ప్రసాద్‌ మాట్లాడుతూ.. ప్రేమించుకున్నవాళ్లు కలిసి బతకడానికి పెళ్లి చేసుకుంటారు. కానీ నన్ను బతికించడం కోసమే ఆమె నన్ను పెళ్లి చేసుకుంది. నువ్వు చేసిన పనికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. 

కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్న కమెడియన్‌
మామూలుగా తల్లిదండ్రుల కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటారు కదా.. నేనూ అదే చేయాలనుకుంటున్నా అన్నాడు. అనడమే ఆలస్యం.. భార్యను కూర్చోబెట్టి తాంబూలంలో ఆమె కాళ్లు కడిగి ఆ నీళ్లను తన నెత్తిన చల్లుకున్నాడు. అది చూసి సునీత సైతం కన్నీళ్లు పెట్టుకుంది. నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆస్పత్రికి వెళ్లాలి. కానీ తన గురించి వదిలేసి నా చుట్టూ తిరిగింది అంటూ ప్రసాద్‌ భావోద్వేగానికి లోనయ్యాడు.

చదవండి: ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ ట్విటర్‌ రివ్యూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement