‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ ట్విటర్‌ రివ్యూ | Game Changer Movie Twitter Review, Social Media Talk | Sakshi
Sakshi News home page

Game Changer X Review: ‘గేమ్‌ ఛేంజర్‌’ టాక్‌ ఎలా ఉందంటే..

Published Fri, Jan 10 2025 2:28 AM | Last Updated on Fri, Jan 10 2025 7:59 AM

Game Changer Movie Twitter Review, Social Media Talk

మెగాఫ్యాన్స్‌ మూడేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత రామ్‌ చరణ్‌(Ram Charan) సోలో హీరోగా నటించిన ‘గేమ్‌ ఛేంజర్‌’(Game Changer) చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియన్‌ టాప్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా  కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు.  శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. 

భారీ అంచనాల మధ్య నేడు( జనవరి 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో స్పెషల్‌ షో బొమ్మ పడిపోయింది. తెలంగాణలో శుక్రవారం ఉదయం 4 గంటల నుంచి షోస్‌ పడనున్నాయి. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

గేమ్‌ ఛేంజర్‌ కథేంటి? ఎలా ఉంది?  శంకర్‌, చరణ్‌ ఖాతాలో భారీ హిట్‌ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా చర్చిస్తున్నారు.అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.


గేమ్‌ ఛేంజర్‌ సినిమాకు ఎక్స్‌లో మిక్స్‌డ్‌ టాక్‌ వస్తుంది. సినిమా బాగుందని కొందరు.. ఆశించిన స్థాయిలో సినిమాలేదని మరికొంత మంది కామెంట్‌ చేస్తున్నారు. చరణ్‌ నటన అదిరిపోయింది కానీ.. శంకర్‌ మేకింగ్‌ బాగోలేదని కొంతమంది నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు. పాటలు అయితే తెరపై చూస్తే అద్భుతంగా ఉన్నాయట. రా మచ్చా మచ్చా పాట అదిరిపోయిందంటూ చాలా మంచి నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. 

ఊహించదగిన కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఫస్టాఫ్‌ యావరేజ్‌గా ఉంది.కొన్ని ఐఏఎస్‌ బ్లాక్‌లు బాగా వచ్చాయి, అలాగే ఆసక్తికరమైన ఇంటర్వెల్ బ్లాక్ కూడా వచ్చింది. ప్రేమకథ బోరింగ్‌గా ఉంది.  కామెడీ కూడా అతిగా ఉంది మరియు అసమర్థంగా ఉంది. రామ్ చరణ్ బాగా చేస్తున్నాడు. తమన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. సెకండాఫ్‌ కోసం ఎదురు చూస్తున్నాం అంటూ ఓ నెటిజన్‌  రాసుకొచ్చాడు.

 ఫస్టాఫ్‌ బాగుంది. దోప్‌ సాంగ్‌ ఇంకాస్త బాగా తీయాల్సిది. ఇంటర్వెల్‌ సీన్‌అదిరిపోయింది. తమన్‌ నేపథ్య సంగీతం బాగుంది. రా మచ్చా మచ్చా సాంగ్‌ అద్భుతం అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.

 ఫస్టాఫ్‌ అదిరిపోయింది. అద్భుతమైన సన్నివేశాలు, భావోద్వేగాలు, యాక్షన్‌తో శంకర్‌ మరోసారి తన టేకింగ్‌ పవర్‌ని చూపించాడు. రామ్‌ చరణ్‌ తన నటనతో ఆకట్టుకున్నాడు. తమన్‌ బీజీఎం అదిరిపోయిది. సెకండాఫ్‌పై హైప్‌ పెంచేలా ఇంటర్వెల్‌ సీన్‌ ఉందని మరో నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement