గేమ్‌ ఛేంజర్‌.. ఒక్క రోజు షూటింగ్‌ ఖర్చు అన్ని లక్షలా? | Shankar Spend Huge Budget On Game Changers Songs | Sakshi
Sakshi News home page

గేమ్‌ ఛేంజర్‌.. ఒక్క రోజు షూటింగ్‌ ఖర్చు అన్ని లక్షలా?

Dec 28 2024 9:45 AM | Updated on Dec 28 2024 10:53 AM

Shankar Spend  Huge Budget On Game Changers Songs

రామ్‌ చరణ్‌-శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన తొలి చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’(game Changer) రిలీజ్‌కి రెడీ అయింది. సంకాంత్రి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేశారు. గతవారం అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించిన ఈవెంట్‌ సినిమాపై బజ్‌ క్రియేట్‌ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ప్రమోషన్స్‌ మొదలు కాలేదు కానీ నెట్టింట మాత్రం గేమ్‌ ఛేంజర్‌పై చర్చ జరుగుతూనే ఉంది.

(చదవండి: 

ఈ సినిమా కోసం నిర్మాత దిల్‌ రాజు భారీగా ఖర్చు చేశాడు. రెమ్యునరేషన్లతో కలిసి దాదాపు రూ. 500 కోట్లకు పైనే ఖర్చు అయినట్లు తెలుస్తోంది. శంకర్‌(shankar)సినిమాలు అంటేనే భారీ బడ్జెట్‌ ఉండాల్సిందే. పాటల కోసమే కోట్లు ఖర్చు చేస్తాడు. ఇక గేమ్‌ ఛేంజర్‌లో కూడా శంకర్‌ శైలీ పాటలు మూడు ఉన్నాయట. విజువల్‌ ట్రీట్‌ ఇచ్చేలా వాటిని తెరకెక్కించామని శంకర్‌ చెబుతున్నాడు. బయటి కంటే థియేటర్‌లో చూస్తేనే పాటలు ఇంకా బాగా ఆకట్టుకుంటాయని సంగీత దర్శకుడు కూడా అంటున్నాడు. 

అయితే ఆ పాటలు చిత్రీకరించేందుకు శంకర్‌ భారీగా ఖర్చు చేశాడట. ముఖ్యంగా ‘రా మచ్చా మచ్చా’ కోసం కోట్లల్లో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ పాట కోసం దాదాపు 500 మంది డ్యాన్సర్లను రంగంలోకి దించాడు శంకర్‌. వైజాగ్‌, అమృత్‌ సర్‌ వంటి ఏరియాల్లో షూట్‌ చేశారు. ఈ పాట షూటింగ్‌ సమయంలో ఒక్కరోజుకే రూ. 78 లక్షల వరకు ఖర్చు చేశారట. సినిమా మొత్తంలో ఒక్కరోజులో అయిన హయ్యెస్ట్‌ ఖర్చు ఇదేనట. మొత్తంగా ఈ పాట కోసం రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. థియేటర్స్‌లో చూసినప్పుడు ఆ పాటల స్థాయి తెలుస్తుందని దిల్‌ రాజు అంటున్నాడు. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌(Ram Charan)కి జోడీగా కియరా అద్వానీ నటించగా..శ్రీకాంత్‌, అంజలి, సునీల్‌, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement