వాళ్లు బాలకృష్ణ మనుషులని నాకు తెలియదు: కిర్రాక్‌ ఆర్పీ | Kiraak RP Chepala Pulusu Sent Balakrishna Home | Sakshi
Sakshi News home page

Kirak RP: వాళ్లు బాలకృష్ణ మనుషులని నాకు తెలియదు: కిర్రాక్‌ ఆర్పీ

Published Sun, Jul 2 2023 6:31 PM | Last Updated on Sun, Jul 2 2023 6:50 PM

Kiraak RP Chepala Pulusu Sent Balakrishna Home - Sakshi

కమెడియన్‌ కిర్రాక్‌ ఆర్పీ పేరు సోషల్‌ మీడియాలో మారుమోగిపోతోంది. ప్రముఖ కామెడీ షో నుంచి బయటకు వచ్చిన అతను సొంతంగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో కర్రీ పాయింట్‌ స్టార్ట్‌ చేశాడు. దీనికి అనూహ్యమైన రెస్పాన్స్‌ రావడంతో. హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు బ్రాంచ్‌లు ప్రారంభించాడు. త్వరలో విశాఖ, బెంగుళూరులో కూడా స్టార్ట్‌ చేయబోతున్నట్లు ప్రకటించాడు.

(ఇదీ చదవండి: Kajal Aggarwal: నెటిజన్‌ ప్రశ్నకు అదిరిపోయే సమాధానం ఇచ్చిన కాజల్‌)

తాజాగా హైదరాబాద్‌లోని మియాపూర్‌ క్రాస్‌ రోడ్‌లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు మరో బ్రాంచ్‌ ఆయన ప్రారంభించాడు. ఇందుకు గాను బలగం డైరెక్టర్‌ వేణు ముఖ్య అతిథిగా వచ్చి.. రిబ్బన్‌ కట్‌ చేశాడు. ఈ కార్యక్రమంలో హీరో అశ్విన్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కిర్రాక్‌ ఆర్పీ నెల్లూరు చేపల పులుసుకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోయాడని బలగం వేణు అన్నాడు. 

టాలీవుడ్‌కు చెందిన టాప్‌ హీరోలు ఈ చేపల పులుసు రుచి చూశారని కిరాక్‌ ఆర్పీ ఈ సందర్భంగా తెలిపాడు. మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌ చరణ్‌, ఉపాసన,ప్రభాస్, శ్రీకాంత్‌ వంటి సినీ ప్రముఖులు తమ చేపల పులుసును టేస్ట్‌ చేశారన్నాడు.  నందమూరి బాలకృష్ణ  ఇంటికి కూడా చేపల పులుసు వెళ్లింది. మాదాపూర్‌లోని బ్రాంచ్‌కు కొందరు బాలకృష్ణకు సంబంధించిన వ్యక్తులు వచ్చారు. కానీ వారు బాలయ్యకు చెందిన వారని తనకు అప్పట్లో తెలియదని పేర్కొన్నాడు. రుచితో పాటు క్వాలిటీ నచ్చడంతో బాలయ్య ఇంటి నుంచి వచ్చి వారు తమ చేపల పులుసును తరుచుగా తీసుకెళ్లేవారు. దీంతో కొద్దిరోజుల తర్వాత వారు బాలయ్య ఇంటి నుంచి వచ్చినట్లు చెప్పడంతో అసలు విషయం తెలసినట్లు ఆర్పీ చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: కీర్తి, కృతీ.. ఇద్దరిది ఒకే స్థితి… ఏమిటి ఈ పరిస్థితి?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement