Balakrishna Likely To Attend As Chief Guest For Chiranjeevi Bhola Shankar Pre Release Event - Sakshi
Sakshi News home page

Bhola Sankar Movie: స్కెచ్‌ అదిరింది, చిరంజీవికి బాలకృష్ణ జై కొడతాడా?

Published Wed, Jun 7 2023 3:52 PM | Last Updated on Wed, Jun 7 2023 4:55 PM

Chiranjeevi Balakrishna Bhola Sankar Pre Realise Function - Sakshi

చిరంజీవి  - మెహర్‌ రమేష్‌ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘భోళా శంకర్‌’. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. తమన్నా కథానాయిక. చిరు చెల్లిగా కీర్తి సురేష్‌ నటిస్తోంది. ఇప్పటికే ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ను చిత్ర బృందం  విడుదల చేసింది. ‘భోళా మేనియా ’ అంటూ సాగే ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది. అన్నాచెల్లి అనుబంధాలతో ముడిపడి ఉన్న ఓ మాస్‌ యాక్షన్‌ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి మేకర్స్‌ తుది మెరుగులు దిద్దుతున్నారు.

(ఇదీ చదవండి: పెళ్లి కాకుండానే రెండోసారి తల్లి కాబోతున్న మోడల్‌, అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశముందా?)

‘భోళా శంకర్‌’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని వైజాగ్ లేదా విజయవాడలో నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.  ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని ప్లాన్ చేస్తున్నారట. మెగాస్టార్ చిరంజీవి,  బాలకృష్ణ మధ్య మంచి అనుబంధం ఉంది కాబట్టి ప్లాన్‌ వర్క్‌ అవుట్‌ అవుతందని చిత్ర బృందం భావిస్తోందట. ఇదే జరిగితే నందమూరి, మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతారని మేకర్స్ స్కెచ్‌ వేస్తున్నట్లు సమచారం.

గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్  సినిమా ప్రీ రిలీజ్‌ కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేశ్‌ అతిధిగా రావడం..ఆ తర్వాత మహేశ్‌ సినిమాకి తారక్ రావడం జరిగింది. ఇలాంటి సందర్భాలు జరిగితే అభిమానుల మధ్య మరింత ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందని మేకర్స్‌ భావిస్తున్నారు.

(ఇదీ చదవండి: అదుపులో లేని భావోద్వేగాలు.. బ్రేకప్‌ చెప్పా, కుమిలిపోయా: నటి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement