మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళా శంకర్' మూవీ గురించి మరోసారి మాట్లాడుకునే టైం వచ్చింది. గత నెల అంటే ఆగస్టు 11న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. విడుదలకు ముందు.. చిరు వల్ల ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ బిగ్ స్క్రీన్‌పై ఇది ఘోరమైన ఫలితం అందుకుంది. అలాంటిది ఇప్పుడు ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. ఒకే ఇంట్లో కలిసుంటున్నారా!?)
ఈ ఏడాది సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' అనే స్ట్రెయిట్ మూవీతో హిట్ కొట్టిన చిరంజీవి.. అదే ఊపుతో 'భోళా శంకర్' చేశారు. అయితే ఇది 'వేదాళం' అనే తమిళ మూవీకి రీమేక్. దీంతో రిలీజ్ కి చాన్నాళ్ల ముందు నుంచే విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. కానీ టీమ్ అంతా నమ్మకంగా ఉండేసరికి హిట్ కొట్టచ్చేమో అని అందరూ అనుకున్నారు.
కానీ పలువురు నెటిజన్స్ అనుకున్నట్లే 'భోళా శంకర్' ఫ్లాప్ అయింది. రిలీజ్ అయిన రెండో రోజుకే అందరూ ఈ సినిమా గురించి మెల్లగా మర్చిపోయారు. అలాంటిది ఇప్పుడు ఈ చిత్ర డిజిటల్ హక్కులు దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రిలీజ్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ముందు అనుకున్న తేదీలో కాస్త మార్పు చేసి సెప్టెంబరు 15నే స్ట్రీమింగ్‌లోకి తీసుకురావాలని అనుకుంటున్నారట.
(ఇదీ చదవండి: అందుకే ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు: తెలుగు నటి)
Comments
Please login to add a commentAdd a comment