గోపీచంద్ రామబాణం గురి తప్పింది. చిరంజీవి భోళా శంకర్.. డీలా పడింది. రెండూ ఫ్లాప్ టాక్ మూటగట్టుకున్న సినిమాలే! కనీస వసూళ్లు సాధించేందుకు ముప్పుతిప్పలు పడ్డ చిత్రాలే! థియేటర్‌లో కలెక్షన్స్ రాబట్టడం అయ్యే పనిలా లేదని ఓటీటీని ఆశ్రయించాయి. కనీసం ఇక్కడి ప్రేక్షకులైనా వన్ టైమ్ వాచ్ చేస్తారేమోనని! ఈసారైనా గురి కుదిరిందా? అనుకున్నది జరిగిందా? అంటే అవును, కాదు అని రెండు సమాధానాలు వినిపిస్తాయి. అదెలా అనుకుంటున్నారా?
రామబాణం సినిమా ఓటీటీలో సక్సెస్ అయింది. తెలుగు, సౌత్, బాలీవుడ్ సినిమాలను వెనక్కు నెడుతూ నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. మరి భోళా శంకర్ అంటారా? కనీసం టాప్ 10 చిత్రాల్లో కూడా చోటు దక్కించుకోలేదు. ఇది మెగా ఫ్యాన్స్‌ను ఎంతగానో నిరాశకు గురి చేస్తోంది. థియేటర్లలోనే అనుకుంటే ఓటీటీలోనూ భోళా శంకర్‌కు కనీస ఆదరణ లేకుండా పోయిందని ఫీల్ అయ్యారు.
మరోపక్క రామబాణం ఇంతలా దూసుకుపోతుండటంతో గోపీచంద్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఇది నిన్నటి లెక్క. నేడు భోళా శంకర్ తొలి స్థానంలోకి రాకెట్‌లా దూసుకొచ్చింది. నిన్నటివరకు టాప్ 10లో కూడా లేని చిరు మూవీ నేడు ఏకంగా టాప్ 1లో ట్రెండ్ అవుతోంది. రామబాణం రెండో స్థానంలో ఉంది.
భోళా శంకర్ విషయానికి వస్తే..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం భోళా శంకర్. తమిళ హిట్ మూవీ వేదాళం చిత్రానికి ఇది రీమేక్‌గా తెరకెక్కింది. తమన్నా, కీర్తి సురేశ్ ముఖ్య పాత్రలు పోషించగా మెహర్ రమేశ్ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. దీంతో నెలరోజులకే ఓటీటీ బాట పట్టింది. సెప్టెంబర్ 15 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
రామబాణం విషయానికి వస్తే..
గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా నటించిన చిత్రం రామబాణం. లక్ష్యం, లౌక్యం వంటి హిట్స్ తర్వాత గోపీచంద్- శ్రీవాస్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ఈ సినిమా సెప్టెంబర్ 14న ఓటీటీలోకి వచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
చదవండి: ఐదు రోజులుగా ఇబ్బందిపడుతున్న అనసూయ, ఈ బూతులేంటి అంటూ ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment