Ramabanam movie
-
ఓటీటీలో రామబాణం, భోళా శంకర్.. ఏ సినిమాకు ఎక్కువ క్రేజ్ అంటే?
గోపీచంద్ రామబాణం గురి తప్పింది. చిరంజీవి భోళా శంకర్.. డీలా పడింది. రెండూ ఫ్లాప్ టాక్ మూటగట్టుకున్న సినిమాలే! కనీస వసూళ్లు సాధించేందుకు ముప్పుతిప్పలు పడ్డ చిత్రాలే! థియేటర్లో కలెక్షన్స్ రాబట్టడం అయ్యే పనిలా లేదని ఓటీటీని ఆశ్రయించాయి. కనీసం ఇక్కడి ప్రేక్షకులైనా వన్ టైమ్ వాచ్ చేస్తారేమోనని! ఈసారైనా గురి కుదిరిందా? అనుకున్నది జరిగిందా? అంటే అవును, కాదు అని రెండు సమాధానాలు వినిపిస్తాయి. అదెలా అనుకుంటున్నారా? రామబాణం సినిమా ఓటీటీలో సక్సెస్ అయింది. తెలుగు, సౌత్, బాలీవుడ్ సినిమాలను వెనక్కు నెడుతూ నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. మరి భోళా శంకర్ అంటారా? కనీసం టాప్ 10 చిత్రాల్లో కూడా చోటు దక్కించుకోలేదు. ఇది మెగా ఫ్యాన్స్‌ను ఎంతగానో నిరాశకు గురి చేస్తోంది. థియేటర్లలోనే అనుకుంటే ఓటీటీలోనూ భోళా శంకర్‌కు కనీస ఆదరణ లేకుండా పోయిందని ఫీల్ అయ్యారు. మరోపక్క రామబాణం ఇంతలా దూసుకుపోతుండటంతో గోపీచంద్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఇది నిన్నటి లెక్క. నేడు భోళా శంకర్ తొలి స్థానంలోకి రాకెట్లా దూసుకొచ్చింది. నిన్నటివరకు టాప్ 10లో కూడా లేని చిరు మూవీ నేడు ఏకంగా టాప్ 1లో ట్రెండ్ అవుతోంది. రామబాణం రెండో స్థానంలో ఉంది. భోళా శంకర్ విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం భోళా శంకర్. తమిళ హిట్ మూవీ వేదాళం చిత్రానికి ఇది రీమేక్‌గా తెరకెక్కింది. తమన్నా, కీర్తి సురేశ్ ముఖ్య పాత్రలు పోషించగా మెహర్ రమేశ్ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. దీంతో నెలరోజులకే ఓటీటీ బాట పట్టింది. సెప్టెంబర్ 15 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రామబాణం విషయానికి వస్తే.. గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా నటించిన చిత్రం రామబాణం. లక్ష్యం, లౌక్యం వంటి హిట్స్ తర్వాత గోపీచంద్- శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ఈ సినిమా సెప్టెంబర్ 14న ఓటీటీలోకి వచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. చదవండి: ఐదు రోజులుగా ఇబ్బందిపడుతున్న అనసూయ, ఈ బూతులేంటి అంటూ ట్వీట్ -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 30 సినిమాలు
ఎప్పటిలానే మరో వీకెండ్ వచ్చేసేందుకు రెడీ అయిపోయింది. వినాయక చవితి సందర్భంగా ఈ శుక్రవారం చాలా సినిమాలు థియేటర్లలో రిలీజ్‌కు తొలుత ప్లాన్ చేశారు. అవన్నీ సైడ్ అయిపోవడంతో ఈసారి చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. దీంతో సినీ ప్రేమికుల దృష్టి ఓటీటీలపై పడింది. ఇప్పుడు వీళ్ల కోసమా అన్నట్లు ఏకంగా 30 వరకు కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్కి రెడీగా ఉన్నాయి. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' 10వరోజు హైలైట్స్.. వాళ్లని నిద్ర పోనీయకుండా చేశాడు!) సోమవారం ఓటీటీ లిస్టు అనుకున్నప్పుడు 32 వరకు ఉన్నాయి. కానీ వాటిలో కొన్ని సినిమాలు ఇప్పటికే ఓటీటీల్లోకి వచ్చేయగా, మరికొన్ని కొత్తగా వచ్చి చేరాయి. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ వీకెండ్ కోసం.. భోళా శంకర్, MY3, రామబాణం, మాయపేటిక, హాస్టలు హుడుగురు బేకాగిద్దరే లాంటి మూవీస్ ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏయే సినిమాలు ఎందులో స్ట్రీమింగ్ కాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ అమెజాన్ ప్రైమ్ డిజిటల్ విలేజ్ - మలయాళ సినిమా సుబేదార్ - మరాఠీ చిత్రం మిలియన్ మైల్స్ ఎవే - ఇంగ్లీష్ మూవీ వైల్డర్నెస్ - ఇంగ్లీష్ సిరీస్ అనీతి - తెలుగు డబ్బింగ్ మూవీ ద ఫెర్రాగ్నెజ్: సన్రేమో స్పెషల్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) బంబై మేరీ జాన్ - హిందీ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) హాట్‌స్టార్ Myత్రీ - తెలుగు డబ్బింగ్ సినిమా కాలా - హిందీ సిరీస్ ల్యాంగ్ ల్యాంగ్ ప్లేస్ డిస్నీ - ఇంగ్లీష్ సినిమా ద అదర్ బ్లాక్ గర్ల్ - ఇంగ్లీష్ సిరీస్ ఆహా మాయపేటిక - తెలుగు సినిమా నెట్‌ఫ్లిక్స్ భోళా శంకర్ - తెలుగు చిత్రం ఎల్ కొండే - స్పానిష్ మూవీ ఇన్సైడ్ ద వరల్డ్స్ టఫస్టె ప్రిజన్స్: సీజన్ 7 - ఇంగ్లీష్ సిరీస్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ - ఇంగ్లీష్ సినిమా మిస్ ఎడ్యుకేషన్ - ఇంగ్లీష్ సిరీస్ సర్వైవింగ్ సమ్మర్: సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ ద క్లబ్: పార్ట్ 2 - టర్కిష్ సిరీస్ డైరీస్ సీజన్ 2: పార్ట్ 1 - ఇటాలియన్ సిరీస్ (స్ట్రీమింగ్) థర్స్ డేస్ విడోస్ - స్పానిస్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) ఎరంగార్డ్: ద ఆర్ట్ ఆఫ్ సెడక్సన్ - డానిష్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) వన్స్ అపాన్ ఏ క్రైమ్ - జపనీస్ మూవీ (ఇప్పటికే స్ట్రీమింగ్) రామబాణం - తెలుగు సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్) (ఇదీ చదవండి: అతిపెద్ద సినిమా స్క్రీన్.. ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ పోద్ది!) జీ5 హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే - కన్నడ సినిమా సోనీ లివ్ జర్నీ ఆఫ్ లవ్ 18+ - మలయాళ చిత్రం బుక్ మై షో ఏ హనీమూన్ టూ రిమెంబర్ - ఇంగ్లీష్ చిత్రం మోర్టల్ కంబాట్ లెజెండ్స్: కేజ్ మ్యాచ్ - ఇంగ్లీష్ సినిమా ఈ-విన్ దిల్ సే - తెలుగు సినిమా (సెప్టెంబరు 16) సైనా ప్లే పప్పచన్ ఒలివిలాన్ - మలయాళ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్) (ఇదీ చదవండి: బెండు తీసిన 'బిగ్‌బాస్'.. హౌసులో దొంగతనానికి స్కెచ్!) -
OTT Releases: భోళాశంకర్, రామబాణం సహా బోలెడన్ని చిత్రాలు..
ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఎక్కువగా ఓటీటీలో సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద సినిమాలు సైతం రిలీజైన నెలలోపే ఓటీటీకి వచ్చేస్తున్నాయి. ఈ వారంలో మిమ్మల్ని అలరించేందుకు సూపర్ హిట్ సినిమాలు వచ్చేస్తున్నాయి. ఏయే సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం. ఈ వారంలో విడుదలయ్యే సినిమాలపై ఓ లుక్కేద్దాం పదండి. మెగాస్టార్ భోళాశంకర్ మెగాస్టార్ భోళాశంకర్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘భోళా శంకర్’. ఈ చిత్రాన్ని మెహర్ రమేశ్ తెరకెక్కించారు. ఈ సినిమాలో కీర్తి సురేశ్ కీలక పాత్ర పోషించగా... తమన్నా హీరోయిన్గా నటించింది. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుుకుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ సెప్టెంబర్ 15 నుంచి తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. గోపీచంద్ రామబాణం గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా నటించిన చిత్రం ‘రామబాణం. శ్రీవాస్ దర్శకత్వంలో.. టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో జగపతిబాబు, ఖుష్బూ ముఖ్యపాత్రలు పోషించారు. మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతంగా మెప్పించలేకపోయింది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఈ చిత్రం సెప్టెంబరు 14వ తేదీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్కు రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. మాయపేటిక విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, పాయల్ రాజ్‌పుత్‌లు నటించిన చిత్రం మాయపేటిక. ఈ చిత్రానికి రమేష్ రాపర్తి దర్శకత్వం వహించారు. మొబైల్ ఫోన్ వల్ల చెడు, మంచి నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈనెల 15 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. అనీతి వసంతబాలన్ దర్శకత్వం వహించిన తమిళ రొమాంటిక్ మూవీ అనేతి. ఈ చిత్రంలో అర్జున్ దాస్, దుషార విజయన్ ప్రధాన పాత్రల్లో నటించారు. హౌస్ కీపర్‌తో ప్రేమలో పడే ఫుడ్ డెలివరీ ఏజెంట్ ప్రేమకథను తెరకెక్కించారు. ఈ చిత్రం ఈనెల 15 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ముగ్గురు యువకుల డిజిటల్ విలేజ్ ఫహద్ నందు, ఉల్సవ్ రాజీవ్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం డిజిటల్ విలేజ్. ఇందులో హృషికేష్, ఇందిర, ఎంసీ మోహనన్, సురేష్ బాబు కన్నోమ్ నటించారు. తమ గ్రామంలోని ప్రజలకు డిజిటల్ పరిజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతో ముగ్గురు స్నేహితుల స్టోరీనే కథాంశంగా చూపించారు. ఈ సినిమా ఈనెల 15 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. జర్నీ ఆఫ్ లవ్ 18+ నాస్లెన్ గఫూర్, మీనాక్షి దినేష్, మాథ్యూ థామస్, నిఖిలా విమల్ నటించిన మలయాళ రొమాంటిక్ కామెడీ చిత్రం జర్నీ ఆఫ్ లవ్ 18 ప్లస్ . అరుణ్ డి జోస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఈనెల 15 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ హేలీ లు రిచర్డ్సన్, బెన్ హార్డీ, రాబ్ డెలానీ, సాలీ ఫిలిప్స్, జమీలా నటించిన చిత్రం లవ్ ఎట్ ఫస్ట్ సైట్. దీనికి వెనెస్సా కాస్విల్ దర్శకత్వం వహించారు. ఈ రొమాంటికి డ్రామాను ఓ విమానంలో చిగురించిన ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ మూవీ ఈ నెల 15 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈనెల 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హాలీవుడ్ చిత్రాలు వైఫ్ లైక్- నెట్‌ఫ్లిక్స్- 11 సెప్టెంబర్ 2023 ఎలిమెంటల్- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్- 13 సెప్టెంబర్ 2023 ఎ మిలియన్ మైల్స్ అవే- అమెజాన్ ప్రైమ్ వీడియో- 15 సెప్టెంబర్ 2023 -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు
సోమవారం వస్తే చాలు ఆఫీస్, స్కూల్, కాలేజీలకు వెళ్లేవాళ్లు.. అబ్బ సోమవారం అప్పుడే వచ్చేసిందా అని ఫీలవుతారు. మూవీ లవర్స్ మాత్రం ఈ వారం ఏమేం కొత్త సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటిలో ఏం చూడాలి అని తెగ ఎగ్జైట్ అయిపోతుంటారు. అయితే థియేటర్లో ఈ వారం 'మార్క్ ఆంటోని', 'చాంగురే బంగారురాజ' తప్ప వేరే చిత్రాలు ఏం రిలీజ్ కావట్లేదు. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' ఏడోరోజు హైలైట్స్.. హౌసులో ఫస్ట్ ఎలిమినేషన్.. షకీలా కన్నీళ్లు) మరోవైపు ఈ వారం ఓటీటీలో మాత్రం 30కి పైగా సినిమాలు-వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో భోళా శంకర్, రామబాణం, అనీతి, మాయపేటిక, బార్బీ సినిమాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. మరోవైపు 'కాలా', 'బంబై మేరీ జాన్' వెబ్ సిరీస్‌లు కూడా చూడాలనే ఇంట్రెస్ట్ రేపుతున్నాయి. ఇంతకీ ఈ వీక్ ఏయే మూవీస్.. ఏయే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఓటీటీలో విడుదలయ్యే మూవీస్ (సెప్టెంబరు 11- సెప్టెంబరు 17) నెట్‌ఫ్లిక్స్ వైఫ్ లైక్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 11 క్లాస్ యాక్ట్ (ఫ్రెంచ్ సిరీస్) - సెప్టెంబరు 13 రెజ్లర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 13 ఎరంగార్డ్: ద ఆర్ట్ ఆఫ్ సెడక్సన్ (డానిష్ సినిమా) - సెప్టెంబరు 14 వన్స్ అపాన్ ఏ క్రైమ్ (జపనీస్ మూవీ) - సెప్టెంబరు 14 రామబాణం (తెలుగు సినిమా) - సెప్టెంబరు 14 భోళా శంకర్ (తెలుగు చిత్రం) - సెప్టెంబరు 15 ఎల్ కొండే (స్పానిష్ మూవీ) - సెప్టెంబరు 15 ఇన్సైడ్ ద వరల్డ్స్ టఫస్టె ప్రిజన్స్: సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 15 లవ్ ఎట్ ఫస్ట్ సైట్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 15 మిస్ ఎడ్యుకేషన్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 15 సర్వైవింగ్ సమ్మర్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 15 ద క్లబ్: పార్ట్ 2 (టర్కిష్ సిరీస్) - సెప్టెంబరు 15 అమెజాన్ ప్రైమ్ కెల్సీ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 12 ద కిడ్నాపింగ్ డే (కొరియన్ సిరీస్) - సెప్టెంబరు 13 బంబై మేరీ జాన్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 14 ఏ మిలియన్ మైల్స్ ఎవే (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 15 వైల్డర్నెస్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 15 అనీతి (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 15 ఆహా మాయపేటిక (తెలుగు సినిమా) - సెప్టెంబరు 15 హాట్‌స్టార్ ఎనిమల్స్ అప్ క్లోజ్ విత్ బెర్టీ గ్రెగోరి (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 13 ఎలిమెంటల్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 13 హ్యాన్ రివర్ పోలీస్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 13 వెల్కమ్ టూ ద రెక్సామ్ సీజన్ 2 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 13 కాలా (హిందీ సిరీస్) - సెప్టెంబరు 15 ల్యాంగ్ ల్యాంగ్ ప్లేస్ డిస్నీ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 15 ద అదర్ బ్లాక్ గర్ల్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 15 సోనీ లివ్ జర్నీ ఆఫ్ లవ్ 18+ (మలయాళ చిత్రం) - సెప్టెంబరు 15 బుక్ మై షో బార్బీ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 12 ఏ హనీమూన్ టూ రిమెంబర్ (ఇంగ్లీష్ చిత్రం) - సెప్టెంబరు 15 సైనా ప్లే పప్పచన్ ఒలివిలాన్ (మలయాళ మూవీ) - సెప్టెంబరు 14 ఈ-విన్ దిల్ సే (తెలుగు సినిమా) - సెప్టెంబరు 16 (ఇదీ చదవండి: 'బేబి' హీరోయిన్‌కి పెళ్లిపై ఇంట్రెస్ట్.. అలాంటోడే కావాలని!) -
గోపీచంద్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఓటీటీకి వచ్చేస్తోన్న రామబాణం!
మాచో స్టార్ గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా నటించిన రామబాణం. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. జగరపతిబాబు, ఖుష్బూ ప్రధానపాత్రలు పోషించారు. అయితే లక్ష్యం, లౌక్యం వంటి హిట్స్ తర్వాత గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. కానీ సినిమా మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. గోపీచంద్ యాక్షన్ సీక్వెన్స్, డింపుల్ అందాలు సినిమాను ఓ మోస్తరుగా నడిపించినప్పటికి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బోల్తా కొట్టింది. (ఇది చదవండి: బాలీవుడ్లో మరో సినిమా చేస్తోన్న ధనుష్.. ముచ్చటగా మూడోసారి! ) మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామబాణం... నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. ఈ మూవీ ఇంకెప్పుడు ఓటీటీలోకి వస్తుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబరు 14వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించింది. ఈ ప్రకటనతో గోపీచంద్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్లు తెలిపారు. దాదాపు నాలుగు నెలల తర్వాత ఓటీటీ రానుండడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. (ఇది చదవండి: సీనియర్ నటి నిరోషా ఇంట చోరీ.. విలువైన నగలు సహా..) -
నెలలు గడుస్తున్నా ఓటీటీకి రాని టాలీవుడ్ మూవీస్.. అసలు కారణాలేంటి?
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఓటీటీల యుగం నడుస్తోంది. ఎంత పెద్ద సినిమా అయినా సరే నెల రోజుల్లోపే ఓటీటీలో ప్రత్యక్షం కావాల్సిందే. ఇక చిన్న సినిమాలు వారంలోపే ఓటీటీలోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరికొన్ని సినిమాలైతే డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేసేస్తున్నారు. ఇక సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చిందంటే మూడు వారాల్లోనే ఓటీటీకి రావడం మన చూశాం. అలాంటిది రిలీజ్ అయి కూడా నెలలు దాటిపోతున్నా ఇంకా ఓటీటీకి రాకపోవడమేంటి? ఆ సినిమాలు ఎందుకు ఓటీటీలోకి రావడం లేదు. ఈ ఏడాదిలోనే రిలీజై కూడా ఇప్పటివరకు రాలేదంటే.. ఆ సినిమాల గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. అందులోనూ మన తెలుగు సినిమాలు కూడా ఉన్నాయంటే.. అందుకు గల కారణాలేంటో ఓ లుక్కేద్దాం. ఏజెంట్ ఇంకెప్పుడు? అక్కినేని అఖిల్, సాక్షి వైద్య జంటగా నటించిన చిత్రం ఏజెంట్. స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అఖిల్ కెరీర్లో మరో ఫ్లాప్‌గా మిగిలింది. మేకోవర్ కోసం చాలా కష్టపడిన అఖిల్‌కు ఏజెంట్ తీవ్ర నిరాశనే మిగిల్చింది. తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్‌తో ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. (ఇది చదవండి: తిరుమలలో షారుక్, నయనతార- విఘ్నేష్ శివన్ జంట) ఇప్పటికీ సినిమా ఓటీటీ రిలీజ్‌పై కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు(మే19)నుంచే స్ట్రీమింగ్ చేస్తున్నట్లు కూడా సోనీలివ్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అయితే మళ్లీ ఏమైందో ఏమో కానీ ఏజెంట్ స్ట్రీమింగ్‌ను వాయిదా వేసింది. ఇప్పటివరకు ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఎలాంటి సమాచారం లేదు. ది కేరళ స్టోరీ ఇంకా రాదా? ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ.. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రం రిలీజ్ 50 రోజులు పూర్తయ్యాక ఓటీటీకి వస్తుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఆదా శర్మ సైతం ఏ ఓటీటీకి ఇవ్వాలేనే దానిపై చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించింది. గతంలో జూన్ 23న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటివరకు రిలీజ్ డేట్‌పై మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయడం లేదు. కాగా.. కేరళలోని బాలికలను ఇస్లాం మతంలోకి మార్చి సౌదీకి తరలించారనే నేపథ్యంలో సుదీప్తో సేన్ తెరకెక్కించారు. ఓటీటీకి గురిపెట్టని రామబాణం మాచో స్టార్ గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయాతి జంటగా నటించిన చిత్రం 'రామబాణం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మే5న విడుదలై మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో జగపతిబాబు, ఖుష్భూ కీలక పాత్రలు పోషించారు. గోపీచంద్ యాక్షన్ సీక్వెన్స్, డింపుల్ అందాలు సినిమాను ఓ మోస్తరుగా నడిపించినప్పటికి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బోల్తా కొట్టింది. ఈ క్రమంలో రామబాణం మూవీ థియేటర్లలో విడుదలై నెలరోజులు కూడా పూర్తికాకముందే ఓటీటీలోకి రాబోతుందని మేకర్స్ ప్రకటించారు. గతంలోనే జూన్ 3 నుంచి ఈ సినిమా సోనిలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. మరి రామబాణం ఓటీటీ రావాలంటే ఇంకెన్ని రోజులు పడుతుందో వేచి చూడాల్సిందే. (ఇది చదవండి: ఆ కొరియోగ్రాఫర్ చేసిన పనికి గట్టిగా ఏడ్చాను: కృతి సనన్) జర హట్కే జర బచ్కే ఎప్పుడొస్తుంది? విక్కీ కౌశల్, సారా అలీఖాన్ జంటగా నటించిన చిత్రం జర హట్కే జర బచ్కే. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది జూన్‌లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఇప్పటివరకు ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్కు రాలేదు. ఇప్పటికే జియో సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. మరీ ఇన్ని రోజులైనా ఓటీటీకి రాకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. దీనిపై మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. చూద్దామని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జ్విగాటో స్టాండప్ కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కపిల్ శర్మ. నందితా దాస్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం జ్విగాటో. షహనా గోస్వామి హీరోయిన్గా నటించింది. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అంతేకాదు టొరంటో వరల్డ్‌వైడ్ ఫిల్మ్ సెలబ్రేషన్స్-2022లోనూ ప్రదర్శితమైంది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఇప్పటి వరకు మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆరునెలలైనా ఓటీటీకి రాకపోవడంపై అభిమానులు నిరాశ చెందుతున్నారు. అగ్ర హీరోల సినిమాలే నెల రోజుల్లోపే ఓటీటీకి వస్తుంటే.. ఈ చిత్రాలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నారు. -
అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోన్న గోపీచంద్ 'రామబాణం' మూవీ
మాచో స్టార్ గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయాతి జంటగా నటించిన చిత్రం 'రామబాణం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మే5న విడుదలయ్యింది.జగపతిబాబు, ఖుష్భూ కీలక పాత్రలను పోషించారు. లక్ష్యం, లౌక్యం వంటి హిట్స్ తర్వాత గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. కానీ సినిమా మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. గోపీచంద్ యాక్షన్ సీక్వెన్స్, డింపుల్ అందాలు సినిమాను ఓ మోస్తరుగా నడిపించినప్పటికి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బోల్తా కొట్టింది. ఈ క్రమంలో రామబాణం మూవీ థియేటర్లలో విడుదలై నెలరోజులు కూడా పూర్తికాకముందే ఓటీటీలోకి రాబోతుంది. జూన్ 3 నుంచి ఈ సినిమా సోనిలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్లలో సినిమాను మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూసేయండి మరి. -
గోపీచంద్ 'రామబాణం'.. ఆ డిలీటెడ్ సీన్స్ మీరు చూశారా?
మాచో స్టార్ గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయాతి జంటగా నటించిన చిత్రం 'రామబాణం'. 'లక్ష్యం', 'లౌక్యం' చిత్రాల తర్వాత శ్రీవాస్ డైరెక్షన్లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మించారు. (ఇది చదవండి: గోపీచంద్ 'రామబాణం' మూవీ రివ్యూ) ఈ చిత్రంలో జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రల్లో నటించారు. మే 5 తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుంచి డిలీటెడ్ సీన్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ట్విటర్ వేదికగా వీడియోలను పంచుకున్నారు. (ఇది చదవండి: ఓ ఆర్టిస్ట్‌గా మాత్రమే చూడండి.. కామంతో కాదు.. బిగ్ బాస్ బ్యూటీ!) -
ఈ రెండు సినిమాల పరిస్థితి ఏంటి..? హిట్ అవ్వకపోతే మాత్రం
-
రామబాణం మూవీ పబ్లిక్ టాక్ వీడియో
-
గోపీచంద్ 'రామబాణం' మూవీ రివ్యూ
టైటిల్: రామబాణం నటీనటులు: గోపీచంద్, డింపుల్ హయాతి, జగపతిబాబు, ఖుష్బూ, నాజర్, అలీ, వెన్నెల కిశోర్, సచిన్ ఖేడేకర్ తదితరులు నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల దర్శకత్వం: శ్రీవాస్ సంగీతం: మిక్కీ జే మేయర్ సినిమాటోగ్రఫీ: వెట్రీ పళనిస్వామి ఎడిటర్: ప్రవీణ్ పూడి మాచో స్టార్ గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా నటించిన చిత్రం 'రామబాణం'. లక్ష్యం, లౌక్యం చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో తెరకెక్కించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం మే 5, 2023న థియేటర్లలో విడుదలైంది. అన్నదమ్ముల రిలేషన్, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీతో భిన్నమైన ఎలివేషన్స్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే.. రాజారాం(జగపతిబాబు), భువనేశ్వరి(ఖుష్బూ ఆర్గానిక్ ఫుడ్ హోటల్ వ్యాపారం చేస్తుంటారు. రాజారాంకు తమ్ముడి విక్కీ( గోపీచంద్) బిజినెస్‌లో సాయంగా ఉంటాడు. అక్కడే పాపారావు(నాజర్) హోటల్ వ్యాపారం నిర్వహిస్తుంటాడు. రాజారాం తక్కువ ధరకే ఫుడ్ అందించడాన్ని ఓర్వలేని పాపారావు.. జగపతిబాబుతో గొడవలకు దిగుతాడు. ఇది చూసి సహించలేని విక్కీ.. పాపారావు గోడౌన్‌ను తగలబెడతాడు. ఈ విషయం తెలుసుకున్న రాజారాం.. విక్కీని మందలిస్తాడు. నీతి, నిజాయితీ అనుకుంటూ తిరిగే రాజారాం తీరు నచ్చక చిన్నప్పుడే కోల్‌కతాకు పారిపోతాడు విక్కీ. అక్కడ గుప్తా అనే వ్యక్తి విక్కీని చేరదీస్తాడు. ఆ తర్వాత కోల్‌కతాను తన గుప్పిట్లో పెట్టుకున్న డాన్ ముఖర్జీ సామ్రాజ్యాన్ని కూలదోసి.. తానే విక్కీ భాయ్‌గా చెలామణి అవుతాడు. అదేక్రమంలో భైరవి(డింపుల్ హయాతి)ప్రేమిస్తాడు. భైరవిని పెళ్లి చేసుకోవాలనుకున్న విక్కీకి భైరవి నాన్న(సచిన్ ఖేడేకర్) ఓ కండీషన్ పెడతాడు. దీంతో దాదాపు 14 ఏళ్ల తర్వాత తిరిగి హైదరాబాద్‌కు వస్తాడు విక్కీ. (చదవండి: నేను చనిపోలేదు.. ఇంకా బతికే ఉన్నా : సెల్వ రాఘవన్) కోల్‌కతా నుంచి వచ్చిన విక్కీని.. అన్న రాజారాం సంతోషంతో ఆహ్వానిస్తాడు. అయిదే పాపారావు(నాజర్), అతని అల్లుడు జీకే(తరుణ్ అరోరా)తో జరిగిన గొడవల గురించి విక్కీకి తెలియకుండా జాగ్రత్తపడతాడు రాజారాం. అదేవిధంగా విక్కీ సైతం తన కోల్‌కతాలో భాయ్ అన్న విషయాన్ని దాచిపెడతాడు. అంతా సంతోషంగా సాగిపోతున్న సమయంలో రాజా రాంను వ్యాపారంలో కోలుకోలేని విధంగా దెబ్బ తీస్తారు నాజర్, జీకే. అసలు వాళ్లిద్దరూ రాజారాంను ఢీ కొట్టేందుకు చేసిన ప్లానేంటి? కోల్‌కతా నుంచి వచ్చిన విక్కీ ఏం చేశాడు? విక్కీకి భైరవి నాన్న పెట్టిన కండీషన్ ఏంటి? అసలు అన్న రాజారాం కోసం విక్కీ ఏం చేశాడు? వారిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నదే అసలు కథ. కథ ఎలా సాగిందంటే... లక్ష్యం, లౌక్యం చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘రామబాణం’. డైరెక్టర్ శ్రీవాస్ సినిమా అంటే కామెడీ, ఎమోషన్స్, డిఫెరెంట్ ఎలివేషన్స్ ఉంటాయని తెలిసిందే. కథను హీరో గోపీచంద్‌ను చూపించడంతోనే మొదలెట్టాడు. సినిమా ప్రారంభంలోనే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ను పరిచయం చేశాడు. ఆ తర్వాత హీరో కోల్‌కతా వెళ్లడం.. విక్కీ భాయ్‌గా ఎదగడం చకాచకా జరిగిపోతాయి. సినీ ప్రేక్షకులకు ఎక్కడా బోరు కొట్టించకుండా కథను వేగంగా తీసుకెళ్లాడు. కథను ఎక్కడే గానీ సాగతీయలేదు. స్టోరీ రోటీన్‌గా అనిపించినా కామెడీ సీన్స్, ఎమోషన్స్‌తో ఆడియన్స్‌కు బోరు కొట్టించకుండా డైరెక్టర్ జాగ్రత్తపడ్డాడనే చెప్పాలి. అయితే కథలో ఎలాంటి ట్విస్టులు లేకపోవడం పెద్ద మైనస్. కామెడీ సీన్స్, ఫైట్స్, సాంగ్స్‌తో ఫస్టాప్ సింపుల్‌గా ముగించాడు. కథలో సీన్స్ ప్రేక్షకుని ఊహకు అందేలా ఉంటాయి. సెకండాఫ్ వచ్చేసరికి కథ మొత్తం అన్నదమ్ములు విక్కీ, రాజారాం.. విలన్స్ నాజర్, జీకే చుట్టే తిరుగుతుంది. అన్నకు తెలియకుండా తమ్ముడు.. తమ్ముడికి తెలియకుండా అన్న ఒకరికోసం ఒకరు ఆరాటపడే ఎమోషన్స్ ఫర్వాలేదనిపిస్తాయి. అన్నదమ్ముల అనుబంధం, కుటుంబంలో ఉండే ఎమోషన్స్‌కే ప్రాధాన్యత ఇచ్చారు. కథను ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా చేయడంలో శ్రీవాస్ తన మార్క్‌ను చూపించాడు. బ్రదర్స్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను తెరకెక్కించడంతో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కానీ స్టోరీలో ఎలాంటి కొత్తదనం లేకపోవడం పెద్ద మైనస్. అక్కడక్కడా బోరుగా అనిపించినా.. కామెడీ సీన్స్‌తో నెట్టుకొచ్చారు. సాంగ్స్, ఫైట్స్, కామెడీ సీన్స్ ఫర్వాలేదనిపించినా.. ఆడియన్స్‌కు అంతగా కనెక్ట్ అయ్యేలా లేవు. ఫ్యామిలీ ఎమోషన్స్ చూపిస్తూనే ప్రేక్షకులను ఓ సందేశాన్ని ఇచ్చాడు డైరెక్టర్. కేవలం ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫ్యాన్స్‌కు మాత్రమే ఫర్వాలేదనిపించేలా ఉంది. మాస్ ఆడియన్స్‌కు కాస్తా బోరుగానే అనిపించేలా కథనం సాగుతుంది. ఎవరెలా చేశారంటే... మాచో స్టార్ గోపీచంద్ మరోసారి తన మార్క్‌ను చూపించారు. ఫైట్ సీన్స్, కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. హీరోయిన్ డింపుల్ హయాతి ఫర్వాలేదనిపించింది. సాంగ్స్‌లో తన గ్లామర్‌తో అలరించింది. గోపీచంద్ అన్న, వదినలుగా జగపతిబాబు, ఖుష్బూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఎప్పుడు సీరియస్ పాత్రలు చేసే జగపతి బాబు.. ఈసారి సైలెంట్ క్యారెక్టర్లోనూ మెప్పించాడు. నాజర్, అలీ, గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్, సచిన్ ఖేడేకర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయాకొనిస్తే సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. మిక్కీ జే మేయర్ సంగీతం బాగుంది. ఎడటింగ్లో కొన్ని సీన్స్‌కు కత్తెర పడాల్సింది. నిర్మాణ విలువలు సంస్థ స్తాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
తరాలు మారినా ఎమోషన్స్ మారలేదు: హీరో గోపీచంద్
‘‘వందేళ్ల క్రితం అమ్మను ‘అమ్మ’ అనే పిలిచాం. ఇప్పుడూ అమ్మా అనే పిలుస్తాం. తరాలు మారినా ఎమోషన్స్ మారలేదు. అలాగే సినిమాల విషయంలో ఆడియన్స్ మారలేదు. సరైన కంటెంట్ ఇస్తే ఆడియన్స్ సినిమాలు చూస్తున్నారు. అయితే కథలో ఆడియన్స్‌ను మనం ఎంతవరకు ఇన్వాల్వ్ చేయగలుగుతున్నాం అన్నదే ముఖ్యం. వారు కనెక్ట్ అయ్యే ఏ జానర్ సినిమా తీసినా వాటిని ఆదరిస్తారు’’ అన్నారు హీరో గోపీచంద్. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘రామబాణం’. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో గోపీచంద్ చెప్పిన విశేషాలు.... ► ఈ మధ్య నేను ఎక్కువగా యాక్షన్ చిత్రాలే చేశాను. ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్న సినిమా చేయాలని అనుకుంటున్నప్పుడు భూపతిరాజాగారు చెప్పిన కథ, అందులోని బ్రదర్ ఎమోషన్స్ నచ్చడంతో ‘రామబాణం’ సినిమా చేశాం. హిట్ చిత్రాలు ‘లక్ష్యం’, ‘లౌక్యం’ల తర్వాత శ్రీవాస్, నేను మరో సినిమా చేయాలని ‘రామబాణం’ చేయలేదు. కథ కుదిరింది కాబట్టి చేశాం. ► ‘రామబాణం’ అన్నదమ్ముల కథ. ఇద్దరి స్వభావం ఒకటే. కానీ ఎంచుకున్న దారులు వేరు. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌కు కమర్షియల్ హంగులు జోడించి ఈ సినిమా చేశాం. అలాగే అంతర్లీనంగా ఓ సందేశం కూడా ఉంది. ఓ సమస్యను మనం కొన్నేళ్లు పట్టించుకోకుండా ఉంటే దాని దుష్ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. అప్పుడు బాధ పడతాం. ఈ విషయాన్నే ‘రామబాణం’లో చూపించాం. ► ‘లక్ష్యం’ సినిమాలో జగపతిబాబుగారితో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. ఆ సినిమాలో అన్నదమ్ముల్లా నటించిన మేం ‘రామబాణం’లోనూ అన్నదమ్ముల్లా నటించాం. ఈ సినిమాలో జగపతిబాబుగారిది కీలకపాత్ర. హీరోగా నా క్యారెక్టర్ పెంచేసి, ఆయన క్యారెక్టర్‌ను తగ్గించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే సినిమాకు కథే హీరో. కథే సినిమాను నడిపించాలి. ► టీజీ విశ్వప్రసాద్‌గారు మంచి నిర్మాత. ఇండస్ట్రీలో అతి మంచితనం మంచిది కాదని నేను ఆయనకు చె΄్పాను. ఎందుకంటే ఆయన చాలా సినిమాలు చేస్తున్నారు. అలాంటి వారు ఇండస్ట్రీలో ఉంటే చాలా మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ► ప్రస్తుతం కన్నడ దర్శకుడు హర్షతో ఓ సినిమా చేస్తున్నాను. ఆ తర్వాత దర్శకలు శ్రీను వైట్ల, తేజగార్లతో సినిమాలు ఉంటాయి. ► గతంలో నేను ‘ఒక్కడున్నాడు’, ‘సాహసం’ వంటి విభిన్నమైన సినిమాలు చేశాను. ఆ సినిమాలు ఇప్పుడు వచ్చి ఉంటే హిట్ అయ్యేవి. అయితే ఆ తరహా సినిమాల్లో నాకు నటించాలని ఉన్నా సరైన కథలు దొరకడం లేదు. ► హిట్ సినిమాలు అందించాలనే ఒత్తిడి నాకే కాదు... ప్రతి హీరోకూ ఉంటుంది. ఎందుకంటే ఓ సినిమా ఫలితంపై ఎన్నో కుటుంబాలు (ముఖ్యంగా బయ్యర్లు, డిస్ట్రిబూటర్స్ని ఉద్దేశిస్తూ..) ఆధారపడి ఉంటాయి. అయితే కొన్నిసార్లు హిట్ అవుతాయని మేం భావించిన సినిమాలు సరైన ఫలితాలను ఇవ్వక΄ోవచ్చు. తప్పులను విశ్లేషించుకుని అవి రిపీట్ కాకుండా చూసుకోవాలి. నాకు వచ్చిన ప్రతి రోల్‌ని డ్రీమ్ రోల్లా భావిస్తాను. ► నా కెరీర్ స్టార్టింగ్‌లో ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’ చిత్రాల్లో విలన్ రోల్స్ చేశాను. ఇండస్ట్రీలో ముందు నన్ను నిలబెట్టింది విలన్ రోల్సే. ప్రభాస్ సినిమాలో విలన్‌పాత్ర చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. అయితే కథ, అందులోని విలన్‌పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండాలి. -
యాంకర్ గా నవదీప్ కొత్త అవతారం. రివర్స్ లో ఆదుకున్న జగపతిబాబు, గోపీచంద్
-
ప్రభాస్ కూడా పెట్టించుకోరా..? ఆయన బాగా పెడతాడు అన్నాడు
-
ప్రభాస్ తో మల్టీస్టారర్ సినిమా పై క్లారిటీ ఇచ్చిన గోపీచంద్
-
Ramabanam Pre Release Event : ‘రామబాణం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సెకండ్ ఇన్నింగ్స్‌తో నా జీవితమే మారిపోయింది.. ఇప్పుడు ఆ ఒత్తిడి లేదు
‘‘గతంలో నేను చేసిన ‘శివరామరాజు’ చిత్రం అన్నదమ్ముల కథే. ఆ సినిమా చూశాక విడిపోయిన 24 కుటుంబాలు మళ్లీ కలిశాయి. ‘రామబాణం’ కూడా చాలా మంచి ఉద్దేశంతో చేసిన సినిమా’’ అని నటుడు జగపతిబాబు అన్నారు. గోపీచంద్, డింపుల్ హయతి జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రామబాణం’. టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాత. ఈ చిత్రం రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ మూవీలో కీలక పాత్ర చేసిన జగపతిబాబు విలేకరులతో చెప్పిన విశేషాలు. ► ఇండస్ట్రీలో ఇప్పుడు హారర్, యాక్షన్, థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి... సెంటిమెంట్ తగ్గింది. నెగిటివిటీ పెరిగింది. సినిమా ఎంత క్రూరంగా ఉంటే అంత బావుంటోంది.. అందుకే నేను సక్సెస్ అయ్యాను (నవ్వుతూ). అయితే అంత నెగిటివిటీ లోనూ పాజిటివిటీ ఉందని చెప్పడానికి ‘రామబాణం’ వస్తోంది. ► సెకండ్ ఇన్నింగ్స్‌లో నేనిప్పటి వరకూ 70కిపైగా పాత్రలు చేశా. అయితే చెప్పుకోడానికి ఏడెనిమిది సినిమాలే ఉన్నాయి. కొందరు నన్ను సరిగ్గా వాడుకోలేదు. కానీ ‘రామబాణం’ విషయంలో అలా కాదు. ఈ చిత్రాన్ని బలంగా మలిచాడు శ్రీవాస్. ఇందులో ఆర్గానిక్ ఫుడ్ ప్రాధాన్యతని చక్కగా చూపించాం. ► నేను హీరో కాదు.. విలన్ కాదు.. యాక్టర్‌ని. అందులోనూ డైరెక్టర్స్ యాక్టర్‌ని. మన నుంచి వాళ్లు ఏం రాబట్టుకోవాలనుకుంటున్నారో వారి కళ్లు చూస్తే అర్థమౌతుంది. నాకు ఎప్పుడైనా కథే ముఖ్యం. కాంబినేషన్ కాదు. పాత్ర నచ్చకపోతే కుదరదని చెబుతున్నాను. ► సెకండ్ ఇన్నింగ్స్‌తో నా జీవితమే మారిపోయింది. హీరో అనేది పెద్ద బాధ్యత.. ఒత్తిడి ఉంటుంది. కానీ, ఇప్పుడు ఆ ఒత్తిడి లేకపోవడంతో నటనపైనే దృష్టి పెడుతున్నాను. ► చిన్న సినిమా అనేది ఉండదు. హిట్ అయితే అదే పెద్ద సినిమా అవుతుంది. నాకు డబ్బు ముఖ్యం కాదు.. పాత్ర, సినిమా ముఖ్యం. సల్మాన్ ఖాన్‌తో చేసిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ తర్వాత బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. గాడ్ ఫాదర్ లాంటి పాత్ర చేయాలని ఉంది. అలాగే ‘గాయం’కి మరో స్థాయిలో ఉండే పాత్ర చేయాలనే ఆసక్తి ఉంది. ప్రస్తుతం నేను చేస్తున్న నాలుగైదు సినిమాలు పెద్ద బ్యానర్స్లోనివే. -
Ramabanam Movie Stills: గోపీచంద్ ‘రామబాణం’ మూవీ స్టిల్స్
-
సుమక్కతో అట్లుంటది సీరియస్ గా ఉంటె గోపీచంద్ కూడా పడీ పడీ నవ్వుకున్నాడు
-
గుడి కడతానన్న అభిమాని.. హీరోయిన్ ఆన్సర్ అదిరిందిగా!
సినీ తారలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్ల కోసం ఏం చేయడానికైనా రెడీ అయిపోతుంటారు కొందరు ఫ్యాన్స్. మరి కొందరేమో ఏకంగా గుడి కట్టేసి తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఇలా ఇప్పటికే ఖుష్భూ, నిధి అగర్వాల్, హన్సిక, నమిత, మొన్నీ మధ్య సమంత.. ఇలా హీరోయిన్లకు గుడికట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మరో అభిమాని హీరోయిన్ డింపుల్ హయాతికి గుడి కట్టాలనుకున్నాడు. ఈ విషయాన్ని నేరుగా ఆమెనే అడిగేశాడు. మ్యాచో హీరో గోపీచంద్‌తో డింపుల్ కలిసి నటించిన సినిమా రామబాణం ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్, మీమర్స్‌తో హీరోహీరోయిన్లు సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని.. 'మీకు గుడి కట్టాలనుకుంటున్నా. అది పాలరాయితో కట్టించాలా? లేక ఇటుకలతో కట్టించాలా' అని ప్రశ్నించాడు. దీనికి డింపుల్ సమాధానిమిస్తూ.. 'నాకు బంగారంతో గుడి కట్టండి..చాలా బాగుంటుంది' అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. డింపుల్ ఆన్సర్‌కి అక్కడున్న వాళ్లంతా తెగ నవ్వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
దివి నుంచి దిగొచ్చిన దేవకన్య.. వైట్ శారీలో ‘ఖిలాడీ’ భామ అందాలు (ఫొటోలు)
-
రామబాణం టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే....!
-
గోపీచంద్ తో ఇప్పటివరకు ఎవరూ ఇలా మాట్లాడి ఉండరు..!!
-
వాళ్లందరికీ.. నా కృతఙ్ఞతలు !
-
ఏంటండీ..! ఆ పంచె కట్టులో అలా ఉన్నారు..!!