Gopichand And Dimple Hayathi Rama Banam To Start Streaming On OTT - Sakshi
Sakshi News home page

Rama Banam: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోన్న గోపీచంద్‌ 'రామబాణం' మూవీ

Published Thu, May 25 2023 3:27 PM | Last Updated on Thu, May 25 2023 6:33 PM

Gopichand And Dimple Hayathi Rama Banam To Streaming On Ott - Sakshi

మాచో స్టార్ గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయాతి జంటగా నటించిన చిత్రం 'రామబాణం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై శ్రీవాస్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మే5న విడుదలయ్యింది.జ‌గ‌ప‌తిబాబు, ఖుష్భూ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

ల‌క్ష్యం, లౌక్యం వంటి హిట్స్ త‌ర్వాత గోపీచంద్‌, శ్రీవాస్ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్‌ సినిమా కావడంతో ఈ మూవీపై హైప్‌ క్రియేట్‌ అయ్యింది. కానీ సినిమా మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. గోపీచంద్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌, డింపుల్‌ అందాలు సినిమాను ఓ మోస్తరుగా నడిపించినప్పటికి బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం బోల్తా కొట్టింది.

ఈ క్రమంలో రామ‌బాణం మూవీ థియేటర్లలో విడుదలై నెలరోజులు కూడా పూర్తికాకముందే ఓటీటీలోకి రాబోతుంది. జూన్‌ 3 నుంచి ఈ సినిమా సోనిలివ్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. మరి థియేటర్లలో సినిమాను మిస్‌ అయినవాళ్లు ఓటీటీలో చూసేయండి మరి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement