టాలీవుడ్‌కి ఏప్రిల్ నెల అంతగా కలిసి రాలేదు. ఆ నెలలలో విడుదలైన తెలుగు సినిమాల్లో ఒక్క విరూపాక్ష మినహా మిగతావేవి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. రావణాసుర, మీటర్, శాకుంతలం, ఏజెంట్ చిత్రాలైతే భారీ నష్టాలను మిగిల్చాయి. ఇక మే నెలలో అయినా సాలిడ్ హిట్ కొట్టాలని టాలీవుడ్ వేచి చూస్తుంది. ఈ నెలలో వరుస చిత్రాలు విడుదల కాబోతుంది. మరి తొలివారం అటు థియేటర్.. ఇటు ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలపై ఓ లుక్కేయండి.
రామబాణం
గోపీచంద్, డింపుల్ హయతి జంటగా నటించిన చిత్రం ‘రామబాణం’. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. జగపతి బాబు, ఖుష్బూ కీలక పాత్రలు పోషించారు. మే 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అల్లరి నరేశ్ సీరియస్ ప్రయోగం ‘ఉగ్రం’
విజయ్ కనకమేడల దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్, మిర్నా మీనన్ జంటగా నటింన చిత్రం ‘ఉగ్రం’. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలవుతోంది. నరేశ్ కెరీర్‌లో 60వ సినిమా ఇది. మానవ అక్రమ రవాణా నేపథ్యంలో సీరియస్‌గా సాగే కథ ఇది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై హైప్‌ని క్రియేట్ చేశాయి. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో మే 5న తెలుస్తుంది.
‘అరంగేట్రం’
రోషన్. జెడ్, ముస్తఫా అస్కరి, శ్రీనివాస్ ప్రభన్, అనిరుధ్.టి, లయ, ఇందు, శ్రీవల్లి, విజయ, సాయిశ్రీ, జబర్దస్త్ సత్తిపండు కీలక పాత్రల్లో నటించిన చిత్రం అరంగేట్రం. శ్రీనివాస్ ప్రభన్ దర్శకత్వంలో మహేశ్వరి.కె నిర్మించిన ఈ సినిమా మే 5న విడుదల కానుంది. ఆరుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిల మధ్య ప్రధానంగా సాగే సినిమా ఇది.
యాద్గిరి అండ్ సన్స్
అనిరుధ్, యశస్విని జంటగా బిక్షపతి రాజు పందిరి దర్శకత్వంలో.. చంద్రకళ పందిరి నిర్మించిన రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ స్టోరీ ‘యాద్గిరి & సన్స్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
వీటితో పాటు ‘ది కేరళ స్టోరీ’అనే సినిమా మలయాళం, హిందీలో మే 5న విడుదల కాబోతుంది. అదా శర్మ, సిద్ది ఇదాని మెయిన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక తమిళ్‌లో కులసామి అనే చిన్న సినిమా మే 5న విడుదల కాబోతుంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు\వెబ్ సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్
మీటర్ మూవీ (తెలుగు)- మే 5
తూ ఝూటీ మే మక్కర్ (హిందీ)- మే5
ది టేర్(ఇంగ్లీష్)- మే2
శాంక్చురీ- మే 4
యోగి(తెలుగు) మే 5
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
కరోనా పేపర్స్(మలయాళ చిత్రం)- మే5
సాస్ బహూ ఔర్ ప్లమింగో(హిందీ)- మే 5
ఆహా
గీతా సుబ్రహ్మణ్యం మూడో సీజన్- మే5
ఇవి కూడా చదవండి:
నీ బతుకేంటో నాకు తెలుసు.. అశ్వనీదత్‌పై పోసాని ఫైర్
నా జీవితంలో ఎలాంటి బాధలు లేవు.. కానీ ఆ ఒక్క విషయంలోనే: నాగ చైతన్య
Comments
Please login to add a commentAdd a comment