
అల్లరి నరేశ్ పోలీసాఫీసర్‌గా చేసిన కత్తి కాంతారావు, బ్లేడ్ బాబ్జీ చిత్రాలు మంచి విజయం సాధించాయి. కానీ మూడోసారి లాఠీ పట్టి చేసిన ఉగ్రం మాత్రం మిశ్రమ స్పందన అందుకుంది. నాంది తర్వాత విజయ్ కనకమేడల- నరేశ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఉగ్రం. మిర్నా మీనన్ హీరోయిన్‌గా నటించింది. హరీశ్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా మే 5న విడుదలైంది. మనకు సమస్య వస్తే పోలీస్ దగ్గరకు వెళ్తాం.. అదే పోలీస్‌కు సమస్య వస్తే ఏం చేస్తాడు? ఎలా పరిష్కరిస్తాడు? అనేదే కథ.
అల్లరి నరేశ్ కెరీర్‌లో 60వ చిత్రంగా తెరకెక్కిన ఉగ్రం మానవ అక్రమ రవాణా నేపథ్యంలో సీరియస్‌గా సాగుతుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ ఎంట్రీకి రెడీ అయింది. సినిమా రిలీజైన నెల రోజులకు ఓటీటీలో రాబోతోంది. జూన్ 2 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇకపోతే అల్లరి నరేశ్ ప్రస్తుతం ఫరియా అబ్దుల్లాతో ఓ మూవీ, సుబ్బు దర్శకత్వంలో మరో మూవీ చేస్తున్నాడు. అలాగే విజయ్ కనకమేడల డైరెక్షన్‌లోనూ మరోసారి నటించే ఆస్కారం ఉంది.
చదవండి: మూడోసారి సహజీవనం.. 83 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న నటుడు
Comments
Please login to add a commentAdd a comment