Ugram Movie
-
ఉగ్రం ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అల్లరి నరేశ్ పోలీసాఫీసర్‌గా చేసిన కత్తి కాంతారావు, బ్లేడ్ బాబ్జీ చిత్రాలు మంచి విజయం సాధించాయి. కానీ మూడోసారి లాఠీ పట్టి చేసిన ఉగ్రం మాత్రం మిశ్రమ స్పందన అందుకుంది. నాంది తర్వాత విజయ్ కనకమేడల- నరేశ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఉగ్రం. మిర్నా మీనన్ హీరోయిన్గా నటించింది. హరీశ్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా మే 5న విడుదలైంది. మనకు సమస్య వస్తే పోలీస్ దగ్గరకు వెళ్తాం.. అదే పోలీస్‌కు సమస్య వస్తే ఏం చేస్తాడు? ఎలా పరిష్కరిస్తాడు? అనేదే కథ. అల్లరి నరేశ్ కెరీర్లో 60వ చిత్రంగా తెరకెక్కిన ఉగ్రం మానవ అక్రమ రవాణా నేపథ్యంలో సీరియస్‌గా సాగుతుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ ఎంట్రీకి రెడీ అయింది. సినిమా రిలీజైన నెల రోజులకు ఓటీటీలో రాబోతోంది. జూన్ 2 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇకపోతే అల్లరి నరేశ్ ప్రస్తుతం ఫరియా అబ్దుల్లాతో ఓ మూవీ, సుబ్బు దర్శకత్వంలో మరో మూవీ చేస్తున్నాడు. అలాగే విజయ్ కనకమేడల డైరెక్షన్‌లోనూ మరోసారి నటించే ఆస్కారం ఉంది. చదవండి: మూడోసారి సహజీవనం.. 83 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న నటుడు -
ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న 'ఉగ్రం' టీం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఉగ్రం చిత్ర బృందం మంగళవారం దర్శించుకుంది. సినీ నటుడు అల్లరి నరేష్, నటి మీర్జామీనన్తో పాటు పలువురు చిత్ర బృంద సభ్యులు అమ్మవారి దర్శనానికి విచ్చేయగా, ఆలయ అధికారులు వారికి సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. చదవండి: రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్'పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన శంకర్ ఆలయ పాలక మండలి సభ్యులు బుద్దా రాంబాబు అల్లరి నరేష్‌కు అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ఉగ్రం చిత్రం విజయవంతం కావడంతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్టు హీరో అల్లరి నరేష్ తెలిపారు. -
అల్లరి నరేష్ 3 రోజుల్లో 400 సిగరెట్లు తాగి..
-
ఈ సినిమాలో అల్లరి నరేష్ తో చేయడానికి కారణం ఏంటంటే...
-
ఇండస్ట్రీలో ఉండాలా.. వద్దా.. అని తేల్చుకొని సినిమా చేశాను
-
ఉగ్రం మూవీ సక్సెస్ సెలబ్రేషన్...
-
ఈ రెండు సినిమాల పరిస్థితి ఏంటి..? హిట్ అవ్వకపోతే మాత్రం
-
ఆడియన్స్ పెట్టిన కామెంట్స్ విని ఎమోషనల్ అయినా అల్లరి నరేష్
-
ఆ ఏజ్ లో పాప టాలెంట్,యాక్టింగ్ చూసి షాక్...అయ్యా బాబోయ్ చిచ్చరపిడుగు
-
సినిమా నచ్చకపోతే డైరెక్టర్ గా తిడుతున్నారు..
-
Ugram Movie : 'ఉగ్రం' చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
డైరెక్టర్ విజయ్ కనకమేడల అతని సినిమా పై కాంఫిడెన్స్
-
ఉగ్రం మూవీ పబ్లిక్ టాక్ వీడియో
-
Mirna Menon : కళ్లతోనే మాయ చేస్తున్న అల్లరి నరేష్ ‘ఉగ్రం’ హీరోయిన్
-
నా భార్య నా బీభత్సాన్ని ఇంట్లో చాలా సార్లు చూసింది
-
అల్లరి నరేశ్ 'ఉగ్రం' ట్విటర్ రివ్యూ
నాంది వంటి హిట్ చిత్రం తర్వాత హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందిన మరో చిత్రం 'ఉగ్రం'. మీర్నా మీనన్ హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ చిత్రం మే 5న ప్రేక్షకుల వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అసలు ఉగ్రం కథేంటి? ఎలా ఉంది? అల్లరి నరేశ్ యాక్షన్‌పై తమ అభిప్రాయాలను ట్విటర్లో పంచుకుంటున్నారు. నాంది తర్వాత యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ఉగ్రం. (ఇది చదవండి: సినిమాల్లోకి రావాలన్న ఇంట్రస్టే లేదు: త్రిష) ఉగ్రం సినిమాలో అల్లరి నరేశ్ యాక్షన్ అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. సెకండాఫ్‌లో క్లైమాక్స్, ఫైట్ సీన్స్ వేరే లెవెల్లో ఉన్నాయంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేశ్ విశ్వరూపం చూపించాడని ట్విటర్ వేదికగా స్పందిస్తున్నారు. మరికొందరు అల్లరి నరేష్ ముఖ్యంగా క్లైమాక్స్ ఫర్ఫార్మెన్స్ అదిరిపోయింది. కానీ కొన్ని కారణాల వల్ల అతని డైలాగ్ డెలివరీ కొన్ని మాస్ సీన్స్‌లో సింక్ కాలేదని అంటున్నారు. బీజీఎం కొన్ని సీన్స్‌లో డీసెంట్‌గా ఉందని చెబుతున్నారు. కొందరు ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉందనగా.. సెకండాఫ్‌లో గూస్బంప్స్ ఖాయమంటున్నారు. ఉగ్రం అల్లరి నరేశ్ యాక్షన్ వేరే లెవెల్లో ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. #Ugram is pure goosebumps stuff. what a perfomence anna @allarinaresh 🔥🔥🔥. Second half 🔥🔥🔥 Fights especially climax and hizra flight 🔥🔥🔥 Cinematography 🔥🔥🔥 Bgm,🔥🔥@sahugarapati7 good production. Overall: 3.5/5 Perfect mystery drama Ugram is 🔥🔥🔥🔥🔥 pic.twitter.com/lAovtf3tf1 — praveen Chowdary kasindala (@PKasindala) May 4, 2023 #Ugram movie review - POSITIVES: 1)@allarinaresh acting 👌👌 2) BGM 🥵🥵 3) intermission (rain fight)👍👍 4)climax🥵🥵🔥 Negatives: 1)so many drag scenes 2) love track Overall only for allari naresh performance Rating-2.5/5 Average movie pic.twitter.com/okE13flcMZ — movie_2updates (@Movie_updates2) May 4, 2023 Allan Naresh gave a good performance especially in the climax portions but for some reason his dialogue delivery is non-sync in a few mass scenes. BGM is decent in parts. Film could use some editing especially with random song placements that ruin the flow #Ugram — Venky Reviews (@venkyreviews) May 5, 2023 Vereyyyyy... Vereeyyyyy LEVEL ACTING OF ALLARI NARESH 🥵🥵🥵🥵🥵🥵🥵🥵💥🥵🥵💥🥵🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥@tollymasti #tollymasti . .#Ugram #UgramUsa #UgramReview #Allari #Ugramm @Shine_Screens #UgramOnMAY5th@allarinaresh @DirVijayK @harish_peddi @SricharanPakala @Shine_Screens — Tollymasti (@tollymasti) May 4, 2023 -
ఉగ్రం నా కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్ ఫిల్మ్ అవుతుంది
‘‘నేను పోలీసాఫీసర్‌గా చేసిన ‘కత్తి కాంతారావు’, ‘బ్లేడ్ బాజ్జీ’ చిత్రాలు విజయాలు సాధించాయి. అయితే ఇవి కామెడీ చిత్రాలు. కాగా నేను సీరియస్ పోలీస్ పాత్ర చేసిన ‘ఉగ్రం’ సినిమా కూడా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. ‘ఉగ్రం’ నా కెరీర్లో హయ్యస్ట్ గ్రాసర్ ఫిల్మ్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. ‘నాంది’ తర్వాత హీరో ‘అల్లరి’ నరేశ్, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘ఉగ్రం’. హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘గతంలో నేను చేసిన ఫైట్స్ నవ్వించడం కోసం... ఈ సినిమాలో ఎమోషన్ కోసం యాక్షన్ సీన్స్ చేశాను’’ అన్నారు. ‘‘నాంది’ సినిమాకు మూడురెట్ల వసూళ్లు ‘ఉగ్రం’ సినిమా రాబడుతుందనే నమ్మకం ఉంది’’ ఉన్నారు విజయ్ కనకమేడల. ‘‘భారతదేశ వ్యాప్తంగా మిస్సింగ్ కేసులు నమోదు అవుతున్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మనకన్నా ఎక్కువ మిస్సింగ్స్ ఉన్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. పక్కా ఆధారాలతో వాస్తవ ఘటనలను బేస్ చేసుకుని ‘ఉగ్రం’ కథ రెడీ చేశాం’’ అన్నారు రచయిత వెంకట్. కామెడీ సినిమాలు చేయడానికి నేను సిద్ధమే. నా తర్వాతి సినిమా కామెడీ జానర్లోనే ఉంటుంది. అయితే కొందరు నాకు కామెడీ కథలు చెప్పేటప్పుడు వాళ్లకు వాళ్లే ఎగ్జయిట్ అయ్యి, నవ్వేసుకుంటున్నారు. నాకు నవ్వు రావడం లేదు. ఆడియన్స్ ఆర్గానిక్ కామెడీని ఇష్టపడుతున్నారు. ఇప్పుడు నేను ‘కితకితలు’ సినిమా చేస్తే బాడీ షేమింగ్ అని తిడతారు. కుటుంబసమేతంగా చూసే కామెడీ సినిమాలు తీయాలన్నప్పుడు అందులో అసభ్య పదజాలం, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండకూడదు. చెప్పాలంటే కామెడీ సినిమాల రైటర్స్ తగ్గిపోయారు. – ‘అల్లరి’ నరేశ్ -
అల్లరి నరేష్ తన భార్య కూతురు గురించి పొగడ్తలు
-
మహర్షితో ఆ ధైర్యం వచ్చింది
‘‘అల్లరి’తో మొదలైన నా కెరీర్లో ‘ఉగ్రం’ 60వ చిత్రం. ఈ ప్రయాణంలో ఎత్తుపల్లాలు ఉన్నాయి. గెలుపు, ఓటములను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో నేర్చుకున్నాను. 60 సినిమాలు చేయడం అంత సులభం కాదు.. ప్రేక్షకుల ఆదరణ వల్లే ఇది సాధ్యపడింది. ఈ ప్రయాణంలో బాపుగారు, కె. విశ్వనాథ్‌గారు వంటి లెజెండరీ దర్శకులతో పాటు, వంశీగారు, కృష్ణవంశీగార్లతో పని చేసే చాన్స్ రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని ‘అల్లరి’ నరేశ్ అన్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్, మిర్నా మీనన్ జంటగా సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన చిత్రం ‘ఉగ్రం’. ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘అల్లరి’ నరేశ్ పంచుకున్న విశేషాలు. ► మహేశ్‌బాబుగారి ‘మహర్షి’ సినిమాకి ముందు నేను చేసిన పాత్రలు వినోదాత్మకంగా ఉంటాయి. ‘మహర్షి’లో నా పాత్ర సీరియస్‌గా, సింపతీగా ఉన్నా ప్రేక్షకులకు బాగా నచ్చింది. దాంతో ఇలాంటి పాత్రల్లోనూ ఆడియన్స్ ఆదరిస్తారనే ధైర్యం నాకు కలిగింది. రచయితలకు కూడా నమ్మకం కలగడంతో నా కోసం కామెడీ కాకుండా సీరియస్‌గా ఉండే కొత్త కథలు రాయడం మొదలు పెట్టారు. అలా వచ్చిన ‘నాంది’ హిట్ అయింది. ఇప్పుడు ‘ఉగ్రం’ తర్వాత మరిన్ని కొత్త కథలు నా కోసం రాస్తారనే నమ్మకం ఉంది. ► కామెడీ పాత్రలు చేయడం సులభం అనుకుంటారందరూ. కానీ చాలా కష్టం. కామెడీ చేసేవారు ఏ పాత్రయినా చేయగలరు. ‘రంగమార్తాండ’లో బ్రహ్మనందంగారు, ‘విడుదల’ చిత్రంలో సూరి అద్భుతంగా చేశారు. ‘ఉగ్రం విషయానికి వస్తే దర్శకుడు విజయ్ నా ప్లస్సుల కంటే మైనస్సులు ముందుగా నాకు చెప్పడంతో జాగ్రత్తలు తీసుకొని ‘ఉగ్రం’ చేశాను. మనల్ని దర్శకుడు నమ్మితే దాని ఫలితం వేరేలా ఉంటుంది. నన్ను క్రిష్‌గారు నమ్మడంతో ‘గమ్యం’, సముద్రఖనిగారు నమ్మడంతో ‘శంభో శివ శంభో’ వచ్చాయి. ఇప్పుడు విజయ్‌కి నాపై ఉన్న నమ్మకంతో ‘నాంది, ఉగ్రం’ వచ్చాయి. ► ‘ఉగ్రం’ ఐదేళ్ల టైమ్ లిమిట్లో జరుగుతుంది. ఎస్ఐ శిక్షణలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించడం, ఆ తర్వాత పెళ్లి, ఒక కూతురు.. ఇలా మూడు వేరియేషన్స్‌లో ఉండే శివకుమార్ పాత్రలో కనిపిస్తాను. యాక్షన్ సీన్స్‌ని డూప్ లేకుండా చేశాను. ► మనకి సమస్య వస్తే పోలీస్ దగ్గరికి వెళ్తాం. అదే పోలీస్‌కి సమస్య వస్తే ఏం చేస్తాడు? ఎలా ట్రీట్ చేస్తాడనేది ‘ఉగ్రం’లో ఉంటుంది. సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో స్క్రీన్ ప్లే చాలా ఆసక్తిగా ఉంటుంది. ► కామెడీ, సీరియస్.. ఏదీ సేఫ్ జోనర్ కాదు. ‘సుడిగాడు, బెండు అప్పారావు, కితకితలు’ వంటి హిట్ సినిమాలు చూసినప్పుడు ‘నరేశ్ సినిమా బావుంది అన్నారు కానీ నరేశ్ కామెడీ బాగా చేశాడనలేదు’. కానీ ‘గమ్యం, శంభో శివ శంభో, మహర్షి’ చూశాక ‘నరేశ్ బాగా నటించాడు’ అన్నారు. కామెడీ చేసేవాళ్లంటే ఇండస్ట్రీలో, ఆడియన్స్‌లో ఎక్కడో చిన్న చూపు ఉంది. ఈ విషయంలో నాకెక్కడో చిన్న గిల్ట్ ఫీలింగ్ ఉంది. ► ‘వివాదాల జోలికి వెళ్లొద్దు, ఎవరి గురించి చెడుగా మాట్లాడొద్దు’ అని మా నాన్న ఈవీవీ సత్యనారాయణగారు చెప్పారు. నాన్నగారు చెప్పినట్లు నాకు పని తప్ప మరో ఆలోచన లేదు. ఈవీవీగారి బ్యానర్లో నాన్నగారి మార్క్ సినిమాలు చేయాలి. సరైన కథ కుదిరితే నిర్మిస్తాను. నా సోదరుడు ఆర్యన్ రాజేశ్ తనని తాను నిరూపించుకునేందుకు సరైన కథ కోసం ఎదురు చూస్తున్నాడు. నాకు దర్శకత్వం ఆలోచన ఉంది కానీ అందుకు టైమ్ పడుతుంది.. అయితే నేను దర్శకత్వం వహించే మూవీలో నేను నటించను. ► నా సినిమాల్లో ‘సుడిగాడు’కి సీక్వెల్ తీయొచ్చు. ఆ మూవీకి పని చేసిన అనిల్ రావిపూడి మొన్న కలసినప్పుడు ‘సుడిగాడు 2’ చేద్దామా? అన్నాడు. ‘నేను రూటు మార్చితే మళ్లీ కామెడీవైపు తీసుకెళ్తారా?’ అని సరదాగా అన్నాను. నాన్నగారి చివరి రోజుల్లో ‘అలీబాబా అరడజను దొంగలు’ మూవీకి సీక్వెల్‌గా ‘అలీబాబా డజను దొంగలు’ సినిమా చేద్దామనుకున్నాం.. కానీ, కుదరలేదు. ప్రస్తుతం నేను, ఫరియా అబ్దుల్లా ఒక సినిమా చేస్తున్నాం. సుబ్బుగారి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాను. ‘జెండా’ అనే కథని కొన్నాను.. నేనే నిర్మిస్తా. అలాగే విజయ్‌తో మరో సినిమా ఉంటుంది. -
Ugram Pre Release: అల్లరి నరేశ్ ‘ఉగ్రం’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
మే తొలివారం థియేటర్/ ఓటీటీలో అలరించే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లివే
టాలీవుడ్‌కి ఏప్రిల్ నెల అంతగా కలిసి రాలేదు. ఆ నెలలలో విడుదలైన తెలుగు సినిమాల్లో ఒక్క విరూపాక్ష మినహా మిగతావేవి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. రావణాసుర, మీటర్, శాకుంతలం, ఏజెంట్ చిత్రాలైతే భారీ నష్టాలను మిగిల్చాయి. ఇక మే నెలలో అయినా సాలిడ్ హిట్ కొట్టాలని టాలీవుడ్ వేచి చూస్తుంది. ఈ నెలలో వరుస చిత్రాలు విడుదల కాబోతుంది. మరి తొలివారం అటు థియేటర్.. ఇటు ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలపై ఓ లుక్కేయండి. రామబాణం గోపీచంద్, డింపుల్ హయతి జంటగా నటించిన చిత్రం ‘రామబాణం’. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. జగపతి బాబు, ఖుష్బూ కీలక పాత్రలు పోషించారు. మే 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అల్లరి నరేశ్ సీరియస్ ప్రయోగం ‘ఉగ్రం’ విజయ్ కనకమేడల దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్, మిర్నా మీనన్ జంటగా నటింన చిత్రం ‘ఉగ్రం’. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలవుతోంది. నరేశ్ కెరీర్లో 60వ సినిమా ఇది. మానవ అక్రమ రవాణా నేపథ్యంలో సీరియస్‌గా సాగే కథ ఇది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై హైప్‌ని క్రియేట్ చేశాయి. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో మే 5న తెలుస్తుంది. ‘అరంగేట్రం’ రోషన్. జెడ్, ముస్తఫా అస్కరి, శ్రీనివాస్ ప్రభన్, అనిరుధ్.టి, లయ, ఇందు, శ్రీవల్లి, విజయ, సాయిశ్రీ, జబర్దస్త్ సత్తిపండు కీలక పాత్రల్లో నటించిన చిత్రం అరంగేట్రం. శ్రీనివాస్ ప్రభన్ దర్శకత్వంలో మహేశ్వరి.కె నిర్మించిన ఈ సినిమా మే 5న విడుదల కానుంది. ఆరుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిల మధ్య ప్రధానంగా సాగే సినిమా ఇది. యాద్గిరి అండ్ సన్స్ అనిరుధ్, యశస్విని జంటగా బిక్షపతి రాజు పందిరి దర్శకత్వంలో.. చంద్రకళ పందిరి నిర్మించిన రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ స్టోరీ ‘యాద్గిరి & సన్స్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు ‘ది కేరళ స్టోరీ’అనే సినిమా మలయాళం, హిందీలో మే 5న విడుదల కాబోతుంది. అదా శర్మ, సిద్ది ఇదాని మెయిన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక తమిళ్లో కులసామి అనే చిన్న సినిమా మే 5న విడుదల కాబోతుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు\వెబ్ సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్ మీటర్ మూవీ (తెలుగు)- మే 5 తూ ఝూటీ మే మక్కర్ (హిందీ)- మే5 ది టేర్(ఇంగ్లీష్)- మే2 శాంక్చురీ- మే 4 యోగి(తెలుగు) మే 5 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కరోనా పేపర్స్(మలయాళ చిత్రం)- మే5 సాస్ బహూ ఔర్ ప్లమింగో(హిందీ)- మే 5 ఆహా గీతా సుబ్రహ్మణ్యం మూడో సీజన్- మే5 ఇవి కూడా చదవండి: నీ బతుకేంటో నాకు తెలుసు.. అశ్వనీదత్‌పై పోసాని ఫైర్ నా జీవితంలో ఎలాంటి బాధలు లేవు.. కానీ ఆ ఒక్క విషయంలోనే: నాగ చైతన్య -
Ugram Pre Release: అల్లరి నరేశ్ ‘ఉగ్రం’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
అల్లరి నరేశ్ ‘ఉగ్రం’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు) -
ఉగ్రం సినిమా చూసి నా కూతురు అన్న మాటకి...
-
చావో రేవో తేల్చుకుందాం అని సినిమా చేశాను.. యాక్షన్ సీన్స్ లో నరేష్ ఇరగదీశాడు
-
నా ఉగ్రరూపం చూస్తారు.. రోజూ 18గంటలు కష్టపడ్డాము: అల్లరి నరేష్
‘‘ఇప్పటి వరకూ మిమ్మల్ని (ప్రేక్షకుల్ని) కితకితలు పెట్టించాను.. మరికొన్ని సినిమాల్లో కన్నీళ్లు పెట్టించాను. కానీ, ‘ఉగ్రం’ త్రంలో నా ఉగ్రరూపం చూస్తారు. ‘నాంది’ సినిమాని ఎంత ఆదరించారో అంతకుమించి పదిరెట్లు ‘ఉగ్రం’ ని ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని హీరో ‘అల్లరి’ నరేశ్ అన్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్, మిర్నా మీనన్ జంటగా నటింన చిత్రం ‘ఉగ్రం’. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ – ‘‘ఉగ్రం’ నా కెరీర్లో 60వ సినిమా. ‘అల్లరి’ నుంచి ‘ఉగ్రం’ వరకూ నా జర్నీలో ఉన్న దర్శకులు, నిర్మాతలకు థ్యాంక్స్. చదవండి: నేను బతుకుతున్నదే నా బిడ్డ కోసం.. చైతన్య తల్లి ఎమోషనల్ నేను, విజయ్ ‘నాంది’ చేస్తున్నప్పుడు ఎలాంటి అంచనాలు లేవు. కానీ, ‘ఉగ్రం’ మూవీకి అంచనాలు పెరుగుతాయి.. వాటిని కచ్చితంగా చేరుకోవాలని యూనిట్ అంతా కష్టపడ్డాం. నాకు, విజయ్‌కి సింక్ బాగా కుదిరింది. మా కమిట్మెంట్స్ అయిపోయాక మూడో సినిమా కలిసి చేస్తాం. బడ్జెట్ ఎక్కువ అవుతున్నా మా నిర్మాతలు ఎప్పుడూ చర్చ పెట్టలేదు. సినిమాకి ఎంత ఖర్చు పెట్టారో, పబ్లిసిటీ కోసం కూడా బాగా ఖర్చు చేస్తున్నందుకు థ్యాంక్స్. ఈ మూవీ కోసం ప్రతిరోజూ దాదాపు 16 నుంచి 18 గంటలు పనిచేశాం’’అన్నారు. సాహు గారపాటి మాట్లాడుతూ– ‘‘నరేశ్‌గారు ఇప్పటి వరకూ చేయని పాత్రని ‘ఉగ్రం’ సినిమాలో చేశారు. మేమంతా ఎంత థ్రిల్ అయ్యామో సినిమా చూశాక ప్రేక్షకులు కూడా అంతే థ్రిల్ అవుతారు. ఆయన కెరీర్లో ఇది బిగ్గెస్ట్ మూవీ అవుతుంది’’ అన్నారు. హరీష్ పెద్ది మాట్లాడుతూ–‘‘విజయ్‌గారు అనుకున్నది సాధించుకునే వరకూ నిద్రపోడు.. ఎవర్నీ నిద్రపోనివ్వడు. ఆయనపై మేము పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవుతుంది’’ అన్నారు. విజయ్ కనకమేడల మాట్లాడుతూ–‘‘శ్రీచరణ్ పాకాల ఇప్పటి వరకూ కొంచెం క్లాస్ టచ్‌లో ఉన్న స్పై, థ్రిల్లర్ సినిమాలు చేశాడు. ‘ఉగ్రం’ తర్వాత ‘మనకి పోటీగా ఇంకొకడు వచ్చాడ్రా’ అంటూ మాస్ మ్యూజిక్ డైరెక్టర్స్‌కి కొంచెం భయం మొదలవుతుంది.. ఇది నిజం. చదవండి: పూజాహెగ్డేకు బ్యాడ్‌టైం.. ఆ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న బ్యూటీ ‘ఉగ్రం’ బడ్జెట్ ఎక్కువ అయినా నన్ను నమ్మి సపోర్ట్ చేసిన నిర్మాతలకు థ్యాంక్స్. ఈ సినిమా కోసం రాత్రిపూట వానలో తీసిన ఓ ఫైట్ కోసం నరేశ్‌గారు ఎంత కష్టపడ్డారో సినిమా చూస్తే తెలుస్తుంది’’ అన్నారు. ‘‘ఉగ్రం’ సినిమా ఘన విజయం సాధించాలి’’ అని హీరోలు అడివి శేష్, నిఖిల్, విశ్వక్ సేన్, సందీప్ కిషన్, దర్శకులు హరీష్ శంకర్, శివ నిర్వాణ, వశిష్ట, అనిల్ రావిపూడి, వీఐ ఆనంద్ అన్నారు. ఈ వేడుకలో కెమెరామేన్ సి«ద్, సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల, కథ, మాటల రచయితలు తూము వెంకట్, అబ్బూరి రవి పాల్గొన్నారు.