‘‘ఇప్పటి వరకూ మిమ్మల్ని (ప్రేక్షకుల్ని) కితకితలు పెట్టించాను.. మరికొన్ని సినిమాల్లో కన్నీళ్లు పెట్టించాను. కానీ, ‘ఉగ్రం’ త్రంలో నా ఉగ్రరూపం చూస్తారు. ‘నాంది’ సినిమాని ఎంత ఆదరించారో అంతకుమించి పదిరెట్లు ‘ఉగ్రం’ ని ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని హీరో ‘అల్లరి’ నరేశ్ అన్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్, మిర్నా మీనన్ జంటగా నటింన చిత్రం ‘ఉగ్రం’. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ – ‘‘ఉగ్రం’ నా కెరీర్‌లో 60వ సినిమా. ‘అల్లరి’ నుంచి ‘ఉగ్రం’ వరకూ నా జర్నీలో ఉన్న దర్శకులు, నిర్మాతలకు థ్యాంక్స్. చదవండి: నేను బతుకుతున్నదే నా బిడ్డ కోసం.. చైతన్య తల్లి ఎమోషనల్
నేను, విజయ్ ‘నాంది’ చేస్తున్నప్పుడు ఎలాంటి అంచనాలు లేవు. కానీ, ‘ఉగ్రం’ మూవీకి అంచనాలు పెరుగుతాయి.. వాటిని కచ్చితంగా చేరుకోవాలని యూనిట్ అంతా కష్టపడ్డాం. నాకు, విజయ్‌కి సింక్ బాగా కుదిరింది. మా కమిట్‌మెంట్స్ అయిపోయాక మూడో సినిమా కలిసి చేస్తాం. బడ్జెట్ ఎక్కువ అవుతున్నా మా నిర్మాతలు ఎప్పుడూ చర్చ పెట్టలేదు. సినిమాకి ఎంత ఖర్చు పెట్టారో, పబ్లిసిటీ కోసం కూడా బాగా ఖర్చు చేస్తున్నందుకు థ్యాంక్స్. ఈ మూవీ కోసం ప్రతిరోజూ దాదాపు 16 నుంచి 18 గంటలు పనిచేశాం’’అన్నారు. సాహు గారపాటి మాట్లాడుతూ– ‘‘నరేశ్‌గారు ఇప్పటి వరకూ చేయని పాత్రని ‘ఉగ్రం’ సినిమాలో చేశారు. మేమంతా ఎంత థ్రిల్ అయ్యామో సినిమా చూశాక ప్రేక్షకులు కూడా అంతే థ్రిల్ అవుతారు. ఆయన కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ మూవీ అవుతుంది’’ అన్నారు.
హరీష్ పెద్ది మాట్లాడుతూ–‘‘విజయ్‌గారు అనుకున్నది సాధించుకునే వరకూ నిద్రపోడు.. ఎవర్నీ నిద్రపోనివ్వడు. ఆయనపై మేము పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవుతుంది’’ అన్నారు. విజయ్ కనకమేడల మాట్లాడుతూ–‘‘శ్రీచరణ్ పాకాల ఇప్పటి వరకూ కొంచెం క్లాస్ టచ్‌లో ఉన్న స్పై, థ్రిల్లర్ సినిమాలు చేశాడు. ‘ఉగ్రం’ తర్వాత ‘మనకి పోటీగా ఇంకొకడు వచ్చాడ్రా’ అంటూ మాస్ మ్యూజిక్ డైరెక్టర్స్‌కి కొంచెం భయం మొదలవుతుంది.. ఇది నిజం.
చదవండి: పూజాహెగ్డేకు బ్యాడ్‌టైం.. ఆ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న బ్యూటీ
‘ఉగ్రం’ బడ్జెట్ ఎక్కువ అయినా నన్ను నమ్మి సపోర్ట్ చేసిన నిర్మాతలకు థ్యాంక్స్. ఈ సినిమా కోసం రాత్రిపూట వానలో తీసిన ఓ ఫైట్ కోసం నరేశ్‌గారు ఎంత కష్టపడ్డారో సినిమా చూస్తే తెలుస్తుంది’’ అన్నారు. ‘‘ఉగ్రం’ సినిమా ఘన విజయం సాధించాలి’’ అని హీరోలు అడివి శేష్, నిఖిల్, విశ్వక్ సేన్, సందీప్ కిషన్, దర్శకులు హరీష్ శంకర్, శివ నిర్వాణ, వశిష్ట, అనిల్ రావిపూడి, వీఐ ఆనంద్ అన్నారు. ఈ వేడుకలో కెమెరామేన్ సి«ద్, సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల, కథ, మాటల రచయితలు తూము వెంకట్, అబ్బూరి రవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment