
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఉగ్రం చిత్ర బృందం మంగళవారం దర్శించుకుంది. సినీ నటుడు అల్లరి నరేష్, నటి మీర్జామీనన్‌తో పాటు పలువురు చిత్ర బృంద సభ్యులు అమ్మవారి దర్శనానికి విచ్చేయగా, ఆలయ అధికారులు వారికి సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు.
చదవండి: రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్'పై క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన శంకర్
ఆలయ పాలక మండలి సభ్యులు బుద్దా రాంబాబు అల్లరి నరేష్‌కు అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ఉగ్రం చిత్రం విజయవంతం కావడంతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్టు హీరో అల్లరి నరేష్ తెలిపారు.