Indrakeeladri Temple
-
ఇంద్రకీలాద్రి : బెజవాడ దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి : బెజవాడ దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి : రికార్డు స్థాయిలో దుర్గమ్మకు సారె సమర్పణ (ఫొటోలు)
-
విజయవాడ : దుర్గమ్మకు ఘనంగా ఆషాడమాసం సారె (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఆషాఢ మాసోత్సవాలు (ఫొటోలు
-
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో ఆషాఢమాసం ఉత్సవాలు
-
ఇంద్రకీలాద్రి పై ఘనంగా వసంత నవరాత్రి ఉగాది మహోత్సవాలు
-
కొండకు కొత్త శోభ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై పలు అభివృద్ధి పనులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారంశంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. విజయవాడ కనకదుర్గానగర్ గోశాల వద్ద రూ.216.05 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మరో రూ.23.145 కోట్లతో పూర్తి చేసిన పనులను ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ పనులకు సీఎం జగన్ తొలుత శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు. అమ్మవారి విశేషాలతో దుర్గామల్లేశ్వర దేవస్థానం ప్రచురించిన ‘శ్రీకనకదుర్గా వైభవం – ఉపాసనా విధానం’ పరిశోధనాత్మక గ్రంథాన్ని ఆవిష్కరించారు. వేద పాఠశాల విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించారు. అనంతరం ఇంద్రకీలాద్రిపైకి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. దుర్గగుడి మాస్టర్ ప్లాన్‌ను పరిశీలించారు. మాస్టర్ ప్లాన్ వివరాలను దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ముఖ్యమంత్రికి తెలియచేశారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా గోశాల శంకుస్థాపన ప్రాంతం వరకు వివిధ కళాబృందాలు తమ ప్రదర్శనలతో ఘన స్వాగతం పలికాయి. కేరళ సంప్రదాయ డ్రమ్స్ బృందం, తెలంగాణ కొత్తగూడెం గిరిజనుల కొమ్ము కోయ నృత్యం, భద్రాచలం ఒగ్గుడోలు, గిరిజన గుస్సాడి (నెమలి నృత్యం) కోలాటం, కూచిపూడి నృత్య బృందాల ప్రదర్శనలు అలరించాయి. పూర్ణకుంభంతో స్వాగతం కనక దుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రి జగన్‌కు పెద రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి అంతరాలయంలో ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ముఖ్యమంత్రికి తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్ర పటాన్ని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, దుర్గగుడి చైర్మెన్ కర్నాటి రాంబాబు, కమిషనర్ ఎస్.సత్యనారాయణ, ఈవో కెఎస్.రామారావు, వేద పండితులు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి తానేటి వనిత, శాసన మండలి సభ్యులు తలశిల రఘరామ్, రుహుల్లా, అరుణ్‌కుమార్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, తూర్పు నియోజక వర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, దేవస్థానం కమిటీ సభ్యులు, దేవదాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలన్, దేవదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ, కలెక్టర్ ఢిల్లీరావు, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె రాణా, డీసీపీ విశాల్ గున్ని, జాయింట్ కలెక్టర్ సంపత్‌కుమార్, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్ అదితిసింగ్ , ఆలయ ఈవో కె.ఎస్ రామారావు, ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్.డి ప్రసాద్, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన పనులు ఇవీ.. ► రూ.5.60 కోట్లతో పునః నిర్మించిన మల్లేశ్వర స్వామి వారి ఆలయం ► రూ.4.25 కోట్లతో పూర్తైన ఇంద్రకీలాద్రి కొండ రక్షణ పనులు ► రూ.3.25 కోట్లతో ఎల్టీ ప్యానల్ బోర్డులు, ఎనర్జీ, వాటర్ మేనేజ్మెంట్, స్కాడా పనులు ► 2016 పుష్కరాల సమయంలో గత సర్కారు కూల్చిన ఎనిమిది ఆలయాలను రూ 3.87 కోట్లతో పునః నిర్మించి ప్రారంభించిన సీఎం జగన్. ► పాతపాడు గ్రామంలో దేవస్థానం స్థలంలో రూ.5.66 కోట్లతో 1 మెగావాట్ సోలార్ విద్యుత్ కేంద్రం ► కొండ దిగువన రూ.23 లక్షలతో నిర్మించిన బొడ్డు బొమ్మ, రూ.28 లక్షలతో అమ్మవారి పాత మెట్ల మార్గంలో నిర్మించిన ఆంజనేయ స్వామి, వినాయక ఆలయాలను ప్రారంభించిన సీఎం జగన్. శంకుస్థాపనలు ► దుర్గగుడిలో రూ.30 కోట్లతో అన్నప్రసాద భవనం ► రూ.27 కోట్లతో ప్రసాదం పోటు భవన నిర్మాణాలు ► రూ.13 కోట్లతో ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ ► రూ.15 కోట్లతో రాజగోపురం ముందుభాగం వద్ద మెట్ల నిర్మాణం ► రూ.23.50 కోట్లతో దక్షిణాన అదనపు క్యూ కాంప్లెక్స్ ► రూ.7.75 కోట్లతో కనకదుర్గ ప్రవేశ మార్గం వద్ద మహారాజద్వార నిర్మాణం ► రూ.7 కోట్లతో కొండపైన పూజా మండపం ► రూ.18.30 కోట్లతో మల్లిఖార్జున మహా మండపం క్యూకాంప్లెక్స్‌గా మార్పు ► రూ.19 కోట్లతో నూతన కేశ ఖండనశాల ► కొండ దిగువన ఉన్న గోశాల భవనం రూ.10 కోట్లతో బహుళ ప్రయోజన సౌకర్య సముదాయంగా మార్పు ► దాతల సహకారంతో రూ.5 కోట్లతో కొండపైన గ్రానైట్ రాతి యాగశాల నిర్మాణం ► దేవస్థానం–ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ.33 కోట్లతో కనక దుర్గానగర్ వద్ద మల్టీ లెవల్ కారు పార్కింగ్ నిర్మాణం పనులు. -
Bhavani Devotess In Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై భవానీ భక్తుల రద్దీ (ఫోటోలు)
-
ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భక్తుల రద్దీ..|
-
వైభవంగా ఇంద్రకీలాద్రి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు
-
Vijayawada: దసరా శరన్నవరరాత్రులు ఇంద్రకీలాద్రిలో భక్తుల రద్దీ (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు.. క్యూలైన్లు ఫుల్
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఆరోరోజు దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఇక, నేడు అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి రెండు గంటల నుంచి దర్శనాలు మొదలయ్యాయి. కాగా, ఇంద్రకీలాదిపై వినాయకుడి గుడి నుంచి కొండపై వరకూ భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. సుమారు నాలుగు లక్షల మంది భక్తులు వస్తారని అధికారుల అంచనా వేశారు. క్యూలైన్లు నిండిపోవడంతో వీఎంసీ వద్ద కంపార్ట్మెంట్లను పోలీసులు ఏర్పాటు చేశారు. మరోవైపు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు మధ్యాహ్నం ఇంద్రకీలాద్రికి రానున్నారు. ప్రభుత్వం తరఫున సీఎం జగన్.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇక, మూలనక్షత్రం సందర్బంగా విశాఖలోని శారదాపీఠంలో అక్షరాభ్యాసాలు జరుగనున్నాయి. రాజశ్యామల అమ్మవారు సరస్వతీ దేవి అవతారంలో దర్శనమివ్వనున్నారు. దేవాలయంలో ఘనంగా పూజలు జరుగుతున్నాయి. మరోవైపు, తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు ఆరోరోజు తిరుమల శ్రీవారు.. హనుమంత వాహనంపై దర్శనమివ్వనున్నారు. అలాగే, రాత్రి గజవాహనంలో దర్శనమిస్తారు. ఇక, గురువారం గరుడోత్సవం సందర్భంగా రెండు లక్షలకు పైగా మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. గరుడోత్సవం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి ఎనిమిది గంటలు, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 66,757 కాగా, తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 26,395గా ఉంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.53 కోట్లు. ఇది కూడా చదవండి: వరుసగా మూడో ఏడాదీ వైఎస్సార్ అవార్డులు -
Dasara Navaratri Utsavalu : ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరరాత్రులు (ఫొటోలు)
-
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా శరన్నవరాత్రులు !
-
తొలి రోజు శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ దర్శనం
-
వచ్చే నెల 20వ దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చే నెల 20వ తేదీన ఇంద్రకీలాదికి వెళ్లనున్నారు. ఇక, అక్టోబర్ 15 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు జరుగనున్నాయి. అక్టోబర్ 20న అమ్మవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. మరోవైపు.. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు సన్నాహాలు జరుగుతున్నాయని సుమారు రూ.7 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ రాంబాబు, ఈవో భ్రమరాంబ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు 10 విశేష అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారన్నారు. ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రూ.2.50 కోట్లతో ఇంజినీరింగ్ పనులు చేస్తున్నామని చెప్పారు. ఉత్సవాల్లో గతేడాది ఆరు లక్షలకు పైగా భక్తులు అమ్మ వారిని దర్శించుకుంటే ఈ ఏడాది అంతకు మించి వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. గత ఏడాది ఉత్సవాల్లో 16 లక్షలకు పైగా లడ్డూలను దేవస్థానం అందించిందని, ఈ ఏడాది సుమారు 20 లక్షల లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. మూలా నక్షత్రం రోజున రూ.500 వీఐపీ టికెట్లు ఉత్సవాల్లో ముఖ్యమైన మూలా నక్షత్రం రోజున రూ. 500 వీఐపీ టికెట్లను విక్రయించాలని దేవస్థానం నిర్ణయించింది. భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనం నిలిపివేస్తారని తెలిపారు. రూ.500 వీఐపీ టికెట్ తీసుకున్నా ముఖ మండపం దర్శనం మాత్రమే కల్పిస్తామని వివరించారు. మిగిలిన రోజుల్లో రూ. 100, రూ.300, రూ. 500 టికెట్ల విక్రయాలు ఉంటాయన్నారు. ఉత్సవాలకు సుమారు రెండు వందల మంది పని చేస్తున్నారని, భక్తుల తలనీలాలు తీసేందుకు ఇతర ఆలయాలు, బయట నుంచి ఆరు వందల మంది అందుబాటులో ఉంటారని తెలిపారు. 22న వేదసభ ఉత్సవాల్లో ప్రత్యేకంగా నిర్వహించే ఆది దంపతుల నగరోత్సవం మల్లేశ్వరస్వామి ఆలయం మెట్ల వద్ద యాగశాల నుంచి ప్రారంభమవుతుందన్నారు. మహా మండపం, కనకదుర్గనగర్, దుర్గాఘాట్, దేవస్థాన ఘాట్‌రోడ్డు మీదగా అమ్మవారి ఆలయానికి చేరుకుంటుందన్నారు. రాజగోపురం ఎదుట పూజతో నగరోత్సవం ముగుస్తుందన్నారు. 21న అర్చక సభ, 22న వేద సభ జరుగుతుందని పేర్కొన్నారు. ఉత్సవాల్లో చివరి రోజు 23వ తేదీ నుంచి భవానీల రాక ప్రారంభమవుతుందని భావిస్తున్నామని, మూడు రోజుల పాటు తాకిడి ఉండే అవకాశాలున్నాయన్నారు. సమావేశంలో పాలక మండలి సభ్యులు కట్టా సత్తెయ్య, బచ్చు మాధవీకృష్ణ, చింకా శ్రీనివాసులు, తొత్తడి వేదకుమారి, వైదిక కమిటీ సభ్యులు యజ్జనారాయణశర్మ, మురళీధర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. తొలిసారి మహా చండీదేవిగా అమ్మవారు.. ఉత్సవాల్లో తొలిసారిగా అమ్మవారిని మహా చండీదేవిగా అలంకరిస్తామని దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య పేర్కొన్నారు. తొలిరోజున అమ్మవారి శ్రీబాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారన్నారు. 23వ తేదీ రెండు అలంకారాల్లో అమ్మవారిని భక్తులు దర్శించుకోవచ్చునన్నారు. ఉదయం మహిషాసురమర్దని, మధ్యాహ్నం నుంచి శ్రీ రాజరాజేశ్వరిదేవిగా అమ్మవారి దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. 23వ తేదీ సాయంత్రం శ్రీ గంగాపార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వరస్వామి వార్లకు పవిత్ర కృష్ణా నదిలో తెప్పోత్సవం జరుగుతుందన్నారు. ఇది కూడా చదవండి: తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత.. -
గాయత్రీదేవీగా దర్శనమిస్తున్న అమ్మవారు
-
ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
-
బెజవాడ ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
-
శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
-
ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న 'ఉగ్రం' టీం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఉగ్రం చిత్ర బృందం మంగళవారం దర్శించుకుంది. సినీ నటుడు అల్లరి నరేష్, నటి మీర్జామీనన్తో పాటు పలువురు చిత్ర బృంద సభ్యులు అమ్మవారి దర్శనానికి విచ్చేయగా, ఆలయ అధికారులు వారికి సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. చదవండి: రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్'పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన శంకర్ ఆలయ పాలక మండలి సభ్యులు బుద్దా రాంబాబు అల్లరి నరేష్‌కు అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ఉగ్రం చిత్రం విజయవంతం కావడంతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్టు హీరో అల్లరి నరేష్ తెలిపారు. -
విజయవాడ: ఉగాది సందర్భంగా ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు (ఫోటోలు)
-
విజయవాడ దుర్గగుడి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి ట్రస్ట్ బోర్డు ఏర్పాటైంది. దుర్గగుడి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 15 మంది సభ్యులతో కూడిన దుర్గగుడి ట్రస్ట్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 15 మంది ట్రస్ట్ బోర్డు సభ్యులు చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు.అయితే ఎక్స్ అఫిషియయోగా దేవస్థాన ప్రధాన అర్చకుడు ఉండనున్నారు. -
భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)
-
ముగిసిన భవానీ దీక్షల విరమణలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం వద్ద ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన భవానీ దీక్షల విరమణలు సోమవారంతో ముగిశాయి. మల్లేశ్వరస్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో ఆలయ స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ పర్యవేక్షణలో ఆలయ వైదిక కమిటీ సభ్యులు కోట ప్రసాద్, రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, అర్చకులు మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం కలశ ఉద్వాసన, వేద ఆశీర్వచనంతో దీక్షలు పరిసమాప్తం అయ్యాయి. ఈ సందర్భంగా ఈవో భ్రమరాంబ మాట్లాడుతూ దీక్షల విరమణకు దాదాపు 4.5 లక్షల మంది భవానీలు విచ్చేశారని తెలిపారు. ఈ కార్యక్రమానికి సుమారు రూ.6 కోట్ల మేర ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం నుంచి ఆర్జిత సేవలు యధాతథం జరుగుతాయని వివరించారు. -
భవాని దీక్షలు మొదటి రోజు: ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీలు (ఫొటోలు)
-
నేడు ఉదయం 7 గంటల వరకే దుర్గమ్మ దర్శనం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): చంద్రగ్రహణం కారణంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఆలయాలతోపాటు ఉపాలయాల్లో మంగళవారం ఉదయం ఏడు గంటల వరకే దర్శనానికి అనుమతిస్తారు. ఎనిమిది గంటలకు ఆలయ ద్వారాలను మూసివేస్తారు. గ్రహణ మోక్షకాలం అనంతరం సాయంత్రం 6.30గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి శుద్ది, అమ్మవారికి స్నపనాభిషేకం, అర్చన, మహానివేదన, హారతులను ఇచ్చి ఆలయ ద్వారాలను తిరిగి మూసివేస్తారు. బుధవారం తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. గ్రహణం నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, ఖడ్గమాలార్చన, గణపతి హోమం, నవగ్రహ హోమం, రుద్రహోమాలను మాత్రమే నిర్వహిస్తారు. ఉదయం 7.30 గంటలకు ప్రారంభమయ్యే లక్ష కుంకుమార్చన నుంచి సాయంత్రం పంచహారతులు వరకు అన్ని సేవలను రద్దు చేశారు. బుధవారం తెల్లవారుజాము నుంచి అన్ని ఆర్జిత సేవలు యథాతథంగా కొనసాగుతాయని ఆలయ వైదిక కమిటీ తెలిపింది. -
Vijayawada: ఇంద్రకీలాద్రిపై కోటిదీపోత్సవ ధగధగలు (ఫొటోలు)
-
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై గాజుల ఉత్సవం (ఫొటోలు)
-
Vijayawada: దుర్గమ్మకు భారీగా దసరా ఆదాయం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో రూ.16 కోట్ల మేర ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ భ్రమరాంబ తెలిపారు. ఇంద్రకీలాద్రి మహా మండపం ఆరో అంతస్తులో ఆమె సోమవారం విలేకరులకు ఉత్సవ ఆదాయ వ్యయాలను వివరించారు. హుండీ కానుకల ద్వారా రూ.9.11 కోట్లు, దర్శన టికెట్ల ద్వారా రూ.2.50 కోట్లు, ప్రసాదాల విక్రయాలతో రూ.2.48 కోట్లు, ఆర్జిత సేవల టికెట్ల ద్వారా రూ.1.03 కోట్లు, తలనీలాల ద్వారా రూ.20 లక్షలు, విరాళాలు ఇతరత్రా కలిపి రూ.16 కోట్ల ఆదాయం సమకూరిందని వివరించారు. ఉత్సవాల ఏర్పాట్లు, ప్రొవిజన్స్, ఇతర ఖర్చులకు రూ.10.50 కోట్ల మేర వెచ్చించామని తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ, వైదిక కమిటీ సభ్యుడు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, ఈఈలు కోటేశ్వరరావు, రమా పాల్గొన్నారు. 26 నుంచి కార్తిక మాసోత్సవాలు ఈ నెల 26 నుంచి నవంబర్ 23వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై కార్తిక మాసోత్సవాలను వైభవంగా నిర్వహి స్తామని ఈఓ భ్రమరాంబ తెలిపారు. 23వ తేదీన ధనత్రయోదశి సందర్భంగా మహాలక్ష్మి యాగం, 24న దీపావళి సందర్భంగా అమ్మవారి ప్రధాన ఆలయంలో ధనలక్ష్మి పూజ, సాయంత్రం ఏడు గంటలకు ఆలయ ప్రాంగణంలో దీపావళి వేడుకలు నిర్వహిస్తామన్నారు. 25వ తేదీ సూర్యగ్రహణం నేపథ్యంలో ఉదయం 11 గంటలకు ఆలయాన్ని మూసివేసి, 26 ఉదయం ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామన్నారు. నవంబర్ ఎనిమిదో తేదీన చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం ఎనిమిది గంటలకు అమ్మవారి ఆలయంతో పాటు ఉపాలయాలను మూసివేసి మరుసటిరోజు ఉదయం పూజల అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. నవంబర్ 4 నుంచి భవానీ మండల దీక్షలు నవంబర్ నాలుగో తేదీ నుంచి భవానీ మండల దీక్షలు, 24వ తేదీ నుంచి అర్ధమండల దీక్షలు ప్రారంభమవుతాయని ఈఓ తెలిపారు. డిసెంబర్ 15వ తేదీ నుంచి భవానీ దీక్ష విరమణలు ప్రారంభమై 19వ తేదీ పూర్ణాహుతితో ముగుస్తాయని పేర్కొన్నారు. డిసెంబర్ ఏడో తేదీన సత్యనారాయణపురం రామకోటి నుంచి కలశజ్యోతుల మహోత్సవం ప్రారంభమవుతుందని తెలిపారు. (క్లిక్ చేయండి: గుండెకు ‘ఆరోగ్యశ్రీ’ అండ) -
దుర్గమ్మ దసరా ఆదాయం రూ.3.95 కోట్లు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగిన దసరా ఉత్సవాల్లో అమ్మవారికి భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకల లెక్కింపు ప్రారంభమైంది. మంగళవారం జరిగిన లెక్కింపులో రూ.3,95,06,500 నగదుతోపాటు 532 గ్రాముల బంగారం, 13.680 కిలోల వెండి లభించిందని ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. 22 హుండీల ద్వారా ఈ ఆదాయం వచ్చిందన్నారు. మహా మండపం ఆరో అంతస్తులో నిర్వహించిన లెక్కింపులో సేవా సిబ్బందితోపాటు ఆలయానికి చెందిన వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. బుధ, గురువారాల్లోనూ కానుకల లెక్కింపు ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. -
రిపోర్టర్‌పై నటి హేమ ఫైర్
-
చదువుల తల్లి సరస్వతిగా జగన్మాత
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజైన ఆదివారం జగన్మాత కనకదుర్గమ్మ శ్రీ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. త్రిశక్తి స్వరూపిణి నిజ స్వరూపాన్ని సాక్షాత్కరింపజేస్తూ శ్వేత దండ, కమండలం ధరించి అభయ ముద్రలో శ్రీ సరస్వతీదేవిగా భక్తులను అనుగ్రహించారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రానికి శరన్నవరాత్రుల్లో ఎంతో విశిష్టత ఉంది. అందుకే చదువుల తల్లిగా కొలువుదీరిన దుర్గమ్మను రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకున్నారు. శనివారం రాత్రికే క్యూలైన్లు నిండిపోయాయి. అమ్మవారి దర్శనం ఆదివారం తెల్లవారు జామున 1.10 గంటల నుంచే ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు 2.30 లక్షల మంది దర్శనం చేసుకున్నట్లు దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ప్రత్యేక కుంకుమార్చనలు, పిల్లలకు అక్షరాభ్యాసాలు జరిగాయి. అమ్మవారి నగరోత్సవం కనుల పండువగా జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో కూచిపూడి కళాకారులు తమ నాట్య విన్యాసాలతో అలరించారు. నేడు దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం కాగా, సోమవారం దుర్గాదేవిగా కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. లోక కంటకుడైన దుర్గమాసురిడిని వధించిన అమ్మవారు దుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపై ఆవిర్భవించారు. ‘దుర్గే దుర్గతి నాశని’ అనే వాక్యం భక్తులకు శుభాలను కలుగజేస్తుంది. శరన్నవరాత్రులందు దుర్గాదేవిని అర్చించడం వల్ల దుర్గతులను పోగొట్టి సద్గతులను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. అమ్మవారిని దర్శించుకున్న డీజీపీ వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాల్లో భాగంగా సరస్వతీదేవిగా దర్శనమిస్తున్న బెజవాడ కనకదుర్గమ్మను డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్న ఆయనకు ఆలయాధికారులు స్వాగతం పలికి అమ్మవారి సన్నిధికి తీసుకువెళ్లారు. అక్కడ అర్చకస్వాములు అమ్మవారికి పూజలు చేయించారు. ఆశీర్వాద మండపంలో వేద పండితులు డీజీపీకి ఆశీస్సులందించారు. -
మహాలక్ష్మీదేవిగా దుర్గమ్మ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజైన శనివారం అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 11 వరకు దాదాపు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మహాలక్ష్మి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఐశ్వర్యప్రాప్తి, విజయం లభిస్తాయని భక్తుల నమ్మకం. శనివారం సాయంత్రం నగరోత్సవం కనుల పండువగా సాగింది. ఆదివారం అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి 2.5 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి ఆదివారం రాత్రి 11 గంటల వరకు భక్తులందరికీ ఉచితంగా అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. వీఐపీలకు, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనాలుండవని అధికారులు చెప్పారు. కొండపైకి వాహనాలను అనుమతించేది లేదన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా నగరంలోకి వాహనాలు రాకుండా వెలుపల నుంచే మళ్లిస్తున్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి వినాయక టెంపుల్ వరకు, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు, కుమ్మరిపాలెం నుంచి మోడల్ గెస్ట్‌హౌస్ వరకు వాహనాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. కాగా, శనివారం అమ్మవారిని మంత్రి అంబటి రాంబాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ దర్శించుకున్నారు. నేటి అలంకారం శ్రీ సరస్వతిదేవి ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ మూలా నక్షత్రం రోజైన ఆదివారం సరస్వతిదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. సరస్వతిదేవిని దర్శించుకోవడం వల్ల సర్వ విద్యలలో విజయం లభిస్తుందని భక్తుల నమ్మకం. -
లలితా త్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదవ రోజైన శుక్రవారం లలితాత్రిపుర సుందరీ అలంకారంలో దుర్గమ్మ దర్శనమిచ్చారు. చక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధి దేవతగా భక్తులను అనుగ్రహించారు. శుక్రవారం కావడంతో లక్ష మందికి పైగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రి పైన ఆది దంపతుల నగరోత్సవం శుక్రవారం వైభవంగా సాగింది. కాగా, ఆశ్వయుజ శుద్ధ షష్ఠి ఆరో రోజైన శనివారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. రేపు మూలా నక్షత్రం.. ఆదివారం అమ్మవారి జన్మనక్షత్రం మూలానక్షత్రం రోజున సరస్వతీ దేవి రూపంలో దుర్గమ్మ భక్తులను అనుగ్రహించనున్నారు. ఆ రోజు ఆలయానికి 2 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అధికారుల అంచనా. ఈ నేపథ్యంలో ఆ రోజు వీఐపీ దర్శనాలను అధికారులు రద్దు చేశారు. మూలానక్షత్రం రోజు వృద్ధులు, వికలాంగులు దర్శనాలకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. కాగా, మూలా నక్షత్రం సందర్భంగా ఆదివారం సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేయనున్నారు. -
Vijayawada: శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ దర్శనం (ఫొటోలు)
-
అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ దర్శనం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో నాలుగో రోజైన గురువారం దుర్గమ్మ శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నుంచి అమ్మవారికి పట్టు వ్రస్తాలను సమర్పించారు. గురువారం సుమారు 70 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారుల అంచనా. అన్నపూర్ణాదేవి విశేష అలంకారం కావడంతో భక్తులు ప్రసాద స్వీకరణకు బారులు తీరారు. సాయంత్రం శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్ల నగరోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అమ్మవారిని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభు త్వ విఫ్ కోరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. నేడు శ్రీలలితా త్రిపుర సుందరిగా.. దసరా ఉత్సవాల్లో 5వ రోజు శుక్రవారం అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. శుక్రవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. -
గాయత్రీ దేవిగా 'కనకదుర్గమ్మ' దర్శనం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడోరోజైన బుధవారం అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. క్యూలైన్లు సాఫీగా సాగిపోయేలా ఏర్పాట్లు చేయడంతో సామాన్యులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం అవుతోంది. కొండపైకి ప్రొటోకాల్, డిజిగ్నేటెడ్ విఐపీల వాహనాలు తప్ప, ఇతరుల వాహనాలు రాకుండా కట్టడి చేశారు. కనులవిందుగా నగరోత్సవం ఆది దంపతుల నగరోత్సవం నయన మనోహరంగా సాగింది. గంగాసమేత దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులతో మల్లేశ్వరాలయం దిగువన ఉన్న మహా మండపం నుంచి నగరోత్సవం ప్రారంభమైంది. దుర్గమ్మను ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బొత్స, కారుమూరి దర్శించుకున్నారు. కాగా, దివ్యాంగులకు మోడల్ గెస్ట్‌హౌస్ నుంచి దుర్గగుడికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు బస్సు సౌకర్యం ఉంది. పున్నమి ఘాట్ నుంచి భక్తులను ప్రత్యేక బస్సుల్లో ఓం టర్నింగ్ వరకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి వలంటీర్లు వారిని సేకరించుకొని, వీల్చైర్లలో తీసుకెళ్లి దర్శనం చేయిస్తున్నారు. నేడు అన్నపూర్ణాదేవిగా.. దసరా మహోత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ చవితిని పురస్కరించుకుని గురువారం కనకదుర్గమ్మను శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. శ్రీ అన్నపూర్ణాదేవి అన్నం ప్రసాదించే మాతృమూర్తి. శ్రీ అన్నపూర్ణాదేవి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నాన్ని, వజ్రాలు పొదిగిన గరిటెతో సాక్షాత్తు ఈశ్వరునికే భిక్షను అందించే అంశం అద్భుతం. లోకంలో జీవుల ఆకలిని తీర్చడం కన్నా మిన్న ఏదీ లేదు. ఈ నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో దుర్గమ్మను దర్శిస్తే అన్నాదులకు లోపం లేకుండా, ఇతరులకు అన్నదానం చేసే సౌభాగ్యాన్ని పొందగలుగుతామని భక్తుల విశ్వాసం. -
విజయవాడ: శరన్నరవరాత్రి ఉత్సవాలు మూడో రోజు.. భక్తుల కోలాహలం (ఫొటోలు)
-
Vijayawada: శరన్నవరాత్రి వైభవం.. అమ్మవారికి కుంకుమార్చన (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రిపై వైభవంగా..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజున కనకదుర్గమ్మ.. స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున మూడు గంటలకు వేద పండితులు, అర్చకుల సుప్రభాత సేవతో శరన్నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. శాస్త్రోక్తంగా బాలభోగ నివేదన చేసిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మవారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. తొలి రోజే పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఇంద్రకీలాద్రి కోలాహలంగా మారింది. సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తులతో నిర్వహించిన నగరోత్సవం భక్తులకు కనువిందుచేసింది. అమ్మవారి సేవలో గవర్నర్ దంపతులు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులు సోమవారం దుర్గమ్మను దర్శించుకున్నారు. వారికి దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, కల్టెకర్ ఢిల్లీరావు, సీపీ టీకే రాణా, ఆలయ ఈవో భ్రమరాంబ స్వాగతం పలికారు. గవర్నర్ మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయన్నారు. దుర్గమ్మను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు సీజే తెలిపారు. నేడు బాలాత్రిపురసుందరిగా.. బెజవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తున్న దసరా మహోత్సవాల్లో రెండో రోజైన ఆశ్వయుజ శుద్ధ విదియ(మంగళవారం) నాడు శ్రీ బాలా త్రిపురసుందరీదేవిగా కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తారు. దసరా ఉత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారమే శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి. -
శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా కేంద్రమైన విజయవాడలోని ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు ముస్తాబైంది. అమ్మవారి సన్నిధిలో సోమవారం నుంచి అక్టోబర్ ఐదో తేదీ వరకు శ్రీదేవీశరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలిరోజు దుర్గమ్మ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. రోజూ తెల్లవారుజామున నాలుగు నుంచి రాత్రి పదిగంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. అక్టోబర్ రెండో తేదీన మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని రెండులక్షల మందికిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అదేరోజు అమ్మవారికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టువ్రస్తాలు సమర్పిస్తారు. ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్ జిల్లా సీపీ టి.కె.రాణా ప్రత్యేక పూజలు చేసి దుర్గమ్మకు పట్టువ్రస్తాలు సమర్పించారు. -
విజయవాడ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు (ఫొటోలు)
-
శ్రావణమాసం చివరి శుక్రవారం : ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్‌లోని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరఫున ఆదివారం బంగారు బోనం సమర్పించనున్నారు. ఈ కమిటీ వారు ప్రతి ఏటా ఆషాడ మాసంలో బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో వర్షాలు విస్తారంగా కురిసి, పాడి పంటలతో రైతులు, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ గత 13 ఏళ్లుగా అమ్మవారికి బంగారు బోనం సమర్పించే కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని మహంకాళీ బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్ రాకేష్ తివారీ పేర్కొన్నారు. ఈ ఏడాది అమ్మవారికి బోనం సమర్పించే కార్యక్రమానికి కమిటీ సభ్యులతో పాటు 500 మందికి పైగా కళాకారులు విజయవాడకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు బ్రాహ్మణ వీధిలోని జమ్మి చెట్టు వద్ద అమ్మవారికి పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం బంగారు బోనంతో ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు. మేళతాళాలు, తీన్మార్ డప్పులు, పోతురాజుల విన్యాసాలు, కోలాట, బేతాళ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు, వడిబియ్యంతో పాటు కృష్ణమ్మ తల్లికి పట్టువస్త్రాలు, పసుపు కుంకుమ, గంగతెప్పను సమర్పించనున్నారు. -
ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న వర్మ, కొండా సురేఖ
సాక్షి, విజయవాడ: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మాజీ మంత్రి కొండా సురేఖ, కొండా చిత్ర యూనిట్ సోమవారం ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆర్జీవీ మాట్లాడుతూ.. 'విజయవాడలో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు దుర్గమ్మ దర్శనానికి రాలేదు. కొండా సురేఖ దంపతుల వలన అమ్మవారిని దర్శించుకున్నాను. కొండా దంపతుల భక్తి పారవశ్యం నన్ను ఆకర్షించింది. కొండా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అమ్మవారిని దర్శించుకున్నాను. సినిమా హిట్ కావాలని అమ్మవారిని కోరుకున్నాను' అని తెలిపారు. మాజీ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. 'ఆర్జీవీ దేవుడు పంపిన దూతగా వచ్చి మా బయోపిక్ తీశారు. మా బయోపిక్ సినిమాలో కేవలం 10 శాతం మాత్రమే ఉంది. కానీ మా బయోపిక్ తీయాలంటే వెబ్ సిరీస్ సరిపోదు. ఏ శత్రువుకి రాని అనుభవాలు మేము భరించాము. నా పాత్ర చేయడానికి హీరోయిన్ బాగా కష్టపడింది. కొండా మూవీ బయటకు వచ్చాక మీరే చెప్తారు. సినిమా విజయవంతం అయ్యాక అమ్మవారి దర్శనానికి మళ్లీ వస్తాం' అని పేర్కొన్నారు. KONDA family moolaana idhee naa paristhithi 😳😳😳 pic.twitter.com/rqN9a18nWc — Ram Gopal Varma (@RGVzoomin) June 13, 2022 చదవండి: మహారాష్ట్ర సీఎంను కలిసిన మేజర్ టీమ్ బస్ దిగేలోగా నా బ్యాగులోని డబ్బు, కార్డులు, వస్తువులు మాయమయ్యాయి -
విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న రామ్‌చరణ్ (ఫొటోలు)
-
అమ్మవారిని దర్శించుకున్న రామ్‌చరణ్, ఆలయంలో ఫ్యాన్స్ రచ్చ!
సాక్షి, విజయవాడ: మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరో రెండు రోజుల్లో (ఏప్రిల్ 29న) రిలీజ్ కానుంది. ఈ క్రమంలో రామ్ చరణ్, కొరటాల శివ కృష్ణా జిల్లాలోని విజయవాడలో ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ విషయం తెలిసిన అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టారు. అనంతరం రామ్‌చరణ్‌ను చూసేందుకు దుర్గమ్మ ఆలయం లోపలికి దూసుకొచ్చారు. దుర్గగుడి అంతరాలయంలో జై చరణ్ అంటూ నినాదాలిచ్చారు. మొబైల్ ఫోన్లతో వీడియోలు తీశారు. ఈ క్రమంలో ఆలయంలోని కానుకల హుండీలపై నిలబడ్డారు. పోలీసులు, ఆలయ అధికారుల సమన్వయ లోపం కారణంతో అక్కడ గందరగోళం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో క్యూలైన్లలో నిల్చున్న భక్తులు చాలాసేపు ఇబ్బందులు పడ్డారు. దుర్గ గుడి దర్శనం అనంతరం చరణ్, శివ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Mass @AlwaysRamCharan Fans🔥😎🤙#acharya #AcharyaOnApril29th #RamCharan #SIDDHA pic.twitter.com/Lha6KP7JRe — SIDDHA (@Pavanlucky988) April 27, 2022 చరణ్ బాబు ఎక్కడికైనా వస్తే అమ్మోరు తల్లే మమ్మల్ని ఆవహించి ముందుకి పంపుతుంది అనిపించేంత జనసముద్రం🤙🔥 బెజవాడ సన్నిధిలో చరణ్ అభిమానుల సింహ గర్జన 🔥🤙 బెజవాడ గడ్డ 🔥చరణ్ బాబు అడ్డా🔥@AlwaysRamCharan #RamCharan #AcharyaOnApr29 #Acharya pic.twitter.com/fX7LwzHDSK — TeamRC_Chittoor (@RcChittoor) April 27, 2022 Security arrangements should have been better... Man Of Masses #RamCharan Swamy in Vijayawada With Director #KoratalaSiva garu !! Visiting Kanaka durgamma Temple Today ❤️🙏 pic.twitter.com/FgRrydSoKx — Sᴀɱ JօղVíƙ™ (@Sam_Jonvik2) April 27, 2022 #RamCharan craze all over 🔥👌🏻 #Acharya promotionspic.twitter.com/LS0FbYUvBM — Sᴀɱ JօղVíƙ™ (@Sam_Jonvik2) April 27, 2022 చదవండి: ఆచార్య ఫస్ట్ రివ్యూ: రామ్‌చరణే బాస్! మరి చిరంజీవి? -
ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
-
ఇంద్రకీలాద్రిపై 26 నుంచి మహా శివరాత్రి మహోత్సవాలు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఈ నెల 26వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు మహా శివరాత్రి మహోత్సవాలను నిర్వహించనున్నట్లు వైదిక కమిటీ పేర్కొంది. 26న శనివారం ఉదయం 9.30 గంటలకు శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులకు మంగళస్నానాలు, వధూవరులుగా అలంకరణ జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు ఉత్సవాలకు అంకురార్పణ, మండపారాధన, కలశ స్థాపన, ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్టాపన, మూలమంత్రహావనం, బలిహరణ, హారతి జరుగుతుంది. మార్చి 1వ తేదీ మంగళవారం రాత్రి 9 గంటలకు శ్రీ గంగా పార్వతి (దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్ల దివ్యలీలా కల్యాణోత్సవం జరుగుతుంది. 2వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు స్వామి వారి రథోత్సవం నిర్వహిస్తారు. 3వ తేదీ ఉదయం 9.30 గంటలకు దేవస్థాన యాగశాలలో మహా పూర్ణాహుతితో ఉత్సవాలు లాంఛనంగా ముగుస్తాయి. అనంతరం వసంతోత్సవం జరుగుతుంది. -
దుర్గమ్మ సన్నిధిలో సీజేఐ దంపతులు
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ సతీసమేతంగా శనివారం ఉదయం దర్శించుకున్నారు. తొలుత ఆలయం వద్ద రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖమంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వారికి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ మర్యాదలతో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ పైలా సోమినాయుడు, కార్యనిర్వహణాధికారి భ్రమరాంబ, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతించారు. అంతరాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాన్ని అందజేశారు. సీజేఐ వెంట ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కన్నెగంటి లలిత, ఏపీ, తెలంగాణ హైకోర్టుల రిజిస్ట్రార్లు, విజయవాడ ఎంపీ కేశినేని నాని, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ హరిజవహర్‌లాల్, కలెక్టర్ జె. నివాస్, పోలీస్ కమిషనర్ కాంతిరాణా తదితరులు ఉన్నారు. -
Vijayawada: దుర్గమ్మకు కానుకగా డైమండ్ నెక్లెస్
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ రాష్ట్రం భువనగిరికి చెందిన భక్తుడు బి.పూర్ణచంద్రుడు రూ.2.50 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్‌ను కానుకగా అందజేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసిన పూర్ణచంద్రుడు దంపతులు ఆలయ పర్యవేక్షకులు బలరామ్‌ను కలిసి నెక్లెస్‌ను అందజేశారు. సుమారు 17 గ్రాముల బంగారం, చిన్న డైమండ్స్‌తో రూపొందించిన ఈ నెక్లెస్‌ను ఉత్సవాలలో అమ్మవారికి అలంకరించాలని దాతలు కోరారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. దాతలతోపాటు దుర్గగుడి వైదిక కమిటీ సభ్యుడు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి తదితరులున్నారు. (సప్తగిరులపై ‘స్నో’యగాలు.. కృష్ణమ్మకు ‘ఇంద్ర’హారం) -
దుర్గమ్మకు గాజుల మహోత్సవం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో శనివారం గాజుల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అమ్మవారి మూలవిరాట్‌తో పాటు ఉత్సవమూర్తిని గాజులతో అలంకరించారు. యమ ద్వితీయను పురస్కరించుకుని ప్రతి ఏటా కార్తీక మాసం రెండో రోజున అమ్మవారి సన్నిధిలో గాజుల మహోత్సవాన్ని నిర్వహిస్తారు. అమ్మవారి మూలవిరాట్‌తో పాటు ఉత్సవమూర్తిని, ఆలయ ప్రాంగణాన్ని రెండు లక్షల గాజులతో అలంకరించారు. శనివారం అమ్మవారు గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమివ్వగా, ఆది, సోమవారాలు కూడా ఆలయ ప్రాంగణం గాజుల అలంకరణతోనే ఉంటుందని ఆలయ ఈవో భ్రమరాంబ పేర్కొన్నారు. ఉత్సవం ముగిసిన అనంతరం అమ్మవారికి అలంకరించిన గాజులను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తామని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న కార్తీక మాసోత్సవాల్లో మల్లేశ్వరస్వామికి పెద్ద ఎత్తున భక్తులు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో సహస్ర లింగార్చన, దీపార్చన నిర్వహించారు. -
దుర్గమ్మ దసరా హుండీ ఆదాయం రూ.7.50 కోట్లు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాల్లో అమ్మవారికి హుండీల ద్వారా రూ.7.50 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడుల రూపంలో భక్తులు సమర్పించారు. మూడు రోజులుగా జరుగుతున్న కానుకల లెక్కింపు ప్రక్రియ బుధవారంతో ముగిసింది. బుధవారం లెక్కింపులో రూ.1,43,62,253 నగదు, 328 గ్రాముల బంగారం, 8.174 కిలోల వెండి సమకూరినట్లు ఆలయ ఈవో భ్రమరాంబ చెప్పారు. 3 రోజులుగా నిర్వహించిన లెక్కింపులో మొత్తం రూ.7,50,84,836ల నగదు,1.448 కిలోల బంగారం, 26.577 కిలోల వెండి లభ్యమైనట్లు తెలిపారు. -
భక్తులు పెద్ద మనసుతో క్షమించాలి: డీజీపీ
సాక్షి, విజయవాడ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు బుధవారం దర్శించకున్నారు. దర్శనానంతరం మంత్రి మాట్లాడుతూ.. 'అమ్మవారి కృపా కటాక్షాలు, ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించా. మంగళవారం మూలా నక్షత్రం రోజున లక్ష మందికి పైగా మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. నిన్న అధిక సంఖ్యలో భక్తులు వచ్చినా చివరి భక్తుడి వరకు దర్శనం కల్పించాము. అందుకు సహకరించిన రెవెన్యూ, పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను' అని మంత్రి వెల్లంపల్లి అన్నారు. భక్తులు పెద్ద మనసుతో క్షమించాలి: డీజీపీ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని డీజీపీ గౌతమ్ వాంగ్ బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వచనం పొందారు. దర్శనానంతరం డీజీపీ మాట్లాడుతూ.. దసరా నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. వాటిని భక్తులు పెద్ద మనసుతో క్షమించాలి. దసరా శరన్నవరాత్రిలో పోలీసుల పాత్ర చాలా కీలకమైంది. విధి నిర్వహణ నిర్వహిస్తున్న పోలీసులందరికీ నా కృతజ్ఞతలు. దసరా నవరాత్రి ఉత్సవాలలో పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను సీపీ బత్తిన శ్రీనివాసులు ముందుండి జరిపించడం చాలా సంతోషకరంగా ఉంది' అని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. చదవండి: (ఇంద్రకీలాద్రిపై వర్షం.. భక్తుల హర్షం) -
ఇంద్రకీలాద్రిపై వర్షం.. భక్తుల హర్షం
సాక్షి, అమరావతి: పాలకుడు మంచివాడైతే దైవం కరుణిస్తుందని, ప్రకృతి పులకిస్తుందని ఇంద్రకీలాద్రి సాక్షిగా మరోసారి రుజువైంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నప్పుడు అహ్లాదకర దృశ్యం ఆవిష్కృతమైంది. అంతవరకు మండే ఎండతో, ఉక్కపోతతో ఉన్న వాతావరణంతో అందరూ చమటలతో నిట్టూర్పులు విడవసాగారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ మధ్యాహ్నం 3 గంటలకు ఇంద్రకీలాద్రి ఘాట్ ప్రారంభంలోని కామధేను అమ్మవారి ఆలయ సమీపానికి చేరుకోగానే ఒక్కసారిగా చిరుజల్లులు మొదలయ్యాయి. సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న సీఎం ఇంద్రకీలాద్రిపైకి చేరుకుని తన వాహనం నుంచి దిగగానే ఒక్కసారిగా పెద్ద వర్షం మొదలై ఆ ప్రాంతమంతా ఆహ్లాదకరంగా మారిపోయింది. సీఎం ఆలయం లోపలికి వెళ్లి పూజలు ముగించుకుని తిరిగి బయటకు వచ్చే వరకు అంటే 3.45 గంటల వరకు వర్షం పడుతూనే ఉంది. సీఎం వైఎస్ జగన్ వాహనం ఇంద్రకీలాద్రి కిందకు దిగిన కాసేపటికి వర్షం ఆగిపోయింది. ఇంద్రకీలాద్రిపై తప్ప విజయవాడలో మరెక్కడా ఆ సమయంలో వర్షం పడకపోవడం విశేషం. ప్రజలకు మంచి చేయాలని పాలకుడు చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే.. దేవుని ఆశీస్సులు, ప్రకృతి కటాక్షం లభిస్తుందనడానికి ఇది శుభ సంకేతమని అర్చకులు, పండితులు, పలువురు భక్తులు వ్యాఖ్యానించారు. అభివృద్ధి పనులకు వెన్నుదన్ను ► ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి రూ.70 కోట్లు ప్రత్యేకంగా మంజూరు చేసిన విషయాన్ని భక్తులు గుర్తు చేసుకున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా నేరుగా ప్రభుత్వ నిధులను అమ్మవారి ఆలయానికి మంజూరు చేయలేదు. ► కృష్ణా పుష్కరాల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో ఏకంగా 40 ఆలయాలను కూల్చివేసిన విషయాన్ని కూడా భక్తులు ప్రస్తావించారు. అందుకు భిన్నంగా ప్రస్తుత ముఖ్యమంత్రి హిందూ ఆలయాల అభివృద్ధికి కృషిచేయడం హైందవ ధర్మం పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనం అని పేర్కొన్నారు. ► ఇంద్రకీలాద్రిపై అన్నదాన కాంప్లెక్స్, ప్రసాదాల పోటు, కేశ ఖండనశాల నిర్మాణంతోపాటు ఘాట్‌రోడ్డులో కొండరాళ్లు జారి పడకుండా రక్షణ చర్యలు చేపట్టేందుకు సీఎం మంజూరు చేసిన నిధులతో పనులు మొదలుపెట్టారు. -
దుర్గమ్మ సేవలో ఏపీ సీఎం
సాక్షి, తిరుపతి, తిరుమల/అమరావతి: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పాల్గొన్నారు. అత్యంత ప్రాశస్త్యమైన మూలా నక్షత్రం రోజున శ్రీసరస్వతీదేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించారు. అంతకు ముందు ఉదయం తిరుమల శ్రీవారి దర్శనానంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన.. తిరిగి తాడేపల్లికి చేరుకున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3గంటలకు ఆహ్లాదకర వాతావరణం మధ్య తన క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి ఇంద్రకీలాద్రి చేరుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆలయం వద్ద వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పరివేష్టితం ధారణతో అమ్మవారికి సమర్పించే పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలను తలపై పెట్టుకుని ఆలయంలోకి అడుగుపెట్టారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రాలతో అంతరాలయంలోకి ప్రవేశించి.. శ్రీసరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మ వారికి వాటిని సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశీర్వచన మండపంలో వేద పండితులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆశీర్వచనం పలికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. 78 కిలోల బియ్యంతో శ్రీవారికి తులాభారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తిరుమల పర్యటనలో భాగంగా మంగళవారం కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం పట్టు వస్త్రాలు సమర్పించి, స్వామి వారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం సంప్రదాయ బద్ధంగా ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. స్వామి దర్శనానంతరం వకుళామాతను, ఆలయ ప్రదక్షిణగా వచ్చి విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, శ్రీ యోగ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన శ్రీవారికి తులాభారం సమర్పించారు. పలువురు భక్తులు తమ బరువుకు సమానంగా బెల్లం లేదా బియ్యం లేదా ఇతర ధాన్యాలతో తూకం వేసి స్వామి వారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సంప్రదాయం ప్రకారం సీఎం వైఎస్ జగన్ తన బరువుకు సమానంగా 78 కిలోల బియ్యం తులాభారంలో సమర్పించారు. ఇక కన్నడ, హిందీలోనూ ఎస్వీబీసీ చానళ్లు దేశ విదేశాల్లో ఉన్న భక్తుల కోసం ఎస్వీబీసీ కన్నడ, హిందీ చానళ్లను శ్రీవారి ఆలయం వెలుపల గొల్ల మండపం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఇప్పటికే తెలుగు, తమిళంలో ఉన్న చానళ్ల ద్వారా టీటీడీ శ్రీ వేంకటేశ్వర వైభవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెబుతోంది. అనంతరం రోజుకు 6 లక్షల లడ్డూల తయారీ సామర్థ్యంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన నూతన బూందీ పోటును సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. దీని నిర్మాణానికి ఇండియా సిమెంట్స్ అధినేత, ప్రస్తుత టీటీడీ బోర్డు సభ్యుడు శ్రీనివాసన్ రూ.12 కోట్లు విరాళం అందించారు. ఇదివరకటి పోటుకు కూడా అప్పట్లో ఈయన ఇంతే మొత్తం విరాళంగా ఇచ్చారు. 8,541 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆధునిక బూందీ పోటులో 40 థర్మిక్ ఫ్లూయిడ్ స్టౌలు.. గాలి, వెలుతురు బాగా వచ్చే సదుపాయం కల్పించారు. ఎస్వీబీసీ కన్నడ, హిందీ చానళ్లను ప్రారంభిస్తున్న సీఎం జగన్ సహజ వ్యవసాయ పద్ధతులకు పెద్దపీట సహజ వ్యవసాయ పద్ధతులపై ముఖ్యమంత్రి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి ఎంఓయూ పత్రాలను మార్చుకున్నారు. అంతకు ముందు టీటీడీ ఈవో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టీటీడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేశారు. అనంతరం అన్నమయ్య భవనం అవరణంలో నిత్య పుష్ప కైంకర్య సేవలో తరించిన పుష్పాలతో తయారు చేసిన దేవతా కళా కృతులను ముఖ్యమంత్రి పరిశీలించి, వాటిని తయారు చేసిన మహిళలను అభినందించారు. తిరుమల, ఇంద్రకీలాద్రి కార్యక్రమాల్లో మంత్రులు నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), పేర్ని వెంకట్రామయ్య, ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మార్గాని భరత్, ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్లు, పలువురు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. సీఎం సంప్రదాయాలు పాటించే వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా సాధారణంగా ఉంటూ సంప్రదాయాలకు విలువ ఇచ్చే వ్యక్తి అని మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామి వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తాను తిరుమలకు రావడం ఇదే తొలిసారి అని చెప్పారు. శ్రీవేంకటేశ్వర కన్నడ భక్తి చానల్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం స్వామి వారి దయతోనే జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని సంప్రదాయ బద్ధంగా, చాలా బాగా నిర్వహించారని టీటీడీని అభినందించారు. సహజ వ్యవసాయ పద్ధతులపై ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందం చేసుకుంటున్న దృశ్యం -
అన్నపూర్ణగా.. శ్రీమహాలక్ష్మిగా..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం దుర్గమ్మ రెండు విశేష అలంకారాల్లో కొలువుదీరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు శ్రీ అన్నపూర్ణాదేవిగా, మధ్యాహ్నం 2 గంటల తరువాత శ్రీమహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావటంతో క్యూలైన్లు కిటకిటలాడాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సౌకర్యార్థం ఓంకారం వద్ద వీల్ చైర్స్ సదుపాయం, తాగునీటి సౌకర్యం కల్పించారు. ఉచిత ప్రసాదాలు అందేలా ఏర్పాటు చేశారు. నేడు మూలా నక్షత్రం శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరో రోజు మంగళవారం కనకదుర్గ అమ్మవారు శ్రీసరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా నేడు తెలవారుజామున 3 గంటల నుంచే భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఈ రోజు ఎలాంటి టికెట్లు లేకుండా భక్తులందరికీ దర్శనం చేసుకొనే అవకాశం కల్పిస్తున్నారు. -
నేడు దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూలానక్షత్రం సందర్భంగా మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించనున్నారు. సోమవారం ఉదయం దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకుని, సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ జె.నివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంద్రకీలాద్రికి చేరుకుంటారని చెప్పారు. అంతరాలయంలో అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. అనంతరం వేదపండితులు ఆయన్ని ఆశీర్వదిస్తారని తెలిపారు. పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ మూలానక్షత్రం సందర్భంగా అమ్మవారి దర్శనానికి ఎక్కువమంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆగ్మెంటెడ్ రియాల్టీ షోను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి అమ్మవారి చరిత్రను తెలిపే ఆగ్మెంటెడ్ రియాల్టీ షోను ముఖ్యమంత్రి జగన్ మంగళవారం ప్రారంభించనున్నారు. దుర్గగుడి అధికారులు సరికొత్త టెక్నాలజీతో ఇంద్రకీలాద్రిపై ఘాట్‌రోడ్డు, చినరాజగోపురం, మల్లేశ్వరస్వామి దేవస్థానాల వద్ద చరిత్ర చెప్పే క్యూఆర్ కోడ్ ఉన్న బోర్డులు ఏర్పాటు చేశారు. ‘కనకదుర్గ ఏఆర్’ అనే యాప్ డౌన్లోడ్ చేసి బోర్డుపై కోడ్ స్కాన్ చేస్తే అమ్మవారి చరిత్ర, ఆడియా, వీడియో ద్వారా విని, చూసే అవకాశం ఉందని ఆలయ ఈఈ భాస్కర్ తెలిపారు. సినిమా మాదిరి బొమ్మలు, మ్యూజిక్ ప్రత్యేకంగా ఉంటాయన్నారు. ఇది చిన్న పిల్లలకు వినోదాత్మకంగా కూడా ఉంటుందని చెప్పారు. -
రేపు దుర్గమ్మను దర్శించుకోనున్న సీఎం జగన్
సాక్షి, విజయవాడ: అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం దుర్గమ్మను దర్శించికుని.. మధ్యాహ్నం 3 గంటలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆదివారం 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం మూలా నక్షత్రం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు పక్కాగా చేశాం. దీనికి భక్తులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అన్నారు. ఇంద్రకీలాద్రి: నేడు రెండు అవతారలలో దుర్గమ్మ దర్శనం.. ఇంద్రకీలాద్రిపై దసరామహోత్సవాల్లో నేడు ఐదవరోజు ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇక నేడు రెండు అవతారాలలో దుర్గమ్మ దర్శనమిస్తుంది. పంచమి, షష్టి తిథులు ఏకమవ్వడంతో అమ్మవారికి రెండు అలంకారాలు చేస్తారు. ఉదయం అన్నపూర్ణా దేవిగా దర్శనమిస్తుండగా.. మధ్యాహ్నం 12 గంటల నుంచి మహాలక్ష్మీ దేవిగా భక్తులకు అమ్మవారి దర్శనం లభిస్తుంది. సోమవారం ఉదయం 4 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. (చదవండి: దుర్గమ్మ దర్శనానికి.. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు తప్పనిసరి) తిరుమల: మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు.. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్స మండపంలో శ్రీమలయప్పస్వామివారు మోహినీ రూపంలో దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చాడు.రాత్రి 7 గంటలకు విశేషమైన గరుడవాహన సేవ ఉంటుంది. చదవండి: టీటీడీ చరిత్రలో అరుదైన దృశ్యం.. -
లలితా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో నాలుగో రోజు ఆదివారం లలితా త్రిపుర సుందరీదేవిగా కనకదుర్గమ్మ దర్శనమిచ్చారు. స్కూళ్లు, కాలేజీలకు దసరా సెలవులు ఇవ్వడం, ఆదివారం సెలవురోజు కావడంతో సాయంత్రానికి 50 వేల మందికిపైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు సాయంత్రం వేళ కృష్ణమ్మ అందాలను తనివితీరా ఆస్వాదించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ ఘనంగా నగరోత్సవం జరిగింది. లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో అమ్మవారిని హోం మంత్రి మేకతోటి సుచరిత, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలు దర్శించుకున్నారు. కాగా, మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రిపై పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లు అధికారులు ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నారు. -
జేసీ అయితే ఏంటి?
సాక్షి, ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ‘మీరు ఎవరో నాకు తెలియదు. పాస్ ఉంటే చూపించండి. కొండపైకి పంపుతా’ అంటూ జాయింట్ కలెక్టర్ శివశంకర్ కారును ఎస్ఐ, సీఐ అడ్డగించిన ఘటన శుక్రవారం ఇంద్రకీలాద్రి టోల్గేట్ వద్ద చోటు చేసుకుంది. దసరా పనుల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్ శివశంకర్ శుక్రవారం మధ్యాహ్నం తన కారులో కొండపైకి బయలుదేరారు. టోల్గేట్ వద్ద జేసీ కారును అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్ఐ బి.శంకర్రావు అడ్డుకుని పాస్ చూపించాలని కోరారు. తాను జేసీనని చెప్పినా వినకపోవడంతో అక్కడే ఉన్న సీఐ ఎస్.ఎస్.వి.నాగరాజు వద్దకు వెళ్లి తన కారునే ఆపుతారా అని ప్రశ్నించారు. పాస్ ఉంటేనే కారును కొండపైకి పంపుతానని సీఐ చెప్పడంతో ఇద్దరి మధ్య వాదన జరిగింది. దీంతో జేసీ శివశంకర్ వెంటనే నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులుకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని సీపీ శ్రీనివాసులు మీడియా ముఖంగా వెల్లడించారు. చదవండి: (డ్రగ్స్ డాన్.. కుల్దీప్ సింగ్) పోలీసుల తీరుపై సీరియస్ సీఐ, ఎస్ఐ తీరుపై జేసీ శివశంకర్ సీరియస్ అయ్యారు. పోలీసుల తీరుకు నిరసనగా ఘాట్‌రోడ్డు నుంచి కొండపైకి నడిచి వెళ్లారు. మార్గమ ధ్యలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రొటోకాల్‌పై కలెక్టర్ సీరియస్ వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాల్లో అధికారుల ప్రొటోకాల్ వ్యవహరంపై కలెక్టర్ జె.నివాస్ సీరియస్ అయ్యారు. కలెక్టర్ దసరా ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించేందుకు శుక్రవారం రాత్రి ఇంద్రకీలాద్రిపైకి చేరుకొని ఆయా పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. ఘాట్‌రోడ్డులో జాయింట్ కలెక్టర్‌ను పోలీసులు అడ్డుకోవడంపై అధికారులను కలెక్టర్ మందలించారు. ఉత్సవాలు సవ్యంగా, విజయవంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని సూచించారు. -
స్వర్ణకవచాలంకారంతో కరుణించిన కనకదుర్గ
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు కనకదుర్గమ్మ.. స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులను అనుగ్రహించింది. గురువారం తెల్లవారుజామున మూడు గంటలకు వేదపండితులు, అర్చకుల సుప్రభాతసేవతో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. శాస్త్రోక్తంగా స్నపనాభిషేకం, బాలభోగ నివేదన చేసిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ తొలిదర్శనం చేసుకున్నారు. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులు అమ్మవారికి తొలిపూజ చేశారు. గవర్నర్ దంపతులకు మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, అధికారులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మవారిని దర్శించుకునే అవకాశం భక్తులకు కల్పించారు. ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ఈ ఉత్సవాలను జరుపుతున్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు పక్కా ప్రణాళికతో, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు చేశారు. కోవిడ్ ఉపశమనంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. కృష్ణమ్మ చెంత పులకించిపోయారు. అయితే ప్రభుత్వం ఈసారి కూడా నదీస్నానాలకు అనుమతించలేదు. సీతమ్మవారి పాదాల వద్ద కేశఖండనశాలను ఏర్పాటు చేశారు. భక్తులు అక్కడే జల్లు స్నానాలు చేసేందుకు 300కు పైగా షవర్లను ఏర్పాటు చేశారు. తాత్కాలిక మరుగదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటుచేశారు. భక్తులకు ఉచిత ప్రసాదం అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ఉచితంగా ప్రసాదాలను అందజేశారు. క్యూలైన్లలో తాగునీటి ఏర్పాట్లు చేశారు. పిల్లలకు పాలు, వృద్ధులకు బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చారు. ఏర్పాట్లను కలెక్టర్ జె.నివాస్, సీపీ శ్రీనివాసులు పర్యవేక్షించారు. పల్లకీసేవ, పంచహారతులు భక్తులను పరవశింపజేశాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కరోనా నుంచి ఉపశమనం కలగాలి: గవర్నర్ నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. అమ్మవారిని దర్శించుకుని తొలిపూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు ఉపశమనం లభించాలని దుర్గమ్మను ప్రార్థించినట్టు తెలిపారు. దసరా ఉత్సవాలను ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని ఆలయ అధికారులను ఆదేశించారు. అమ్మవారిని దర్శించుకున్న న్యాయమూర్తులు, ప్రముఖులు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ కృష్ణమోహన్, జస్టిస్ రఘునందనరావు, జస్టిస్ శివశంకర్ దర్శించుకున్నారు. స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిని దర్శించుకున్నవారిలో ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీ పి.కల్పలతారెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తదితరులున్నారు. -
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు
-
నేటినుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు
సాక్షి, విజయవాడ: దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. నేటి (గురువారం) నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మూలానక్షత్రమైన ఈ నెల 12న కనకదుర్గ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టువ్రస్తాలు సమర్పిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. దసరా ఉత్సవాల ప్రారంభానికి ముందురోజున వన్‌టౌన్ పోలీసులు అమ్మవారికి పట్టువ్రస్తాలు సమర్పించడం ఆనవాయితీ. తర్వాత రోజుల్లో నగర పోలీసు కమిషనర్ సమర్పించేవారు. ఈ నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్ (సీపీ) బత్తిన శ్రీనివాసులు కుటుంబసమేతంగా బుధవారం రాత్రి ఇంద్రకీలాద్రికి వచ్చి అమ్మవారికి పట్టువ్రస్తాలు సమర్పించారు. నేడు ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనం నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజు గురువారం తెల్లవారుజామున మూడు గంటలకు వేద పండితులు, అర్చకులు సుప్రభాతసేవతో అమ్మవారిని మేల్కొలిపి, శాస్త్రోక్తంగా స్నపనాభిషేకం, బాలభోగ నివేదన, నిత్యార్చనలు చేస్తారు. అనంతరం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఆ తర్వాత రోజు నుంచి తెల్లవారుజామున 4 గంటల నుంచి దర్శనాలకు అనుమతి ఇస్తారు. అమ్మవారి దర్శనానికి రోజుకు 10 వేలమందిని మాత్రమే అనుమతిస్తారు. 4 వేలమందికి ఉచితంగా, 3 వేలమంది వంతున రూ.100, రూ.300 టికెట్లతో దర్శనం కల్పించనున్నారు. ఆన్లైన్ టికెట్ లేకుండా వచ్చిన భక్తులకు అప్పటికప్పుడు దర్శనం టికెట్లు విక్రయించేందుకు వీఎంసీ కార్యాలయం ఎదుట, పున్నమిఘాట్ వద్ద దుర్గగుడి టోల్గేట్, ఓం టర్నింగ్‌ల వద్ద కరెంటు బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. కరోనా కారణంగా అంతరాలయ దర్శనాలను రద్దుచేసి లఘు దర్శనం ఏర్పాటు చేశారు. అన్నదానం బదులుగా ప్రసాదాలు కరోనా నిబంధనలు పాటిస్తూ అన్నదానాన్ని నిలుపుదల చేశారు. దానికి బదులుగా ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు బెల్లం పొంగలి, 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సాంబార్ రైస్, పెరుగు అన్నం ప్యాకెట్లు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బెల్లం పొంగలి భక్తులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. నేడు అమ్మవారిని దర్శించుకోనున్న గవర్నర్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గురువారం ఇంద్రకీలాద్రిపై శ్రీస్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. గవర్నర్ రానున్నందున ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి అలంకారం శ్రీస్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి దేవీశరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొలిరోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి గురువారం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని శ్రీస్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అలంకరిస్తారు. అమ్మవారిని స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శించుకోవడంతో సకల దారిద్యాలు తొలిగిపోయి సుఖసంతోషాలతో ఉంటామని భక్తుల నమ్మకం. -
9 నుంచి గగన విహారం
సాక్షి, అమరావతి: శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడలో హెలీ టూరిజం ఏర్పాటు చేస్తున్నారు. ఆకాశంలో విహరిస్తూ నగర అందాలు వీక్షించే అవకాశం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈనెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఈనెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర పర్యాటకశాఖ, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) సంయుక్తంగా హెలీ రైడ్స్ ఏర్పాటు చేశాయి. దసరా సందర్భంగా భక్తులు, పర్యాటకులు అధికసంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో హెలీ టూరిజానికి మంచి ఆదరణ లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. కృష్ణానది ఒడ్డున హెలిప్యాడ్ ఏర్పాటుకు వీఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో విశాఖపట్నం, కాకినాడ, కోటప్పకొండ, కొండపల్లి, కొండవీడుల్లో హెలీ టూరిజం నిర్వహించగా విజయవాడలో మొదటిసారి అందుబాటులోకి తీసుకొచ్చారు. రెండు కేటగిరీల్లో ఫ్లై జాయ్ టికెట్లు కృష్ణానది పైనుంచి విహరిస్తూ జలనిధి అందాలతో పాటు మబ్బుల మాటునుంచి ఇంద్రకీలాద్రి వైభవం, బెజవాడ నగర సోయగాలను వీక్షించేలా ప్రాజెక్టును రూపొందించారు. ఇందుకోసం హెలీ టూరిజంలో విశేష అనుభవం గడించిన తుంబై ఏవియేషన్ సంస్థ ఆరుగురు ప్రయాణించేందుకు వీలుండే సింగిల్ ఇంజన్ హెలికాప్టర్‌ను అందుబాటులోకి తేనుంది. రెండు కేటగిరీల్లో అందించే ఈ హెలీ రైడ్స్‌కు ప్రాథమికంగా టికెట్ రేట్లను నిర్ణయించారు. ఆకాశం నుంచి ఇంద్రకీలాద్రి మీదుగా ప్రకాశం బ్యారేజీ, నగర అందాలను వీక్షించేందుకు 6 నుంచి 7 నిమిషాల ప్రయాణానికి రూ.3,500 టిక్కెట్ ధరగా నిర్ణయించారు. దుర్గగుడి ఏరియల్ వ్యూ, నగరంలోని హిల్స్ అందాలను వీక్షించేందుకు 15 నిమిషాల ప్రయాణానికి టిక్కెట్ ధర రూ.6 వేలు వసూలు చేయనున్నారు. ఈ ఫ్లై జాయ్‌ని ప్రోత్సహించడానికి సామాజిక మాధ్యమాల వేదికగా విస్తృత ప్రచారం కల్పించనున్నారు. టికెట్లు బుక్ చేసుకోవడానికి ఒక ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. జిల్లాల్లో ఆఫ్‌లైన్ టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకుల స్పందనను బట్టి టికెట్ ధర తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. టూరిజాన్ని ప్రోత్సహించేలా.. రాష్ట్రంలో టూరిజాన్ని విస్తరించి, మరింత ప్రోత్సహించేలా చర్యలు చేపడుతున్నాం. ఈ క్రమంలోనే విజయవాడలో తొలిసారిగా హెలీ టూరిజాన్ని తీసుకొస్తున్నాం. పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తాం. ఏర్పాట్లపై కృష్ణాజిల్లా కలెక్టర్, వీఎంసీ కమిషనర్లతో చర్చించాం. – ఎస్.సత్యనారాయణ, ఏపీటీడీసీ ఎండీ -
రేపటి నుంచి నవరాత్రి మహోత్సవాలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపటి (గురువారం) నుంచి ఈనెల 15వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉత్సవాల్లో కనకదుర్గ అమ్మవారు రోజుకొక అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రోజుకు 10 వేలమంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. ఆన్లైన్ ద్వారా టైం స్లాట్ ప్రకారం దర్శనం టిక్కెట్లు ఇస్తున్నారు. గురువారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, తరువాత అన్ని రోజులు తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మవారి దర్శనం లభించనుంది. మూలానక్షత్రం రోజు 12వ తేదీ తెల్లవారుజామున 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చు. 15వ తేదీ విజయదశమి పర్వదినాన సాయంత్రం 5 గంటలకు కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. హంస వాహనంపై దుర్గామల్లేశ్వరులు కృష్ణానదిలో జలవిహారం చేస్తారు. ఊరేగింపులను ఆలయ ప్రాంగణం, పరిసరాలకే పరిమితం చేస్తున్నారు. విద్యుత్ దీపాలతో అలంకరించిన కనకదుర్గ అమ్మవారి ఆలయం 5 క్యూలైన్ల ఏర్పాటు ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం మొత్తం ఐదు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వినాయకగుడి నుంచి టోల్‌గేటు ద్వారా కొండపైన ఓం టర్నింగ్ వరకు మూడు క్యూలైన్లు, అక్కడి నుంచి అదనంగా ఉచిత దర్శనం లైను ఒకటి, వీఐపీ లైను ఒకటి సిద్ధం చేశారు. దర్శనానంతరం భక్తులు శివాలయం మెట్ల మార్గం ద్వారా కిందకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. దర్శనానంతరం కొండ దిగువన మహామండపం వద్ద కొబ్బరికాయలు కొట్టేందుకు ఏర్పాట్లు చేశారు. 13 ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేసి, 10 లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నారు. ఆలయ పరిసరాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. కొండపైన, దిగువన సూచన బోర్డులు ఏర్పాటు చేశారు. పున్నమి, భవాని ఘాట్లలో భక్తులు నదిలో స్నానం చేసే అవకాశం ఉన్నందున ఆ మార్గాలను మూసివేశారు. ఉత్సవాలకు 3 వేలమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 7 నుంచి శారదాపీఠంలో పెందుర్తి: శరన్నవరాత్రి ఉత్సవాలకు విశాఖ శ్రీ శారదాపీఠం ముస్తాబైంది. ఈ నెల 7న పీఠంలో ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. ఈ నెల 15 వరకు పీఠం అధిష్టాన దేవత శ్రీశారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు రోజుకో అవతారంలో పూజలందుకుంటారు. తొలిరోజు గురువారం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి చేతుల మీదుగా ఉత్సవాలను శాస్త్రోక్తంగా ప్రారంభిస్తారు. లోకకల్యాణం కోసం పీఠంలో శ్రీమత్ దేవి భాగవత పారాయణం చేపట్టనున్నారు. ఉత్సవాల్లో అమ్మవారి నిజరూపాన్ని వీక్షించే అవకాశం ఉంటుందని పీఠం ప్రతినిధులు వెల్లడించారు. అమ్మవారి అవతారాలు.. ఉత్సవాల్లో అమ్మవారు గురువారం బాలత్రిపుర సుందరిదేవిగా, శుక్రవారం మహేశ్వరిగా, శనివారం వైష్ణవిదేవిగా, ఆదివారం అన్నపూర్ణ దేవిగా, సోమవారం లలితా త్రిపురసుందరిదేవిగా, మంగళవారం మహాసరస్వతిదేవిగా, బుధవారం మహాలక్ష్మిగా, గురువారం మహిషాసుర మర్ధినిగా, శుక్రవారం విజయదుర్గగా దర్శనమిస్తారు. -
దసరా ఉత్సవం.. మూడు వేల మందితో భద్రత పటిష్టం
సాక్షి, విజయవాడ: ఈ నెల 7 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించే శరన్నవరాత్రి మహోత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకునేందుకు పోలీస్ శాఖ నుంచి అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రోజూ పది వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా దేవదాయ, రెవెన్యూ, కార్పొరేషన్, నీటిపారుదల శాఖ, దేవస్థాన అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో సమన్వయం చేస్తున్నామన్నారు. దర్శనానికి వచ్చే భక్తులు తప్పని సరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. 10 ఏళ్ల లోపు చిన్నారులు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు దర్శన అనుమతి లేదని స్పష్టం చేశారు. భవానీ మాలధారణతో వచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయలేదన్నారు. ఘాట్లలో స్నానాలకు అనుమతి లేదని, జల్లు స్నానాలను సీతమ్మవారి పాదాల వద్ద ఏర్పాటు చేశామని వివరించారు. క్యూలైన్ల వద్ద భద్రతా ఏర్పాట్లు.. ►కెనాల్ రోడ్డులోని వినాయకుడి గుడి నుంచి ప్రారంభమయ్యే భక్తుల క్యూలైన్.. ఘాట్ రోడ్డు మీదుగా అమ్మవారి గుడికి చేరుకుంటుందన్నారు. ►అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు అర్జున వీధి మీదుగా కెనాల్ రోడ్డుకు చేరుకోవాలన్నారు. ►కుమ్మరిపాలెం వైపు నుంచి వచ్చే భక్తులు హెడ్‌వాటర్ వర్క్స్ ఎదురుగా గుడికి ఆనుకుని టోల్ గేట్ వరకు క్యూలైన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ►నవరాత్రి విధుల్లో మూడు వేల మంది పోలీసు సిబ్బందిని నియమిస్తున్నట్లు సీపీ తెలిపారు. నిఘా పక్కా.. చోరీలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రోన్, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, అల్లరి మూకలపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నామని చెప్పారు. సమస్యలు ఎదురైతే 100 లేదా 7328909090 నంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం కమాండ్ కంట్రోల్‌రూం, వన్‌టౌన్, భవానీపురం పోలీస్ స్టేషన్లతో పాటు రైల్వే, బస్ స్టేషన్, పోలీస్ కమిషనరేట్ కార్యాలయం, స్టేట్ గెస్ట్‌హౌస్ ప్రాంతాల్లో పోలీస్ సమాచార కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మోడల్ గెస్ట్ హౌస్, పోలీస్ కంట్రోల్ రూం వద్ద 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామన్నారు. వాహనాల పార్కింగ్ ప్రాంతాలు.. విధుల్లో ఉండే పోలీస్ సిబ్బంది వాహనాలను మోడల్ గెస్ట్ హౌస్ వెనుక పార్క్ చేసుకోవాలన్నారు. భక్తులు కార్లను పద్మావతి ఘాట్ గాంధీజీ మున్సిపల్ హైస్కూల్, రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్, టీటీడీ ఖాళీ ప్రదేశం, పున్నమీ ఘాట్, భవానీ ఘాట్ల వద్ద, ద్విచక్ర వాహనాలను ఇరిగేషన్ పార్క్, గద్ద బొమ్మ(కేఆర్ మార్కెట్), లోటస్ అపార్ట్మెంట్ల వద్ద పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ వైపు నుంచి భక్తులతో వచ్చే బస్సులు భవానీఘాట్, పున్నమీ ఘాట్‌లో, విశాఖపట్నం గుంటూరు వైపు నుంచి బస్సులు పున్నమీ ఘాట్‌లో పార్కింగ్ చేసుకోవాలని కోరారు. మూలా నక్షత్రం నాడు.. ఈ నెల 11న మూలా నక్షత్రం రోజు రాత్రి 11 గంటల నుంచి 12 రాత్రి 11 గంటల వరకు కేఆర్ మార్కెట్ వైపు వెళ్లే బస్సులను బస్టాండ్, పీసీఆర్, చల్లపల్లి బంగ్లా, ఏలూరు లాకులు, బీఆర్టీఎస్ రోడ్డు, బుడమేరు వంతెన, పైపుల రోడ్, సితార, గొల్లపూడి జంక్షన్, ఇబ్రహీంపట్నం మీదుగా మళ్లిస్తున్నట్టు చెప్పారు. ప్రకాశం బ్యారేజ్, సీతమ్మవారి పాదాలు, పీసీఆర్ విగ్రహం, ఘాట్ రోడ్డు, కుమ్మరిపాలేనికి ఇరువైపులా వాహనాలను అనుమతించబోమని సీపీ తెలిపారు. వాహనాల మళ్లింపు ఇలా.. ►ఉత్సవాల సమయంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ తెలిపారు. ►విజయవాడ,ఇబ్రహీంపట్నం మధ్య రాకపోకలు సాగించే వాహనాలను సీతమ్మవారి పాదాలు, పీఎస్ఆర్ విగ్రహం, ఘాట్ రోడ్, స్వాతి జంక్షన్ మార్గాల్లో అనుమతించమన్నారు. ఈ వాహనాలు కనకదుర్గా ఫ్లై ఓవర్ మీదుగా రాకపోకలు సాగించాలన్నారు. ►కుమ్మరిపాలెం నుంచి అమ్మవారి గుడి వైపు వచ్చే వాహనాలు గుప్తాసెంటర్, చెరువు సెంటర్, సితార సెంటర్, స్వాతి సెంటర్ నుంచి ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లాలన్నారు. ►సీతమ్మవారి పాదాల నుంచి గుడికి చేరుకునే వాహనాలు గద్దబొమ్మ, కేఆర్ మార్కెట్, పంజా సెంటర్, గణపతిరావు రోడ్డు, చిట్టినగర్ సొరంగం మీదుగా ప్రయాణించాలని సూచించారు. మాట్లాడుతున్న మంత్రి వెలంపల్లి, చిత్రంలో ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీ మోహన్, కలెక్టర్, సీపీ తదితరులు సమన్వయంతో విజయవంతం చేద్దాం ►ఉత్సవ ఏర్పాట్లపై మంత్రి వెలంపల్లి సాక్షి, ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ.. దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ జె.నివాస్ అధ్యక్షతన బ్రాహ్మణవీధిలోని దేవస్థాన పరిపాలనా భవనంలో సమావేశం జరిగింది. ఉత్సవాల ఏర్పాట్లు ఏ దశలో ఉన్నాయనే వివరాలను దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులు మంత్రికి, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్‌కు వివరించారు. వైభవంగా నిర్వహించాలి.. అనంతరం మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ దేవస్థానం తరఫున చేపట్టిన పనులు త్వరతిగతిన పూర్తి చేసి, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. భక్తులకు మంచినీరు, పారుశుద్ధ్యం, ప్రసాదాల కౌంటర్లు తదితరాల ఏర్పాటులో అలసత్వం వద్దన్నారు. ఉత్సవాలను గతంలో కంటే వైభవంగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణులతో పాటు పలువురు రెవెన్యూ, జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. -
దుర్గమ్మ సేవలో సీఎస్ సమీర్‌శర్మ
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సమీర్ శర్మ శనివారం దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన సమీర్‌శర్మ దంపతులకు దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్, దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ సాదరంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు జరిపించారు. మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పలు ఇంజనీరింగ్ పనులను పరిశీలించారు. -
దుర్గమ్మకు కానుకగా రూ. 5 లక్షల స్వర్ణ హారం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు రూ.5 లక్షల విలువైన బంగారు డైమండ్ కంఠాభరణాన్ని శుక్రవారం కానుకగా సమర్పించారు. హైదరాబాద్‌కు చెందిన మహాలక్ష్మయ్య దంపతులు శనివారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి వచ్చి ఆలయ ఈవో భ్రమరాంబ, ప్రధాన అర్చకులు లింగంభోట్ల దుర్గాప్రసాద్‌లకు డైమండ్ హారాన్ని అందచేశారు. దాతలకు అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అధికారులు, పాలక మండలి సభ్యురాలు కటకం శ్రీదేవి అమ్మవారి చిత్రపటం, ప్రపాదం, శేషవస్త్రాలను అందజేశారు. ఈవోకు బంగారు హారాన్ని అందచేస్తున్న దాతలు -
ధర్మపథం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: దుర్గగుడిలో ధర్మపథం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ధర్మ ప్రచారం కోసమే ప్రత్యేకంగా ధర్మపథం కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం మొదలుపెట్టింది. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధర్మపథం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ కార్యక్రమంలో దేవాదయశాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: (కోస్టల్ బ్యూటీ.. విశాఖ అందాలపై ప్రత్యేక కథనం) -
దుర్గమ్మ దర్శనానికి.. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు తప్పనిసరి
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 7 నుంచి ప్రారంభమయ్యే దసరా మహోత్సవాలను కోవిడ్ నిబంధనల మేరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఇందుకు సంబంధించి గురువారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ జే నివాస్ మాట్లాడుతూ.. దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నట్లుగా సర్టిఫికెట్‌ను వెంట తెచ్చుకోవాలని సూచించారు. అలాగే, భవానీలు తమతమ స్వస్థలాల్లోనే దీక్ష విరమణ చేయాలన్నారు. కొండపైకి వాహనాలను అనుమతించబోమని, వీఐపీ భక్తులకోసం 15 వాహనాలను ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక మూలా నక్షత్రం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల వీఐపీ, ప్రొటోకాల్, బ్రేక్ దర్శనాలను రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. తెల్లవారుజాము నుంచే దర్శనాలు మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ.. తెల్లవారుజామున 4 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆన్లైన్లో టికెట్లు పొందిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉచిత దర్శనం ద్వారా 4 వేలు, రూ.300 టికెట్‌పై 3 వేలు, రూ.100 టికెట్‌పై మరో 3 వేల మందిని మాత్రమే అనుమతించాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్ర వేడుకగా దేవస్థానం దసరా ఉత్సవాలను నిర్వహిస్తోందని దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్ చెప్పారు. తొలుత వీరంతా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఉత్సవ పనులను ఆలయ ఈవో భ్రమరాంబ వివరించారు. సమావేశంలో దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాస్, మునిసిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్,, జేసీ మాధవీలత, వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ పాల్గొన్నారు. -
ఇంద్రకీలాద్రి: 4 గంటల నుంచే అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలలో అమ్మవారి దర్శన వేళలను ఆలయ వైదిక కమిటీ ఖరారు చేసింది. ఉత్సవాలలో ప్రతి రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది. ► తొలి రోజైన 7వ తేదీన అమ్మవారికి స్నపనాభిషేకం స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అలంకారం నేపథ్యంలో ఉదయం 9 గంటలకు దర్శనం ప్రారంభం అవుతుందని వైదిక కమిటీ పేర్కొంది. ► ఇక 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతి రోజు తెల్లవారుజామున 4 గంటలకే దర్శనం ప్రారంభం అవుతుంది. ► 11వ తేదీ సోమవారం అమ్మవారిని అన్నపూర్ణాదేవి, మహాలక్ష్మీగా అలంకరిస్తారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటల వరకు దర్శనం నిలిపివేస్తారు. రెండు గంటలకు అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరించిన అనంతరం దర్శనాలు ప్రారంభమవుతాయి. ► ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో రోజుకు ఎంత మంది భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించాలనే దానిపై సృష్టత లేదని తెలుస్తుంది. త్వరలోనే జరగబోయే జిల్లా అధికారుల రివ్యూ మీటింగ్‌లో దీనిపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. ► 12వ తేదీ మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టువస్త్రాలను సమర్పించనున్నారని పేర్కొన్నారు. చదవండి: వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌లో ఏపీ మరో రికార్డు -
అక్టోబర్ 7 నుంచి 15 వరకు ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు
విజయవాడ: ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో అక్టోబర్ 7 నుంచి 15 వరకు దసరా శరన్నవరాత్రులు జరగనున్నాయి. అక్టోబర్ 7న స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి, 8న బాలా త్రిపుర సుందరీ దేవిగా, 9న గాయత్రీదేవిగా, 10న లలితా త్రిపుర సుందరీ దేవిగా, 11న అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మహాలక్ష్మిదేవిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. 12న సరస్వతీదేవిగా, 13న దుర్గాదేవిగా, 14న మహిషాసురమర్ధినిగా, 15న రాజరాజేశ్వరి దేవిగా ఇంద్రకీలాద్రి అమ్మవారు దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 12 తారీఖున మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. -
27న దుర్గమ్మ సన్నిధిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఈ నెల 27వ తేదీన సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించేందుకు దేవస్థాన వైదిక కమిటీ నిర్ణయించింది. 27వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మహామండపం ఆరో అంతస్తులో వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహిస్తారు. టికెట్ ధరను రూ.1,500గా దేవస్థానం నిర్ణయించింది. టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు దేవస్థానమే పూజా సామాగ్రిని సమకూర్చుతుంది. భక్తులు టికెట్లను దేవదాయ ధర్మాదాయ శాఖ వెబ్సైట్ https://tms.ap.gov.in ద్వారా, దేవస్థాన ఆర్జిత సేవా టికెట్ల కౌంటర్లలో కొనుగోలు చేయవచ్చునని ఆలయ అధికారులు పేర్కొన్నారు. అలాగే, 27వ తేదీ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరిగే ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే అవకాశాన్ని భక్తులకు దేవస్థానం కల్పించింది. ఇందుకోసం తెల్లరేషన్ కార్డు ఉన్న భక్తులు ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 23వ తేదీ నుంచి దేవస్థానం దరఖాస్తులను పంపిణీ చేస్తుంది. దరఖాస్తులను మహా మండపం గ్రౌండ్ ఫ్లోర్‌లోని టోల్ ఫ్రీ కౌంటర్లో ఉచితంగా పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులతో పాటు తెల్లరేషన్ కార్డు జిరాక్స్ కాపీని జత చేసి 25వ తేదీ సాయంత్రం 4 గంటల లోపుగా అందజేయాలి. సామూహిక వరలక్ష్మీ వ్రతాల్లో పాల్గొనే భక్తులు తప్పని సరిగా మాస్కులు ధరించాలని దేవస్థానం సూచించింది. పవిత్రోత్సవాల సందర్భంగా దర్శన వేళల్లో మార్పు దుర్గ గుడిలో ఈ నెల 21వ తేదీ నుంచి పవిత్రోత్సవాల నేపథ్యంలో అమ్మవారి దర్శన వేళల్లో మార్పు చేశారు. 21 నుంచి పవిత్రోత్సవాలు ముగిసే 23వ తేదీ వరకు ఉదయం 9 గంటల తర్వాతే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అలాగే, ఆ మూడు రోజులపాటు అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. -
ఇంద్రకీలాద్రిపై ఈనెల 21 నుంచి పవిత్రోత్సవాలు
సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఈనెల 21 నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభంకానున్నాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈనెల 23న మహా పూర్ణాహుతితో ఉత్సవాలు ముగియనున్నాయి. ఈనెల 21 నుంచి మూడ్రోజులపాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి.