అక్టోబర్ 7 నుంచి‌ 15 వరకు ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు | Dasara Sarannavaratri Celebrations From October 7 To 15 In Indrakeeladri | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 7 నుంచి‌ 15 వరకు ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు

Published Mon, Aug 30 2021 11:29 PM | Last Updated on Mon, Aug 30 2021 11:31 PM

Dasara Sarannavaratri Celebrations From October 7 To 15 In Indrakeeladri - Sakshi

విజయవాడ: ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో అక్టోబర్ 7 నుంచి 15 వరకు దసరా శరన్నవరాత్రులు జరగనున్నాయి. అక్టోబర్ 7న స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి, 8న  బాలా త్రిపుర సుందరీ దేవిగా, 9న గాయత్రీదేవిగా, 10న లలితా త్రిపుర సుందరీ దేవిగా, 11న అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.  అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మహాలక్ష్మిదేవిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు.

12న సరస్వతీదేవిగా, 13న దుర్గాదేవిగా, 14న మహిషాసురమర్ధినిగా,  15న రాజరాజేశ్వరి దేవిగా ఇంద్రకీలాద్రి అమ్మవారు దర్శనమివ్వనున్నారు. అక్టోబర్‌ 12 తారీఖున మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement