సాక్షి, విజయవాడ: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మాజీ మంత్రి కొండా సురేఖ, కొండా చిత్ర యూనిట్ సోమవారం ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆర్జీవీ మాట్లాడుతూ.. 'విజయవాడలో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు దుర్గమ్మ దర్శనానికి రాలేదు. కొండా సురేఖ దంపతుల వలన అమ్మవారిని దర్శించుకున్నాను. కొండా దంపతుల భక్తి పారవశ్యం నన్ను ఆకర్షించింది. కొండా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అమ్మవారిని దర్శించుకున్నాను. సినిమా హిట్ కావాలని అమ్మవారిని కోరుకున్నాను' అని తెలిపారు.
మాజీ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. 'ఆర్జీవీ దేవుడు పంపిన దూతగా వచ్చి మా బయోపిక్ తీశారు. మా బయోపిక్ సినిమాలో కేవలం 10 శాతం మాత్రమే ఉంది. కానీ మా బయోపిక్ తీయాలంటే వెబ్ సిరీస్ సరిపోదు. ఏ శత్రువుకి రాని అనుభవాలు మేము భరించాము. నా పాత్ర చేయడానికి హీరోయిన్ బాగా కష్టపడింది. కొండా మూవీ బయటకు వచ్చాక మీరే చెప్తారు. సినిమా విజయవంతం అయ్యాక అమ్మవారి దర్శనానికి మళ్లీ వస్తాం' అని పేర్కొన్నారు.
KONDA family moolaana idhee naa paristhithi 😳😳😳 pic.twitter.com/rqN9a18nWc
— Ram Gopal Varma (@RGVzoomin) June 13, 2022
చదవండి: మహారాష్ట్ర సీఎంను కలిసిన మేజర్ టీమ్
బస్ దిగేలోగా నా బ్యాగులోని డబ్బు, కార్డులు, వస్తువులు మాయమయ్యాయి
Comments
Please login to add a commentAdd a comment