Konda
-
మాణిక్యధార కొండకు పోటెత్తిన భక్తులు
-
కొండ బాబు టీడీపీ నుంచి టికెట్ తెచ్చుకోవాలి: ద్వారంపూడి
-
సీతమ్మకొండపై హర్ శిఖర్ తిరంగా
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): రాష్ట్రంలో అత్యంత ఎత్తయిన సీతమ్మ కొండపై ‘హర్ శిఖర్ తిరంగా’కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. కొండపై ఆర్మీ బృందం జాతీయ జెండాను విజయవంతంగా ఆవిష్కరించింది. దీంతో సీతమ్మకొండకు జాతీయస్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ (నిమాస్) డైరెక్టర్ కల్నల్ రణవీర్‌సింగ్ జమ్వాల్ ఆధ్వర్యంలో 14 మందితో కూడిన ఆర్మీ బృందం సోమవారం మధ్యాహ్నం హుకుంపేట మండలంలోని మారుమూల ఓలుబెడ్డ గ్రామానికి చేరుకుంది. సర్పంచ్ పాంగి బేస్ ఆధ్వర్యంలో గిరిజనులంతా వారికి పూలమాలలతో స్వాగతం పలికారు. థింసా నృత్యాలతో ఆర్మీ బృందం కూడా సందడి చేసింది. మధ్యాహ్నం 1.30గంటలకు సీతమ్మ కొండపైకి బయలుదేరిన ఆర్మీ బృందం... గంటన్నరలో కొండపైకి చేరుకుని జాతీయ జెండాను ఎగురవేసింది. ఈ సందర్భంగా కల్నల్ రణవీర్‌సింగ్ జమ్వాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎత్తయిన శిఖరంగా గుర్తించిన సీతమ్మ కొండపై జాతీయ జెండాను ఎగురవేయడం సంతోషంగా ఉందన్నారు. తమ యాత్ర, జాతీయ జెండా ఆవిష్కరణకు రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటకశాఖ, స్థానిక గిరిజనులు ఎంతో సహకరించినట్లు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీన హర్ శిఖర్ తిరంగా యాత్రను ప్రారంభించామన్నారు. సీతమ్మ కొండతో కలిపి ఇప్పటి వరకు 22 రాష్ట్రాల్లోని ఎత్తయిన పర్వత శిఖరాల్లో జాతీయ జెండాను విజయవంతంగా ఎగురవేశామన్నారు. మరో 6 రాష్ట్రాల్లో హర్ శిఖర్ తిరంగాను అక్టోబర్ 15వ తేదీకి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎవరెస్ట్ అధిరోహకుడు ఆనంద్‌కుమార్, టూరిజం అడ్వంచర్ స్పోర్ట్స్ ప్రతినిధి కుంతూరు కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. -
Fact Check: సీతకొండపై బాబు బొంకు!.. అబద్ధాలతో ట్వీట్
సాక్షి, విశాఖపట్నం: నాడు రాష్ట్రపతిగా అబ్దుల్ కలామ్‌కు అవకాశం కల్పించింది తానేనంటూ తరచూ బుకాయించే చంద్రబాబు ఆయన పేరుతో తాజాగా మరోసారి బరి తెగించారు! ఇటీవల విశాఖలో జీ 20 సదస్సు సందర్భంగా బీచ్‌రోడ్డు సీతకొండ సమీపంలోని వ్యూ పాయింట్‌ని సుందరంగా తీర్చిదిద్దిన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ వ్యూ పాయింట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే కలాం వ్యూ పాయింట్ పేరును రాష్ట్ర ప్రభుత్వం మార్చేసిందంటూ చంద్రబాబు ట్వీట్ చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. చంద్రబాబు నీచ రాజకీయాలకు మహనీయుడైన కలాం పేరును వాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జనసైన్యం పేరుతో జనసేనకు చెందిన ఓ వ్యక్తి బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో పోస్ట్ చేసిన ట్వీట్‌ను కొద్దిగా మార్చి ఇంగ్లీష్‌లో చంద్రబాబు మధ్యాహ్నం ట్వీట్ చేశారు. ఇక్కడ కూడా కాపీ, పేస్ట్‌లో చంద్రబాబుని మించినవారు లేరంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సీతకొండ ఎదురుగా ఖాళీ స్థలం నుంచి సముద్రం అద్భుతంగా కనిపిస్తుంది. స్థానికులు దశాబ్దాలుగా దీన్ని సీతకొండ వ్యూ పాయింట్‌గానే వ్యవహరిస్తున్నారు. తాము 30 ఏళ్లుగా విశాఖలోనే ఉంటున్నామని, వ్యూ పాయింట్‌ను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని పలువురు పేర్కొంటున్నారు. రూ.3.29 కోట్లతో వ్యూ పాయింట్ అభివృద్ధి సుందర విశాఖ సాగర తీరంలో సరైన వ్యూ పాయింట్స్ లేకపోవడంతో జీ 20 సదస్సు సందర్భంగా సీఎం జగన్ ఆదేశాల మేరకు జోడుగుళ్ల పాలెం సమీపంలోని ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చారు. చక్కటి పెయింటింగ్స్ ఏర్పాటు చేశారు. నడక దారితోపాటు మార్బుల్స్‌తో కూర్చునే బెంచీలు, లవ్ వైజాగ్ చిహ్నం తదితరాలతో తీర్చిదిద్ది వైఎస్సార్ వ్యూ పాయింట్‌గా నామకరణం చేశారు. -
రెండుసార్లు జైలుకెళ్లొచ్చాను: నటుడు
కొండా సినిమాతో గుర్తింపు సంపాదించాడు ప్రశాంత్ కార్తి. 2017 నుంచి ఇండస్ట్రీలో ఉంటున్న ఆయనకు పలు సినిమాల్లో నటించినా రాని గుర్తింపు కొండా చిత్రంతో వచ్చింది. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'సివిల్ కాంట్రాక్టర్ నుంచి నటుడిగా మారాను. ఈ ఫీల్డ్‌లోకి రాకముందు రెండుసార్లు జైలుకెళ్లాను. వేరేవాళ్లకోసం జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కానీ క్లీన్‌చిట్‌తో బయటకు వచ్చాను. నాకు నక్సలైట్ ఆర్కే అంటే ఇష్టం. ఆయన ప్రజల కోసం పోరాడింది పుస్తకాల్లో చదివాను. నా అదృష్టం కొద్దీ ఆయన పాత్రలో నటించాను. నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం. మధ్యలో కొన్ని కారణాల వల్ల ట్రాక్ తప్పాను. చాలాకాలం తర్వాత ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. సినిమాల్లోకి రావడానికి చిరంజీవిగారే నాకు స్ఫూర్తి. ఈమధ్యే అనంత సినిమా తీశాను. నేనే హీరోగా చేసి నిర్మించాను. ఇండస్ట్రీలో చాలా రాజకీయాలుంటాయి. వాటిని తట్టుకుని ముందుకు వెళ్లడం చాలా కష్టం' అని చెప్పుకొచ్చాడు ప్రశాంత్. చదవండి: పెళ్లి కోసమే సినిమాలకు దూరంగా రాశీ ఖన్నా -
బెజవాడలో కొండా ఫ్యామిలీతో వర్మ ‘కొండా’ (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న వర్మ, కొండా సురేఖ
సాక్షి, విజయవాడ: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మాజీ మంత్రి కొండా సురేఖ, కొండా చిత్ర యూనిట్ సోమవారం ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆర్జీవీ మాట్లాడుతూ.. 'విజయవాడలో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు దుర్గమ్మ దర్శనానికి రాలేదు. కొండా సురేఖ దంపతుల వలన అమ్మవారిని దర్శించుకున్నాను. కొండా దంపతుల భక్తి పారవశ్యం నన్ను ఆకర్షించింది. కొండా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అమ్మవారిని దర్శించుకున్నాను. సినిమా హిట్ కావాలని అమ్మవారిని కోరుకున్నాను' అని తెలిపారు. మాజీ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. 'ఆర్జీవీ దేవుడు పంపిన దూతగా వచ్చి మా బయోపిక్ తీశారు. మా బయోపిక్ సినిమాలో కేవలం 10 శాతం మాత్రమే ఉంది. కానీ మా బయోపిక్ తీయాలంటే వెబ్ సిరీస్ సరిపోదు. ఏ శత్రువుకి రాని అనుభవాలు మేము భరించాము. నా పాత్ర చేయడానికి హీరోయిన్ బాగా కష్టపడింది. కొండా మూవీ బయటకు వచ్చాక మీరే చెప్తారు. సినిమా విజయవంతం అయ్యాక అమ్మవారి దర్శనానికి మళ్లీ వస్తాం' అని పేర్కొన్నారు. KONDA family moolaana idhee naa paristhithi 😳😳😳 pic.twitter.com/rqN9a18nWc — Ram Gopal Varma (@RGVzoomin) June 13, 2022 చదవండి: మహారాష్ట్ర సీఎంను కలిసిన మేజర్ టీమ్ బస్ దిగేలోగా నా బ్యాగులోని డబ్బు, కార్డులు, వస్తువులు మాయమయ్యాయి -
విజయవాడకు కొండా సురేఖ.. 'వైఎస్సార్ వల్లే మేము ఇలా ఉన్నాం'
సాక్షి, విజయవాడ: మహానేత వైఎస్సార్ జ్ఞాపకాలను తాము ఎన్నటికీ మరచిపోలేమని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘కొండా’ చిత్రం ప్రమోషన్లో భాగంగా కొండా సురేఖ, చిత్ర యూనిట్ సోమవారం విజయవాడకు విచ్చేసింది. తొలుత పోలీస్ కంట్రోల్ రూం వద్ద ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. ‘ఎన్నాళ్లయినా రాజశేఖరన్న జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నాం. ఈ రోజు మేమీ స్థాయిలో ఉన్నామంటే.. అది రాజన్న పెట్టిన భిక్షే. ప్రాణం ఉన్నంత వరకు వైఎస్సార్‌ను మరువలేం. ఆయన ఆశయాలను గౌరవిస్తూనే నేటికీ రాజకీయాల్లో కొనసాగుతున్నాం.’ అంటూ భావోద్వేగ పర్యంతమయ్యారు. వైఎస్సార్ అభిమానిగా తొలుత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి, ‘కొండా’ సినిమా ప్రమోషన్‌ను ప్రారంభించాలని భావించి నగరానికి వచ్చినట్లు సురేఖ తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో విలువలు లేకుండా పోయాయని, టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన అధ్వాన్నంగా ఉందని ఆమె విమర్శించారు. ప్రమోషన్లో భాగంగా ‘కొండా’ చిత్ర విశేషాలను సురేఖ వివరించారు. ఆమె వెంట చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు. చదవండి: (సత్యసాయి: టీడీపీ నేత పరిటాల సునీత దురుసు ప్రవర్తన) -
‘కొండా’ సినిమా: పొలిటీషియన్‌కి ఆర్జీవీ ఇండైరెక్ట్ వార్నింగ్
రాంగోపాల్ వర్మ.. ఈ పేరు వెంట ఎప్పుడూ వివాదాలు తిరుగుతుంటాయనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సినిమాలతో సంచనాలు సృష్టించడమే కాదు. ట్వీట్లతోనూ సోషల్ మీడియాని ఊపేస్తుంటాడు ఈయన. తాజాగా ఆయన కొండా మురళీ, సురేఖ బయోపిక్‌గా ‘కొండా’ సినిమాని ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దీని గురించి ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అందులో..‘ అరచేతిని అడ్డుపెట్టి సూర్య కాంతిని ఆపలేరని ఆనాటి కార్ల్ మార్క్స్ తెలుసుకున్నట్టే, పిచ్చిపిచ్చి ప్రయత్నాలతో కొండా సినిమా షూటింగ్ ఆపలేరని నల్ల బల్లి సుధాకర్ తెలుసుకోవాలి...జై తెలంగాణ’ అంటూ రాసుకొచ్చాడు వర్మ. ఇది ఇప్పుడు నెట్టింట హట్ టాపిక్ అయ్యింది. ‘కొండా’ సినిమా విషయంలో వరంగల్‌కి చెందిన ప్రముఖ పొలిటిషీయన్ నుంచి ఆర్జీవీకి బెదిరింపులు వచ్చినట్లు సినీ జనాలు అనుకుంటున్నారు. అందుకే ఆయన ఈ ట్వీట్లో ‘నల్ల బల్లి సుధాకర్’ అనే పేరుతో ఆ పొలిటిషీయన్కి వార్నింగ్ ఇచ్చినట్లు ఫిల్మీ దునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: బ్యాక్ బెంచర్ ఎలా ఉంటాడో చెప్పిన వర్మ.. ట్వీట్ వైరల్ అరచేతిని అడ్డుపెట్టి సూర్య కాంతి ని ఆపలేరని ఆనాటి కార్ల్ మార్క్స్ తెలుసుకున్నట్టే, పిచ్చిపిచ్చి ప్రయత్నాలతో కొండా సినిమా షూటింగ్ ఆపలేరని నల్ల బల్లి సుధాకర్ తెలుసుకోవాలి...జై తెలంగాణ — Ram Gopal Varma (@RGVzoomin) October 19, 2021 -
అయ్యన్నపాత్రుడు మతిభ్రమించి మాట్లాడుతున్నారు : కొండా రాజీవ్ గాంధీ
-
Etela: మరి ఆయనను సస్పెండ్ చేయొచ్చు కదా?
-
కోండ కబ్జా
-
కొండనూ కొళ్లగొట్టారు
►కదిరి కొండకు ‘రియల్’ ముప్పు ►మట్టినీ ‘క్యాష్’ చేసుకుంటున్న రియల్టర్లు ►ఇప్పటికే అర ఎకరం విస్తీర్ణంలో కొండ మాయం ►అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే వ్యవహారం కదిరి...లక్ష్మీనారసింహుడు నిలయం...ఇక స్వామి కొలువైన కదిరి కొండకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఏటా సంక్రాంతి పండుగ మరుసటి దినం కనుమ రోజున జరిగే ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి పులి పార్వేట ఉత్సవం కదిరికొండ నుంచే ప్రారంభమవుతుంది. ఈ కొండపైన ఉన్న స్వామివారి పాదముద్రికలు ఇప్పటికీ పూజలందుకుంటున్నాయి. కొండపై ఎన్నో ఆలయాలు కూడా ఉన్నాయి. ఇంతటి ప్రాశస్త్యం కల్గిన కదిరి కొండకు ఇప్పుడు ‘రియల్’ ముప్పు ఏర్పడింది. 8.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కదిరి కొండలో ఇప్పటికే ఎకరం మేర రియల్టర్లు తవ్వేశారు...టీడీపీ నేతల అండతో తవ్వేస్తూనే ఉన్నారు. - కదిరి కదిరి కొండపై టీడీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే అనుచరులు కన్నేశారు. రియల్టర్ల అవతారమెత్తి ఎర్రమట్టికోసం కొండను కరిగించేస్తున్నారు. ఇప్పటికే పట్టణంలోని మున్సిపల్ స్థలాలను కబ్జా చేసిన వారి కన్ను తాజాగా రహదారుల పక్కనున్న గోతులపై పడింది. ఆ గోతులను పూడ్చి, అక్కడ ప్లాట్లు వేసి అమ్మకానికి పెట్టాలన్నది వారి ఆలోచన. రోడ్డు పక్కనున్న ఆ గోతులను చదును చేయడానికి కదిరి కొండను జేసీబీల సాయంతో తవ్వి, ట్రాక్టర్ల ద్వారా ఆ మట్టిని ‘రియల్’ వ్యాపారం కోసం తరలిస్తున్నారు. ఇప్పటి దాకా సుమారు 300 ట్రాక్టర్ల మట్టిని అక్కడి నుండి తరలించినట్లు తెలుస్తోంది. రాత్రిళ్ల పూట నెలరోజులుగా జరుగుతున్న ఈ వ్యవహారం గురించి తెలిసినా అటు పోలీసులు, ఇటు రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అడిగేవారూ...అడ్డుకునే వారు లేరనీ... పట్టణంలో అక్కడక్కడా వెలసిన అక్రమ లే అవుట్లకు ఇన్నాళ్లూ విఠలరాయుని చెరువు, ముత్యాలచెరువు, కౌలేపల్లి చెరువుల నుండి ఒక్కో ట్రాక్టర్ రూ. 800 చొప్పున ఇస్తూ తరలించే వారు. రెవెన్యూ అధికారుతో పాటు పోలీసులు సైతం చెరువులపై ప్రత్యేక నిఘా పెట్టడంతో అధికార పార్టీకి చెందిన రియల్టర్లు ఇప్పుడు కదిరి కొండను ఎంచుకున్నారు. అడిగేవారు..అడ్డుకునే వారేవరూ లేకపోవడం...పైగా ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో కొండను తవ్వి మట్టిని తరలించారు. చెరువుల నుంచి తెచ్చే బంకమట్టి కన్నా ఈ ఎర్రమట్టే బాగుంటుండడంతో రాత్రిళ్లు మొత్తం ఈ మట్టి రవాణా కొనసాగిస్తున్నారు. లే అవుట్‌కు అనుమతి కూడా లేవు వాస్తవంగా ఎక్కడైనా భూమిని ప్లాట్లుగా వేసి అమ్మకానికి పెట్టాలంటే మొదట రెవెన్యూ కార్యాలయంలో అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాత మున్సిపల్ పరిధిలో అయితే మున్సిపల్ కార్యాలయంలో.... రూరల్ పరిధిలో అయితే పంచాయతీతో పాటు ఎంపీడీఓ కార్యాలయంలో అనుమతులు తీసుకోవాలి. సంబంధిత అధికారులు పరిశీలించి నిబంధనల ప్రకారం రోడ్లు, రిజర్వ్ స్థలం ఇలా అన్నీ సక్రమంగా ఉన్నాయని ధృవీకరించుకున్న తర్వాతే లేఅవుట్‌కు అప్రూవల్ ఇస్తారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇవేమీ చేయకుండానే సదరు టీడీపీ నాయకులు ఎటువంటి అనుమతులూ తీసుకోకుండానే కదిరి–రాయచోటి రోడ్లో కదిరి కొండకు సమీపంలోనే అక్రమ లే అవుట్ వేస్తున్నారు. ఇందుకోసం కదిరి కొండను తవ్వి ఆ మట్టి ఆ స్థలాన్ని చదును చేస్తున్నారు. ఈ విషయం రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు దీన్ని ‘మూమూలు’గా తీసుకుంటున్నారని విన్పిస్తోంది. ‘రియల్’ దొంగలను పట్టుకోవాలి కదిరి కొండ చాలా చరిత్ర ఉంది. అలాంటి కొండను తవ్వేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులను పట్టుకొని వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టాలి. నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో ఎక్కడెక్కడి నుండో వచ్చే భక్తులు కచ్చితంగా కదిరి కొండను దర్శించుకుంటారు. అలాంటి కొండనే తవ్వేస్తున్నారంటే వారికి క్షమించకూడదు. –నరసింహ స్వామి భక్తుడు మేరువ నాగమల్లు, కదిరి: ఊరికే వదలకూడదు ప్లాట్లలను చదును చేసేందుకు కదిరి కొండను తవ్వి ఆ మట్టిని అక్కడికి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. నరసింహస్వామి చరిత్రను తెలియజేసే బ్రంహాండ పురాణంలో కూడా ఆ కదిరి కొండను గురించి పేర్కొన్నారు. దేవతలంతా అక్కడి నుండే ప్రార్ధిస్తే నరసింహ స్వామి ప్రత్యక్షమైనట్లు అందులో ఉంది. ఇందుకు కొండపై ఆధారాలు కూడా ఉన్నాయి. అలాంటి కొండను తవ్వేస్తున్న వారిని ఊరికే వదిలిపెట్టకూడదు. –ప్రసాద్, చెర్లోపల్లి, నరసింహ స్వామి భక్తుడు చర్యలు తీసుకుంటాం కదిరి కొండను తవ్వేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. వెంటనే పరిశీలించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటాం. వారిపై రెవెన్యూ అధికారులతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. ఆ కొండ మా ఆలయం పరిధిలోకే వస్తుంది. అక్కడున్న పలు ఆలయాల్లో నిత్యం ధూప, దీప నైవేద్యాలు కూడా జరుగుతున్నాయి. –వెంకటేశ్వరరెడ్డి,ఈఓ, నరసింహ స్వామి ఆలయం, కదిరి -
కొండా మురళీ ఏకగ్రీవ ఎన్నిక
-
...అను నేను !
మంత్రి పదవిపై సీనియర్ల ఆశలు చందూలాల్, మధుసూదనాచారికి అవకాశం రేసులో రాజయ్య, వినయ్, కొండా తొలి సర్కారులో చోటుపై టీఆర్ఎస్లో చర్చలు సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణలో తొలి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితిదే అని తేలిపోయింది. ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరును శనివారం ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే జూన్ 2న నూతన ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో శనివారం జరిగే టీఆర్ఎస్ సమావేశానికి జిల్లాలోని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. వీరందరూ సమావేశానికి వెళ్తున్నా... మంత్రి వర్గంలో చోటు కోసం ఎవరికివారు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. టీఆర్ఎస్ జిల్లాలో ఎనిమిది సీట్లు గెలిచింది. ఎక్కువ సంఖ్యలోనే గెలిచినా... టీఆర్ఎస్కు ఆశించిన మేర సీట్లు రాలేదు. తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువగా ఉన్న జిల్లాలో టీడీపీ రెండు సీట్లు గెలవడం, పాలకుర్తిలో టీఆర్ఎస్ మూడో స్థానంలో నిలవడం గులాబీ పార్టీకి మింగుడుపడడంలేదు. ఆశించిన దాని కన్నా... రెండు సీట్లు తక్కువ వచ్చాయని భావిస్తున్న టీఆర్ఎస్ అధినాయకత్వం మంత్రి పదవుల కోటాలో జిల్లాకు ఎన్ని కేటాయిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి గరిష్టంగా 15 నుంచి 18 మందితో మంత్రివర్గం ఉండనుంది. ప్రస్తుతం టీఆర్ఎస్కు పది జిల్లాల్లోనూ ఎమ్మెల్యేలు ఉన్నారు. అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించడంతోపాటు సామాజిక సమీకరణల్లో జిల్లాకు గరిష్టంగా రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఈ రెండు పదవులు ఎవరికి ఇస్తారనే అంశం తాజాగా ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్లో పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ కావడంతో ఆయనకు సన్నిహితంగా ఉండే నేతలు మంత్రి పదవుల కోసం ప్రయత్నిస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన అజ్మీరా చందూలాల్ ములుగులో గెలిచారు. లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. గిరిజన నేతల్లో సీనియర్ కావడం, కేసీఆర్‌తో సాన్నిహిత్యంతో చందూలాల్‌కు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గిరిజనులు ఎక్కువగా ఉండే ఆదిలాబాద్ జిల్లాలో సీనియర్లు లేకపోవడం, ఖమ్మంలో ఈ వర్గం వారు గెలకపోవడం ఆయనకు అనుకూలంగా ఉండనుంది. కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే మరో సీనియర్ నేత సిరికొండ మధుసూదనాచారి సైతం మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నారు. టీఆర్ఎస్లో మొదటి నుంచి కీలక నేతగా ఉన్న ఆయనకు సామాజిక సమీకరణలు అనుకూలంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాదు... మధుసూదనాచారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉంటారని భూపాలపల్లి ఎన్నికల సభలో కేసీఆర్ ప్రకటించడం గమనార్హం. టీఆర్ఎస్లో సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్యతోపాటు మాజీ మంత్రి కొండా సురేఖ పేరు మంత్రి పదవి పరిశీలనలో ఉంటుందని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. -
'కొండా సురేఖ విజ్ఞతకే వదిలేస్తున్నాం'