రాంగోపాల్ వర్మ.. ఈ పేరు వెంట ఎప్పుడూ వివాదాలు తిరుగుతుంటాయనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సినిమాలతో సంచనాలు సృష్టించడమే కాదు. ట్వీట్లతోనూ సోషల్ మీడియాని ఊపేస్తుంటాడు ఈయన. తాజాగా ఆయన కొండా మురళీ, సురేఖ బయోపిక్‌గా ‘కొండా’ సినిమాని ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దీని గురించి ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
అందులో..‘ అరచేతిని అడ్డుపెట్టి సూర్య కాంతిని ఆపలేరని ఆనాటి కార్ల్ మార్క్స్ తెలుసుకున్నట్టే, పిచ్చిపిచ్చి ప్రయత్నాలతో కొండా సినిమా షూటింగ్ ఆపలేరని నల్ల బల్లి సుధాకర్ తెలుసుకోవాలి...జై తెలంగాణ’ అంటూ రాసుకొచ్చాడు వర్మ. ఇది ఇప్పుడు నెట్టింట హట్ టాపిక్ అయ్యింది.
‘కొండా’ సినిమా విషయంలో వరంగల్‌కి చెందిన ప్రముఖ పొలిటిషీయన్ నుంచి ఆర్జీవీకి బెదిరింపులు వచ్చినట్లు సినీ జనాలు అనుకుంటున్నారు. అందుకే ఆయన ఈ ట్వీట్‌లో ‘నల్ల బల్లి సుధాకర్’ అనే పేరుతో ఆ పొలిటిషీయన్‌కి వార్నింగ్ ఇచ్చినట్లు ఫిల్మీ దునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
చదవండి: బ్యాక్ బెంచర్ ఎలా ఉంటాడో చెప్పిన వర్మ.. ట్వీట్ వైరల్
అరచేతిని అడ్డుపెట్టి సూర్య కాంతి ని ఆపలేరని ఆనాటి కార్ల్ మార్క్స్ తెలుసుకున్నట్టే, పిచ్చిపిచ్చి ప్రయత్నాలతో కొండా సినిమా షూటింగ్ ఆపలేరని నల్ల బల్లి సుధాకర్ తెలుసుకోవాలి...జై తెలంగాణ
— Ram Gopal Varma (@RGVzoomin) October 19, 2021
Comments
Please login to add a commentAdd a comment