RGV Cake Cutting AT Konda Movie Wrap Up Praty: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన సినిమాల కంటే కాంట్రవర్సరీస్‌తోనే ఎక్కువగా పాపులర్ అయ్యాడు. తాజాగా నక్సలైట్ అవతారం ఎత్తి మరోసారి వార్తల్లో నిలిచాడు. సినిమా షూటింగ్ పూర్తైన సందర్భంగా వర్మ చేసిన రచ్చ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. కాగా వరంగల్‌కు చెందిన పొలిటికల్ లీడర్స్ కొండా మురళి-సురేఖ దంపతుల జీవి కథ ఆధారంగా ఆర్జీవీ కొండా అనే ఫ్యాక్షన్ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
కొండా మురళి పాత్రలో అదిత్ అరుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ సందర్భంగా వరంగల్‌లోని గోపాల్‌పూర్ కొండామురళి గెస్ట్‌హౌస్‌లో ముగింపు వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొండా మురళి, కొండా సురేఖ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఇక ఈ వేడుకలో నక్సలైట్ గెటప్‌లో వచ్చిన ఆర్జీవీ.. పెద్ద తల్వార్‌తో కేకును ముక్కలు ముక్కలుగా కోశాడు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. కిల్లింగ్ ఏ కేక్ ఫర్ కొండా అంటూ రాసుకొచ్చాడు. చదవండి: Rgv Hotel: 'ఆర్జీవీ హోటల్'.. అక్కడ అన్నీ అవే కనిపిస్తాయి
KILLING a CAKE for KONDA pic.twitter.com/BXMmJIpV5F
— Ram Gopal Varma (@RGVzoomin) December 26, 2021
Comments
Please login to add a commentAdd a comment