రామ్‌గోపాల్‌వర్మకు మూడు నెలల జైలు శిక్ష | Mumbai Court Sentenced Director Ram Gopal Varma To 3 Months In Jail Over Cheque Bouncing Case | Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: ఆర్జీవీకి మూడు నెలల జైలు శిక్ష.. దర్శకుడు ఏమన్నారంటే?

Jan 23 2025 11:51 AM | Updated on Jan 23 2025 3:21 PM

Mumbai Court Sentenced Director Ram Gopal Varma To 3 Months In Jail Over Cheque Bouncing Case

ముంబై: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ (Ram Gopal Varma)కు బిగ్‌ షాక్‌ తగిలింది.  చెక్‌ బౌన్స్‌ కేసులో అంధేరి మెజిస్ట్రేట్‌.. ఆర్జీవీకి మూడు నెలల జైలు శిక్ష విధించింది. ఏడేళ్ల క్రితంనాటి చెక్‌ బౌన్స్‌ కేసులో వర్మను దోషిగా తేల్చిన న్యాయస్థానం దర్శకుడికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దర్శకుడు విచారణకు గైర్హాజరవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. 

ఫిర్యాదుదారుడికి రూ.3.72 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, లేని పక్షంలో మరో మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కాగా ఈ కేసు ఇప్పటిది కాదు! 2018లో రామ్‌గోపాల్‌ వర్మపై చెక్‌ బౌన్స్‌ కేసు నమోదైంది. మశ్చీంద్ర మిశ్రా తరపున శ్రీ కంపెనీ ఈ కేసు దాఖలు చేసింది. 2022 జూన్‌లో వర్మ ఈ కేసులో బెయిల్‌ కూడా తెచ్చుకున్నాడు.

వర్మ రియాక్షన్‌
దీనిపై వర్మ సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు. ఇది ఏడేళ్లనాటి కేసు. నా దగ్గర పని చేసిన మాజీ ఉద్యోగితో రూ.2.38 లక్షల వివాదానికి సంబంధించినది. ప్రస్తుతం మా లాయర్లు ఈ వ్యవహారాన్ని చూసుకుంటున్నారు. కేసు కోర్టులో ఉన్నందున ఇంతకంటే ఎక్కువ ఏమీ చెప్పలేను అన్నాడు.

 

 

చదవండి: ‘సిండికేట్’తో నా పాపాలన్నీ కడిగేసుకుంటా: ఆర్జీవీ
 బాలీవుడ్‌ సెలబ్రిటీలకు వరుస బెదిరింపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement