బాలీవుడ్ సెలబ్రిటీలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. సల్మాన్ ఖాన్ (Salman Khan)కు బెదిరింపులు, సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనలతో చిత్రపరిశ్రమలో ఆందోళన వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ (Kapil Sharma)కు చంపుతామని బెదిరింపులు వస్తున్నాయి. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. పాకిస్తాన్ నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ముంబైలోని అంబోలి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు.
రిప్లై రాలేదంటే తీవ్ర పరిణామాలు
ఈమెయిల్‌లో ఏముందంటే..? నువ్వేం చేస్తున్నావో ప్రతీది గమనిస్తున్నాం. ఓ సున్నిత విషయాన్ని నీ దృష్టికి తీసుకురావడం అత్యంత ఆవశ్యకమని భావిస్తున్నాం. ఇదేం పబ్లిసిటీ స్టంట్ కాదు, అలా అని నిన్ను వేధించడమూ లేదు. ఈ మెసేజ్‌ను సీరియస్‌గా తీసుకోవాలని, అలాగే దీన్ని సీక్రెట్‌గా ఉంచాలని కోరుతున్నాం.. ఇట్లు బిష్ణు అని రాసుంది. అంతేకాకుండా ఎనిమిది గంటల్లో ఈ మెసేజ్‌కు రిప్లై ఇవ్వాలని లేదంటే వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించారు.
వరుసగా బెదిరింపులు
కపిల్ కంటే ముందు సుగంధ మిశ్ర, రెమో డి సౌజ, రాజ్‌పాల్ యాదవ్‌కు సైతం ఇటువంటి మెయిల్సే వచ్చాయి. సల్మాన్ ఖాన్ స్పాన్సర్ చేస్తున్న షోలో భాగమైన కపిల్ శర్మను, అతడి టీమ్ మొత్తాన్ని చంపేస్తామని బెదిరించారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నదెవరు? అందుకు గల కారణాలేంటన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇకపోతే గత వారం సైఫ్ అలీఖాన్ ఇంట్లో అతడిపై దాడి జరిగింది. ఓ దుండగుడు సైఫ్‌ను ఆరుసార్లు కత్తితో పొడిచి పారిపోయాడు. ఆటోలో ఆస్పత్రికి వెళ్లిన నటుడికి వైద్యులు సర్జరీ చేశారు. తన శరీరంలో నుంచి 2.5 అంగుళాల కత్తి మొననను తీసేశారు.
చదవండి: నా పదేళ్ల కెరీర్‌లో సుబ్బు నా ఫేవరెట్ : అనుపమా పరమేశ్వరన్
Comments
Please login to add a commentAdd a comment