Rajpal Yadav
-
కోపంతో జర్నలిస్ట్ ఫోన్ లాక్కున్న కమెడియన్.. వీడియో వైరల్
ఈ దీపావళి సినిమా వాళ్లకు బాగానే కలిసొచ్చింది. సౌత్‌లో లక్కీ భాస్కర్, క, అమరన్ సినిమాలకు హిట్ టాక్ రాగా బాలీవుడ్ భూల్ భులయ్యా 3, సింగం అగైన్ చిత్రాలు ఏకంగా రూ.100 కోట్లు దాటేశాయి. ఇకపోతే భూల్ భులయ్యా 3 సినిమాలో నటించిన రాజ్‌పాల్ యాదవ్ తాజాగా వార్తల్లో నిలిచాడు.దీపావళి అలా జరుపుకోవద్దు!దీపావళికి పటాసులు కాల్చవద్దని సూచిస్తూ ఆ మధ్య ఓ వీడియో షేర్ చేశాడు. టపాకాయలు కాల్చడం వల్ల గాలి, శబ్ధ కాలుష్యం పెరుగుతుందని పేర్కొన్నాడు. అతడి కామెంట్లపై విమర్శలు వెల్లువెత్తడంతో సదరు వీడియోను డిలీట్ చేశాడు. తన మాటల వల్ల మనోభావాలు దెబ్బతిన్నవారికి క్షమాపణలు చెప్తూ మరో వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. నటుడి క్షమాపణలుదీపావళి పండగ సంతోషాన్ని తగ్గించాలన్నది నా ఉద్దేశం కాదు. నన్ను క్షమించండి. మన జీవితాల్లో వెలుగును, ఆనందాన్ని నింపేదే దీపావళి. ఈ పండగను అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ నటుడిని ఓ జర్నలిస్టు కొన్ని ప్రశ్నలడిగాడు. నెలన్నరకోసారి నన్ను చూస్తారుఈ ఇంటర్వ్యూని అతడి ఫోన్లోనే రికార్డ్ చేశాడు. ప్రస్తుతం మీ చేతిలో ఎన్ని సినిమాలున్నాయని అడగ్గా రాజ్‌పాల్.. ప్రతి నెలన్నరకోసారి మీరు నన్ను చూస్తూనే ఉంటారని బదులిచ్చాడు. దీపావళి పండగపై చేసిన కామెంట్ల గురించి జర్నలిస్టు ఆరా తీయగా రాజ్‌పాల్ అసహనం వ్యక్తం చేశాడు.ఫోన్ లాక్కున్న నటుడువెంటనే జర్నలిస్టు చేతిలోని ఫోన్‌ను లాక్కున్నాడు. ఇదంతా ఫోన్లో రికార్డవగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజ్‌పాల్ తన ఫోన్‌ను లాక్కోవడంతోపాటు విసిరేసేందుకు ప్రయత్నించాడని సదరు జర్నలిస్టు పేర్కొన్నాడు. लोगों को हंसाने वाले मशहूर फिल्म अभिनेता राजपाल यादव आखिर इतना क्यों भड़क गए?फिल्म अभिनेता राजपाल यादव आज यूपी के लखीमपुर खीरी जिले के पलिया कस्बे में पहुंचे थे, जहां एक पत्रकार के सवाल पर उनको इतना गुस्सा आ गया कि सवाल पूछ रहे पत्रकार के मोबाइल फोन पर झपट्टा मारकर मोबाइल फोन… pic.twitter.com/Gj7vCRTxEB— Zameer Ahmad (@zameerahmad_lmp) November 2, 2024 చదవండి: చిత్ర పరిశ్రమలో విషాదం.. దర్శకుడు అనుమానాస్పద మృతి -
నా చేతులతో మొదటి భార్య శవాన్ని మోశా.. బిడ్డను కనగానే..: కమెడియన్
తెలుగు సినిమాలో టాప్ కమెడియన్ ఎవరంటే బ్రహ్మానందం అని టక్కున చెప్పేస్తారు. అలాగే బాలీవుడ్లో బడా కమెడియన్ అనగానే చాలామందికి రాజ్‌పాల్ యాదవ్ గుర్తొస్తారు. 25 ఏళ్లుగా హిందీ ప్రేక్షకులకు నవ్వులు పంచుతున్న అతడు తాజాగా తన జీవితంలో జరిగిన ఓ విషాదకర సంఘటనను వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'అప్పుడు రోజులు ఎలా ఉండేవంటే.. 20 ఏళ్లకే మన చేతిలో ఉద్యోగం ఉందంటే చాలు.. జనాలు పెళ్లి చేసుకోమని సలహా ఇస్తూ ఉండేవారు. మా నాన్న వారి మాటలు విని నాకు 20 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశాడు. నా మొదటి భార్య నాకు ఓ బిడ్డను ప్రసాదించి చనిపోయింది. నా చేతులతో ఆమె శవాన్ని.. నేను ఇతర పనులతో బిజీగా ఉండటంతో ప్రసవమైన మరునాడు ఆమెను వెళ్లి చూద్దామనుకున్నాను. ఇంతలోనే ఆమె మరణించిందన్న కబురు అందింది. ఈ చేతులో ఆమె శవాన్ని మోశాను. తనను హత్తుకుని ఏడ్చాను. అయితే నా కుటుంబం నా కూతురికి తల్లి లేని లోటు తెలియనివ్వకుండా పెంచింది. 2003లో నేను రెండో పెళ్లి చేసుకున్నాను. తన ఊరికి వెళ్లినప్పుడు ఆమె వారి సాంప్రదాయం ప్రకారం తన ముఖం కనిపించకుండా ఓ వస్త్రాన్ని కప్పుకుని ఉంది. ఆమె చాలా తొందరగా మా యాసభాషను నేర్చుకుంది. నేను మా అమ్మతో ఎలా మాట్లాడతానో తను కూడా తనతో అలాగే మాట్లాడేది. నా రెండో భార్యకు 5 భాషలు వచ్చు నువ్వు చీర కట్టుకోవాలి లేదంటే ఇలాంటి డ్రెస్‌లే వేసుకోవాలని నా భార్యకు నేనెప్పుడూ ఆంక్షలు పెట్టేవాడిని కాదు. తనకు ఐదు భాషలు వచ్చు. నా తల్లిదండ్రులు, గురువు తర్వాత నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన వ్యక్తి నా భార్యే! నా కూతుర్ని కూడా తన కూతురిలా కంటికి రెప్పలా చూసుకుంది. నా కూతురిప్పుడు పెళ్లి చేసుకుని లక్నోలో సెటిలైంది. తను సంతోషంగా ఉంటోందంటే అందుకు కారణం నా కుటుంబం, నా భార్యే! నేను చేసిందేమీ లేదు, వాళ్లవల్లే ఇదంతా సాధ్యమైంది' అని చెప్పుకొచ్చాడు రాజ్‌పాల్ యాదవ్. కాగా ఇతడు ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న 'సత్యప్రేమ్ కీ కథ', ఆయుష్మాన్ ఖురానా 'డ్రీమ్ గర్ల్ 2' చిత్రాల్లో నటిస్తున్నాడు. చదవండి: రాజకీయాల్లోకి కీర్తి సురేశ్? -
ట్రాన్స్‌జెండర్ అవతారమెత్తిన బాలీవుడ్ ప్రముఖ నటుడు
నటుడు, కమెడియన్, దర్శకుడు, రచయిత, నిర్మాత.. మల్టీటాలెంటెడ్ పర్సన్ రాజ్‌పాల్ యాదవ్. ఈ బాలీవుడ్ నటుడు ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం 'అర్ధ్'. రుబీనా దిలైక్, హితేన్ తేజ్వానీ, కుల్‌భూషణ్ ఖర్బందా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. ఇందులో రాజ్‌పాల్ యాదవ్ ట్రాన్స్‌జెండర్‌గా కనిపించి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. ఇలాంటి పాత్ర చేసేందుకు ఒప్పుకోవడం మామూలు విషయం కాదని ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా హీరో అవుదామని ముంబైకి వచ్చిన ఓ వ్యక్తి కథే అర్ధ్ అని తెలుస్తోంది. ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించిన మేకర్స్ విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు. Presenting to you the first look of my next film ARDH! @Palash_Muchhal @RubiDilaik @tentej #ardhmovie pic.twitter.com/thzwnwCYR0— Rajpal Naurang Yadav (@rajpalofficial) February 23, 2022 -
ప్రముఖ హాస్య నటుడికి 6 నెలల జైలు శిక్ష
బాలీవుడ్ హస్యనటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు ఢిల్లీ కార్కారదుమ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఎమ్జీ అగర్వాల్ దగ్గర నుంచి తీసుకున్న 5 కోట్ల రూపాయల అప్పును తిరిగి చెల్లించనందుకు గాను, కోర్టు ఈ శిక్ష విధించింది. అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అమిత్ అరోరా ఈ నటుడికి 6 నెలల జైలు శిక్షతో పాటు, 11.2 కోట్ల రూపాయలు జరిమానాను, అతని భార్య రాధ యాదవ్‌కు 70 లక్షల జరిమానాను విధించారు. తరువాత రాజ్‌పాల్‌కు 50వేల రూపాయల వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్ మంజూరు చేశారు. 2010 లో రాజ్‌పాల్ తొలిసారి తానే నటిస్తూ దర్శకత్వం వహించబోయే సినిమా ‘ఆట పాట లపాట’ కోసం ఢిల్లీకి చెందిని మురళీ ప్రాజెక్ట్ కంపెనీ యజమాని ఎమ్జీ అగర్వాల్ దగ్గర నుంచి 5కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. ఈ మొత్తాన్ని వడ్డీతో కలిపి 2011, డిసెంబర్ 3 నాటికి తిరిగి చెల్లిస్తానని మాట ఇచ్చి సకాలంలో చెల్లించలేకపోయారు. దీంతో ఆ వ్యాపారవేత్త ఈ రాజ్ పాల్ దంపతుల మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన ఢిల్లీ హై కోర్టు అప్పు చెల్లించడానికి ఈ దంపతులకి చాలా అవకాశాలు ఇచ్చింది, కానీ వారు అప్పు చెల్లించలేదు. దీంతో సోమవారం శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. రాజ్‌పాల్ హిందీలో ‘భూల్‌భూలయ్యా’, ‘పార్టనర్’, ‘హంగామా’ వంటి హిందీ చిత్రాల్లోనే కాక తెలుగులో ‘కిక్ -2’ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించాడు -
ఇక ఆ హాస్యనటుడు జైలుకేనా?
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ హాస్యనటుడు రాజ్‌పాల్ యాదవ్ రుణ రికవరీ కేసులో దోషిగా తేలారు. చెక్ బౌన్స్ సహా, ఏడు కేసుల్లో రాజ్‌పాల్ యాదవ్, అతని భార్య రాధను కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఢిల్లీలోని 'కర్ కర్ డూమా' కోర్టు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అమిత్ అరోరా ఈ తీర్పును వెలువరించారు. ఈ నెల 23న న్యాయస్థానం వీరికి శిక్షలను ఖరారు చేయనుంది. కాగా 2010లో ఒక హిందీ సినిమా నిర్మాణం కోసం రాజ్‌పాల్ , అతడి భార్య కలిసి ఢిల్లీకి చెందిన వ్యాపారి ఎం.జి.అగర్వాల్ వద్ద రూ.5 కోట్లు అప్పుగా తీసుకున్నారు. అయితే ఆ బాకీ తీర్చకపోవడంతో బాధితుడు రికవరీ కోసం కోర్టును ఆశ్రయించాడు. ఈ బాకీ మొత్తం ఇపుడు రూ. 8కోట్లకు చేరినట్టు అంచనా. గతంలో కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన కేసులో సుప్రీంకోర్టు రాజ్‌పాల్ యాదవ్, అతని భార్యకు ఆరు రోజుల జైలు శిక్షను విధించింది. దీంతోపాటు ముంబై మలాడ్‌లోని రాజ్పాల్యాదవ్, అతడి భార్యకు చెందిన యాక్సిస్ బ్యాంక్ జాయింట్ అకౌంట్‌ను, వారి కంపెనీ అకౌంట్‌ను సైతం అటాచ్ చేయాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇకపోతే బాలీవుడ్ సినిమాలు భూల్ భులయ్యా, పార్టనర్, హంగమా వంటి పలు విజయవంతమైన చిత్రాలతోపాటు, తెలుగులో రవితేజ హీరోగా నటించిన కిక్ సినిమాకు సీక్వల్ కిక్-2 లో కూడా ఆయన నటించారు. -
స్టార్ కమెడియన్ మళ్లీ జైలుకు
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు న్యూఢిల్లీ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి కోర్టు వారికి వివరాలు అందించని కారణంగా గతంలో 10 రోజుల జైలు శిక్షను విధించింది. అయితే కమెడియన్ 4 రోజుల జైలుశిక్ష తర్వాత ఆయన విడుదలయ్యారు. 10 రోజుల జైలు శిక్షను డిసెంబర్ 3 నుంచి 7వ తేదీ వరకు నాలుగు రోజులపాటు అనుభవించిన రాజ్‌పాల్ యాదవ్ హైకోర్టులో అప్పీలు దాఖలు చేశాడు. జస్టిస్ బీడీ అహ్మద్, విభు బక్రూలతో కూడిన ధర్మాసనం ఈ అప్పీలును విచారణకు స్వీకరించి శిక్షను నిలుపుదల చేసింది. కోర్టు అనుమతి లేకుండా ఢిల్లీ విడిచి ఇతర ప్రాంతాలకు ఇతర దేశాలకు వెళ్లరాదనే షరతును కూడా రద్దు చేసింది. రాజ్ పాల్ కేసు శుక్రవారం విచారణకు రాగా, మిగిలిన ఆరు రోజుల జైలు శిక్షను ఆయన అనుభవించాలని తీర్పులో పేర్కొంది. తీహార్ జైలులో జూలై 15 లోగా ఆయన లొంగిపోవాలని జస్టిస్ ఎస్ రవింద్ర భట్, జస్టిస్ దీపా శర్మ ధర్మాసనం సూచించింది. ఢిల్లీకి చెందిన వ్యాపారి మురళి ప్రాజెక్ట్స్ యజమాని ఏంజీ అగర్వాల్ రాజ్‌పాల్ తన వద్ద 2010లో తీసుకున్న ఐదు కోట్ల రూపాయలను తిరిగి చెల్లించలేదని కోర్టులో కేసు దాఖలు చేశారు. సొమ్ము చెల్లింపునకు సంబంధించి దంపతులు ప్రకటించిన అంగీకారాన్ని పలుమార్లు ఉల్లంఘించారని 2013లో రాజ్ పాల్ కు పది రోజుల జైలు శిక్ష విధించింది. -
నటుడు రాజ్‌పాల్‌కు తాత్కాలిక ఊరట
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు హైకోర్టు జోక్యంతో ఊరట లభించింది. రాజ్‌పాల్ యాదవ్, అతని భార్య వ్యతిరేకంగా వసూలు కోసం ఓ వ్యాపారి దాఖలు చేసిన కేసులో కోర్టును తప్పుదారి పట్టించాడని హైకోర్టు ఏక వ్యక్తి ధర్మాసనం జైలు శిక్ష విధించింది. ఢిల్లీకి చెందిన వ్యాపారి మురళి ప్రాజెక్ట్స్ యజమాని ఏంజీ అగర్వాల్ రాజ్‌పాల్ తన వద్ద 2010లో తీసుకున్న ఐదు కోట్ల రూపాయలను తిరిగి చెల్లించలేదని కోర్టులో కేసు దాఖలు చేశారు. సొమ్ము చెల్లింపునకు సంబంధించి దంపతులు ప్రకటించిన అంగీకారాన్ని పలుమార్లు ఉల్లంఘించారని కోర్టు గుర్తించింది. కోర్టు ఆదేశాల మేరకు రాజ్‌పాల్ విచారణకు హాజరైనా, భార్య రాధ తరఫున తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయడంతో కోర్టు గుర్తించింది. కోర్టును తప్పుదోవ పట్టించడం ధిక్కార నేరమని ప్రకటించి పది రోజుల శిక్ష విధించింది. ఏక వ్యక్తి ధర్మాసనం విధించిన 10 రోజుల జైలు శిక్షను డిసెంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు మూడు రోజులపాటు అనుభవించిన రాజ్‌పాల్ యాదవ్ హైకోర్టులో అప్పీలు దాఖలు చేశాడు. జస్టిస్ బీడీ అహ్మద్, విభు బక్రూలతో కూడిన ధర్మాసనం ఈ అప్పీలును విచారణకు స్వీకరించి శిక్షను నిలుపుదల చేసింది. ఏక వ్యక్తి ధర్మాసనం విధించిన శిక్ష కోర్టు తదుపరి తీర్పు వరకు నిలుపు దలచేయడంతో పాటు కోర్టు అనుమతి లేకుండా ఢిల్లీ విడిచి ఇతర ప్రాంతాలకు ఇతర దేశాలకు వెళ్లరాదనే షరతును కూడా రద్దు చేసింది. కోర్టు ఆదేశం మేరకు రాజ్‌పాల్ తన పాస్‌పోర్టును రిజిస్ట్రార్ జనరల్‌కు అప్పగించారని, దీని వలన ఏ ప్రయోజనం కలుగదని వాదించారు. పైగా తన క్లైయింట్ వృత్తి సంబంధ పనులకు విఘాతం కలుగుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ధర్మాసనం రాజ్‌పాల్ దేశంలో తన వృత్తి సంబంధమైన పనులకు హాజరుకావచ్చని, అయితే దేశం విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది. ప్రతివాది మురళి ప్రాజెక్ట్స్‌కు వారం గడువు లోపు రూ. 20 లక్షల చెక్ ఇస్తానన్న రాజ్‌పాల్ అంగీకారాన్ని కోర్టు నమోదు చేసింది. డిసెంబర్ 2వ తేదీన ఏక వ్యక్తి ధర్మాసనం విచారణలో రాజ్‌పాల్ దాఖలు చేసిన అఫిడవిట్లో అతని భార్య సంతకాన్ని ఫోర్జరీ చేశాడని కోర్టు గుర్తించింది. కోర్టును తప్పుదోవ పట్టిస్తున్న నేరానికి యాదవ్‌కు పది రోజుల జైలు శిక్ష విధించడంతో పాటు, అతని భార్య రాధ రిజిస్ట్రార్ కార్యాలయంలో కోర్టు ముగిసే వరకు నిలబడాలని శిక్ష విధించింది. -
కోర్టు ధిక్కారం కేసులో బాలీవుడ్ నటుడికి జైలు
న్యూఢిల్లీ: ఒక కేసులో కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్, అతడి భార్య రాధకు మంగళవారం ఢిల్లీ హైకోర్టు శిక్ష విధించింది. వివరాలిలా ఉన్నాయి. ఢిల్లీకి చెందిన ఎం.జి.అగర్వాల్ అనే వ్యక్తి నటుడు రాజ్‌పాల్ యాదవ్‌పై రూ.5 కోట్లకు రికవరీ కేసు పెట్టాడు. దీనిపై విచారణకు రాజ్‌పాల్ దంపతులు కోర్టుకు హాజరు కావడంలేదు. దీంతో ఆగ్రహం చెందిన జస్టిస్ ఎస్.మురళీధర్ నిందితుడికి 10 రోజుల జైలు శిక్ష విధించారు. అతడి భార్యను కోర్టు సయయం ముగిసినంతవరకు కస్టడీ ఉండేలా శిక్ష విధించారు. నిందితులు విచారణకు హాజరు కాకుండా కోర్టు సమయాన్ని వృథాచేస్తున్నారని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కోర్టు విచారణకు హాజరు కావాలని ఎన్నిసార్లు చెప్పినా తప్పుడు సమాచారమిస్తూ కోర్టును తప్పుదోవ పట్టించేందుకు నిందితులు ప్రయత్నించారన్నారు. వారి తరఫు న్యాయవాదులు సైతం తప్పుడు సాక్ష్యాధారాలను ప్రవేశపెడుతూ కోర్టు సమయాన్ని వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నిందితులు కోర్టు ధిక్కారానికి మరింత పాల్పడకుండా చేసేందుకు ప్రధాన నిందితుడైన నటుడు యాదవ్‌కు 10 రోజుల జైలు శిక్ష (తక్షణమే అమలయ్యేలా..) విధించినట్లు న్యాయమూర్తి తెలిపారు. ఇదిలా ఉండగా, యాదవ్ భార్య రాధకు సంబంధించి తప్పుడు సమాచారం అందించిన ఆమె న్యాయవాదికి సైతం నోటీసు జారీ చేశారు. అలాగే ముంబైలోని మలాడ్‌లో ఉన్న రాజ్పాల్యాదవ్, అతడి భార్యకు యాక్సిస్ బ్యాంక్‌లో ఉన్న జాయింట్ ఎకౌంట్‌ను , వారి కంపెనీ అకౌంట్‌ను సైతం వారంలోగా అటాచ్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2010లో ఒక హిందీ సినిమా నిర్మాణం కోసం రాజ్‌పాల్ , అతడి భార్య కలిసి ఢిల్లీకి చెందిన వ్యాపారి ఎం.జి.అగర్వాల్ వద్ద రూ.5 కోట్లు అప్పుగా తీసుకున్నారు. అయితే దాన్ని ఇప్పటివరకు తీర్చకపోవడంతో అతడు బాకీ రికవరీ కోసం కోర్టును ఆశ్రయించాడు. -
బాలీవుడ్ నటుడికి 10 రోజుల పోలీస్ కస్టడీ
బాలీవుడ్ నటుడు రాజ్ పాల్ యాదవ్ కు పది రోజుల పోలీసు కస్టడీ విధిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజ్ పాల్ యాదవ్, ఆయన భార్యపై ఓ వ్యాపారవేత్త దాఖలు చేసిన కేసులో వివరాలను గుప్తంగా ఉంచినందుకు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్ పాల్ యాదవ్ పై 5 కోట్ల రికవరీ దావా ను నమోదు చేశారు. రాజ్ పాల్ యాదవ్ తరపు న్యాయవాదులిద్దరికి కోర్టు ఉల్లంఘన నోటీసులను కోర్టు జారీ చేసింది. కోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు రాజ్ పాల్ యాదవ్ భార్యను రిజిస్త్రార్ జనరల్ కార్యాలయంలోనే ఉండాలని జస్టిస్ ఎస్ మురళీధర్ సూచించారు.