ట్రాన్స్‌జెండర్‌ అవతారమెత్తిన బాలీవుడ్‌ ప్రముఖ నటుడు | Ardh First Look: Rajpal Yadav As Transgender | Sakshi
Sakshi News home page

Rajpal Yadav: ట్రాన్స్‌జెండర్‌గా బాలీవుడ్‌ నటుడు, ఓటీటీలో రానున్న సినిమా!

Published Fri, Feb 25 2022 2:00 PM | Last Updated on Fri, Feb 25 2022 2:00 PM

Ardh First Look: Rajpal Yadav As Transgender - Sakshi

నటుడు, కమెడియన్‌, దర్శకుడు, రచయిత, నిర్మాత..  మల్టీటాలెంటెడ్‌ పర్సన్‌ రాజ్‌పాల్‌ యాదవ్‌. ఈ బాలీవుడ్‌ నటుడు ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం 'అర్ధ్‌'. రుబీనా దిలైక్‌, హితేన్‌ తేజ్వానీ, కుల్‌భూషణ్‌ ఖర్బందా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ రిలీజైంది. ఇందులో రాజ్‌పాల్‌ యాదవ్‌ ట్రాన్స్‌జెండర్‌గా కనిపించి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు.

ఇలాంటి పాత్ర చేసేందుకు ఒప్పుకోవడం మామూలు విషయం కాదని ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా హీరో అవుదామని ముంబైకి వచ్చిన ఓ వ్యక్తి కథే అర్ధ్‌ అని తెలుస్తోంది. ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్‌ చేస్తున్నట్లు వెల్లడించిన మేకర్స్‌ విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement