ఈ దీపావళి సినిమా వాళ్లకు బాగానే కలిసొచ్చింది. సౌత్‌లో లక్కీ భాస్కర్, క, అమరన్ సినిమాలకు హిట్ టాక్ రాగా బాలీవుడ్ భూల్ భులయ్యా 3, సింగం అగైన్ చిత్రాలు ఏకంగా రూ.100 కోట్లు దాటేశాయి. ఇకపోతే భూల్ భులయ్యా 3 సినిమాలో నటించిన రాజ్‌పాల్ యాదవ్ తాజాగా వార్తల్లో నిలిచాడు.
దీపావళి అలా జరుపుకోవద్దు!
దీపావళికి పటాసులు కాల్చవద్దని సూచిస్తూ ఆ మధ్య ఓ వీడియో షేర్ చేశాడు. టపాకాయలు కాల్చడం వల్ల గాలి, శబ్ధ కాలుష్యం పెరుగుతుందని పేర్కొన్నాడు. అతడి కామెంట్లపై విమర్శలు వెల్లువెత్తడంతో సదరు వీడియోను డిలీట్ చేశాడు. తన మాటల వల్ల మనోభావాలు దెబ్బతిన్నవారికి క్షమాపణలు చెప్తూ మరో వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
నటుడి క్షమాపణలు
దీపావళి పండగ సంతోషాన్ని తగ్గించాలన్నది నా ఉద్దేశం కాదు. నన్ను క్షమించండి. మన జీవితాల్లో వెలుగును, ఆనందాన్ని నింపేదే దీపావళి. ఈ పండగను అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ నటుడిని ఓ జర్నలిస్టు కొన్ని ప్రశ్నలడిగాడు.
నెలన్నరకోసారి నన్ను చూస్తారు
ఈ ఇంటర్వ్యూని అతడి ఫోన్‌లోనే రికార్డ్ చేశాడు. ప్రస్తుతం మీ చేతిలో ఎన్ని సినిమాలున్నాయని అడగ్గా రాజ్‌పాల్.. ప్రతి నెలన్నరకోసారి మీరు నన్ను చూస్తూనే ఉంటారని బదులిచ్చాడు. దీపావళి పండగపై చేసిన కామెంట్ల గురించి జర్నలిస్టు ఆరా తీయగా రాజ్‌పాల్ అసహనం వ్యక్తం చేశాడు.
ఫోన్ లాక్కున్న నటుడు
వెంటనే జర్నలిస్టు చేతిలోని ఫోన్‌ను లాక్కున్నాడు. ఇదంతా ఫోన్‌లో రికార్డవగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజ్‌పాల్ తన ఫోన్‌ను లాక్కోవడంతోపాటు విసిరేసేందుకు ప్రయత్నించాడని సదరు జర్నలిస్టు పేర్కొన్నాడు.
लोगों को हंसाने वाले मशहूर फिल्म अभिनेता राजपाल यादव आखिर इतना क्यों भड़क गए?
फिल्म अभिनेता राजपाल यादव आज यूपी के लखीमपुर खीरी जिले के पलिया कस्बे में पहुंचे थे, जहां एक पत्रकार के सवाल पर उनको इतना गुस्सा आ गया कि सवाल पूछ रहे पत्रकार के मोबाइल फोन पर झपट्टा मारकर मोबाइल फोन… pic.twitter.com/Gj7vCRTxEB— Zameer Ahmad (@zameerahmad_lmp) November 2, 2024
Comments
Please login to add a commentAdd a comment