
కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు గురు ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. తన కెరీర్‌లో 'మఠం' సినిమా ఎవర్‌గ్రీన్‌గా నిలిచింది. దీంతో ఆయన పేరు మఠం గురు ప్రసాద్‌గా గుర్తింపు పొందారు. తను ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే ఆయన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
గురుప్రసాద్ మూడు రోజుల క్రితమే మరణించారని తెలుస్తోంది. ఆయన నివసిస్తున్న అపార్ట్‌మెంట్ నుంచి దుర్వాసన రావడంతో కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల ఎంట్రీతో ఆయన మరణ వార్త వెలుగులోకి వచ్చింది. ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. జిగర్తాండ, బాడీగార్డ్, కుష్క, విజిల్, మైలారీ వంటి సినిమాలతో ఆయన ఆకట్టుకున్నారు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డును కూడా ఆయన సొంతం చేసుకున్నారు.