guru prasad
-
చిత్ర పరిశ్రమలో విషాదం.. దర్శకుడు అనుమానాస్పద మృతి
కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు గురు ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. తన కెరీర్లో 'మఠం' సినిమా ఎవర్‌గ్రీన్‌గా నిలిచింది. దీంతో ఆయన పేరు మఠం గురు ప్రసాద్‌గా గుర్తింపు పొందారు. తను ఉంటున్న అపార్ట్మెంట్లోనే ఆయన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.గురుప్రసాద్ మూడు రోజుల క్రితమే మరణించారని తెలుస్తోంది. ఆయన నివసిస్తున్న అపార్ట్మెంట్ నుంచి దుర్వాసన రావడంతో కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల ఎంట్రీతో ఆయన మరణ వార్త వెలుగులోకి వచ్చింది. ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. జిగర్తాండ, బాడీగార్డ్, కుష్క, విజిల్, మైలారీ వంటి సినిమాలతో ఆయన ఆకట్టుకున్నారు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డును కూడా ఆయన సొంతం చేసుకున్నారు. -
వైద్యంపై సినిమా.. ప్రధాన పాత్రలో కార్డియాలజిస్ట్
వినోద్ హీరోగా, రిచా కర్లా, ధరణి రెడ్డి హీరోయిన్లుగా రవికుమార్ గోనుగుంట దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహిషాసురుడు’. అనిరుధ్, అపరాజిత సమర్పణలో ప్రముఖ కార్డియాలజిస్ట్ ఎస్.గురుప్రసాద్ నిర్మించారు. సాకేత్ సాయిరామ్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియోను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, డైరెక్టర్ రేలంగి నరసింహారావు, నటులు తనికెళ్ల భరణి, గౌతం రాజు విడుదల చేశారు. ఎస్. గురుప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో ప్రధాన పాత్ర చేశాను. కోట్లాది రూపాయలు ఖర్చయ్యే వైద్య పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బదులు మన దేశంలోనే వాటిని తయారు చేసుకుంటే తక్కువ ఖర్చుతో వైద్యం అందించవచ్చనే పాయింట్‌తో ఈ సినిమా తీశాం’’ అన్నారు. ‘‘సామాజిక బాధ్యతతో గురుప్రసాద్ ఈ సినిమా నిర్మించాలనుకున్నారు’’ అన్నారు రవికుమార్ గోనుగుంట. చదవండి: సిక్స్ ప్యాక్ కోసం కసరత్తులు, హీరోయిన్‌పై ట్రోలింగ్ -
తల్లీ కొడుకుల ఆత్మహత్య..!
గుంటూరు: తల్లీ కొడుకులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం రామిరెడ్డిపేట పాత సమితి కార్యాలయం సమీపంలో గురువారం అర్దరాత్రి దాటాక జరిగింది. వివరాలు.. సిరిగిరి విజయలక్ష్మి (67) ఆమె కుమారుడు గురుప్రసాద్ (35)తో గత పదిరోజులుగా కాలనీలో అద్దె ఇల్లు తీసుకొని నివాసముంటోంది. శుక్రవారం ఉదయం ఎంత సేపటికీ తలుపులు తీయకపోవడంతో స్థానికులు తలుపులు తెరిచి చూస్తే.. తల్లీ కొడుకులు విగతజీవులుగా పడిఉన్నారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు వారి బంధువులకు తెలియజేశారు. పురుగుల మందు తాగిన ఆనవాళ్లు ఉండటంతో.. ఇద్దరు కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. గురుప్రసాద్‌కు మతిస్థిమితం లేదని స్థానికులు అంటున్నారు. -
పిల్లలు ఎక్కడ?