
వినోద్ హీరోగా, రిచా కర్లా, ధరణి రెడ్డి హీరోయిన్లుగా రవికుమార్ గోనుగుంట దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహిషాసురుడు’. అనిరుధ్, అపరాజిత సమర్పణలో ప్రముఖ కార్డియాలజిస్ట్ ఎస్.గురుప్రసాద్ నిర్మించారు. సాకేత్ సాయిరామ్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియోను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, డైరెక్టర్ రేలంగి నరసింహారావు, నటులు తనికెళ్ల భరణి, గౌతం రాజు విడుదల చేశారు.
ఎస్. గురుప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో ప్రధాన పాత్ర చేశాను. కోట్లాది రూపాయలు ఖర్చయ్యే వైద్య పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బదులు మన దేశంలోనే వాటిని తయారు చేసుకుంటే తక్కువ ఖర్చుతో వైద్యం అందించవచ్చనే పాయింట్‌తో ఈ సినిమా తీశాం’’ అన్నారు. ‘‘సామాజిక బాధ్యతతో గురుప్రసాద్ ఈ సినిమా నిర్మించాలనుకున్నారు’’ అన్నారు రవికుమార్ గోనుగుంట.
చదవండి: సిక్స్ ప్యాక్ కోసం కసరత్తులు, హీరోయిన్‌పై ట్రోలింగ్
Comments
Please login to add a commentAdd a comment