
‘‘శబ్దం’ సినిమాని ఎంజాయ్ చేశాను. ఎమోషనల్‌గా చాలా హై ఇస్తుంది. హారర్ సినిమాకీ కన్నీళ్లొస్తాయని ఎప్పుడూ అనుకోలేదు. మంచి కథ, భావోద్వేగాలున్న హారర్ సినిమా ఇది. హారర్ మూవీస్‌ని ఇష్టపడే వారైతే పది మంది ఫ్రెండ్స్‌తో కలసి వెళ్లండి... చాలా ఎంజాయ్ చేస్తారు’’ అని హీరో నాని తెలిపారు. ఆది పినిశెట్టి హీరోగా అరివళగన్ దర్శకత్వం వహించిన తెలుగు–తమిళ చిత్రం ‘శబ్దం’. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
శివ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఎన్ సినిమాస్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో, మైత్రీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా నైజాంలో రిలీజవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ– ‘‘నిన్ను కోరి’ సినిమా నుంచి ఆది, నేను ఫ్రెండ్స్. ‘శబ్దం’ సినిమాపై తను ఎందుకు అంత నమ్మకంగా ఉన్నాడో నాకు తెలుసు. సౌండ్ ఒక ఆయుధం అని ఒక రకమైన కొత్త యాంగిల్‌ని సినిమాలో చూపించారు.
థియేటర్స్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన సినిమా ఇది. అందరూ థియేటర్స్‌లో చూసి ఆదికి, ‘శబ్దం’ టీమ్‌కి మంచి బ్లాక్ బస్టర్ ఇవ్వాలి’’ అన్నారు. ఆది పినిశెట్టి మాట్లాడుతూ– ‘‘శబ్దం’ ప్రయాణం 16 ఏళ్ల క్రితం మొదలైంది. ‘వైశాలి’ లేకపోతే ‘శబ్దం’ ఉండేది కాదు. మా డైరెక్టర్ అరివళగన్‌కి ధన్యవాదాలు. హారర్ ఫ్యాన్స్‌కి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది’’ అని చెప్పారు. అరివళగన్ మాట్లాడుతూ– ‘‘వైశాలి’ తర్వాత ఆది, నేను మళ్లీ సినిమా చేయాలనుకున్నప్పుడు సౌండ్‌ని హారర్ థీమ్‌గా తీసుకోవాలనుకున్నాం. సౌండ్‌ని విజువలైజ్ చేసి, హారర్ క్రియేట్ చేయడం సవాల్‌గా అనిపించింది. తమన్ పది రెట్లు ఎక్కువ ఇంపాక్ట్ ఉన్న సంగీతం ఇచ్చారు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment