తల్లయ్యాక వదిన పాత్రలే వస్తున్నాయి: బిగ్‌బాస్‌ విన్నర్‌ | Bigg Boss 14 Winner Rubina Dilaik Reveals She Is Getting Bhabhi Roles Post Motherhood, Deets Inside | Sakshi
Sakshi News home page

తల్లయ్యాక అన్నీ వదిన పాత్రలే ఆఫర్‌ చేస్తున్నారు: బుల్లితెర నటి

Published Thu, Sep 12 2024 6:48 PM | Last Updated on Thu, Sep 12 2024 6:56 PM

Rubina Dilaik Getting Bhabhi Roles Post Motherhood

హీరోలకు పెళ్లయినా, పిల్లలు పుట్టినా, మనవళ్లు, మనవరాళ్లను ఎత్తుకునే వయసు వచ్చినా కూడా తెరపై కథానాయకులుగానే చెలామణి అవుతారు. కానీ హీరోయిన్లు మాత్రం కాస్త వయసుపైబడ్డట్లు కనిపించినా పక్కన పెట్టేస్తారు. ఎప్పటికప్పుడు కొత్త కథానాయికలను తీసుకురావాలని దర్శకనిర్మాతలు ఆరాటపడతారు.

సైడ్‌ క్యారెక్టర్లు
వెండితెర అయినా, బుల్లితెర అయినా నటీమణులకు పెళ్లయిందంటే చాలు సైడ్‌ క్యారెక్టర్లు ఆఫర్‌ చేస్తుంటారు. తనక్కూడా అలాంటి పరిస్థితే ఎదురైందంటోంది నటి, బిగ్‌బాస్‌ విన్నర్‌ రుబీనా దిలైక్‌. గతేడాది డిసెంబర్‌లో రుబీనా- అభినవ్‌ శుక్లా దంపతులకు కవలలకు జన్మనిచ్చారు. పిల్లలు పుట్టాక తన లైఫ్‌ మరింత అందంగా మారిందంటోంది రుబీనా. అయితే తల్లయ్యాక తనకన్నీ వదిన రోల్స్‌ మాత్రమే వస్తున్నాయంది. 

గణపతి పూజ
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా గణపతిని ఇంట్లో పెట్టుకుని పూజించినట్లు తెలిపింది. భర్త, పిల్లలు ఊరికి వెళ్తే.. తను మాత్రం ఒక్కతే విఘ్నేశుడిని పూజించింది. ఆ సమయంలో ఫ్యామిలీని చాలా మిస్సయయ్యానంది. అందుకే, రెండురోజులకే గణనాథుడిని నిమజ్జనం చేసి తాను కూడా ఊరెళ్లి పిల్లలతో కలిసి సేద తీరుతోంది. రుబీనా.. అటు వృత్తి పనిని‌, ఇటు ఫ్యామిలీ లైఫ్‌ను బ్యాలెన్స్‌ చేయడానికి ప్రయత్నిస్తోంది.

బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement