![Isha Malviya Fires on Rinku Dhawan Comment On Her Breakup With Samarth](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/05/30/Isha-Malviya.jpg.webp?itok=RoRU81KU)
హిందీ బిగ్‌బాస్ 17వ సీజన్‌లో బుల్లితెర జంట ఇషా మాల్వియా- సమర్థ్ జురేల్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వీరిద్దరూ బిగ్‌బాస్ హౌస్‌లో అభిషేక్ (ఇషా మాల్వియా మాజీ ప్రియుడు)ను చులకనగా చేసి మాట్లాడటం.. అతడు ఆవేశంతో సమర్థ్ చెంప చెళ్లుమనిపించడం.. ఎంతగానో వైరలయ్యాయి. హౌస్‌లో ఒకరిపై మరొకరు అంత ప్రేమ కురిపించుకున్నారు కానీ, షో నుంచి బయటకు వచ్చాక మాత్రం ఆ ప్రేమను కంటిన్యూ చేయలేకపోయారు. కొంతకాలానికే బ్రేకప్ చెప్పుకున్నారు.
![](/sites/default/files/inline-images/isha1q.jpg)
నాకెప్పుడో తెలుసు
వీళ్ల బ్రేకప్‌ను ఎప్పుడో ఊహించానంటూ నటి రింకూ ధావన్ సెటైర్లు వేసింది. 'కేవలం ఆరు నెలల్లో ఇషా నెక్స్ట్ ఎవరిని డేటింగ్ చేస్తుందనే వార్తను చదవాల్సి వస్తుందని సమర్థ్‌కు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడే చెప్పాను. ఆమె నిలకడగా ఓ చోట ఉండలేదు' అని వ్యాఖ్యానించింది. తాజాగా ఈ కామెంట్స్‌పై నటి ఇషా మాల్వియా ఆగ్రహం వ్యక్తం చేసింది.
![](/sites/default/files/inline-images/isha.jpg)
పిచ్చి కూతలు ఆపు
'రింకూ సంసారం కూడా సరిగ్గా సాగనేలేదు. నేను ఈ మాట అనకూడదు.. కానీ నా గురించి అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు. తనకు విడాకులయ్యాయి. ఒక్కతే 20 ఏళ్ల కుమారుడిని చూసుకుంటూ బతికేస్తోంది. నా విషయంలో ఏమైంది? బ్రేకప్ చెప్పుకున్నా, రిలేషన్‌లో ఉన్నా మేము బాగానే ఉన్నాం. ఆమె తన గురించి తాను చూసుకుంటే బెటర్. పక్కవాళ్ల మీద ఫోకస్ చేసి వారి గురించి పిచ్చి కూతలు కూసి హైలైట్ అవ్వాలని చూస్తే బాగోదు' అని ఇషా వార్నింగ్ ఇచ్చింది.
చదవండి: కజ్‌రారే సాంగ్.. లైవ్‌లో డ్యాన్స్ మర్చిపోలేనన్న అమితాబ్..
Comments
Please login to add a commentAdd a comment